jamia milia university
-
‘జామియా’లో డాక్యుమెంటరీ కలకలం
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై ‘ఇండియా: ద మోదీ క్వశ్చన్’ పేరిట బీబీసీ రూపొందించిన వివాదాస్పద డాక్యుమెంటరీని ప్రదర్శించేందుకు విద్యార్థి సంఘం నాయకులు ఏర్పాట్లు చేయడం ఢిల్లీలోని జామియా మిలియా ఇస్లామియా యూనివర్సిటలో కలకలం రేపింది. బుధవారం సాయంత్రం 6 గంటలకు ఈ డాక్యుమెంటరీ ప్రదర్శిస్తామని స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా(ఎస్ఎఫ్ఐ) నేతలు ప్రకటించారు. దీంతో పలువురు విద్యార్థులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. డాక్యుమెంటరీ ఎందుకొచ్చింది? తిరువనంతపురం: బీబీసీ డాక్యుమెంటరీని కేరళ గవర్నర్ ఆరిఫ్ మొహమ్మద్ ఖాన్ తప్పుబట్టారు. ‘జీ20 కూటమికి భారత్ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన ఇదే సమయానికి బీబీసీ డాక్యుమెంటరీ తేవడం ఏంటి?’ అని ప్రశ్నించారు. -
పెట్టుబడుల ఉపసంహరణ ఎవరికి చేటు?
ఆర్థిక అభివృద్ధి మాత్రమే ప్రభుత్వ రంగ సంస్థల లక్ష్యం కాదు. ఇంతవరకు షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు, ఇతర వెనుగబడిన కులాలు, ఇటీవల ఆర్థికంగా వెనుకబడిన సెక్షన్లకు ప్రాతినిధ్యం వహిస్తున్న అనేక మంది ప్రజలకు ప్రభుత్వరంగ సంస్థలు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ వచ్చాయి. ఈ అర్థంలో పీఎస్‌యూలు సామాజిక న్యాయానికి ఉపకరణాలుగా వ్యవహరించాయి. కానీ ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్ లేకపోవడంతో ప్రభుత్వరంగ పరిశ్రమలను ప్రైవేటీకరించడం అంటే తొలిదశలో రిజర్వేషన్లను తప్పనిసరి చేసిన ఆ ’చారిత్రక అన్యాయా’న్ని పునరుద్ధరించడమే అవుతుంది కదా. భారతదేశంలో ప్రభుత్వ రంగం అనేది ప్రధానంగా ప్రభుత్వ రంగ పరిశ్రమలకే (పీఎస్‌యూ) ప్రాతినిధ్యం వహిస్తుంటుంది. ఆర్థిక వృద్ధి, పెరుగుదలలో పీఎస్‌యులు పోషించే కీలకపాత్ర కారణంగా.. ఆర్థిక వ్యవస్థ తలుపులు తెరిచి ప్రభుత్వ గుత్తాధిపత్యం క్రమేణా ముగుస్తున్న కాలం లోనూ ప్రభుత్వరంగ సంస్థలు శిఖరస్థాయిలోనే ఉంటూ వచ్చాయి. 1991 తర్వాత రెండో తరం సంస్కరణలు ప్రభుత్వరంగ సంస్థలలో మొదలయ్యాయి. దీంతో పీఎస్‌యూలను మహారత్న, నవరత్న, మినీ రత్న అనే భాగాలుగా వర్గీకరించారు. పాలనాపరమైన, ఆర్థిక స్వయంప్రతిపత్తికి సంబంధించిన సంస్కరణలు, అవగాహనా ఒప్పందాల ద్వారా స్వీయ బాధ్యత వంటివి ప్రభుత్వం పీఎస్‌యూల ద్వారా సొంతంగా బిజినెస్ నిర్వహించాలనే భావనను ముందుకు తీసుకొచ్చాయి. ఈ పంథాలో తొలి లక్ష్యం నష్టాలు తెస్తున్న పీఎస్‌యూలను పునర్ వ్యవస్థీకరించడం. నష్టాలతో నడుస్తున్న పీఎస్‌యూలను వదిలించుకోవడానికి మొదటగా పెట్టుబడుల ఉపసంహరణ, ప్రైవేటీకరణలను ఒక ఐచ్ఛికంగా తీసుకొచ్చారు. రెండోది.. లాభదాయకంగా నడుస్తున్న పీఎస్‌యూలకు ఆర్థిక, పాలనాపరమైన స్వయంప్రతిపత్తిని అందించడమే. అయితే నష్టాలతో నడుస్తున్న పీఎస్‌యూలు కూడా ప్రభుత్వ రంగ సంస్థలు గానే చలామణి అవుతూ వచ్చాయి. దీనికి పరిష్కారం ఏమిటంటే ఫ్రాన్స్, బ్రిటన్ దేశాల్లో ప్రోత్సహించినట్లుగా, కీన్సియన్ తరహా సంస్థలను పరిత్యజించడాన్ని ఒక ప్రత్యామ్నాయంగా ప్రోత్సహించడమే. అంటే సంక్షేమ రాజ్యంగా ఉంటున్న భారతదేశాన్ని నయా ఉదారవాద దేశంగా మార్చివేయడంలో ఇది ఒక భాగం. మొత్తం ప్రభుత్వ రంగాన్ని ప్రైవేటీకరించడమే లక్ష్యం అయినప్పటికీ, లాభదాయకంగా నడుస్తున్న పీఎస్‌యూల విషయంలో ఇది సమర్థనీయంగా ఉండదు. పైగా పీఎస్‌యూలనుంచి పెట్టుబడుల ఉపసంహరణను ప్రభుత్వ ఆధారిత అభివృద్ధిని ప్రోత్సహించడానికి అంటే సామాజిక సంక్షేమ ప్రభుత్వ లక్ష్యాన్ని చేరుకోవడానికి అని చెబుతూ రాజకీయంగా భాష్యం చెప్పారు. పెట్టుబడుల ఉపసంహరణకు ఇది కొత్త భాష్యం అన్నమాట.సాక్షాత్తూ ప్రధానమంత్రి నరేంద్రమోదీ వెబినార్ ద్వారా పాల్గొన్న సదస్సులో ‘ప్రైవేటీకరణ, సంపదపై రాబడి’ అనే పేరుతో చేసిన ప్రసంగం యావత్తూ నయా ఉదారవాద ఎజెండాకు సంగ్రహరూపంగానే కనబడుతుంది. నష్టాలతో నడుస్తున్న ప్రభుత్వ రంగ సంస్థలకు పైకి లేవనెత్తడానికి పన్ను చెల్లింపుదారుల డబ్బును దుర్వినియోగపరుస్తున్నామని నరేంద్రమోదీ కూడా ఆవేదన వ్యక్తం చేశారు. నష్టాలతో నడిచే పీఎస్‌యూలకు వెచ్చించే డబ్బును సామాజిక, ఆర్థికాభివృద్ధికి ఉపయోగించుకోవచ్చని కూడా ఆయన సూచించారు. అలాగే మానవ వనరుల సమర్థ నిర్వహణ వాదాన్ని కూడా ప్రధాని తీసుకొచ్చారు. ప్రభుత్వరంగ సంస్థల్లో పనిచేసే ప్రభుత్వోద్యోగులు తాము శిక్షణ పొందిన రంగంలో నేర్చుకున్న నైపుణ్యాలను ఉపయోగించలేకపోతున్నారని, అది వారి ప్రతిభకు అన్యాయం చేయడమే అవుతుందని ప్రధాని పేర్కొన్నారు. అయితే ప్రధాని చేసిన వెబినార్ ప్రసంగంలో నష్టాలతో నడుస్తున్న పీఎస్‌యూలను మాత్రమే ప్రైవేటీకరిస్తామనే చెప్పలేదు. వ్యూహాత్మక రంగంలోని అతి కొద్ది పీఎస్‌యూలను మినహాయించి తక్కిన మొత్తం ప్రభుత్వ రంగ పరిశ్రమలకు ఈ ప్రైవేటీకరణ భావనను ఆయన విస్తరించడం విశేషం. వ్యాపారంలో కొనసాగడం ప్రభుత్వం పని కాదనే పచ్చి నయా ఉదారవాద వాదనను ప్రధాని ఈ సందర్భంగా ముందుకు తీసుకొచ్చారు. ఈ వాదన పరిమితమైన ప్రభుత్వం, సత్పరిపాలన భావనకు సంబంధించింది.ఇక్కడ సత్పరిపాలన అంటే భాగస్వామ్యం, జవాబుదారీతనం, పారదర్శకం, బాధ్యతాయుతం, సమర్థవంతం, న్యాయబద్ధత, సమీకృతం, చట్టబద్ధత అనేటటువంటి భావజాలపరంగా తటస్థంగా ఉండే లక్షణాలను ముందుకు తీసుకురావడమే తప్ప మరేమీ కాదు. పరిమిత ప్రభుత్వం, అపరిమిత పాలన అనే నయా ఉదారవాద ఎజెండాను ఇది ముందుకు నెడుతుంది. ప్రస్తుతం కేంద్రప్రభుత్వ విధాన నిర్ణయాల్లో ఈ సత్పరిపాలనా భావనే కేంద్ర స్థానంలో ఉంటోంది.ఇది సంక్షేమవాదం, నయా ఉదారవాదం భావనలపై భావజాలపరమైన చర్చలో భాగం కావచ్చు. కానీ ప్రజల చేత ఎన్నుకున్న ప్రభుత్వం ఆర్థికాభివృద్ధిని సాధించడం, పబ్లిక్ సెక్టర్ని సంస్కరించడం అనే లక్ష్యాల సాధనలో తన హక్కులను కాపాడుకోగలగాలి.మెజారిటీ ప్రజల ఎంపికద్వారా ఏర్పడిన ప్రభుత్వం ప్రాతినిధ్య ప్రజాస్వామ్యంలోనే నయా ఉదారవాద ఎజెండాను ముందుకు తీసుకురావడానికి కలలు కంటున్న పరిస్థితి ఇప్పుడు రాజ్యమేలుతోంది. ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే, ప్రభుత్వ రంగ సంస్థల్లో నయా ఉదారవాదాన్ని అమలు చేయడం ద్వారా కలిగే ఫలితాలు ఎలా ఉండబోతాయన్నదే.ఈ నయా ఉదారవాదంలోనూ సంక్షేమవాదం కొనసాగుతుంది. పెట్టుబడుల ఉపసంహరణ, ప్రైవేటీకరణ ద్వారా సేకరించిన నిధులను సరిగా ఉపయోగించడం ద్వారా ప్రధాని సూచించినట్లుగా పేదలకు ఇళ్లు, గ్రామాల్లో రహదారుల నిర్మాణం, పాఠశాలలు తెరవడం, పేదలకు పరిశుభ్రమైన నీటిని కల్పించడం వంటి సంక్షేమ చర్యలు చేపట్టవచ్చు. మొదటగా ప్రభుత్వ రంగ సంస్థలను సంస్కరించడం ద్వారా ప్రభుత్వ గుత్తాధిపత్యానికి ముగింపు పలకవచ్చు. కానీ ఒక్క శాతంమంది అతి సంపన్నుల చేతిలో 40 శాతం దేశ సంపద పోగుపడి ఉన్న దేశంలో కొద్ది మంది బడా పెట్టుబడిదారుల చేతిలో అధికారాన్ని కేంద్రీకరించడం నుంచి ప్రైవేటీకరణను ఏది నిరోధించగలుగుతుంది అనేది పెద్ద ప్రశ్న. ఈ గుత్తాధిపతులు కేవలం పరిశ్రమ రంగంతో పాటు ఇతర రంగాల్లో విధాన నిర్ణయాలను కూడా వీరు విశేషంగా ప్రభావితం చేయగలరు.రెండోది, ఆర్థిక అభివృద్ధి మాత్రమే ప్రభుత్వ రంగ సంస్థల లక్ష్యం కాదు. ఇంతవరకు షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు, ఇతర వెనుగబడిన కులాలు, ఇటీవల ఆర్థికంగా వెనుకబడిన సెక్షన్లకు ప్రాతినిధ్యం వహిస్తున్న అనేక మంది ప్రజలకు ప్రభుత్వరంగ సంస్థలు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ వచ్చాయి. ఈ అర్థంలో పీఎస్‌యూలు సామాజిక న్యాయానికి ఉపకరణాలుగా వ్యవహరించాయి. కానీ ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్ లేకపోవడంతో ప్రభుత్వరంగ పరిశ్రమలను ప్రైవేటీకరించడం అంటే తొలిదశలో రిజర్వేషన్లను తప్పనిసరి చేసిన ఆ ’చారిత్రక అన్యాయా’న్ని పునరుద్ధరించడమే అవుతుంది కదా.మూడోది. ప్రైవేటీకరణ ఒక ప్రభుత్వానికే పరిమితమైనది కాదు. పరిమిత ప్రభుత్వం అనేది ఉండదు. నయా ఉదారవాద ప్రభుత్వం అనేది వాస్తవంగా ఒక రెగ్యులేటరీ ప్రభుత్వం. పాలించడానికి అది నియంత్రణా వ్యవస్థలను రూపొందించి, చట్టాల అనువర్తనం, ప్రామాణిక ఆచరణలు లేదా సేవలకు హామీ ఇస్తుంది. పైగా తనదైన జాప్యందారీ వ్యవస్థలను రూపొందించుకుంటుంది. వీటిని సేవించడం ద్వారా ప్రభుత్వ ఉద్యోగులు తమ వృత్తికి న్యాయం చేకూర్చలేరు. బ్యాంకింగ్, విమానయాన రంగాల్లో దివాలాకు సంబంధించిన పలు కేసుల కారణంగా నష్టాల పాలవుతున్న ప్రైవేట్ కంపెనీల జాబితా మరింతగా పెరగడమే తప్ప తగ్గడం అనేది ఉండదు. ప్రభుత్వం వ్యాపార సామర్థ్యంతోటే ఉండాలి: ప్రభుత్వం కేవలం ఖర్చుపెట్టే సంస్థగానే ఉండిపోవలసిన అవసరం లేదు. సంపాదించే సంస్థగా కూడా ఉండాలి. వ్యాపారంలో కొనసాగినప్పుడు ఇది సాధ్యపడుతుంది. దీనికి చేయవలసిందల్లా ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉత్తమ పాలనను అమలు చేయడమే. లాభాలతో నడుస్తున్న ప్రభుత్వ రంగ సంస్థలు ఇతర పీఎస్‌యూలకు నమూనాగా ఉండాలి. నష్టాలతో నడుస్తున్న ప్రభుత్వ రంగ సంస్థలను కూడా సంస్కరించినట్లయితే, లాభాలబాట పట్టే ఆ సంస్థలు తిరిగి సాధికారత సాధించగలవు. ఉత్తమపాలన అనేది ప్రభుత్వ రంగ సంస్థలలో కూడా సమర్థతకు, ఆర్థికానికి, సామర్థ్యానికి, జవాబుదారీతనానికి హామీపడగలదు. జుబేర్ నజీర్ వ్యాసకర్త అసిస్టెంట్ ప్రొఫెసర్, జామియా మిలియా ఇస్లామియా, న్యూఢిల్లీ -
షార్జీల్ ఇమామ్‌పై కేసు.. చార్జిషీట్ దాఖలు
న్యూఢిల్లీ: రెచ్చగొట్టే ప్రసంగాలతో జామియా మిలియా ఇస్లామియా యూనివర్సిటీలో అల్లర్లకు కారణమయ్యారనే ఆరోపణలతో జేఎన్‌యూ పూర్వ విద్యార్థి షార్జీల్ ఇమామ్‌పై దేశద్రోహం కేసు నమోదైంది. డిసెంబరు 15న తన విద్వేషపూరిత వ్యాఖ్యలతో విద్యార్థులను రెచ్చగొట్టినందున ఆయనపై చార్జిషీట్ వేసినట్లు ఢిల్లీ పోలీసులు తెలిపారు. గతేడాది డిసెంబరులో పౌరసత్వ సవరణ చట్టాని(సీఏఏ)కి వ్యతిరేకంగా జామియా మిలియా యూనివర్సిటీ విద్యార్థులు గళమెత్తడం తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసిన విషయం తెలిసిందే. యూనివర్సిటీకి సమీపంలో ఉన్న న్యూ ఫ్రెండ్స్ కాలనీ, జామియా నగర్ ప్రాంతాల్లో అలజడి సృష్టించిన అల్లరి మూకలు అనంతరం యూనివర్సిటీలో ప్రవేశించారని పోలీసులు పేర్కొన్నారు. (‘వీడియోతో.. వాళ్లకు వాళ్లుగా దొరికిపోయారు!’) ‘‘రాళ్లు రువ్వుతూ.. ఆయుధాలు చేపట్టి కొంత మంది అల్లర్లకు తెరతీశారు. ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులను భారీగా ధ్వంసం చేశారు. ఎంతో మంది పోలీసులు, సామాన్య పౌరులకు గాయాలయ్యాయి. ఈ క్రమంలో డిసెంబరు 13, 2019లో విద్వేషపూరిత ప్రసంగాలు ఇచ్చి అల్లర్లకు కారణమైన షార్జీల్‌ను అరెస్టు చేశాం. మా దర్యాప్తులో సేకరించిన సాక్ష్యాల ఆధారంగా 124 ఏ ఐపీసీ, 153 ఏ ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదు చేశాం. ఈ మేరకు సాకేత్ జిల్లా కోర్టులో చార్జిషీట్ దాఖలు చేశాం’’ అని వెల్లడించారు. కాగా సీఏఏను వ్యతిరేకిస్తూ షాహిన్‌బాగ్‌లో చేపట్టిన నిరసనలో పాల్గొన్న షార్జీల్... అలీగడ్ ముస్లిం యూనివర్సిటీలో ఇచ్చిన ప్రసంగంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచిన విషయం తెలిసిందే. ఇక గతంలోనూ అస్సాం, ఈశాన్య రాష్ట్రాలను దేశం నుంచి వేరుచేస్తారంటూ తీవ్ర వ్యాఖ్యలు చేసినందుకు గానూ మణిపూర్, అరుణాచల్ ప్రదేశ్ పోలీసులు అతడిపై కేసు నమోదు చేశారు. -
చూపు పోయింది.. అవార్డు వచ్చింది
సాక్షి, న్యూఢిల్లీ: సీఏఏకి నిరసనగా గత డిసెంబరు 15 న ఢిల్లీలోని జామియా మిలియా యూనివర్సిటీ వద్ద జరిగిన ఆందోళనలో మహమ్మద్ మిన్హాజుద్దీన్ అనే విద్యార్ధి కంటికి తీవ్ర గాయమైన సంగతి తెలిసిందే. యూనివర్సిటీ లైబ్రరీలోకి ప్రవేశించిన పోలీసులు విచక్షణారహితంగా లాఠీచార్జి చేశారు. లాఠీ దెబ్బలు అతని ఎడమకంటికి బలంగా తగిలాయి. అంతే ! తీవ్ర గాయమైన మిన్హాజుద్దీన్ కంటి చూపు పోయింది. ఆ సమయంలో అతను మానవహక్కులకు సంబంధించిన వ్యాసం రాస్తున్నాడు. గాయం అనంతరం డాక్టర్ల వద్దకు వెళ్లగా అతని కంటిని పరీక్షించిన వారు ఇక శాశ్వతంగా చూపు రాదని స్పష్టం చేశారు. (కొట్టరాని చోటా కొట్టారు) ఆశ్చర్యం ఏమిటంటే పోలీసు లాఠీ తనపై విరగడానికి కేవలం కొద్ది నిముషాల ముందే మిన్హాజుద్దీన్ తన వ్యాసాన్ని పూర్తి చేశాడు. ఆ తరువాత కంటి చూపు కోల్పోయి తలనొప్పి ఎంతగా బాధిస్తున్నా.. ఆ పేపర్ కి తుదిమెరుగులు దిద్ది తన యూనివర్సిటీ అధ్యాపకుల సంఘానికి సమర్పించాడు. రెండు నెలలు గడిచిపోయాయి. మానవ హక్కులపై మిన్హాజుద్దీన్ రాసిన ఆర్టికల్ కే ఉత్తమమైనదిగా జామియా టీచర్స్ అసోసియేషన్ అవార్డు లభించింది. ఈ అవార్డుకు ఆ విద్యార్ధి పొంగిపోలేదు. మానవ హక్కులు రోజురోజుకీ ఎందుకిలా దిగజారిపోతున్నాయా అన్నదే ఇప్పుడా 26 ఏళ్ళ విద్యార్ధి మనోవేదన ! ఒక చట్టానికి నిరసనగా ఆందోళన చేసినంత మాత్రాన ఎక్కడో లైబ్రరీలో ఉన్న తనలాంటి విద్యార్థుల మీద పోలీసు లాఠీ విరగడాన్ని అతడు జీర్ణించుకోలేకపోతున్నాడు. (‘ఢిల్లీకి వచ్చి పెద్ద తప్పు చేశాను’) చదవండి: టాయిలెట్లో దాక్కొన్నా.. కంటి చూపు పోయింది.. -
రాళ్లు రువ్వి వర్సిటీలోకి వెళ్లారు
సాక్షి, న్యూఢిల్లీ: జామియా యూనివర్సిటీ వద్ద సీఏఏకు వ్యతిరేక ఆందోళనల సందర్భంగా డిసెంబర్ 15న జరిగిన హింసాత్మక ఘటనలపై తాజాగా విడుదలైన వీడియో సంచలన విషయాలను వెలుగులోకి తెచ్చింది. పోలీసులపై రాళ్లు రువ్వుతున్న ఆందోళనకారులు యూనివర్సిటీలోకి వెళ్లారు. లైబ్రరీ వద్దకు చేరుకున్నట్లు ఆ సీసీ కెమెరా వీడియోలు వెల్లడిస్తున్నాయి. ఆందోళనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు బాష్పావాయుగోళాలను ప్రయోగించారు. (‘వీడియోతో.. వాళ్లకు వాళ్లుగా దొరికిపోయారు!’) యూనివర్సిటీ వర్సిటీలోని ఓ భవనం వద్ద, భవనం లోపల భారీ సంఖ్యలో ఉన్న విద్యార్థులు, ఆందోళనకారులు బయటికి పరుగులు తీసుకుంటూ వచ్చారు. ముసుగులు ధరించిన వారు లైబ్రరీలోకి పారిపోయారు. అయితే, లైబ్రరీలోకి వచ్చిన పోలీసులు అక్కడ ఉన్న విద్యార్థులను ఇష్టానుసారంగా కొట్టారని ఫిర్యాదు చేసిన విషయం విదితమే. (జామియాలో దాడి; కీలక వీడియో విడుదల) తాజాగా విడుదల చేసిన ఈ వీడియో ద్వారా ఆందోళనకారులే ఆ లైబ్రరీలోకి వెళ్లినట్లు తెలుస్తోంది. రాళ్లు రువ్వినవారిని తరుముకుంటూ పోలీసులు వెళ్లారని అధికారులు చెబుతున్నారు. అయితే, లైబ్రరీలోకి వెళ్లలేదని చెప్పారు. యూనివర్సిటీ యాజమాన్యం అనుమతి లేకుండా పోలీసులు ఏ యూనివర్సిటీలోకి వెళ్లలేరని సీనియర్ పోలీస్ అధికారి ఎంఎస్ రంధ్వా తెలిపారు. కాగా, ఆ రోజున పోలీసులు ఆందోళనకారులను చెదరగొట్టేందుకు భాష్పావాయుగోళాలను ప్రయోగించడం.. ఆందోళనకారులు పోలీసులపై రాళ్లు రువ్వడం జరిగింది. ఆందోళనకారులు మూడు బస్సులకు నిప్పుపెట్టారు. మరో రెండు ద్విచక్ర వాహనాలను తగలబెట్టారు. అయితే, పోలీసులు లైబ్రరీలోకి వచ్చి దాడి చేశారంటూ ఓ వీడియో ఇటీవల విడుదలైన విషయం తెలిసిందే. ఆందోళనల నేపథ్యంలో పదిమంది వర్సిటీ విద్యార్థులకు పోలీసులు ఇప్పటికే నోటీసులు జారీ చేశారు. -
‘వీడియోతో.. వాళ్లకు వాళ్లుగా దొరికిపోయారు!’
న్యూఢిల్లీ: పౌరసత్వ సవరణ చట్టాని(సీఏఏ)కి వ్యతిరేకంగా గళమెత్తిన జామియా మిలియా యూనివర్సిటీ విద్యార్థులపై పోలీసుల లాఠీ చార్జీకి సంబంధించిన వీడియో.. కాంగ్రెస్ పార్టీ, బీజేపీల మధ్య ట్విటర్ వార్‌కు తెరతీసింది. సీఏఏను నిరసిస్తూ రెండు నెలల క్రితం ఆందోళనకు దిగిన యూనివర్సీటీ విద్యార్థులపై పోలీసులు లాఠీలతో విరుచుకుపడిన విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించి తాజాగా వెలుగులోకి వచ్చిన వీడియోపై.. ఏఐసీసీ కార్యదర్శి ప్రియాంక గాంధీ స్పందించారు. ‘‘చదువుకుంటున్న విద్యార్థులపై ఢిల్లీ పోలీసులు ఎలా విరుచుకుపడ్డారో చూడండి! తాను చదువుకుంటున్నానని.. ఓ విద్యార్థి పుస్తకం చూపిస్తున్నా.. పోలీసులు లాఠీతో చితకబాదుతున్నారు. కానీ హోం మంత్రి, ఢిల్లీ పోలీసులు మాత్రం తాము లైబ్రరీలోకి ప్రవేశించి విద్యార్థులను కొట్టలేదని చెబుతున్నారు. అయితే ఈ వీడియోతో వారు ఎంత నిజాయితీపరులో దేశం మొత్తం తెలిసిపోయింది’’ అని ప్రియాంక ట్విటర్లో సదరు వీడియోను షేర్ చేశారు.(సీఏఏపై వెనక్కి వెళ్లం: ప్రధాని మోదీ) देखिए कैसे दिल्ली पुलिस पढ़ने वाले छात्रों को अंधाधुंध पीट रही है। एक लड़का किताब दिखा रहा है लेकिन पुलिस वाला लाठियां चलाए जा रहा है। गृह मंत्री और दिल्ली पुलिस के अधिकारियों ने झूठ बोला कि उन्होंने लाइब्रेरी में घुस कर किसी को नहीं पीटा।..1/2 pic.twitter.com/vusHAGyWLh — Priyanka Gandhi Vadra (@priyankagandhi) February 16, 2020 ఇందుకు ప్రతిగా బీజేపీ ఐటీ సెల్ ఇంచార్జ్ అమిత్ మాలవీయ సైతం ఈ వీడియోను షేర్ చేసి.. వరుస ట్వీట్లు చేశారు. ‘‘ లైబ్రరీలో మాస్కులతో విద్యార్థులు.. మూసి ఉన్న పుస్తకాలు చదువుతున్నారు.. చదువులో నిమగ్నం కాకుండా ఆతురతగా ప్రవేశద్వారం వైపే చూస్తున్నారు.. లైబ్రరీ అంటే ఇలాగే ఉంటుందా... పోలీసులపై రాళ్లు రువ్విన తర్వాత జామియా ఆందోళనకారులు లైబ్రరీలో దాక్కున్నారు. ఈ వీడియోతో వాళ్లకు వాళ్లుగా దొరికిపోయారు. దీని ఆధారంగా అల్లరిమూకను పోలీసులు గుర్తించవచ్చు’’ అంటూ పోలీసుల చర్యను సమర్థించారు. కాగా ఈ వీడియోను తొలుత విడుదల చేసిన జామియా సమనన్వయ కమిటీ అమిత్ మాలవీయ వ్యాఖ్యలను తప్పుబట్టింది. టియర్ గ్యాస్ ప్రయోగిస్తున్న కారణంగా విద్యార్థులు ముఖాలకు మాస్కులు ధరించారని పేర్కొంది. వాళ్ల చేతుల్లో రాళ్లు లేవని... వారు ఎటువంటి నినాదాలు చేయడం లేదన్న విషయం స్పష్టమవుతోందని తెలిపింది. ఇక సీఏఏను వ్యతిరేకిస్తున్న క్రమంలో తాము ఎటువంటి హింసకు పాల్పడలేదని పలువురు విద్యార్థులు ఇదివరకే పేర్కొన్న విషయం తెలిసిందే.(జామియాలో దాడి; కీలక వీడియో విడుదల) -
‘జామియా’ లాఠీచార్జీ వీడియో లీక్
న్యూఢిల్లీ: ఢిల్లీలోని జామియా మిలియా ఇస్లామియా యూనివర్సిటీ విద్యార్థులపై పోలీసులు లాఠీచార్జీ చేసిన వీడియో తాజాగా వెలుగులోకి వచ్చింది. జామియా సమన్వయ కమిటీ (జేసీసీ) విడుదల చేసిన ఈ వీడియోలో.. గత డిసెంబర్ 15న పారామిలటరీ, పోలీసు సిబ్బంది లైబ్రరీలో విద్యార్థులను కొడుతున్న దృశ్యాలు సీసీటీవీలో రికార్డయ్యాయి. 48 సెకన్ల నిడివి ఉన్న ఈ వీడియోలో 8 మంది భద్రతా సిబ్బంది పాత రీడింగ్ హాల్లోకి వచ్చి విద్యార్థులను కర్రలతో కొడుతున్నట్లు ఉంది. ఈ సందర్భంగా పారామిలటరీ, పోలీసు సిబ్బంది కనబడకుండా ఉండేందుకు ముఖాలకు చేతిరుమాలును కట్టుకున్నారు. ఈ వీడియోపై విచారణ జరుపుతున్నట్లు ప్రత్యేక పోలీస్ కమిషనర్ ప్రవీర్ రంజన్ తెలిపారు. పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా వర్సిటీలో తీవ్రస్థాయిలో నిరసనలు వెల్లువెత్తడం, పోలీసులు క్యాంపస్‌లోకి ప్రవేశించి లాఠీచార్జీ చేయడం తెలిసిందే. -
సీఏఏ : భయంతో దాక్కుంటే చితకబాదారు..!
-
జామియాలో దాడి; కీలక వీడియో విడుదల
న్యూఢిల్లీ : జామియా మిలియా యూనివర్సిటీ విద్యార్థులపై పోలీసుల చర్యకు సంబంధించి మరో కీలక వీడియోను విద్యార్థి సంఘం నాయకులు శనివారం విడుదల చేశారు. పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా గళం విప్పిన యూనివర్సీటీ విద్యార్థులపై రెండు నెలల క్రితం పోలీసులు లాఠీలతో విరుచుకుపడిన సంగతి తెలిసిందే. 49 సెకండ్లున్న తాజా వీడియో ప్రకారం.. యూనివర్సీటీలోని పాత రీడింగ్ హాల్లో చదువుకుంటున్న విద్యార్థుల్ని పోలీసులు లాఠీలతో చితకబాదారు. క్యాంపస్ మైదానంలో సీఏఏకు నిరసనగా ర్యాలీ నిర్వహిస్తున్న విద్యార్థులను లాఠీ లార్జీ, టియర్ గ్యాస్‌తో చెదరగొట్టారు. అనంతరం అక్కడి నుంచి లైబ్రరీలోకి ప్రవేశించిన పోలీసులు రీడింగ్ రూమ్‌లో చదువుకుంటున్న విద్యార్థులపై అకారణంగా దాడికి దిగారు. అప్పటికే పోలీసుల చర్య గురించి తెలుసుకున్న విద్యార్థులు బెంచీల మాటున దాక్కున్నప్పటీకీ బయటకు లాగి మరీ లాఠీలతో కొట్టారు. డిసెంబరు 15న ఈ ఘటనలో దాదాపు 100 విద్యార్థులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే, విద్యార్థుల భారీ ర్యాలీ నేపథ్యంలో వారిని కట్టడి చేసేందుకు చర్యలు మాత్రమే చేపట్టామని, ఎవరిపై దాడులు చేయలేదని పోలీసులు పేర్కొనడం తెలిసిందే. -
ఢిల్లీలో కలకలం: మరోసారి కాల్పులు
సాక్షి, న్యూఢిల్లీ: జామియా మిలియా యూనివర్సిటీలో ఆదివారం అర్ధరాత్రి మరోసారి కాల్పుల కలకలం చెలరేగింది. దీంతో కాసేపటివరకు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఢిల్లీలోని విశ్వవిద్యాలయం ఎదుట విద్యార్థులు పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా నిరసననలు వ్యక్తం చేస్తుండగా కొంతమంది దుండగులు స్కూటీపై వచ్చి కాల్పులకు పాల్పడ్డట్లు ప్రత్యక్ష సాక్షులు పేర్కొన్నారు. తొలుత గేట్ నంబర్ 5 దగ్గర, తర్వాత గేట్ నంబర్ 1 వద్ద వారు ఫైరింగ్ జరిపినట్లు వెల్లడించారు. ఈ కాల్పుల్లో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని సమాచారం. ఈ ఘటనపై జామియా యూనివర్సిటీ సెక్యూరిటీ గార్డులు.. అధికారులకు సమాచారమిచ్చారు. ఓక్లా నుంచి వచ్చిన స్కూటీ జుల్లెనా వైపు వెళ్లినట్లుగా గుర్తించారు. దుండగుల్లో ఒకరు రెడ్ జాకెట్ ధరించారని తెలిపారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించగా తమకు ఎలాంటి ఖాళీ బుల్లెట్లు దొరకలేదని తెలిపారు. దుండగులను గుర్తించడానికి ఆ ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నామన్నారు. కాగా నాలుగు రోజుల వ్యవధిలో జామియా మిలియా యూనివర్సిటీ ప్రాంతంలో కాల్పులు జరగడం ఇది మూడోసారి. చదవండి: విద్యార్థులపై తూటా కాల్పుల కలకలం.. అతడింకా పిల్లాడే.! -
పెళ్లి అని చెప్పి తుపాకీ కొన్నాడు..
న్యూఢిల్లీ: పౌరసత్వ నిరసనకారులపై ఢిల్లీలోని జామియా మిలియా యూనివర్సిటీలో జరిగిన కాల్పుల ఉదంతంలో కీలక విషయాలు వెలుగు చూస్తున్నాయి. కాల్పులు జరిపిన 17 ఏళ్ల మైనర్ బాలుడు తుపాకీని ఉత్తరప్రదేశ్‌లో కొనుగోలు చేసినట్టు వెల్లడైంది. జీవార్ ప్రాంతానికి చెందిన అతడు తన గ్రామానికి సమీపంలోని డీలర్ నుంచి 10 వేల రూపాయలకు తుపాకీ కొన్నట్టు దర్యాప్తు అధికారులు వెల్లడించారు. గురువారం రాత్రి జరగనున్న తన సోదరుడిలో పెళ్లిలో కాల్పులు జరపడానికి అని అబద్ధం చెప్పి తుపాకీని కొన్నట్టు తెలిపారు. బంగారు రంగులో ఉన్న సింగిల్‌షాట్ తుపాకీతో పాటు రెండు బుల్లెట్లను బాలుడికి డీలర్ ఇచ్చినట్టు చెప్పారు. వాడకుండా ఉన్న మరో బుల్లెట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ‘బాలుడికి తుపాకీ విక్రయించిన డీలర్‌ను గుర్తించాం. వ్యాపారిని పరిచయం చేసిన నిందితుడి మిత్రుడిని కూడా కనిపెట్టాం. వీరి కోసం మా బృందాలు వెతుకుతున్నాయి. సంబంధిత సెక్షన్ల ప్రకారం కేసు నమోదు చేశామ’ని దర్యాప్తు అధికారులు తెలిపారు. తుపాకీ డీలర్, నిందితుడి స్నేహితుడిని పట్టుకునేందుకు యూపీ పోలీసుల సహకారం తీసుకుంటున్నట్టు చెప్పారు. అయితే ఢిల్లీ పోలీసులు ఇప్పటివరకు తమను సంప్రదించలేదని యూపీ పోలీసులు పేర్కొనడం గమనార్హం. స్థానిక రాజకీయ నాయకులెవరైనా బాలుడికి తుపాకీ ఇచ్చివుంటారని భావించామని గ్రామస్తుడొకరు వెల్లడించారు. నిందితుడు రాజకీయ నేతలతో తిరిగేవాడని చెప్పారు. గర్వపడే పనిచేస్తానంటూ.. కాలేజీకి వెళ్తున్నానని చెప్పి ఢిల్లీ వెళ్లాడని కుటుంబ సభ్యులు తెలిపారు. సాయంత్రానికి తిరిగి వచ్చేస్తానని, సోదరుడి పెళ్లికి హాజరవుతానని చెప్పి ఇంటి నుంచి వెళ్లినట్టు వెల్లడించారు. ‘కాలేజీకి వెళ్లకుండా బస్సులో ఢిల్లీకి చేరుకున్నాడు. తర్వాత ఆటోలో జామియా మిలియా యూనివర్సిటీకి వచ్చాడు. తుపాకీ అతడి సంచిలో ఉంద’ని పోలీసులు తెలిపారు. ఇంటి నుంచి వెళ్లేటప్పుడు గర్వపడే పనిచేస్తానని సోదరితో చెప్పినట్టు వెల్లడించారు. ‘నా గురించి గర్వంగా చెప్పుకోవాలనుకుంటున్నావా? ఈరోజు నుంచి నా గురించి గర్వంగా చెప్పుకుంటావు’ అని తన సోదరితో బాలుడు అన్నట్టు పోలీసులు తెలిపారు. (చదవండి: కాల్పుల కలకలం.. అతడింకా పిల్లాడే.!) -
విద్యార్థులపై తూటా
మహాత్ముడి 72వ వర్ధంతి సందర్భంగా దేశ ప్రజలంతా ఆయనకు నివాళులర్పిస్తున్న వేళ న్యూఢిల్లీలో పౌరసత్వ సవరణ చట్టానికి నిరసనగా ర్యాలీ నిర్వహిస్తున్న జామియా మిలియా ఇస్లామియా విశ్వవిద్యాలయం విద్యార్థులపై ఒక దుండగుడు గురువారం కాల్పులు జరిపిన దృశ్యాలు అందరినీ దిగ్భ్రాంతిపరిచాయి. నడిరోడ్డుపై పట్టపగలు ఇంతక్రితం ఎవరూ కాల్పులకు తెగబడలేదని కాదు. మూడు దశాబ్దాలక్రితం ముంబై మహానగరాన్ని గడగడలాడించిన మాఫియా ముఠాలు ఆధిపత్యం కోసం పరస్పరం తుపాకులతో తలపడిన సందర్భాలున్నాయి. ఒక్కోసారి కిరాయి గూండాలు వ్యాపారిపైనో, పారిశ్రామికవేత్తపైనో గురిపెట్టిన ఉదంతాలున్నాయి. అయితే అవన్నీ పోలీసులు ఘటనా స్థలి దరిదాపుల్లో లేనప్పుడు, వారు అప్రమత్తంగా లేనప్పుడు జరిగినవే. కానీ గురువారం నాటి ఉదంతం తీరు వేరు. అక్కడ పోలీసు బలగాలున్నాయి. రాజ్‌ఘాట్ వైపు వెళ్లే విద్యార్థుల్ని బలప్రయోగం చేసైనా నిరోధించడానికి ఆ బలగాలు సంసిద్ధంగా ఉన్నాయి. ఈలోగా నాటు తుపాకి ధరించిన దుండగుడు శాంతియుతంగా నిరసన తెలియజేస్తున్న విద్యార్థులను గురి చూస్తూ... ‘స్వాతంత్య్రం కావాలా మీకు, ఇదిగో తీసుకోండి’ అంటూ కాల్చి ఒక విద్యార్థిని గాయపరిచాడు. ఇదంతా కెమెరాల సాక్షిగా, పోలీసు బలగాల సాక్షిగా జరిగిపోయింది. ఆరు వారాలక్రితం అదే విశ్వవిద్యాలయం విద్యార్థులు పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఆందోళనకు దిగినప్పుడు ఆ ఆవరణలోకి ప్రవేశించి విద్యార్థులపై లాఠీలు ఝుళిపించిన ఢిల్లీ పోలీసులు... ఆ తర్వాత పలుమార్లు ఆందోళనల్ని అడ్డుకోవడంలో అతిగా ప్రవర్తించిన పోలీసులు ఈసారి ఆ దుండగుడు తుపాకి తీసినా, దాంతో విన్యాసాలు చేసినా, చివరకు కాల్పులు జరిపినా చేష్టలుడిగి చూస్తూ ఉండిపోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది. న్యూజిలాండ్‌లో నిరుడు మార్చిలో క్రైస్ట్ చర్చి నగరంలో 51మందిని ఊచకోత కోసిన దుండగుడి వైనం ఎవరూ మరిచిపోరు. అతగాడు ఈ దాడినంతటినీ ఫేస్బుక్ ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేశాడు. ఢిల్లీలో కాల్పులకు తెగబడిన దుండగుడు కూడా దాడికి ముందు ఫేస్బుక్లో లైవ్ ఇచ్చాడని చెబుతున్నారు. దుండగుడు అప్పటివరకూ ఆ ఆందోళనకారులతోనే ఉన్నాడని, ఉన్నట్టుండి వేగంగా ముందు కొచ్చి కాల్పులు జరిపాడని, ఇది హఠాత్ సంఘటన గనుక తేరుకోవడానికి కొంత సమయం పట్టిందని పోలీసులు ఇస్తున్న సంజాయిషీ ఎవరినీ సంతృప్తిపరచదు. ఊహించని పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కొనడానికి అవసరమైన శిక్షణ వారికుంటుంది. నిత్యం అలాంటి పరిస్థితులతో వ్యవహరిస్తుంటారు కాబట్టి అందుకు సంబంధించిన నైపుణ్యం మెరుగుపడాలి తప్ప తగ్గకూడదు. పైగా అంతవరకూ ఆందోళనకారుల్లో ఒకడిగా ఉన్నవాడు తమవైపు తుపాకి ధరించి, కేకలు పెడుతూ వస్తుంటే అతన్ని అదుపులోకి తీసుకోవడానికి సిద్ధపడాలి. ఎందుకంటే ఆ క్షణంలో అతగాడెవరో తెలిసే అవకాశం లేదు. ఆందోళనకారులవైపునుంచి వస్తున్నాడు గనుక తమకే హాని తలపెట్టొచ్చునని అనుమానం కలగాలి. కనీసం మతి చలించినవాడేమోనన్న సందేహమైనా రావాలి. కానీ పోలీసుల తీరు చూస్తే ఎంతో భరోసాతో ఉన్నట్టు కనబడింది. కాల్పులు జరుపుతున్నాడని అర్థమయ్యాక ఆందో ళనకారులు కూడా ఎదురుదాడికి ప్రయత్నించివుంటే మరెంతమందికి హాని కలిగేదో ఊహించలేం. ఉద్రిక్తతలను ఉపశమింపజేయడానికి, ఆ క్రమంలో అవసరమైతే బలప్రయోగం చేయడానికి అక్కడ సిద్ధంగా వున్న పోలీసులు అంత నిర్లిప్తంగా ఉండిపోవడాన్ని ఎవరూ ఊహించలేరు. ఇందుకు ఏ సంజాయిషీ చెప్పినా అది సాకు మాత్రమే అవుతుంది. ఢిల్లీ పోలీసుల నిర్వాకం వెల్లడికావడం ఇది మొదటిసారి కాదు. ఎంతో ప్రతిష్టాత్మకమైన జేఎన్‌యూపై ముసుగులు ధరించిన దుండగులు దాడి చేసి, లేడీస్ హాస్టల్తోసహా పలుచోట్ల దాదాపు మూడు గంటలపాటు బీభత్సం సృష్టించిన రోజున కూడా వారు ప్రేక్షకపాత్రే పోషించారు. విశ్వవిద్యాలయం ఉన్నతాధికారుల నుంచి తమకు అనుమతి అందలేదని తప్పించుకోజూశారు. ఆరోజు నిర్వా్యపకత్వం సరే... ఆ తర్వాతైనా సమర్థత చాటుకోలేక పోయారు. ఇంతవరకూ ఆ దుండగుల్లో ఒక్కరినీ కూడా అరెస్టు చేయలేకపోయారు. దేశ రాజధాని నగరంలో శాంతిభద్రతల పరిస్థితి ఇంత అధ్వాన్నంగా వుంటే ప్రపంచ దేశాల్లో మన పరువు దెబ్బతినదా? కేంద్ర హోంమంత్రి అమిత్ షా, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ కూడా ఢిల్లీ పోలీస్ కమిషనర్‌తో మాట్లాడారు. కానీ 24 గంటలు గడిచినా ఆ యువకుడు ఏ సంస్థకు చెందిన వాడో, నాటు తుపాకి అతనికెలా వచ్చిందో, ఫేస్బుక్లో అతను పెట్టిన ఉన్మాద రాతల వెనక ఎవరు న్నారో పోలీసులు ఇంకా ఆచూకీ రాబట్టినట్టు లేదు. ఢిల్లీలో ఒకవైపు పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఆందోళనలతోపాటు అసెంబ్లీ ఎన్నికల ప్రచార పర్వం సాగుతోంది. కనుక ఈ రెండూ పరస్పర ప్రభావితాలవుతున్నాయి. ‘మీరు మోదీవైపు ఉంటారా, షహీన్‌బాగ్ వైపా?’ అని అమిత్ షా నేరుగానే ప్రచార సభల్లో ప్రజల్ని ప్రశ్నిస్తున్నారు. కేంద్ర ఆర్థిక శాఖ సహాయమంత్రి అనురాగ్ ఠాకూర్ మరో అడుగు ముందుకేసి దేశద్రోహుల్ని కాల్చి చంపాలంటూ సభికులతో నినాదాలు చేయించారు. అటు కాంగ్రెస్ సైతం షహీన్‌బాగ్ ఆందోళనల్ని తనకు అనుకూలంగా మలుచుకోవడానికి ప్రయత్నిస్తోంది. కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) పార్టీ ఈ ఉద్యమానికి దూరంగా తమ ప్రభుత్వం అయిదేళ్లలో సాధించిన విజయాల గురించి చెప్పుకుంటోంది. ఆందోళనపై కేజ్రీవాల్ స్పష్టమైన వైఖరి తీసుకోలేదు. ఎన్నికల్లో గెలుపు సాధించడం కోసం ఉద్రిక్తతలను రెచ్చగొట్టడం, ప్రజానీకంలో ఒకరకమైన అభద్రతా భావాన్ని కలగజేయడం బాధ్యతారాహిత్యమని నాయకులు గుర్తించాలి. ఇప్పుడు ఢిల్లీలో కాల్పులకు తెగబడి అరెస్టయిన యువకుడు ఇలాంటి ఉద్రిక్తతలతో ప్రభావితమయ్యాడని అర్ధమవుతోంది. కనుక నేతలు సంయమనం పాటించాలి. ఆచితూచి మాట్లాడాలి. -
అతనికి డబ్బులు ఎవరు ఇచ్చారు ? : రాహుల్
సాక్షి, న్యూఢిల్లీ : పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న వారిపై ఢిల్లీలోని జామియా మిలియా యూనివర్సీటీలో ఓ టీనేజర్ కాల్పులు జరపడంపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తీవ్ర స్థాయిలో స్పందించారు. కాల్పులు జరపమని అతనికి డబ్బులు ఎవరు ఇచ్చారని ప్రశ్నించారు. సీఏఏ, ఎన్ఆర్సీ, ఎన్పీఆర్కు వ్యతిరేకంగా శుక్రవారం పార్లమెంటు ఆవరణలో జరిగిన ఆందోళన కార్యక్రమం సందర్భంగా రాహుల్ ఈ మేరకు వ్యాఖ్యానించారు. (చదవండి : జామియా విద్యార్థులపై కాల్పులు) బడ్జెట్ సమావేశాల సందర్భంగా కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ సహా ప్రతిపక్ష నేతలు పార్లమెంటు ఆవరణంలోని మహాత్మా గాంధీ విగ్రహం ముందు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా రాహుల్ మాట్లాడుతూ.. ‘జామియా షూటర్‌కి డబ్బులు ఎవరు చెల్లించారు’ అంటూ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. శాంతియుతంగా నిరసనలు తెలుపుతున్న ప్రజలపై దాడులు చేయడం సరికాదన్నారు. (చదవండి : కాల్పుల కలకలం.. అతడింకా పిల్లాడే) మరోవైపు కాల్పుల ఘటనపై కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ కూడా ట్విటర్లో స్పందించారు. ‘‘కాల్చిపారేయాలి అంటూ బీజేపీ నేతలు, మంత్రులు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం వల్లే ఇవన్నీ జరుగుతున్నాయి. ఎలాంటి ఢిల్లీని నిర్మించాలనుకుంటున్నారు అని అడిగితే మోదీ సమాధానం చెప్పగలరా? వాళ్లు హింస వైపు నిలబడతారా, అహింస వైపు నిలబడతారా? అభివృద్ధి వైపు నిలబడతారా? అల్లర్ల వైపు నిలబడతారా?’ అని ఆమె ప్రశ్నలు కురిపించారు. కాగా, గురువారం జామియా మిలియా యూనివర్సీటీలో 17 ఏళ్ల ఆగంతకుడు జరిపిన కాల్పుల్లో ఓ విద్యార్థికి గాయాలు అయ్యాయి. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాల్పులకు పాల్పడిన వ్యక్తిని ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన రాంభక్త్ గోపాల్‌గా గుర్తించామని పోలీసులు తెలిపారు -
కాల్పుల కలకలం.. అతడింకా పిల్లాడే.!
న్యూఢిల్లీ : పౌరసత్వ నిరసనకారులపై ఢిల్లీలోని జామియా మిలియా యూనివర్సిటీలో జరిగిన కాల్పుల ఉదంతంపై పలు ఆసక్తికర విషయాలు బయటపడ్డాయి. కాల్పులకు దిగిన రాంభక్త్ గోపాల్ ఇంకా మైనరేనని తేలింది. అతడి మార్కుల మెమో ఆధారంగా ఈ విషయం వెల్లడైందని ఢిల్లీ పోలీసులు తెలిపారు. రాంభక్త్పై హత్యాయత్నం కేసు నమోదు చేశామని, అతన్ని జువైనల్ జస్టిస్ బోర్డు ఎదుట ఈరోజు హాజరు పరుస్తామని క్రైం బ్రాంచ్ పోలీసులు చెప్పారు. వారు తెలిపిన వివరాల ప్రకారం.. కాల్పులకు దిగిన రాంభక్త్ గోపాల్ ఇంటర్ మొదటి సంవత్సరం విద్యార్థి అని తెలిసింది. ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన రాంభక్త్ కుటుంబంతో కలిసి ఢిల్లీకి 68 కిలోమీటర్ల దూరంలోని జీవార్లో ఉంటున్నాడు. సీఏఏ నిరసనకారులపై దాడి చేసేందుకే అతడు కొద్ది రోజుల క్రితం ఓ నాటు తుపాకీని కొన్నాడు. గురువారం ఉదయం కాలేజీకి వెళ్తున్నానని చెప్పి ఇంట్లో నుంచి బయల్దేరాడు. నేరుగా బస్సెక్కి ఢిల్లీకి చేరుకున్నాడు. జామియా మిలియా యూనివర్సిటీలో పౌరసత్వ నిరసనకారుల గుంపులో చేరిపోయాడు. నిరసనకారులు హోలీ ఫ్యామిలీ ఆస్పత్రి వైపు వెళ్తుండగా గుంపులో నుంచి బయటికొచ్చాడు. తనను తాను ‘రాంభక్త్ గోపాల్’గా చెప్పుకున్నాడు. నిరసనకారులపై కాల్పులు జరిపాడు. దాంతో షాదామ్ ఫారూక్ విద్యార్థి అనే విద్యార్థి చేతికి బుల్లెట్ తగిలింది’అని వెల్లడించారు. (చదవండి : జామియా విద్యార్థులపై కాల్పులు) ఇక కాల్పుల ఘటన చోటుచేసుకునే సమయంలో, అనంతరం పోలీసుల తీరుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. ఆగంతకుడి చేతిలో తుపాకీ ఉందని గుర్తించినా పోలీసులు అతన్ని కట్టడి చేయలేదని పలువురు ఆరోపించారు. నిందితుడి దాదాపు 30 మీటర్ల దూరంలో ఉండటంతో అతని చేతిలో ఉన్న తుపాకీని గుర్తించలేదని పోలీసులు చెప్పడం గమనార్హం. కాల్పులకు తెగబడిన తరువాత రాంభక్త్ సంఘటనా స్థలం నుంచి నింపాదిగా నడుచుకుంటూ వెళ్తూ చేతిలోని తుపాకీని గాల్లో ఊపుతూ ‘తీసుకోండి స్వాతంత్య్రం’అని వ్యాఖ్యానించడం గమనార్హం. చివర్లో ‘ఢిల్లీ పోలీస్ జిందాబాద్’అని రాంభక్త్ నినాదాలు చేయడం విశేషం. ఇదిలాఉండగా.. ఈ ఘటనపై హోం మంత్రి అమిత్ షా స్పందించారు. జామియా మిలియా వర్సిటీ వద్ద నిరసనకారులపై కాల్పులు జరిపిన వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఢిల్లీ పోలీస్ కమిషనర్ అమూల్య పట్నాయక్‌ను ఆదేశించారు. కాల్పులకు పాల్పడేందుకు కొద్దిసేపటికి ముందు రాంభక్త్ ఫేస్బుక్ లైవ్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ‘షహీన్‌బాగ్ ఖేల్ ఖతమ్’అంటూ అతడు ఒక పోస్ట్ పెట్టాడు. తన అంతిమయాత్రలో తన శరీరాన్ని కాషాయ వస్త్రంతో చుట్టాలని, జైశ్రీరామ్ నినాదాలు చేయాలని అతడు మరో పోస్ట్ పెట్టినట్లు తెలుస్తోంది. ఈ పోస్టుల తాలూకూ స్క్రీన్షాట్లు వైరల్కావడంతో అతడి ఫేస్బుక్ ప్రొఫైల్‌ను తొలగించారు. -
జామియా విద్యార్థులపై కాల్పులు
న్యూఢిల్లీ: పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఢిల్లీలోని జామియా మిలియా విశ్వవిద్యాలయం వద్ద జరుగుతున్న ఆందోళనల్లో గురువారం కలకలం చెలరేగింది. ఆగంతకుడు ఒకరు తుపాకీతో జరిపిన కాల్పుల్లో ఓ విద్యార్థి గాయపడ్డాడు. ఆ ఘటనకు నిరసనగా వందలాది మంది ప్రజలు పోలీసులతో ఘర్షణకు దిగారు. పోలీసుల బ్యారికేడ్లను తోసుకుంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. కాల్పులకు తెగబడిన తరువాత ఆ వ్యక్తి సంఘటన స్థలం నుంచి నింపాదిగా నడుచుకుంటూ వెళ్తూ చేతిలోని తుపాకీని గాల్లో ఊపుతూ ‘తీసుకోండి స్వాతంత్య్రం’అని వ్యాఖ్యానించడం గమనార్హం. అప్పటివరకూ నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించిన అక్కడి పోలీసులు ఒక్కసారిగా మేలుకొని కొంతమంది ఆందోళనకారుల సాయంతో కాల్పులు జరిపిన వ్యక్తిని పట్టుకోగలిగారు. ఈ మొత్తం వ్యవహారంతో ఆందోళనలు జరుగుతున్న ప్రాంతంలో కొంత సమయం గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. నల్లటి జాకెట్ తొడుక్కున్న ఆ వ్యక్తి తనను తాను ‘రాం భక్త్ గోపాల్’గా చెప్పుకున్నాడు. గోపాల్ కాల్పులకు పాల్పడేందుకు కొద్దిసేపటికి ముందే ఫేస్బుక్ లైవ్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ‘షహీన్‌బాగ్ ఖేల్ ఖతమ్’అంటూ అతడు ఒక పోస్ట్ పెట్టాడు. తన అంతిమయాత్రలో తన శరీరాన్ని కాషాయ వస్త్రంతో చుట్టాలని, జైశ్రీరామ్ నినాదాలు చేయాలని అతడు మరో పోస్ట్ పెట్టినట్లు తెలుస్తోంది. ఈ పోస్టుల తాలూకూ స్క్రీన్షాట్లు వైరల్కావడంతో అతడి ఫేస్బుక్ ప్రొఫైల్‌ను తొలగించారు. ‘పోలీసులు బ్యారికేడ్లు ఏర్పాటు చేసిన హోలీ ఫ్యామిలీ ఆస్పత్రి వైపు వెళ్తున్నాం. అకస్మాత్తుగా ఓ వ్యక్తి తుపాకీతో మా ముందుకొచ్చాడు. కాల్పులు జరిపాడు. ఒక బుల్లెట్ షాబాద్ ఫారూఖ్ చేతికి తగిలింది’అని ఆమా ఆసిఫ్ అనే విద్యార్థిని తెలిపింది. షాబాద్‌ను ఆలిండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ ట్రామా సెంటర్‌కు తరలించారని వివరించింది. పలువురు ఇతర విద్యార్థులు ఘటన తీరును అనంతర పరిస్థితులను వివరించారు. జామియా మిలియా విద్యార్థులు గురువారం మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో మహాత్మాగాంధీ స్మారకం రాజ్‌ఘాట్ వద్దకు ర్యాలీగా వెళ్తుండగా.. హోలీ ఫ్యామిలీ ఆసుపత్రి వద్ద పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో విద్యార్థులు అక్కడే బైఠాయించి పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేయడం మొదలుపెట్టారు. విద్యార్థుల ర్యాలీకి అనుమతి లేదని డీసీపీ చిన్మయ్ బిశ్వాల్ తెలిపారు. ‘నిరసన శాంతియుతంగా జరుపుకోవాలని పదేపదే చెబుతున్న తరుణంలో ఓ వ్యక్తి తుపాకీతో వచ్చాడు. అతడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నాం’అని బిశ్వాల్ తెలిపారు. కఠినంగా వ్యవహరించండి జామియా మిలియా వర్సిటీ వద్ద నిరసనకారులపై కాల్పులు జరిపిన వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకోవాలని హోం మంత్రి అమిత్ షా ఢిల్లీ పోలీస్ కమిషనర్ అమూల్య పట్నాయక్‌ను ఆదేశించారు. ఇలాంటి ఘటనలను కేంద్రం సహించబోదని, దోషులను వదిలేది లేదని స్పష్టం చేశారు. ఈ ఘటనపై ఢిల్లీ స్పెషల్ కమిషనర్ ప్రవీర్ రంజన్ దర్యాప్తు చేస్తారని, కేసు పురోగతిని స్వయంగా సమీక్షించనున్నట్లు ట్విట్టర్లో ప్రకటించారు. జామియా మిలియా వర్సిటీ వద్ద బుధవారం జరిగిన సీఏఏ వ్యతిరేక ఆందోళనల సందర్భంగా ఒక వ్యక్తి జరిపిన కాల్పుల్లో ఒక విద్యార్థి గాయపడిన విషయం తెలిసిందే. రాంభక్త్ గోపాల్ అని చెప్పుకునే ఆ వ్యక్తిని వెంటనే అదుపులోకి తీసుకుని, దర్యాప్తు చేపట్టామని పోలీసులు తెలిపారు. -
ఢిల్లీలో కాల్పుల కలకలం
-
క్యాంపస్‌లో ఖాకీలు : విచారణకు డిమాండ్
సాక్షి, న్యూఢిల్లీ : పౌరసత్వ సవరణ చట్టంపై నిరసనల నేపథ్యంలో జామియా మిలియా వర్సిటీలోకి పోలీసులు ప్రవేశించి విద్యార్ధులపై దౌర్జన్యానికి పాల్పడ్డారని వర్సిటీ అధికారులు కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ (హెచ్ఆర్డీ)కు తాజా నివేదిక సమర్పించారు. క్యాంపస్‌లోకి పోలీసుల ప్రవేశంపై న్యాయ విచారణ చేపట్టాలని వర్సిటీ కోరింది. ఈ ఘటనపై విచారణ కమిటీ లేదా న్యాయవిచారణకు ఆదేశించాలని తాజా నివేదికలో హెచ్ఆర్డీని కోరింది. డిసెంబర్ 15-16 తేదీల్లో మధుర రోడ్, జులేనా రోడ్లపై ఆందోళనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీచార్జ్ చేయడంతో పాటు భాష్పవాయుగోళాలను ప్రయోగించారని నివేదికలో వర్సిటీ ఆరోపించింది. ఈ ఘటనలపై న్యాయవిచారణకు ఆదేశించాలని మంత్రిత్వ శాఖకు వర్సిటీ రిజిస్ట్రార్ సమర్పించిన నివేదికలో జామియా మిలియా ఇస్లామియా యూనివర్సిటీ అధికారులు కోరారు. కాగా కేంద్ర ప్రభుత్వం చేపట్టిన పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ జామియా మిలియా వర్సిటీ విద్యార్ధుల నిరసనలతో వర్సిటీ క్యాంపస్ హోరెత్తిన సంగతి తెలిసిందే. -
‘ఢిల్లీకి వచ్చి పెద్ద తప్పు చేశాను’
ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీకి వచ్చి చాలా పెద్ద తప్పు చేశానని జామియా మిలియా ఇస్లామియా విశ్వవిద్యాలయంలో న్యాయవిద్యను అభ్యసిస్తున్న విద్యార్థి మిన్హాజుద్దీన్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నెల 15న జామియా యూనివర్సిటీలో పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా విద్యార్థులు చేపట్టిన నిరసనల్లో పోలీసులు విచక్షణరహితంగా విద్యార్థులపై లాఠీఛార్జి చేసిన విషయం తెలిసిందే. ఈ పోలీసుల దాడిలో మిన్హాజుద్దీన్ కంటికి తీవ్రంగా గాయం కావటంతో పాక్షికంగా చూపు కోల్పోయారు. లైబ్రరీలో చదువుకుంటున్న సమయంలో అకారణంగా పోలీసులు తనపై లాఠీచార్జ్ చేశారని తెలిపారు. నిరసనలు ఏడో గేటు వద్ద జరుగుతుంటే పోలీసులు లైబ్రరీలోకి చొరబడి దాడి చేశారని పేర్కొన్నారు. తాను అసలు నిరసన కార్యక్రమంలో పాల్గొనలేదని మిన్హాజుద్దీన్ వెల్లడించారు. తనకు శాంతి భద్రతలపై పూర్తి నమ్మకం ఉందని.. ‘నేను చేసిన నేరం ఏంటి’ అని మిన్హాజుద్దీన్ సూటిగా ప్రశ్నించారు. పోలీసుల లాఠీచార్జ్‌లో తన కంటికి గాయం అయిందని దీంతో మరో కంటికి కూడా ఇన్ఫెక్షన్ సోకుతుందని వైద్యులు చెప్పినట్లు ఆవేదన వ్యక్తం చేశారు. ‘ఈ ఘటనతో నాకు చాలా భయంగా ఉంది. అలాగే ఇకనుంచి లైబ్రరీలో చదుకోమని ఏ విద్యార్థికి నేను చెప్పలేను. ఆ భయంతో నేను లైబ్రరీలోకి చదుకోవడానికి వెళ్లలేను. విశ్వవిద్యాలయంలో భద్రత లేదు. ఈ ఘటనతో నా తల్లిదండ్రులు బిహార్‌కి వచ్చేయాలని కోరుతున్నారు’ అని మిన్హాజుద్దీన్ తెలిపారు. తాను న్యాయ విద్యను అభ్యసించి, శిక్షణ తీసుకునేందుకు ఢిల్లీకి వచ్చినట్లు తెలిపారు. అది పూర్తైన తర్వాతే బిహార్‌కి వెళ్తానని... అయితే. ఈ ఘటనతో తాను ఎందుకు ఢిల్లీకి వచ్చానా? అని బాధ పడుతున్నానని తెలిపారు. ఎందుకో ఢిల్లీని సురక్షితమైన నగరంగా తాను భావించటం లేదని.. ఇక్కడికి వచ్చి పెద్ద తప్పుచేశానని మిన్హాజుద్దీన్ ఆవేదన వ్యక్తం చేశారు. -
డప్పు దరువులతో.. ‘విప్లవం వర్థిలాలి’
న్యూఢిల్లీ : పౌరసత్వ సవరణ చట్టంపై ఆందోళనలు రోజురోజుకు ఉధృతమవుతున్నాయి. ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద జామియా మిలియా ముస్లిం యూనివర్సిటీ మహిళా విద్యార్థులు గురువారం నిరసనలతో కదం తొక్కారు. ‘జామియా మహిళల విప్లవం వర్థిల్లాలి’ అంటూ నినాదాలు, పాటలతో హోరెత్తించారు. కాగా, పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్న జామియా విశ్వవిద్యాలయ విద్యార్థులపై గత ఆదివారం పోలీసులు లాఠీచార్జి చేసిన సంగతి తెలిసిందే. ఈ ఘర్షణల్లో పదుల సంఖ్యలో విద్యార్థులు, పోలీసులు గాయాలపాలయ్యారు. అయితే, శాంతియుతంగా నిరసన తెలుపుతున్న తమపై పోలీసులు దౌర్జన్యం చేశారని విద్యార్థులు ఆరోపించారు. మహిళా విద్యార్థుల గదుల్లోకి వెళ్లి మరీ బయటకు తరిమికొట్టారని వాపోయారు. కాగా, జామియా విద్యార్థులకు దేశవ్యాప్తంగా అనూహ్య మద్దతు లభిస్తోంది. -
టాయిలెట్లో దాక్కొన్నా.. కంటి చూపు పోయింది..
-
టాయిలెట్లో దాక్కొన్నా.. కంటి చూపు పోయింది..
న్యూఢిల్లీ: పౌరసత్వ సవరణ చట్టానికి (సీఏఏ) వ్యతిరేకంగా దేశమంతా అట్టుడుకుతోంది. ఇక దేశ రాజధాని ఢిల్లీలో జామియా మిలియా ఇస్లామియా విశ్వవిద్యాలయంలో పోలీసులు జరిపిన లాఠీ ఛార్జీ కారణంగా మాస్టర్ ఆఫ్ లా (ఎల్ఎల్ఎమ్) విద్యార్థి మిన్హాజుద్దీన్ తన చూపు కొల్పోయాడు. వివరాల్లోకి వెళితే.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరసనల పర్వం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలోనే డిసెంబరు 15న ఢిల్లీలోని జామియా మిలియా ఇస్లామియా విశ్వవిద్యాలయంలో పోలీసులు ఆయుధాలతో యూనివర్సిటీలోకి చొరబడి విద్యార్థులను చితకబాదారు. సామాజిక మాధ్యమాల్లో పోలీసులు విద్యార్థులను కొడుతున్న వీడియోలు వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే. అయితే సరిగ్గా మూడు రోజుల తర్వాత పోలీసులు జరిపిన లాఠీ చార్జీ కారణంగా జామియా యూనివర్సిటీ ఫైనలియర్ స్టూడెంట్ మిన్హాజుద్దీన్ (26) ఒక కంటికి చూపును పూర్తిగా కోల్పోయాడు. ఇక రెండో కంటిపై కూడా దాని ప్రభావం పడుతుందని డాక్టర్లు చెప్పడంతో ఆవేదన చెందుతున్నాడు. వివరాల్లోకి వెళితే.. గత ఆదివారం తాను లైబ్రరీలోని ఎంఫిల్ సెక్షన్లో చదువుకుంటుండగా.. 25మందికి పైగా సాయుధులైన పోలీసులు లాఠీలతో విద్యార్థులపై దాడికి దిగారు. తన ఒక కంటికి, చేతికి తీవ్ర గాయాలవడంతో.. పారిపోయి టాయిలెట్లో దాక్కుని అక్కడే స్పృహ కోల్పోయానని వివరించాడు. ఆ తర్వాత తన స్నేహితులు కొంతమంది ఎయిమ్స్‌కు, రాజేంద్ర ప్రసాద్ ఐ ఇన్సిట్యూట్‌కు చేర్చారని అన్నాడు. పోలీసులు కాల్పులు జరపడం, టియర్ గ్యాస్ ప్రయోగించడంతో వైరల్ అయిన వీడియోల్లో విద్యార్థుల అర్తనాదాలు, లైబ్రరీలో పుస్తకాలు చెల్లాచెదురు కావడం గమనించవచ్చు. ఇక పోలీసులు దుశ్చర్యకు పాల్పడ్డారని వస్తున్న ఆరోపణలపై సీనియర్ పోలీసు అధికారి వివరణ ఇచ్చారు. జామియా విద్యార్థులపై అవసరానికి మించి బలప్రయోగం, యూనివర్సిటీ క్యాంపస్‌లోకి అక్రమంగా చొరబడటం అనే ఆరోపణల్లో నిజం లేదన్నారు. పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ.. ఒక గుంపు లోపలికి వెళ్ళిన తర్వాతే పోలీసులు క్యాంపస్‌లోకి ప్రవేశించారని పేర్కొన్నారు. ఇక హోం మంత్రిత్వ శాఖకు ఢిల్లీ పోలీసులు పంపిన రిపోర్టులో కాల్పులు జరుపలేదని పేర్కొన్నట్లుగా సమాచారం. అయితే పోలీసులు జరిపిన కాల్పుల కారణంగా బుల్లెట్ గాయాలతో ఇద్దరు విద్యార్థులు సప్ధార్ జంగ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా ఆదివారం విద్యార్థులు ప్రశాంతంగా నిర్వహిస్తున్న ర్యాలీలో స్థానిక ముఠాలు ప్రేరేపిస్తున్నాయనే నెపంతో హింసాత్మకంగా మార్చారు. జామియా మిలియా ఇస్లామియా యూనివర్సిటీలో ఆదివారం జరిగిన దమనకాండలో విద్యార్ధులను మినహాయించి 14 మంది స్ధానికులను అరెస్టు చేశారు. దేశవ్యాప్తంగా సీఏఏకి వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్న వారిలో ఇప్పటివరకు ఇద్దరు మైనర్లతో సహా మొత్తం ఆరు మంది ప్రాణాలు విడిచారు. కాగా ఢిల్లీలో నిరసనల హోరు కారణంగా గంటల కొద్ది ట్రాఫిక్ జామ్ అవుతుండడంతో.. ఏకంగా కొన్ని రోడ్లనే మూసివేశారు. -
షాహి ఇమామ్ సంచలన వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ సర్కారు తీసుకువచ్చిన పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా దేశ రాజధాని సహా వివిధ రాష్ట్రాల్లో నిరసనలు పెల్లుబుకుతున్న వేళ ఢిల్లీలోని జామా మసీదు షాహీ ఇమామ్ సయ్యద్ అహ్మద్ బుఖారి కీలక వ్యాఖ్యలు చేశారు. పౌరసత్వ సవరణ చట్టం భారత్‌లో నివసిస్తున్న ముస్లింలకు ఎటువంటి నష్టం చేయదని పేర్కొన్నారు. అది కేవలం ముస్లిం శరణార్థులకు ఇచ్చే పౌరసత్వానికి మాత్రమే వ్యతిరేకమని స్పష్టం చేశారు. దేశ వ్యాప్తంగా నిరసనలకు కారణమవుతున్న పౌరసత్వ సవరణ చట్టం, జాతీయ పౌర పట్టిక(ఎన్నార్సీ) గురించి సయ్యద్ మంగళవారం మీడియాతో మట్లాడారు. ‘నిరసన తెలపడం అనేది భారత ప్రజలకు ఉన్న ప్రజాస్వామ్యపు హక్కు. మనకు నచ్చని అంశంపై నిరసన తెలియజేయడాన్ని ఎవరూ ఆపలేరు. అయితే అది శాంతియుతంగా జరగాలి. భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవాలి. పౌరసత్వ సవరణ చట్టానికి, ఎన్నార్సీకి చాలా తేడా ఉంది. ఎన్నార్సీ ఇంకా చట్టరూపం దాల్చలేదు. ఇక పౌరసత్వ సవరణ చట్టం అనేది... పాకిస్తాన్, ఆఫ్గనిస్తాన్, బంగ్లాదేశ్ నుంచి వచ్చే ముస్లిం శరణార్థులకు పౌరసత్వం ఇవ్వడానికి మాత్రమే వ్యతిరేకం. భారతీయ ముస్లింలకు దాంతో ఎటువంటి నష్టం జరగదు’ అని పేర్కొన్నారు. అదే విధంగా జామియా యూనివర్సిటీ రణరంగంగా మారిన నేపథ్యంలో ప్రతీ ఒక్కరూ సంయమనం పాటించాలని సయ్యద్ విఙ్ఞప్తి చేశారు. కాగా పార్లమెంటు ఆమోదం పొందిన వివాదాస్పద పౌరసత్వ సవరణ బిల్లుపై రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ సంతకం చేయడంతో చట్టరూపం దాల్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో మూడు పొరుగు దేశాలైన.. పాకిస్తాన్, బంగ్లాదేశ్, అఫ్గానిస్తాన్‌లలో మతపరమైన వేధింపులు ఎదుర్కొని భారత్‌కు వచ్చిన ముస్లిమేతరులకు భారత పౌరసత్వం కల్పించే వీలు కలుగుతుంది. Shahi Imam of Delhi's Jama Masjid, Syed Ahmed Bukhari: There is a difference between Citizenship Amendment Act (CAA) & National Register of Citizens (NRC). One is CAA that has become a law, and the other is NRC that has only been announced, it has not become a law. (17.12.19) pic.twitter.com/Eo9bjd8YTp — ANI (@ANI) December 18, 2019 -
నన్ను ఎన్కౌంటర్ చేస్తారనుకున్నా..
న్యూఢిల్లీ: పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా నిరసన జ్వాలలు కొనసాగుతున్నాయి. ఈశాన్య రాష్ట్రాలతో పాటుగా వివిధ ప్రాంతాల్లో ఘర్షణలు చెలరేగుతున్నాయి. ఈ ఘటనల్లో ఎంతో మంది పౌరులు తీవ్ర గాయాల పాలవుతున్నారు. నిరసనకారులను నిలువరించేందుకు పోలీసులు తీసుకుంటున్న చర్యలపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా దేశ రాజధాని ఢిల్లీలోని జామియా మిలియా ఇస్లామియా యూనివర్సిటీ విద్యార్థుల పట్ల పోలీసులు ప్రవర్తించిన తీరుపై పలువరు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. అనుమతి లేకుండా ఆదివారం జెఎంఐలోకి ప్రవేశించి, విద్యార్థుల తరగతి గదుల్లో చొరబడి మరీ వెంబడించి కొట్టారని పోలీసులపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. లైబ్రరీలో చదువుకుంటున్న అమాయకులపై దౌర్జన్యం చేశారంటూ ఆగ్రహ జ్వాలలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలో కొంతమంది జామియా విద్యార్థులు తమకు ఎదురైన చేదు అనుభవాల గురించి జాతీయ మీడియా ముందు గోడు వెళ్లబోసుకున్నారు. మహ్మద్ ముస్తఫా అనే విద్యార్థి మాట్లాడుతూ... ‘ నేను లైబ్రరీలో చదువుకుంటున్న సమయంలో టియర్ గ్యాస్ వాసన వచ్చింది. పోలీసులు వచ్చి లైబ్రరీలో ఉన్నవాళ్లందరినీ కొట్టారు. నా లాప్టాప్ పగులగొట్టారు. నన్ను కొట్టడం మొదలుపెట్టారు. దేవుడిని తలచుకోండి అంటూ ఆఙ్ఞలు జారీ చేశారు. ఆ తర్వాత కొద్ది సేపటికే నన్ను పోలీసు స్టేషనుకు తరలించారు. కాళ్లు, చేతులపై తీవ్రంగా కొట్టారు. నా రెండు చేతులు ఫ్రాక్చరయ్యాయి. మందుల కోసం అడిగే వాళ్లను చచ్చిపోనివ్వండి అంటూ విద్యార్థులను ఉద్దేశించి పోలీసులు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. నన్ను ఆరోజు ఎన్కౌంటర్ చేస్తారేమోనని భయంతో చచ్చిపోయా అంటూ ఆవేదన వ్యక్తం చేశాడు.(‘నేను ముస్లిం కాదు.. అయినా సీఏఏని వ్యతిరేకిస్తున్నాను’) ఇక మరో విద్యార్థి హమ్జాలా ముజీబీ(21) మాట్లాడుతూ.. ‘ఆరోజు లైబ్రరీ మొత్తాన్ని పోలీసులు చుట్టుముట్టారు. సీసీటీవీలను పగులగొట్టారు. మమ్మల్ని అందరినీ లైన్లో నిల్చోబెట్టి కొట్టారు. మా ఫోన్లు పగులగొట్టారు. మీరెంత మీ వయసెంత. మీకు స్వాతంత్ర్యం కావాలా అంటూ ప్రశ్నించారు. వారి వైపు తీక్షణంగా చూస్తుంటే కళ్లు దించరా అంటూ నా కళ్లజోడు లాక్కొన్నారు అంటూ భయానక అనుభవం గురించి ఇండియా టుడేతో చెప్పుకొచ్చాడు. కాగా పార్లమెంటు ఆమోదం పొందిన వివాదాస్పద పౌరసత్వ సవరణ బిల్లుపై రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ సంతకం చేయడంతో చట్టరూపం దాల్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో మూడు పొరుగు దేశాలైన.. పాకిస్తాన్, బంగ్లాదేశ్, అఫ్గానిస్తాన్‌లలో మతపరమైన వేధింపులు ఎదుర్కొని భారత్‌కు వచ్చిన ముస్లిమేతరులకు భారత పౌరసత్వం కల్పించే వీలు కలుగుతుంది. -
వాళ్లకు టీ అందించి శభాష్ అనిపించుకున్నారు
-
వాళ్లకు టీ అందించి శభాష్ అనిపించుకున్నారు
న్యూఢిల్లీ : ‘పౌరసత్వ’ నిరసనకారులకు టీ అందించి ఇద్దరు సిక్కు సోదరులు మానవత్వం చాటుకున్నారు. పౌరసత్వం సవరణ చట్టం (సీఏఏ)పై నిరసనలు తెలిపిన జామియా మిలియా యూనివర్సిటీ విద్యార్థులపై పోలీసులు ఆదివారం లాఠీచార్జి చేసిన సంగతి తెలిసిందే. దీంతో పోలీసుల దౌర్జన్యకాండను నిరసిస్తూ విద్యార్థులు పెద్దఎత్తున ఇండియాగేట్ వద్ద సోమవారం ఆందోళన నిర్వహించారు. వేలాదిమంది మానవహారం నిర్వహించి.. తమ మొబైల్ టార్చ్‌లతో శాంతియుతంగా నిరసన తెలిపారు. ఈక్రమంలో నిరసనకారులకు మద్దతు తెలపడమేకాకుండా.. ఇద్దరు సిక్కు సోదరులు వారికి టీ కూడా సప్లై చేశారు. స్వయంగా అందరికీ టీ అందించారు. దీంతో ఈ అన్నదమ్ముపై సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం కురుస్తోంది. ఇదిలాఉండగా... జామియా యూనివర్సిటీ విద్యార్థులపై పోలీసుల దాడిని సిక్కులు ఖండించారు. జనవరి 05 వరకు యూనివర్సిటీని మూసివేసిన నేపథ్యంలో విద్యార్థులకు భోజన వసతి కల్పించాలని స్థానిక గురుద్వారాలు నిర్ణయించాయి. ఇండియాగేట్ నిరసనకు పలు హక్కుల సంఘాలు.. 20 కాలేజీలు, యూనివర్సిటీల విద్యార్థులు మద్దతు పలికారు.