సాక్షి, న్యూఢిల్లీ : పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ దేశ రాజధానిలోని జామియా మిలియా ఇస్లామియా యూనివర్సిటీ కేంద్రంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. నిరసన తెలుపుతున్న విద్యార్ధులు, పోలీసుల మధ్య ఘర్షణతో ఆదివారం వర్సిటీ రణరంగాన్నితలపించింది. ఆందోళనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు భాష్పవాయుగోళాలు ప్రయోగించారు. మరోవైపు పోలీసులు తమ ఆందోళనను బలప్రయోగంతో అణిచివేయాలని ప్రయత్నిస్తున్నారని విద్యార్ధులు ఆరోపించారు. మరోవైపు పౌర నిరసనలను కవర్ చేసేందుకు వచ్చిన తనపై పోలీసులు దౌర్జన్యం చేశారని బీబీసీ జర్నలిస్ట్ బుస్రా షేక్ ఆరోపించారు. మగ పోలీసులు తనను జుట్టుపట్టి లాగారని, లాఠీతో కొట్టి తన ఫోన్‌ను గుంజుకున్నారని ఆమె ఆరోపించారు. పోలీసులు తనను దుర్భాషలాడారని, తాను తమాషా కోసం ఇక్కడికి రాలేదని విద్యార్ధుల ఆందోళనను కవర్ చేసేందుకు వచ్చానని ఆమె పేర్కొన్నారు. ఇక పౌరసత్వ చట్ట సవరణను వ్యతిరేకిస్తూ దక్షిణ ఢిల్లీలో ఆందోళనకారులు మూడు బస్‌లను తగలపెట్టారు. మంటలను అదుపులోకి తెచ్చేందుకు వస్తున్న ఫైరింజన్‌ను అడ్డుకుని ధ్వంసం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment