‘పౌరసత్వ’ నిరసనకారులకు టీ అందించి ఇద్దరు సిక్కు సోదరులు మానవత్వం చాటుకున్నారు. పౌరసత్వం సవరణ చట్టం (సీఏఏ)పై నిరసనలు తెలిపిన జామియా మిలియా యూనివర్సిటీ విద్యార్థులపై పోలీసులు ఆదివారం లాఠీచార్జి చేసిన సంగతి తెలిసిందే. దీంతో పోలీసుల దౌర్జన్యకాండను నిరసిస్తూ విద్యార్థులు పెద్దఎత్తున ఇండియాగేట్ వద్ద సోమవారం ఆందోళన నిర్వహించారు. వేలాదిమంది మానవహారం నిర్వహించి.. తమ మొబైల్ టార్చ్‌లతో శాంతియుతంగా నిరసన తెలిపారు.