India Gate
-
ఢిల్లీలో భారీ వర్షం.. ఇండియా గేట్, నోయిడాలో భారీగా ట్రాఫిక్ జామ్
సాక్షి, ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. శనివారం ఉదయం నుంచి ఎడతెరిపిలేని వర్షాల కారణంగా రోడ్లు వరద నీటితో నిండిపోయాయి. దీంతో, వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ఇక, భారీ వానల నేపథ్యంలో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. కాగా, రోడ్ల మీద భారీగా వదర నీరు చేరడంతో మింట్ బ్రిడ్జ్ ప్రాంతంలో అండర్ పాస్‌ను అధికారులు మూసివేశారు. మరోవైపు.. ఇండియా గేట్, నోయిడాలో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఇదిలా ఉండగా.. రానున్న నాలుగు, ఐదు రోజుల్లో జమ్మూ, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, హర్యానా, పశ్చిమ ఉత్తర ప్రదేశ్‌లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. #DelhiRains Daryaganj in a Darya @AtishiAAP @ArvindKejriwal pic.twitter.com/s4VBDscyAJ — Abantika Ghosh (@abantika77) July 8, 2023 दिल्ली में सुबह से ही लगातार बारिश हो रही है बारिश ने मचाई तबाही, राजधानी की सड़कें हुई जाम। बारिश की वजह से जगह-जगह जलभराव की स्थिति देखने को मिली। शहर तालाब में तब्दील हो गया और बरसाती नदियां उफान पर देखने को मिली। #DelhiRains #capital pic.twitter.com/g0CQice4Oc — kumkum (@kumkumgupta00) July 8, 2023 दिल्ली के श्रीनिवासपुरी में बारिश के बाद नाला टूट गया... और नदी की धार की तरह पानी बहता दिखा... #DelhiRains pic.twitter.com/UjuLorgTg7 — kumkum (@kumkumgupta00) July 8, 2023 #DelhiRains| #PragatiMaidanTunnel, which connects India Gate with Ring Road, witnesses severe waterlogging on Saturday following heavy rainfall.#DelhiRain #DelhiNews #Delhi #Rain pic.twitter.com/fPZLwist6r — Prakash K 🇮🇳 (@PrakashK_Legal) July 8, 2023 -
పతకాలను గంగలో కలిపేస్తామంటూ హెచ్చరిక.. హరిద్వార్‌కు చేరుకున్న రెజ్లర్లు
భారత అగ్ర రెజ్లర్ల నిరసన రోజురోజుకి తీవ్ర రూపం దాల్చుతోంది. శాంతియుతంగా చేపట్టిన నిరసన కాస్త ఘర్షణలకు దారితీయడంతో వారిలో ఆగ్రహవేశాలు కట్టలు తెంచుకుని నిరహారదీక్ష చేపట్టేందుకు దారితీసింది. ఈ మేరకు భారత అగ్ర స్థాయి రెజ్లర్లు తమ పతకాలను గంగా నదిలో విసిరేస్తాం, ఆ తర్వాత ఇండియా గేట్ వద్ద నిరవధిక నిరాహార దీక్షకు కూర్చుంటామని గట్టిగా హెచ్చరించారు. ఈ మేరకు మంగళవారం సాయంత్రం రెజ్లర్లు హరిద్వార్‌కు చేరుకుని పతకాలను గంగలో కలిపేందుకు సిద్ధమయ్యారు. #WATCH | Uttarakhand: Wrestlers reach Haridwar to immerse their medals in river Ganga as a mark of protest against WFI chief and BJP MP Brij Bhushan Sharan Singh over sexual harassment allegations.#WrestlersProtest pic.twitter.com/WKqSJQyaH0 — ANI (@ANI) May 30, 2023 అంతకుముందు రెజ్లర్ సాకి మాలిక్ ట్విట్టర్ వేదికగా తమ రెజ్లర్లంతా హరిద్వార్ వెళ్లి గంగా నదిలో సాయంత్రం 6 గంటలకు పతకాలను విసిరేస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే.. తాము కష్టపడి సాధించిన పతకాలను గంగా నదిలో విసిరివేయకపోతే బతకడంలో ఎలాంటి అర్థం లేదు. కాబట్టి ఇండియా గేట్ వద్ద నిరాహార దీక్ష చేస్తాం అని ట్వీట్ చేశారు. అయిన ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టి.. రాజీపడి జీవించడంలో ప్రయోజనం లేదన్నారు. పార్లమెంట్ ప్రారంభోత్సవం వేళ మమ్మల్ని వేధింపులకు గురిచేసిన డబ్ల్యూఎఫ్ చీఫ్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ తెల్లటి దుస్తులు ధరించి అక్కడి దృశ్యాలను క్లిక్ మనిపించడం మమ్మల్ని కలిచివేసింది. అతను అలా తెల్లటి దుస్తులు ధరించడంలో అర్థం తానే వ్యవస్థ అని చెప్పకనే చెప్పినట్లు ఉందని ట్విట్టర్లో రెజ్లర్లంతా కన్నీటి పర్యంతమయ్యారు. అందుకనే మాకు ఈ పతకాలు వద్దు. ఆ వ్యవస్థ మాకు పతకాలు మెడలో వేసి ముసుగు వేసి గొప్ప ప్రచారం చేసుకుంటోందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా, భారత రెజ్లింగ్ సమాఖ్య(డబ్ల్యూఎఫ్ఐ) చీఫ్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌కి వ్యతిరేకంగా లైంగిక ఆరోపణల నేపథ్యంలో వినేష్ ఫోగట్, సాక్షి మాలిక్, బజరంగ పునియా తదితర రెజ్లర్లు ఏప్రిల్ 26 నుచి జంతర్ మంతర్ వద్ద నిరసనలు చేపట్టి సంగతి తెలిసిందే. సుప్రీం కోర్టు జోక్యంతో ఢిల్లీ పోలీసులు శరణ్‌సింగ్‌పై రెండు కేసులు నమోదు చేశారు. ఐతే రెజ్లర్లు మాత్రం అతన్నిఅరెస్టు చేయాలని గట్టిగా డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో పెద్ద సంఖ్యలో రైతులతో సహ చాలామంది మద్దతు వారికి లభించడం గమనార్హం. అదీగాక ఇటీవల జరిగిన కొత్త పార్లమెంట్ ప్రారంభోత్సవం వెలుపలు రెజ్లర్లు శాంతియుతంగా నిరసనలు చేసేందుకు యత్నించారు. ఐతే ఢిల్లీ పోలీసులు అనుమతి నిరాకరిస్తూ వారిని అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. దీంతో ఇరువురు మధ్య తీవ్ర స్థాయిలో ఘర్షణణ వాతావరణం ఏర్పడింది. ఈ క్రమంలోనే రెజ్లర్లు తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ.. నిరవధిక నిరహార దీక్షకు దిగేందుకు సిద్ధమవుతున్నారు. "We will throw our medals in river Ganga in Haridwar today at 6pm," say #Wrestlers who are protesting against WFI (Wrestling Federation of India) president Brij Bhushan Sharan Singh over sexual harassment allegations pic.twitter.com/Mj7mDsZYDn — ANI (@ANI) May 30, 2023 (చదవండి: ఫోన్ కోసం డ్యామ్ నీటిని ఎత్తిపోసిన ఘటన..వృధా చేసిన నీటికి డబ్బు చెల్లించమంటూ లేఖ) -
ఢిల్లీలో అనుహ్యంగా రోడ్ల మీదకు వచ్చిన జనం..ఒక్కసారిగా రహదారులు బ్లాక్
న్యూ ఇయర్ సందర్భంగా ఇండియా గేట్ వద్ద భారీగా జనం పోటెత్తారు. అదీగాక గత రెండేళ్లుగా కరోనా ఆంక్షల నేపథ్యంలో జనం చుట్టుపక్కల ఉన్న షాపింగ్ మాల్స్‌కి, దుకాణాలకు, ఫేమస్ ప్రదేశాలకు వెల్లువలా బయటకు వచ్చారు. దీంతో రహదారులన్నీ ఒక్కసారిగా బ్లాక్ అయ్యాయి. ఇదే సమయంలో జైనుల పుణ్య క్షేత్రమైన సమ్మేద్ షిఖార్జీని పర్యాటక ప్రదేశంగా ప్రకటించాలనే జార్ఖండ్ ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా జైన్ మతానికి చెందిన కొంతమంది వ్యక్తులు ఇండియా గేట్ నుంచి రాష్ట్రపతి భవన్ వరకు ర్యాలీ చేయాలనుకున్నారు. దీంతో ఒక్కసారిగా అప్రమత్తమైన పోలీసులు ఆందోళకనకారులను కొంత దూరంలోనే నిలిపేశారు. సరిగ్గా ఈ ప్రదేశంలోనే ఢిల్లీ వాసులు తమ కుటుంబ సభ్యులతో సెల్ఫీలతో సందడిగా ఉన్నారు. ఆ ప్రదేశం అంతా పికినిక్ స్పాట్‌గా మారింది. దీంతో ఢిల్లీలోని ఐటీఓ, మండిహౌస్, ఆశ్రమం, మధుర రోడ్, గ్రీన్‌పార్క్, డీఎన్డీ వంటి తదితర ప్రాంతాలలో చాలా దారుణమైన ట్రాఫిక్ ఏర్పడి వాహనాలన్ని ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. Delhi | Members of the Jain community protest at India Gate against the decision of the Jharkhand govt to declare 'sacred' Shri Sammed Shikharji a tourist place pic.twitter.com/6WCKHq3UII — ANI (@ANI) January 1, 2023 (చదవండి: న్యూ ఇయర్ గిఫ్ట్ అంటూ..పాముతో కాటు వేయించుకుని మరీ చనిపోయాడు) -
ఇండియాగేట్‌కు గుమ్మడికాయ కడదాం!
కరెన్సీ నోట్ల, రూపాయి విలువ, ద్రవ్యోల్బణం, అరవింద్ కేజ్రీవాల్, ఇండియాగేట్, ఎలాన్ మస్క్, ట్విట్టర్, రిషి సునాక్, సరికొండ చలపతి ఇద్దరు స్నేహితుల మధ్య సంభాషణ.. ‘ఎలాన్ మస్క్ 44 బిలియన్ డాలర్లు పెట్టి ట్విట్టర్ కొన్నాడురా ‘వార్నీ! అంత డబ్బు ఎందుకు వేస్ట్ చేశాడు? మనలాగా గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకుంటే సరిపోయేది కదా!’’ – ఫ్రెండ్ చమత్కారం ..... దాదాపు ఇంతే చమత్కార సూచన ఓ ముఖ్యమంత్రి నుంచి సీరియస్‌గా వచ్చింది. చూడండి: ‘‘ప్రస్తుత దేశ ఆర్థిక పరిస్థితి ఏమీ బాగాలేదు. అమెరికా డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ బాగా తగ్గుతోంది. సామాన్య ప్రజలు కష్టాల్లో కూరుకుపోతున్నారు. దేవతల ఆశీస్సులు కావాలి. ఆ చిత్రాలను కరెన్సీ నోట్లపై ముద్రిస్తే వారి ఆశీర్వాదాలు మనకు లభిస్తాయి. మన నోట్లపై గణేశ్, లక్ష్మీదేవిల చిత్రాలు వేద్దాం. అప్పుడే ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి చెంది భారతదేశం సంపన్న దేశంగా మారుతుంది.’’ – ఈ అరవింద్ కేజ్రీవాల్ సూచనను జనం కాసింత క్రేజీ ఐడియాగానే చూశారు. కరెన్సీ నోట్లపై అంబేడ్కర్, వల్లభభాయ్ పటేల్, భగత్‌సింగ్, సుభాష్ చంద్రబోస్, అబ్దుల్ కలాం ఇలాంటి వారి బొమ్మలు కూడా ఉండాలన్న దేశభక్తితో పాటు... లక్ష్మీదేవి, గణేశ్ లాంటి దేవుళ్ల ఫొటోలు ఉండాలన్న మతపర విశ్వాసాలు ఆక్షేపణీయమేమీకాదు. – కానీ.. పడిపోతున్న రూపాయి విలువ పెంచడానికి, ఆర్థిక వ్యవస్థను దారిలో పెట్టడానికి మూలికా వైద్యం స్థాయి చిట్కాలు... అదీ ఓ ముఖ్యమంత్రి నోట, అందునా ఓ ఐఐటీ మేధావి నోటి వెంట రావడం చర్చకు దారితీసింది. రిషి సునాక్! వింటున్నారా... కాసింత ముందుగా ఈ చిట్కా చెప్పివుంటే బాగుండేది. ఆర్థిక వ్యవస్థను దారిలో పెట్టలేక 45 రోజులకే బ్రిటన్ ప్రధాని లిజ్ ట్రస్ రాజీనామా చేయాల్సిన అవసరం లేకపోయేది. బ్రిటన్‌లో ద్రవ్యోల్బణం 10 శాతానికి చేరి, ధరాభారం మోయలేక సామాన్యులు నానా యాతనలు పడుతున్నారు. మినీ బడ్జెట్‌తో దాన్ని బాగు చేయలేక మార్కెట్లన్నీ కుదేలయి పోతుంటే విధిలేక ప్రధానిగా ట్రస్ రాజీనామా చేయాల్సి వచ్చింది. ఇంత అద్భుతమైన ఐడియా ఆమె చెవిలో వేసుంటే బాగుండేది కదా, అక్కడి కరెన్సీపై వాళ్ల దేవుళ్ల బొమ్మ ముద్రించి బయటపడేది కదా. –అని నెటిజన్లు చురకలేస్తున్నారు. ‘‘రిషి సునాక్ .. వింటున్నారా? కేజ్రీవాల్ చెప్పిన మేడ్ ఈజీ ఫార్ములా, చిన్న చిట్కాతో మీ దేశం బాగుపడిపోతుంది.. అంటూ సరదా కామెంట్లు పెడుతున్నారు. రష్యా–ఉక్రెయిన్ యుద్ధంతోపాటు అనేక కారణాలతో ప్రధాన దేశాలు ఆర్థిక మాంద్యం దిశలో నడుస్తున్నాయి. 2023 కల్లా దాదాపు సగానికి తగ్గొచ్చన్న సంకేతాలు వినపడుతున్నాయి. కేజ్రీవాల్ జీ! కరెన్సీ నోట్లపై దేవుళ్ల బొమ్మలు ముద్రించాలని ప్రధాని మోదీకి రాసే లేఖలో... ఈ చిట్కాను ఐక్యరాజ్యసమితి సమావేశాల్లో కూడా ప్రస్తావించాలని కోరండి. ప్రపంచ దేశాలన్నీ ఆర్థిక మాంద్యంలోంచి బయటపడే అవకాశం ఉంది. మాంకాళమ్మ, పోలేరమ్మ... ఇదేమీ సీరియస్ కాదు. మోదీ మత రాజకీయాలపై కేజ్రీవాల్ వ్యంగాస్త్రమిది. ముల్లును ముల్లుతోనే తీయాలనే వ్యూహం. ఇప్పుడు చూడండి బీజేపీ గింగిరాలు తిరుగుతోంది. –అని ఓ అభిమాని ఆనందం. అవునవును.. రూపాయికీ, గుజరాత్ ఎన్నికల్లోనూ దైవసాయం అవసరమే. అయితే, దీన్ని ఇంకా పవర్‌ఫుల్‌గా వాడుకోవచ్చుననే సలహా కూడా వినిపిస్తోంది.. గణేశ్, లక్ష్మీదేవిలతో పాటు మాంకాళమ్మ, పోలేరమ్మ, ఉప్పలమ్మ, కట్టమైసమ్మలాంటి గ్రామ దేవతల ఫొటోలు కూడా కరెన్సీ నోట్లపై ముద్రిస్తే... రూరల్ ఓటింగ్ అంతా మనకే. – సూపర్ ఐడియా! గుమ్మడికాయ మంత్రం... కేజ్రీవాల్ దారిలోనే ఇంకాస్త అడుగు ముందుకు వేసిన తుంటరి కుర్రాళ్లు ఇలా సూచిస్తున్నారు. ‘‘నిరుద్యోగం పెరిగిపోతోంది, పేదరికం పెరిగిపోతోంది, మన దేశ ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రమే, జనం చేతిలో డబ్బులు ఆడడం లేదు. విద్య, వైద్యం పరిస్థితి ఏం బాగాలేదు. గ్రామాల పరిస్థితి అంతంతే. పట్టణాల్లో కాలుష్యం బాగా పెరిగి పోతోంది. టపాసులతో దీపావళి చేసుకునే పరిస్థితి లేదు. చాలా విషయాల్లో ఇతర దేశాలకన్నా వెనుకబడిపోతున్నాం. పైగా పాకిస్తాన్, బంగ్లాదేశ్, చైనాలనుంచి నరదిష్టి ఎక్కువయింది. వీటన్నింటికి విరుగుడుగా ఇండియా గేట్‌కు ‘గుమ్మడి కాయ’ కడితే ఫలితం ఉంటుందేమో. మేమయితే మా ఇంటికి గుమ్మడి కాయే కడుతున్నాం.’’ – మంచి చిట్కా యాక్ట్ ఆఫ్ గాడ్.. అంతా దైవికం! ఇలా దేవుడిని లాగడం గతంలో కూడా జరిగింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్.. కరోనా వల్లే ఆర్థిక వృద్ధిరేటు తగ్గిందనీ, జీడీపీ తగ్గుముఖం పట్టడానికి, జీఎస్టీ వసూళ్లు తగ్గడానికి అదే కారణం అని అంతా ‘యాక్ట్ ఆఫ్ గాడ్’ (దైవిక చర్య )అనడం పెనుదుమారమే లేపింది. మీ తప్పిదాలను దేవుడిపై నెడతారా అని విపక్షాలవారు, నెటిజన్లు విరుచుకు పడ్డారు. ఇది యాక్ట్ ఆఫ్ గాడ్ కాదనీ, యాక్ట్ ఆఫ్ గవర్నమెంట్ అనీ విమర్శలు గుప్పించారు. అంతకుముందు సంవత్సరం పరిస్థితేమిటని ప్రశ్నించారు. యాక్ట్ ఆఫ్ గాడ్ పేరు మీద ప్రజలు పన్ను చెల్లించడం మానేస్తే ఓకేనా అని ప్రశ్నించారు. కాస్త కొంటె నెటిజన్లు ఇండియాలో ముక్కోటి దేవతలు ఉన్నారు. ఇంతకీ ఏ దేవుడి పుణ్యం ఇది అని వెక్కిరించారు. ముస్లిం దేవుళ్లు, క్రిస్టియన్ దేవుళ్లు, ఇతర మైనారిటీ మతాల దేవుళ్ల పాత్ర ఏమైనా ఉందా అని ట్రోల్ చేశారు. వారందరినీ కోర్టుకు లాగుతున్నారా లేదా అని వ్యంగాస్త్రాలు సంధించారు. కరెన్సీకి ఎక్స్పైరీ డేట్... కరెన్సీ ప్రస్తావన రాగానే గుర్తుకు వచ్చేది నవంబర్ 8, 2016 నాటి డీమానిటైజేషన్. పెద్ద నోట్ల రద్దు జరిగి ఇప్పటికి ఆరేళ్లు. నల్లధనం ఏమీ బయటికి రాకపోగా దేశ ఆర్థిక వ్యవస్థను కుదేలు చేసిందని విమర్శలు వస్తూనే ఉన్నాయి. ఈ సందర్భంగా కరెన్సీపై 10వ తరగతి కుర్రాడి ఐడియా ఒకటి సోషల్ మీడియాలో నడుస్తోంది. అన్ని వస్తువులకు ఎక్స్పైరీ డేట్ ఉంటోంది కదా, కరెన్సీ నోట్లపై కూడా ఎక్స్పైరీ డేట్ ఎందుకు ఉండదు? ఎన్నేళ్ల దాకా చెల్లుబాటు అవ్వాలో మేధావులు ఆలోచించి వాటిపై కూడా ఐదేళ్లో ఆరేళ్లో ఎక్స్పైరీ డేట్ ముద్రించాలి. ఆ టైమ్ దాటాక ప్రజలు పాత నోట్లు తీసుకువెళ్లి కొత్తవి తీసుకుంటారు. అంటే కరెన్సీ అంతా బ్యాంకుకు వస్తుంది. ఇక నల్లధనం అనే మాట ఉండదు కదా. – మన ఐఐటీయన్ సీఎం ఐడియా కన్నా టెన్త్ క్లాస్ స్టూడెంట్ ఐడియా బాగున్నట్లుంది కదా! (క్లిక్ చేయండి: ఉప ఎన్నికలూ జిందాబాద్!) -
ఇండియా గేట్ వద్ద బతుకమ్మ వేడుకలు.. బీజేపీకి బుద్దివచ్చిందంటూ కవిత కౌంటర్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణవ్యాప్తంగా బతుకమ్మ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. కాగా, తొలిసారిగా దేశ రాజధాని ఢిల్లీలోని ఇండియా గేట్ వద్ద బతుకమ్మ వేడుకలను నిర్వహించారు. కేంద్ర సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో కర్తవ్యపథ్‌లో తొలిసారి వేడుకలు జరుగుతున్నాయి. ఈ వేడుకల్లో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి సహా పలువరు ప్రముఖులు పాల్గొన్నారు. అయితే, ఈ వేడుకలపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పందించారు. తెలంగాణభవన్‌లో ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ.. ‘తెలంగాణ వచ్చాక ఎనిమిదేళ్లకు బీజేపీకి బుద్ది వచ్చింది. కేసీఆర్ దెబ్బకు గేట్ వే ఆఫ్ ఇండియా వద్ద బతుకమ్మ ఆడుతున్నారు. తెలంగాణలో సర్దార్ వల్లాభాయ్ పటేల్ పేరుతో విమోచనం అంటున్నారు. అదే గుజరాత్లో పటేల్ విగ్రహం పెట్టి స్టాచ్యూ ఆఫ్ ఇక్వాలిటీ అంటున్నారు. విభజన కావాలా.. యూనిటీ కావాలా తేల్చుకోవాలి. ఈరోజు ఢిల్లీలో బతుకమ్మ వేడుకలు జరుగుతున్నాయంటే దాని వెనుక సీఎం కేసీఆర్ ఉన్నారు. తెలంగాణలో బతుకమ్మ పండుగ ఒక ప్రతీక. జాతీయ రాజకీయాలవైపు కేసీఆర్ చూస్తున్నారు కాబట్టే బీజేపీ నేతలు ఉలిక్కిపడ్డారు. అందులో భాగంగానే నేడు ఢిల్లీలో బీజేపీ నేతలు.. బతుకమ్మ వేడుకలు జరుపుతున్నారు’ అని అన్నారు. Proud moment... Telangana Bathukamma Celebrations at Karthavya Path infront of Historical India Gate. Union Minister for Culture @kishanreddybjp took initiative to make it. Once here human chain formed in the part of Telangana Agitation.@Mahatma_Kodiyar @pradeeepjourno pic.twitter.com/iAPk5iHRlb — 🇮🇳 Venkatesh Nagilla వెంకటేష్ నాగిళ్ల (@Venkatjourno) September 27, 2022 -
తలచుకుంటే నడుచుకోవాలి!
న్యూఢిల్లీలోని ఇండియా గేట్ సమీపాన ఉన్న ఛత్రంలో సెప్టెం బరు 8న స్వాతంత్య్ర సమర యోధుడు సుభాష్ చంద్రబోస్ నిలువెత్తు విగ్రహాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ఆవిష్కరించడం ఒక చరిత్రాత్మక ఘట్టం. ఒకప్పుడు ఆ ఛత్రంలో ఉండిన బ్రిటిష్ రాజు 5వ జార్జ్ విగ్రహం తొలగింపుతో ఏర్పడిన ఖాళీని ఎవరితో భర్తీ చేయాలన్న విషయమై దశాబ్దాల తరబడి సాగిన ఊగిసలాట అనంతరం తీసు కున్న సముచిత నిర్ణయం ఇది. స్వాతంత్య్ర సాధన కోసం సాయుధ మార్గాలను అన్వేషిస్తూ నేతాజీ 1941 జనవరి 26న భారతదేశాన్ని వీడి ప్రవాసం వెళ్లిన అనంతరం ఇన్నేళ్లకు న్యూఢిల్లీలో తొలిసారిగా ఏర్పాటైన ఆ యోధుడి గర్వస్థలి ఇది! 1947కి ముందే అండమాన్‌ను వలస పాలన నుంచి విముక్తం చేసి, త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసినందుకు బోస్‌ను ‘అఖండ భారత్‌కు తొలి అధిపతి’గా మోదీ ప్రశంసించడం కూడా సరైనదే. అదే సమయంలో మనం స్వతంత్ర భారతిపై బోస్ ఆలోచనలు ఏమిటన్నవి మననం చేసుకోవాలి. స్వాతంత్య్రానంతరం భారత భద్రతా బలగాలు ఎలా ఉండాలనే విషయమై నేతాజీ ఐరోపాలో ఉన్నప్పుడే ప్రయోగాత్మకమైన ఆలోచనలు చేశారని చాలామందికి తెలియకపోవచ్చు. 1943 అక్టోబరు 21న షోనన్ (సింగ పూర్)లో ‘ఆజాద్ హింద్ ఫౌజ్’ తాత్కాలిక ప్రభుత్వ ఏర్పాటుకు పూర్వరంగంగా బోస్ 1943 ఆగస్టు 25న ‘ఇండియన్ నేషనల్ ఆర్మీ’కి నాయకత్వం వహించడానికి చాలాముందే ఈ ప్రయత్నాలు జరిగాయి. ఆనాటికి బెర్లిన్‌లో ఉంటున్న దివంగత భారతీయ పాత్రికేయుడు ఏసీఎన్ నంబియార్‌తో భవిష్యత్ స్వతంత్ర భారత విదేశాంగ విధానం, రక్షణ, అంతర్గత పాలనపై తన ఆలోచనలను బోస్ 1934 నుండీ నిరంతరంగా పంచుకుంటూ వచ్చారు. 1942–1945 మధ్య కాలంలో నంబియార్ ఐరోపాలో బోస్‌కు సహాయకారిగా ఉన్నారు. బోస్ ఆయనను 1942 జనవరిలో పూర్తి దౌత్య హోదాతో బెర్లిన్‌లోని జర్మనీ విదేశాంగ కార్యాలయానికి అను బంధంగా ఉన్న ‘ఆజాద్ హింద్ ఆఫీస్’కు తన డిప్యూటీగా నియమించుకున్నారు. 1943 ఫిబ్రవరి 8న బోస్ రహ స్యంగా ఐరోపాను విడిచిపెట్టారు. బోస్‌తో నంబియార్ జర్మనీ, జపాన్లలోని ఫౌజ్ యంత్రాంగం ద్వారా మంత నాలు జరుపుతుండేవారు. బోస్‌కు ఆయన చివరి సమా చారం 1945 జనవరి 12న జర్మనీ పడవ యు–234 ద్వారా బట్వాడా అయింది. అయితే ఆ పడవ 1945 మే 14న అమెరికా నౌకాదళానికి పట్టు బడటంతో ఆ సమాచారం బోస్‌కు చేరలేదు. గాంధీజీ ప్రబోధించిన మత సామరస్యాన్ని దృష్టిలో ఉంచుకుని స్వతంత్ర భారతావనిలో అన్ని పాలనా వ్యవస్థలను నిర్మించడం బోస్ పథకం అని నంబియార్ నాతో చెప్పారు. జర్మనీలో బోస్ చేపట్టిన ప్రారంభ కార్యకలాపాలలో ఒకటి, 1941 డిసెంబర్ నుంచి భారత సైనిక దళాన్ని పటిష్టం చేసుకుంటూ రావడం. అందుకోసం ఉత్తర ఆఫ్రికాలో బ్రిటిష్ సైన్యంలో భాగంగా ఉండి అగ్రరాజ్యాలకు పట్టుబడిన భారతీయ యుద్ధ ఖైదీలను జర్మనీ సహకారంతో వాలంటీర్లుగా తీసుకున్నారు. ఏడాది లోనే దాదాపు 4,000 మంది బోస్ దళ వాలంటీర్లుగా చేరారు. ‘‘భారతదేశంలోని ప్రధాన సామాజిక వర్గాలతో బోస్ దళం సమీకృతంగా ఉండేది. ఆ వర్గాలలోని అల్పసంఖ్యాకులైన ముస్లిం, సిక్కు ప్రతినిధుల సంక్షేమం కోసం బోస్ శ్రద్ధ వహించారు. అంతే కాదు, బోస్ తన కొత్త సైన్యాన్ని మతం, కులం లేదా ప్రాంతం ఆధారంగా రెజిమెంట్లుగా విభజించాలని అనుకోలేదు. తన దళంలో మైనారిటీల మనోభావాలు దెబ్బతినకుండా జాతీయ గీతాన్ని, జాతీయ జెండాను బోస్ జాగ్రత్తగా ఎంపిక చేసుకున్నారు. ముస్లింలు నిరసించిన ‘వందేమాతరం’కు బదులుగా రవీంద్రనాథ్ టాగూర్ ‘జనగణమన’ను ఎంచుకున్నారు. మైసూర్‌కు చెందిన బ్రిటిష్ వ్యతిరేక యోధుడు టిప్పు సుల్తాన్ స్ఫూర్తిని సైన్యంలో ప్రేరేపించ డానికి ఆజాద్ దళ త్రివర్ణ పతాకం మధ్యలో దుముకుతున్న పులిని చేర్చారు’’ అని చరిత్రకారుడు సుగతా బోస్ తెలి పారు. తర్వాత పులి గుర్తుకు బదులుగా గాంధీజీ ‘చరఖా’ వచ్చింది. ఆజాద్ హింద్ ఫౌజ్‌లోని సైనికుల వేర్వేరు భాషల వల్ల కూడా సైనిక దళ ఐక్యతకు ముప్పు వాటిల్లుతుందని బోస్ బలంగా నమ్మారు. ఆ పరిస్థితిని నివారించేందుకు రోమన్ లిపిలో రాసిన హిందుస్థానీ భాషను దళాల ఉమ్మడి మాధ్యమంగా బోస్ స్వీకరించారని ఫౌజ్‌కు 1941–45 మధ్య హిందీ–జర్మన్ అనుసంధాన వ్యాఖ్యాతగా పనిచేసిన ఆక్స్ఫర్డ్ కాలేజ్ ఆఫ్ టెక్నాలజీ విజిటింగ్ లెక్చరర్ రుడాల్ఫ్ హార్టోగ్ తెలిపారు. హిందువులు, ముస్లిములు మాట్లాడే భాషలను హిందూస్థానీగా సమ్మిళితం చేయడం ద్వారా తన సైనిక దళంలో బోస్ భారతదేశంలోని రెండు ప్రముఖ సంస్కృతుల మధ్య సమైక్యతను సాధించారని హార్టోగ్ రాశారు. 1939 తర్వాత కాంగ్రెస్‌లోని మితవాద నాయకులతో విభేదించిన కారణంగా గాంధీజీకి బోస్ దూరమైనప్పటికీ, అది ఆయన పట్ల బోస్‌కు ఉన్న గౌరవాన్ని ఏమాత్రం తగ్గించలేదు. 1942 క్విట్ ఇండియా ఉద్యమానికి గాంధీజీ పిలుపునిచ్చిన ప్పుడు బోస్ ‘ఆజాద్ హింద్ రేడియో’ ద్వారా గాంధీజీ ఆదేశాలను విధిగా పాటించాలని భారతీయులందరికీ స్పష్టమైన పిలుపు నిచ్చారు. (క్లిక్ చేయండి: ప్రత్యామ్నాయ భావజాల దార్శనికుడు) 1944 జూలై 6న బోస్ తన ఆజాద్ హింద్ ఫౌజ్‌కు గాంధీజీ ఆశీర్వాదం కోసం సింగపూర్ నుండి ప్రత్యేక రేడియో ప్రసంగం చేశారు. ‘‘జాతిపితా, భారతదేశ విముక్తి కోసం ఈ పవిత్ర యుద్ధంలో మేము మీ ఆశీర్వాదాలను, శుభాకాంక్షలు కోరుతున్నాము’’ అని బోస్ తన ప్రసంగంలో అన్నారు. 2012లో భారత ప్రభుత్వం సమాచార హక్కు చట్టం కింద ఒక ప్రశ్నకు ఇచ్చిన సమాధానాన్ని బట్టి, గాంధీజీని ఎవరైనా ‘జాతిపిత’ అని సంబోధించిన తొలి సందర్భం అది! ప్రస్తుతం మోదీ నేతృత్వంలోని జాతీయ ప్రజాస్వామ్య కూటమి నేతాజీ ప్రాధాన్యాలను అనుసరించాలనుకుంటే, దేశంలో మత సామరస్యాన్ని కాపాడాలి. లేదంటే, మత సామరస్యం అన్నది ఒక నినాదంలా మాత్రమే మిగిలిపోతుంది. (క్లిక్ చేయండి: అంబేడ్కర్ పేరు ఎందుకు పెట్టాలంటే...) - వప్పల బాలచంద్రన్ కేబినెట్ సెక్రటేరియట్ మాజీ ప్రత్యేక కార్యదర్శి (‘ది ట్రిబ్యూన్’ సౌజన్యంతో) -
పాలకుల కర్తవ్యం ఇదేనా?
కాలానికీ, అవసరాలకూ తగ్గట్టుగా అన్నీ మారతాయి... మారాల్సిందే. అయితే, ఆ మార్పుల వెనుక ఉద్దేశాల పట్ల అనుమానాలు తలెత్తినప్పుడే అభ్యంతరాలు వస్తాయి. కేంద్రంలోని బీజేపీ సర్కారు దేశ రాజధానిలో చేపట్టిన ‘సెంట్రల్ విస్టా’ ఆధునికీకరణ ప్రాజెక్ట్ తొలి దశ గురువారం సాయంత్రం అట్టహాసంగా ప్రారంభమైన తీరు, ‘రాజ్‌పథ్’కు ‘కర్తవ్యపథ్’గా పేరు మార్చడం చర్చకు తావిచ్చింది అందుకే! కేవలం 19 నెలల్లో ఇండియా గేట్ పరిసరాలు కళ్ళు చెదిరేలా మారిపోయాయి. కనువిందు చేస్తూ, గర్వకారణమనిపించే ఈ ఆధునిక మార్పులను ఆహ్వానించాల్సిందే. ఇండియాగేట్ సమీపాన బ్రిటీష్ కాలంలో కింగ్ అయిదో జార్జ్ విగ్రహమున్నచోట నేతాజీ ప్రతిమ పెట్టడమూ స్ఫూర్తిదాయ కమే. కానీ, భారీ విగ్రహాలు పెట్టి, రోడ్లకు పేర్లు మార్చి, దేశం సుభిక్షమని నమ్మింపజూస్తేనే చిక్కు. బానిసత్వాన్ని వదిలించుకోవాలని నోటితో చెబుతూ, తాము ప్రభువులమన్నట్టు ప్రవర్తిస్తేనే కష్టం. కాశీ విశ్వనాథ ఆలయ కారిడార్, కొత్త పార్లమెంట్‌పై 4 సింహాల చిహ్నం, ఐఎన్ఎస్ విక్రాంత్, సెంట్రల్ విస్టా... ఇలా ప్రతి కొత్త ప్రారంభోత్సవం ఇవాళ ఒక జాతీయవాద ప్రచార ఆర్భాటం. ప్రజల్లోకి చొచ్చుకుపోయేందుకు ఓ సరికొత్త రాజకీయ నేరేటివ్. గత నెలరోజుల్లోనే దేశవ్యాప్తంగా 30 ప్రాజెక్టులకు ప్రధాని శంకుస్థాపనో, ప్రారంభమో చేశారు. అలా దీన్ని 2024 ఎన్నికలకు ముందస్తు సన్నాహంగా మార్చడం పాలకుల గడుసుతనం. ఈ క్రమంలో వలసవాద అవశేషాలను తొలగిస్తున్నామంటూ... సామాన్యులు సైతం స్వేచ్ఛగా తిరిగిన ఇండియాగేట్ ప్రాంతాన్ని ‘కర్తవ్య పథ్’గా వారికి దూరం చేయడమే విరోధాభాస. ఈ ఏడాది స్వాతంత్య్ర దిన ప్రసంగంలోనే ప్రధాని ఈ ‘కర్తవ్యపథ’ నిర్దేశం చేసేశారు. ప్రభుత్వం చేసిన వాగ్దానాల్ని నిలబెట్టుకోవాలన్న డిమాండ్లను పక్కన బెట్టి, పౌరుల కర్తవ్యాన్ని నొక్కిచెప్పారు. ప్రజలే ప్రభువులని గుర్తు చేస్తున్న రాజ్‌పథ్‌ను, ప్రజలకు వారి కర్తవ్యాన్ని గుర్తుచేసే కర్తవ్యపథ్గా మార్చారు. ధరల పెరుగుదల, నిరుద్యోగం లాంటి సమస్యల పరిష్కారం పాలకుల కర్తవ్యం. అది వదిలేసి ‘నామ్‌కే వాస్తే’ మార్పులపై దృష్టిపెడితే ఎలా? కాన్వాయ్‌ల మొదలు అనేక అంశాల్లో నేటికీ వలస పాలన అవశేషాలనే అనుసరిస్తున్న మన పాలకులు ముందుగా వారు వదులుకోవాల్సినవి చాలా ఉన్నాయి. నిజానికి, రాష్ట్రపతి భవన్ నుంచి విజయ్ చౌక్, ఇండియా గేట్ మీదుగా పురానా ఖిల్లా దాకా సాగే మార్గం రాజ్‌పథ్. రైజీనా హిల్‌పై నుంచి పురానా ఖిల్లా దాకా ఆ మార్గాన్ని పరికిస్తున్నట్టుగా కట్టిన అప్పటి వైస్రాయ్ భవనమే నేటి రాష్ట్రపతి భవన్. ఆ మాటకొస్తే న్యూఢిల్లీ, అక్కడి భవనాలు, ఇండియా గేట్ లాంటి చారిత్రక కట్టడాలు బ్రిటీష్ హయాంలో నిర్మాణమైనవే. వాటన్నిటినీ బానిస చిహ్నాలుగా తృణీకరిస్తామా? చక్రవర్తి అయిదో జార్జ్ 1911లో భారత సందర్శనకు వచ్చినప్పుడు ‘ఢిల్లీ దర్బార్’ జరిగింది. కలకత్తా నుంచి ఢిల్లీకి దేశ రాజధానిని మార్చారు. ఆ జ్ఞాపకంగా బ్రిటీషర్లు ఈ మార్గానికి ‘కింగ్స్ వే’ అని పేరు పెట్టారు. దాని మీదుగా వెళ్ళే మరో రోడ్‌ను ‘క్వీన్స్ వే’ అన్నారు. స్వాతంత్య్రం వచ్చాక ‘కింగ్స్ వే’ను ‘రాజ్‌పథ్’ అనీ, ‘క్వీన్స్ వే’ను ‘జన్‌పథ్’ అనీ నాటి కాంగ్రెస్ ప్రభుత్వం మార్చింది. నిజానికి, ఆ కొత్త పేర్లేమీ పాతవాటికి అనువాదాలు కావు. ‘రాజ్ పథ్’ అంటే రాజుల మార్గమని కాదు... ‘రాజ్య (ప్రభుత్వ) పథ’మనే అర్థం. ఆ రకంగా అప్పుడే ఆ వలస పాలకుల నామకరణా లను ప్రజాస్వామ్య చిహ్నాలుగా మార్చారు. ఆ పేర్లలో జన్‌సంఘ్ సహా ఎవరికీ కనిపించని వలస వాదం, బానిసత్వం తీరా ఇప్పుడు దర్శనమివ్వడమే విడ్డూరం. పేరులో ఏముంది పెన్నిధి అంటారు కానీ, ప్రతి పేరూ భావోద్వేగాలు రేకెత్తించగలదని ఎనిమిదిన్నరేళ్ళుగా దేశాన్ని ఏలుతున్న బీజేపీకి తెలుసు. అధికారంలోకి వచ్చిన ఏడాదికే 2015లోనే వీధులు, నగరాలు, అవార్డుల పేర్లు మార్చే పనిలో పడింది. ఢిల్లీలోని ఔరంగజేబ్ రోడ్‌ను అబ్దుల్ కలామ్ రోడ్‌గా మార్చడంతో మొదలుపెట్టి, ప్రధాని నివాసం ఉండే రేస్‌కోర్స్ రోడ్‌ను లోక్‌కల్యాణ్ మార్గ్‌గా, నెహ్రూ స్మారక మ్యూజియమ్ – లైబ్రరీ ఉన్న ఒకప్పటి నెహ్రూ నివాసం తీన్‌మూర్తి భవన్‌ను ‘ప్రధానమంత్రి సంగ్రహాలయ’గా మార్చేసింది. అక్బర్ రోడ్, హుమాయూన్ రోడ్ పేర్లు తదుపరి అజెండాలో ఉన్నాయట. ఈ దేశపు సమ్మిశ్రిత సాంస్కృతిక వారసత్వానికి ప్రతీకగా నిలిచిన పేర్లను తొలగించి, హిందూ పునరుద్ధరణవాద నామకరణాల వల్ల సమాజంలో సామరస్యం కొరవడితే అది పూడ్చలేని నష్టం. ఒక వర్గం కన్నా అధికులమనే భావన మరో వర్గంలో కలిగితే, అది సమాజాన్ని నిలువునా చీలు స్తుంది. 2019 ఎన్నికలకు ముందు ఒక్క యూపీలోనే అలహాబాద్‌ను ప్రయాగరాజ్‌గా, ఫైజాబాద్ జిల్లాను అయోధ్య జిల్లాగా, మొఘల్ సరాయ్ రైల్వే జంక్షన్‌ను జన్‌సంఘ్ సిద్ధాంతవేత్త పేరిట దీన్ దయాళ్ ఉపాధ్యాయ జంక్షన్‌గా ఏ వలసవాద పాలన అవశేషాలున్నాయని మార్చారు? ఇది దేశ బహుళత్వ గుర్తింపును నిరాకరించడమే. చరిత్రలో మొఘల్ చక్రవర్తుల భాగాన్ని కనుమరుగు చేసే ప్రయత్నమే. రాజీవ్ ఖేల్‌రత్న అవార్డ్ పేరు ధ్యాన్‌చంద్ అవార్డుగా మారడం వెనుకా హాకీ దిగ్గజంపై గౌరవం కన్నా రాజకీయంగా తేల్చుకోదలచిన లెక్కలే ఎక్కువ. హైదరాబాద్ పేరును ‘భాగ్య నగర్’గా మారుస్తామని ఇటీవల బీజేపీ నేతలు ప్రకటించారు. ఏ చారిత్రక ఆధారాలతో ఆ మాట అన్నారో చెప్పలేం. ఇక, ఢిల్లీని ‘ఇంద్రప్రస్థం’గా మారుస్తారనీ ఓ ప్రచారం. వెరసి, ఈ పేర్ల మార్పు ధోరణితో ఎక్కడికెళతాం? వలస పాలకులు పోయారు కానీ, గద్దెపై పెద్దలు ప్రాధాన్యాలు మర్చిపో తేనే ఇబ్బంది. పాలకులు కర్తవ్యం విడిచి, దోవ తప్పితే ప్రజాస్వామ్యంలో ప్రజలకు కిం కర్తవ్యం? -
AP: ఆ ఊరే ఒక సైన్యం.. వీరుల పురిటిగడ్డ అది..
తాడేపల్లిగూడెం: అక్కడి తల్లులు తమ పిల్లలకు ఉగ్గుపాలతోనే వీరత్వాన్ని రంగరించి పోస్తున్నారు. ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. ఆ ఊరు ఊరంతా ఒక సైన్యమే అంటే అతిశయోక్తి కాదు. టెక్నాలజీతో అందివస్తున్న జాబ్‌లెన్నో ఉన్నా.. తమ మొగ్గు మాత్రం దేశమాత సేవకే అంటున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం మాధవరం అందరికీ ఆదర్శంగా నిలుస్తోంది. ప్రస్తుతం భారత సైన్యంలో ఈ ఊరి నుంచి 1,650 మంది పనిచేస్తున్నారు. వీరిలో కల్నల్స్, లెఫ్టినెంట్ కల్నల్స్ ఉండటం విశేషం. భారత సైన్యంలో చేరాలనుకునే తమ ఊరి యువతకు ఎక్స్‌సర్వీస్‌మెన్ అసోసియేషన్ మార్గనిర్దేశం చేస్తోంది. ఇప్పుడు అగ్నిపథ్ ద్వారా భారత సైన్యంలోకి చేరికలు ఉండటంతో యువత సులువుగా ఎంపికయ్యేలా ప్రత్యేక శిక్షణ అందిస్తోంది. ఇందుకు సంబంధించి కార్యాచరణ ప్రారంభిస్తామని ఎక్స్‌సర్వీస్‌మెన్ అసోసియేషన్ బాధ్యులు ప్రత్తి రామకృష్ణ, బొల్లం వీరయ్య చెబుతున్నారు. దేశంలోనే రెండో స్థానం.. మాధవరం గ్రామస్తులు స్వాతంత్య్రానికి ముందు నుంచే సైనికులుగా, అధికారులుగా సేవలు అందించారు. దేశంలోనే అత్యధికంగా సైన్యంలోకి యువకులను పంపిస్తున్న ప్రాంతంగా మాధవరం రెండో స్థానం పొందడం విశేషం. గ్రామస్తులు మొదటి, రెండో ప్రపంచ యుద్ధాలు, దేశ స్వాతంత్య్ర పోరాటం, పాకిస్థాన్, చైనాలతో యుద్ధాలు, బంగ్లాదేశ్, శ్రీలంక తరఫున చేసిన యుద్ధాల్లో ప్రతిభ చూపారు. సిపాయి, హవల్దార్, సుబేదార్, సుబేదార్ మేజర్, నాయక్, కల్నల్, లెఫ్టినెంట్ కల్నల్ వంటి హోదాల్లో సేవలను అందించారు. భారత్–పాకిస్తాన్ మధ్య జరిగిన రెండు యుద్ధాల్లో 1,850 మంది మాధవరం సైనికులు పాల్గొని సత్తా చాటడం విశేషం. వార్ మెమోరియల్ ఢిల్లీలో ఇండియా గేట్ దగ్గర ఉండగా రెండోది మాధవరంలో మాత్రమే ఉంది. ఇది కూడా చదవండి: సచివాలయ సేవలు బాగున్నాయి.. కేంద్ర మంత్రి కితాబు -
నేతాజీకి జాతి ఘన నివాళి
న్యూఢిల్లీ: ఆజాద్ హిందు ఫౌజ్ దళపతి, స్వాతంత్య్ర సమర యోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ 125వ జయంతిని పురస్కరించుకొని జాతి యావత్తూ ఆయనకి ఘనంగా నివాళులర్పించింది. స్వతంత్ర భారతావని సాధన దిశగా వేసిన సాహసోపేత అడుగులు, బోస్‌ను ‘జాతికి స్ఫూర్తి ప్రదాత’గా నిలిపాయని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ కొనియాడారు. గొప్ప జాతీయవాది, దూరదృష్టి కలిగిన నాయకుడు నేతాజీ అని ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు అభివర్ణించారు. ప్రధాని నరేంద్ర మోదీ దేశవాసులకు పరాక్రమ్ దివస్ (నేతాజీ జన్మదినోత్సవం) శుభాకాంక్షలు తెలిపారు. దేశానికి నేతాజీ అందించిన సేవలకు ప్రతి భారతీయుడు గర్విస్తాడని ప్రధాని ట్వీట్ చేశారు. అనంతరం ఢిల్లీలోని ఇండియా గేట్ దగ్గర నేతాజీ హోలోగ్రామ్ విగ్రహాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదివారం ఆవిష్కరించారు. 28 అడుగుల పొడవు, ఆరు అడుగుల వెడల్పుతో ఉన్న ఈ విగ్రహాన్ని 4కే సామర్థ్యం ఉన్న ప్రొజక్టర్ ద్వారా ప్రదర్శిస్తున్నారు. గ్రానైట్‌తో రూపొందిస్తున్న నేతాజీ విగ్రహ నిర్మాణం పూర్తయ్యాక దీని స్థానంలో ఆ విగ్రహాన్ని స్థాపిస్తారు. కెన్ డూ.. విల్ డూ.. విగ్రహావిష్కరణ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ ప్రజలందరూ నేతాజీ నుంచి కెన్ డూ (చేయగలము) విల్ డూ (చేస్తాము) అన్న స్ఫూర్తిని పొంది ముందడుగు వెయ్యాలని పిలుపునిచ్చారు. స్వాతంత్య్రం సిద్ధించిన తర్వాత ఎందరో త్యాగధనులు, గొప్ప నాయకులు దేశానికి చేసిన సేవల్ని చరిత్ర పుటల నుంచి తొలగించే ప్రయత్నాలు జరిగాయని పరోక్షంగా కాంగ్రెస్‌పై నిప్పులు చెరిగారు. గతంలో జరిగిన తప్పుల్ని సవరించుకుంటున్నామని, వారు దేశానికి సేవల్ని స్మరించుకుంటున్నామని చెప్పారు. దేశానికి స్వాంతంత్య్రం వచ్చిన వందేళ్లలోగా, అంటే 2047 నాటికి భారత్ ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన దేశంగా ఎదగాలన్న లక్ష్యాన్ని ప్రపంచంలో ఏ శక్తి అడ్డుకోలేదని అన్నారు. ఈ సందర్భంగా 2019 నుంచి 2022 సంవత్సరం వరకు సుభాష్ చంద్రబోస్ ఆప్డా ప్రబంధన్ పురస్కార్‌లు ప్రదానం చేశారు. విపత్తు నిర్వహణలో అద్భతమైన ప్రతిభ చూపించిన సంస్థలకి, వ్యక్తులకి ఈ అవార్డులను ఇస్తున్నారు. జపాన్ మాజీ ప్రధానమంత్రి షింజో అబెకు నేతాజీ రీసెర్చ్ బ్యూరో నేతాజీ అవార్డుని బహుకరించింది. అబె తరఫున కోల్‌కతాలోని జపాన్‌కు చెందిన కౌన్సెల్ జనరల్ ఈ అవార్డుని స్వీకరించారు. నేతాజీ అవార్డు తనకి ఇవ్వడం గర్వకారణమని షింజో అబె తన సందేశాన్ని పంపించారు. ఇరు దేశాల మధ్య సత్సంబంధాల కోసం తాను ప్రయత్నిస్తానని చెప్పారు. ఆ భాగాల్ని అనువదించలేదు నేతాజీ సుభాష్ చంద్రబోస్దిగా అనుమానించిన చితాభస్మానికి డీఎన్ఏ పరీక్షలు నిర్వహించడానికి జపాన్‌లోని రెంకోజీ ఆలయం అనుమతి ఇచ్చినట్టుగా తాజాగా వెలుగు చూసిన లేఖలో వెల్లడైంది. అప్పట్లో నేతాజీ అనుమానాస్పద మృతిపై విచారణ జరుపుతున్న జస్టిస్ ఎంకె ముఖర్జీ కమిషన్‌కు చితాభస్మం డీఎన్ఏ పరీక్షలకు అనుమతినిచ్చినట్టుగా టోక్యోలోని రెంకోజీ ఆలయం ప్రధాన పూజారి 2005లో భారత ప్రభుత్వానికి లేఖ రాశారు. అయితే జపాన్ భాషలో ఉన్న లేఖలో ఆ భాగాన్ని అనువదించలేదని సుభాష్ చంద్రబోస్ సోదరుడు శరత్ బోస్ మనవరాలు మాధురి బోస్ ఆదివారం ఒక వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. రెంకోజీ ఆలయం చితాభస్మంపై పరీక్షలకు అనుమతించలేదని ఆ కమిషన్ పేర్కొందని గుర్తు చేశారు. దేశ, విదేశాల్లో.. బోస్ జయంతిని సింగపూర్‌లో ఘనంగా జరిపారు. సింగపూర్ స్వాతంత్య్ర సాధనలో బోస్ పాత్రను దేశవాసులు స్మరించుకున్నారు. బోస్ జన్మదినోత్సవాన్ని జాతీయ సెలవుదినంగా ప్రకటించాలని బెంగాల్ సీఎం మమత డిమాండ్ చేశారు. ఆయన జ్ఞాపకార్థం జైహింద్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తామన్నారు. నేతాజీ జన్మోత్సవ వేడుకలను తమిళనాడులో గవర్నర్, సీఎం ఘనంగా నిర్వహించారు. బెంగళూరులోని బోస్ విగ్రహాన్ని విధాన సభ ముందు ప్రతిష్టిస్తామని కర్ణాటక సీఎం ప్రకటించారు. ఒడిశాలో బోస్ జన్మస్థల మ్యూజియంలో పలు కార్యక్రమాలు జరిపారు. చండీగఢ్‌లో నేతాజీ నూతన విగ్రహాన్ని సీఎం ఖట్టర్ ఆవిష్కరించారు. At the programme to mark the unveiling of the hologram statue of Netaji Bose. https://t.co/OxRPKqf1Q7 — Narendra Modi (@narendramodi) January 23, 2022 -
నేతాజీ జయంతి.. నివాళులు అర్పించిన రాష్ట్రపతి, ప్రధాని
స్వాతంత్ర్య సమర యోధుడు, ఆజాద్ హింద్ ఫౌజ్ వ్యవస్థాపకుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ 125వ జయంతి సందర్భంగా రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆదివారం (జనవరి 23, 2022) ఆయనను స్మరించుకున్నారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి.. "నేతాజీసుభాష్ చంద్రబోస్ 125వ జయంతి సందర్భంగా భారతదేశం ఆయనకు కృతజ్ఞతాపూర్వకంగా నివాళులు అర్పిస్తోంది. స్వేచ్ఛా భారతదేశం, ఆజాద్ హింద్ ఆలోచనకు, తన తీవ్రమైన నిబద్ధతను నెరవేర్చడానికి నేతీజీ తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయాలు -- ఆయనను జాతీయ చిహ్నంగా మార్చాయి. ఆయన ఆదర్శాలు, త్యాగం ప్రతి భారతీయుడికి ఎప్పటికీ స్ఫూర్తినిస్తుంది' అని ఆయన ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ.. "దేశప్రజలందరికీ పరాక్రమ్ దివస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నేతాజీ సుభాష్ చంద్రబోస్ 125వ జయంతి సందర్భంగా ఆయనకు నా గౌరవప్రదమైన నివాళులు. ఆయన జయంతి సందర్భంగా నేను నేతాజీకి నమస్కరిస్తున్నాను. మన దేశానికి ఆయన చేసిన స్మారక సహకారానికి ప్రతి భారతీయుడు గర్విస్తాడు" అని ట్వీట్లో పేర్కొన్నారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ 125వ జయంతిని పురస్కరించుకుని 73వ గణతంత్ర దినోత్సవాలను ప్రారంభించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. పార్లమెంట్ సెంట్రల్ హాల్లో జరిగే ఈ కార్యక్రమంలో ప్రధాని నరేంద్రమోదీ నేతాజీకి పుష్పాంజలి ఘటించనున్నారు. అనంతరం ఇండియా గేట్ వద్ద నేతాజీ హోలోగ్రామ్ విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. మరోపక్క, గణతంత్ర దినోత్సవం పరేడ్‌కు అట్టహాసంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ఏడాది జరగబోయే పరేడ్‌లో 16 మార్చ్ఫాస్ట్ బృందాలు, 17 మిలటరీ బ్యాండ్ బృందాలు, 25 శకటాలు పాల్గొంటున్నాయి. ఆర్మీ తరఫున 14 రకాల ఆయుధాలను పరేడ్‌లో ప్రదర్శించనున్నారు. सभी देशवासियों को पराक्रम दिवस की ढेरों शुभकामनाएं। नेताजी सुभाष चंद्र बोस की 125वीं जयंती पर उन्हें मेरी आदरपूर्ण श्रद्धांजलि। I bow to Netaji Subhas Chandra Bose on his Jayanti. Every Indian is proud of his monumental contribution to our nation. pic.twitter.com/Ska0u301Nv— Narendra Modi (@narendramodi) January 23, 2022 India gratefully pays homage to Netaji Subhas Chandra Bose on his 125th birth anniversary. The daring steps that he took to fulfil his fierce commitment to the idea of a free India — Azad Hind — make him a national icon. His ideals and sacrifice will forever inspire every Indian.— President of India (@rashtrapatibhvn) January 23, 2022 -
సెంట్రల్ విస్టా ప్రాజెక్టు నిర్మాణం ఇలా..
పార్లమెంటు కొత్త భవనం, సచివాలయ నిర్మాణం కోసం ఉద్దేశించిన సెంట్రల్ విస్టా ప్రాజెక్టుకి సుప్రీం కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నేపథ్యంలో ఆ ప్రాజెక్టుపై ఓ లుక్కేద్దాం. కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ నుంచి ఇండియా గేట్ వరకు మూడు కి.మీ. పరిధిలో పునర్నిర్మాణం చేపట్టనున్న ఈ ప్రాజెక్టుకి 2–1 ఓట్ల తేడాతో మంగళవారం సుప్రీం బెంచ్ ఆమోద ముద్ర వేసింది. రాష్ట్రపతి భవన్ నుంచి ఇండియా గేట్ వరకు 3–కి.మీ ప్రాంతాన్ని పునర్నిర్మాణం చేసే ప్రణాళిక ఇది. (సెంట్రల్ విస్టాకు సుప్రీం ఓకే) పునర్నిర్మాణం జరుపుకునే ప్రాంతం 17.5 లక్షల చదరపు కిలో మీటర్లు ఏయే భవనాలు కొత్త పార్లమెంటు భవనం ఉమ్మడి కేంద్ర సచివాలయం ప్రధానమంత్రి, ఉప రాష్ట్రపతి కొత్త నివాసాలు ప్రధానమంత్రి కార్యాలయం అంచనా వ్యయం రూ.20 వేల కోట్లు నిర్మాణ కంపెనీ టాటా ప్రాజెక్ట్స్ లిమిటెడ్ పార్లమెంటు భవనం భారత్ 75వ స్వాతంత్య్ర దినమైన 2022 ఆగస్టు 15 నాటికి పూర్తి కావాలని లక్ష్యం సచివాలయం 2024 నాటికి పూర్తి పార్లమెంటు భవనం విస్తీర్ణం : 64,500 చ.కి.మీ. సీటింగ్ సామర్థ్యం: 1224 ఎంపీలు భవనం ఎత్తు 39 మీటర్లు (2 బేస్మెంట్లు) +గ్రౌండ్ + ఆరు అంతస్తులు కొత్త సచివాలయం రూపు రేఖలు కొత్త భవనాలు 10 రక్షణ భవనాకొత్త సచివాలయం రూపు రేఖలు కొత్త భవనాలు 10 రక్షణ భవనాలు 3 లు 3 ఉద్యోగుల సంఖ్య 52,300 పచ్చదనం కోసం వదిలిన ప్రాంతం 13,700 చదరపు కిలో మీటర్లు పార్కింగ్ ఏరియా 9,612 వాహనాలు -
ఢిల్లీలో నిషేధాజ్ఞలు : 144 సెక్షన్ విధింపు
సాక్షి, న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో 144 సెక్షన్ విధిస్తూ ఢిల్లీ డిప్యూటీ పోలీసు కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు. క్రిమినల్ ప్రొసిజర్ కోడ్ 144 ప్రకారం ఐదుగురి కంటే ఎక్కువ మంది ఒకచోట గుమిగూడడానికి వీల్లేదని, ఇండియా గేటు వద్ద ప్రజలను అనుమతించమని తెలిపారు. ఢిల్లీ వ్యాప్తంగా నిషేధ ఉత్తర్వులు అమలులో ఉంటాయని కమిషనర్ స్పష్టం చేశారు. ఇండియా గేట్ చుట్టూ ఎటువంటి సమావేశాలకు అనుమతి లేదని ఢిల్లీ డీసీపీ ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా ఢిల్లీలో భద్రతను కట్టుదిట్టం చేశారు. ప్రధానంగా ఇండియా గేటు వద్ద సాయుధ పోలీసులు పహరా కాస్తున్నారు. యూపీ హథ్రాస్ జిల్లాలో సామూహిక హత్యాచార ఘటనపై కాంగ్రెస్ నిరసనల మధ్య ఈ ప్రకటన వెలువడింది. ముఖ్యంగా బాధితురాలి కుటుంబాన్ని కలవడానికి వెళుతుండగా మాజీ కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ, పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రాను అక్రమంగా నిర్బంధించారనే ఆరోపణలపై కాంగ్రెస్ కార్యకర్తలు ఇండియా గేట్, శాస్త్రి భవన్ సమీపంలో నిరసన ప్రదర్శన అనంతరం ఈ ప్రకటన వచ్చింది గత నెల 28వ తేదీన 20 మంది పంజాబ్ యూత్ కాంగ్రెస్ సభ్యులు ఇండియా గేటు వద్ద కొత్త వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా ట్రాక్టరును దహనం చేసి నిరసన తెలిపిన సంగతి తెలిసిందే. (కాల్చి బూడిద చేసేశారు.. ఇదెక్కడి న్యాయం!) -
కొత్త సాగు చట్టాలు వద్దు
న్యూఢిల్లీ/ఖట్కార్‌కలాన్: కొత్త వ్యవసాయ చట్టాలపై దేశవ్యాప్తంగా నిరసనలు కొనసాగుతున్నాయి. ఈ బిల్లులతో రైతాంగానికి తీవ్ర నష్టం తప్పదని పేర్కొంటూ ప్రతిపక్షాలు వీధుల్లోకి వచ్చి ఆందోళన చేపడుతున్నాయి. ప్రభుత్వంపై ఒత్తిడి పెంచడంలో భాగంగా కాంగ్రెస్ సహా వివిధ ప్రతిపక్ష పార్టీలు ఈ ఆందోళనలకు నేతృత్వం వహిస్తున్నాయి. సోమవారం ఢిల్లీలోని ఇండియా గేట్ వద్ద నిరసనకారులు ఓ ట్రాక్టర్‌కు నిప్పుపెట్టారు. ఈ ఘటనకు బాధ్యులని భావిస్తున్న పంజాబ్ యూత్ కాంగ్రెస్‌కు చెందిన ఐదుగురిని పోలీసులు అరెస్టు చేశారు. పంజాబ్, ఉత్తరప్రదేశ్, హరియాణా, తెలంగాణ, గుజరాత్, గోవా, ఒడిశా, తమిళనాడు తదితర రాష్ట్రాల్లో రైతులు వీధుల్లోకి వచ్చి, నిరసన ప్రదర్శనల్లో పాల్గొన్నారు. బిల్లులను సుప్రీంకోర్టులో సవాలు చేసేందుకు సిద్ధంగా ఉన్నామని తమిళనాడులో డీఎంకే అధినేత స్టాలిన్ చెప్పారు. తమిళనాడు, కేరళ ప్రభుత్వాలు సుప్రీంకోర్టుకు వెళ్లాలని ఆయన కోరారు. తమిళనాడులో జరిగిన నిరసన ప్రదర్శనల్లో ఎండీఎంకే చీఫ్ వైగో, పీసీసీ అధ్యక్షుడు కేఎస్ అళగిరి, డీఎంకే నేతలు టీఆర్ బాలు, దయానిధి మారన్ తదితరులు పాల్గొన్నారు. కర్ణాటకలో రైతు సంఘాలు బంద్‌కు పిలుపునిచ్చాయి. ప్రజాస్వామ్యం మరణించింది: రాహుల్ ఎన్డీయే ప్రభుత్వం రైతన్నల గొంతులను పార్లమెంట్ లోపల, బయట కర్కశంగా అణచి వేసిందని కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. భారత్‌లో ప్రజాస్వామ్యం మరణించింది అనడానికి ఇదే నిదర్శనమని పేర్కొన్నారు. ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ సంబంధిత బిల్లులు రైతుల పాలిట మరణ శాసనమేనని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు రాహుల్ గాంధీ సోమవారం ట్వీట్ చేశారు. కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్‌సింగ్ తేల్చిచెప్పారు. ధాన్య సేకరణ ప్రారంభమైంది కనీస మద్ధతు ధరతో వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోలు దేశమంతా ప్రారంభమైందని కేంద్రం తెలిపింది. 48 గంటల్లో హరియాణా, పంజాబ్ రాష్ట్రాల్లోని 390 మంది రైతుల నుంచి రూ. 10.53 కోట్ల విలువైన వరి ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసిందని సోమవారం ప్రకటించింది. 2020–21 ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్లో 495.37 లక్షల టన్నుల వరిని సేకరించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. -
భగ్గుమన్న దేశ రాజధాని.. ఉద్రిక్తం
సాక్షి, న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఆమోదించిన వ్యవసాయం బిల్లులకు వ్యతిరేకంగా ఉత్తర భారతదేశంలో నిరసనలు కొనసాగుతున్నాయి. పంజాబ్, హర్యానాతో పాటు రాజస్తాన్, ఉత్తర ప్రదేశ్‌లోనూ రైతులు ఆందోళన నిర్వహిస్తున్నారు. తాజాగా ఈ నిరసనల సెగ దేశ రాజధాని ఢిల్లీని తాకింది. కేంద్రంలోని బీజేపీ సర్కార్ రైతు వ్యతిరేక విధానాలను అవలంభిస్తోందని పెద్ద ఎత్తున రైతులు ఇండియా గేట్ వద్దకు చేరుకున్నారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అంతేకాకుండా వ్యవసాయ బిల్లును నిరశిస్తూ ట్రాక్టర్‌ను దగ్ధం చేశారు. ప్రధాని మోదీ దిష్టి బొమ్మను సైతం కాలబెట్టారు. దీంతో అక్కడి పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. (రైతన్న యుద్ధభేరి.. ఏమైనా జరగొచ్చు) పంజాబ్ ముద్దబిడ్డ, స్వాతంత్య్ర సమరయోధుడు భగత్‌సింగ్ జయంతి నాడు రైతులు రోడ్డుపై పడాల్సిన పరిస్థితి ఏర్పడటం దురదృష్టకరమన్నారు. పంజాబ్ యూత్ కాంగ్రెస్ ఆధ్వరంలో ఈ నిరసన కార్యక్రమం నిర్వహించారు. పోలీసులు వారిని అడ్డుకున్నా ఇండియా గేట్ ముందు కూర్చుని ధర్నా నిర్వహించారు. మరోవైపు వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా పంజాబ్‌లో రైతుల ఆందోళనలు ఆదివారం కూడా కొనసాగాయి. అమృత్సర్– ఢిల్లీ మార్గంలో రైలు పట్టాలపై కూర్చుని నిరసన తెలిపారు. (ఎన్డీయేకు గుడ్‌బై చెప్పిన మిత్రపక్షం) ఓ వైపు దేశ వ్యాప్తంగా నిరసన జ్వాలలు ఎగసిపడుతున్నా.. రైతుల ఆందోళనలకు కారణమైన వ్యవసాయ బిల్లులు చట్టరూపం దాల్చాయి. అవి.. రైతు ఉత్పత్తుల వాణిజ్యం, వ్యాపారం (ప్రోత్సాహం, వసతుల కల్పన) బిల్లు–2020, రైతు(సాధికారత, రక్షణ) ధరల హామీ, వ్యవసాయ సేవల బిల్లు–2020, నిత్యావసరాల(సవరణ) బిల్లు–2020.లకు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ మూడు బిల్లులను ఆమోదించారు. మరోవైపు రైతుల ఉద్యమానికి మద్దతు తెలపాని కాంగ్రెస్ పార్టీ దేశంలోని ప్రధాన పార్టీలను కోరింది. వ్యవసాయ రంగం, రైతుల పాలిట కేన్సర్‌లా మారిన వ్యవసాయ బిల్లులను వ్యతిరేకించాలనీ, ఈ విషయంలో ఎన్డీఏను వీడి బయటకు రావాలని జేడీయూ, ఎల్జేపీ, జేజేపీ పార్టీలను కాంగ్రెస్ కోరింది. ఈ మేరకు ఆదివారం లేఖ రాసింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల రైతు వ్యతిరేక బిల్లులను నిరసిస్తూ రాష్ట్రంలో వివిధ రైతు సంఘాలు, వివిధ సంఘాలు సోమవారం కర్ణాటక బంద్‌కు పిలుపునిచ్చాయి. -
ఇండియా గేట్: ట్రాక్టర్‌ను దగ్థం చేసిన రైతు సంఘాలు
-
వాళ్లకు టీ అందించి శభాష్ అనిపించుకున్నారు
-
వాళ్లకు టీ అందించి శభాష్ అనిపించుకున్నారు
న్యూఢిల్లీ : ‘పౌరసత్వ’ నిరసనకారులకు టీ అందించి ఇద్దరు సిక్కు సోదరులు మానవత్వం చాటుకున్నారు. పౌరసత్వం సవరణ చట్టం (సీఏఏ)పై నిరసనలు తెలిపిన జామియా మిలియా యూనివర్సిటీ విద్యార్థులపై పోలీసులు ఆదివారం లాఠీచార్జి చేసిన సంగతి తెలిసిందే. దీంతో పోలీసుల దౌర్జన్యకాండను నిరసిస్తూ విద్యార్థులు పెద్దఎత్తున ఇండియాగేట్ వద్ద సోమవారం ఆందోళన నిర్వహించారు. వేలాదిమంది మానవహారం నిర్వహించి.. తమ మొబైల్ టార్చ్‌లతో శాంతియుతంగా నిరసన తెలిపారు. ఈక్రమంలో నిరసనకారులకు మద్దతు తెలపడమేకాకుండా.. ఇద్దరు సిక్కు సోదరులు వారికి టీ కూడా సప్లై చేశారు. స్వయంగా అందరికీ టీ అందించారు. దీంతో ఈ అన్నదమ్ముపై సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం కురుస్తోంది. ఇదిలాఉండగా... జామియా యూనివర్సిటీ విద్యార్థులపై పోలీసుల దాడిని సిక్కులు ఖండించారు. జనవరి 05 వరకు యూనివర్సిటీని మూసివేసిన నేపథ్యంలో విద్యార్థులకు భోజన వసతి కల్పించాలని స్థానిక గురుద్వారాలు నిర్ణయించాయి. ఇండియాగేట్ నిరసనకు పలు హక్కుల సంఘాలు.. 20 కాలేజీలు, యూనివర్సిటీల విద్యార్థులు మద్దతు పలికారు. -
పౌరసత్వ వివాదం: ఇండియా గేట్ వద్ద ప్రియాంక నిరసన
-
2022కల్లా కొత్త పార్లమెంట్!
న్యూఢిల్లీ: 2022 పార్లమెంట్ శీతాకాల సమావేశాలు కొత్తగా నిర్మించిన లేదా ఉన్న భవనాలకే ఆధునిక హంగులద్దిన పార్లమెంట్లో జరుగుతాయని ప్రభుత్వ వర్గాలు గురువారం తెలిపాయి. రాష్ట్రపతి భవన్, ఇండియా గేట్‌కు మధ్య ఉత్తర, దక్షిణ బ్లాకుల వద్ద 3 కిలోమీటర్ల విశాలమైన సెంట్రల్ విస్తాను ఈ ప్రాజెక్ట్‌లో భాగంగా నిర్మించనున్నారు. దీని కోసం ప్రభుత్వం దేశ విదేశాల నుంచి డిజైన్, ఆర్కిటెక్ట్ సంస్థలను పిలిచింది. కొత్తగా నిర్మించనున్న ఈ భవనాలు కనీసం 150 నుంచి 200 ఏళ్లపాటు సేవలు అందించనున్నాయి. ఫ్లోటింగ్ ఆఫ్ రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్ (ఆర్ఎఫ్పీ)లోని నిర్దేశిత నిబంధనల ప్రకారం నిర్మాణాలు చేపట్టాల్సి ఉంటుందని ప్రభుత్వం పేర్కొంది. ఇంకా నిర్ణయం తీసుకోలేదా ! ఇప్పుడున్న భవన సముదాయం 1927లో నిర్మితమైందని, ప్రస్తుతం కావాల్సిన అవసరాలను అది అందుకోలేకపోతోందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. అయితే కొత్త భవనం నిర్మించాలా లేక పాతదాన్నే పునర్నిర్మించాలా ? అనే అంశంపై ప్రభుత్వం ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదు. వివిధ మంత్రిత్వ శాఖల కింద ఉన్న ఆఫీసు కార్యాలయాలను నిర్వహించేందుకు ఏటా రూ. 1,000 కోట్లు ఖర్చువుతోంది. కొత్తవాటిని నిర్మించడం ద్వారా ఈ వ్యయాన్ని ఆదా చేయ వచ్చని ప్రభుత్వం భావిస్తోంది. -
క్రైమ్ గేట్
ఇండియా గేట్.. అమర వీరుల స్ఫూర్తి జ్వాలను కాపాడే గూడు! ఇండియా గేట్ మీద అమర వీరుల పేర్లు చెక్కి ఉంటాయి.దాని దగ్గర్లోనే మరో చిన్న కట్టడంలో దేశం కోసం ప్రాణాలొడ్డిన అనామక వీరుల కోసం ఓ జ్యోతి వెలుగుతూంటుంది!అక్కడే 2012లో ఇంకో అనామక నిర్భయ కోసం ఒక పోరాటం జరిగింది.. ఆ పోరాటం దేశాన్ని కుదిపేయడమే కాదు.. మహిళలను కాపాడుకోవడానికి ఒక అద్భుతమైన చట్టాన్నీ తీసుకొచ్చింది..అంత గొప్ప చట్టం వెనుక ఉన్న నిర్భయ కేస్ ఏమిటి? దాన్నెలా ఛేదించారో చిత్రీకరించిన వెబ్ సిరీసే ‘డెల్హీ క్రైమ్!’ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ అవుతోంది ‘‘మేడమ్ ... రోడ్డు మీద ఓ జంట బట్టల్లేకుండా పడి ఉంటే ఇప్పుడే సఫ్దర్‌జంగ్ హాస్పిటల్‌కు తీసుకొచ్చాం.. అమ్మాయి పరిస్థితి బాలేదు’’ ‘‘ఊ...’’ మధ్యరాత్రి నిద్రలో వచ్చిన ఫోన్ కాల్కి ప్రిపేరవుతున్నట్టుగా.. కళ్లు నులుముకుంటూ ‘‘ఓకే... నేనొస్తున్నా...’’ అంటూ ఫోన్ డిస్కనెక్ట్ చేసింది సౌత్ ఢిల్లీ డీసీపీ వర్తికా చతుర్వేది. ‘‘ఏమైంది?’’ పక్కనే ఉన్న భర్త అడుగుతుంటే ‘‘సీరియస్.. వెళ్లాలి’’ హాల్లోకి వచ్చింది గబగబా షూ వేసుకుంటూనే. ఇది ‘‘డెల్హీ క్రైమ్’’లోని సన్నివేశం. ప్రపంచంలో అత్యంత ప్రమాదకరమైన నగరంగా ఢిల్లీని ఖరారు పరిచిన దుర్ఘటన.. ‘‘కంట్రీ ఆఫ్ రేప్స్’’గా అపకీర్తిని మోసుకొచ్చిన విషాదం... 2012, డిసెంబర్ 16.. నిర్భయ గ్యాంగ్ రేప్. మహిళలకు భద్రత లేదని, స్త్రీల ఆత్మగౌరవం అనే పదానికి అర్థమే తెలియని సమాజంగా నిరూపించిన ఘటన. అందుకే అప్పటిదాకా అణిచి పెట్టుకున్న దుఃఖం పార్లమెంట్ మీదకు దండెత్తే సాహసంగా మారింది. ఒళ్లు గగుర్పొడిచే ఆ నేరానికి సంబంధించిన ఇన్వెస్టిగేషన్ ప్రాసెసే ‘‘డెల్హీ క్రైమ్’’. చాలా నిజాలకు కొన్ని కల్పితాలను జోడించి తీసిన సిరీస్. ముందు చెప్పుకున్న సన్నివేశం తర్వాత... డీసీపీ వర్తికా చతుర్వేది(షెఫాలి షా) హడావిడిగా సఫ్దర్ జంగ్ ఆసుపత్రికి వెళ్తూనే దారిలో తన అసిస్టెంట్ స్టాఫ్ అందరినీ అలర్ట్ చేస్తుంది. సఫ్దర్‌జంగ్ హాస్పిటల్‌కు రమ్మని ఆదేశాలిచ్చి తనూ చేరుకుంటుంది. అప్పటికే ఒంటినిండా గాయాలతో రక్తమోడుతూన్న అమ్మాయి.. దీపికను సర్జరీ కోసం థియేటర్‌కు తీసుకెళ్తూంటారు డాక్టర్స్. పేషంట్ కండీషన్ గురించి అడుగుతుంది డీసీపీ. ‘‘బాడీ బయట పార్ట్సే కాదు లోపలి పార్ట్సూ చాలా దెబ్బతిన్నాయి. గ్యాంగ్‌రేప్. ఐరన్‌రాడ్ కూడా ఇన్సర్ట్ చేశారు. లోపల పేగులు బయటకు లాగారు. క్రిటికల్ కండిషన్.. ఈ రాత్రి గడవొచ్చు’’ అని చెప్తూ థియేటర్లోకి వెళ్తుంది డాక్టర్. దీపికతోపాటు హాస్పిటల్లో అడ్మిట్ అయిన అబ్బాయి ఆకాశ్‌ను కలుస్తుంది డీసీపీ. ‘‘సినిమా చూసి తొమ్మిదిగంటలప్పుడు ద్వారకా (ఢిల్లీలోని ఓ ప్రాంతం) వెళ్లడానికి బస్ కోసం వెయిట్ చేస్తున్నాం. దొరకలేదు. రాత్రి అవుతోంది అలా వెయిట్ చేయడమెందుకని అక్కడి నుంచి ఓ ఆటో పట్టుకుని మునీర్కా వచ్చి అక్కడినుంచి ఓ బస్ ఎక్కాం. బస్‌లో ఆరుగురు ఉన్నారు. ఎక్కిన కొన్ని నిమిషాలకే దాదాగిరీ చేయడం మొదలుపెట్టారు. ఐరన్‌రాడ్‌తో నన్ను కొట్టి నా పర్స్, మొబైల్ ఫోన్, ఏటీఎం కార్డ్స్ లాక్కున్నారు.. అడ్డుపడ్డ దీపికనూ కొడ్తూ ఒకతను వెనక్కి తీసుకెళ్లాడు. తర్వాత మిగిలిన వాళ్లూ వెళ్లారు. కాసేపటికి కదులుతూన్న బస్‌లోంచి మమ్మల్ని రోడ్డు మీదకు విసిరేశారు.. నేకెడ్గా!’’ చెప్పాడు ఆకాశ్. భారంగా వార్డ్ బయటకు వస్తుంది డీసీపీ. అక్కడే దీపిక తల్లిదండ్రులుంటారు. వాళ్లకూ ధైర్యం చెప్పి ఆలోపే ఆసుపత్రికి చేరుకున్న తన స్టాఫ్‌తో కారిడార్‌లో సమావేశమవుతుంది. అందరిలో ఒకటే అభిప్రాయం.. వాళ్ల సర్వీస్‌లో ఇంతటి హేయమైన నేరాన్ని చూడలేదని. ఆమెలో తెలియని బాధ, గుబులు మొదలవుతుంది. ఆ రోజు సాయంకాలమే.. తన కూతురు చాంద్ని.. కాలేజ్ చదువుకోసం కెనడాకు పంపిన అప్లికేషన్ ఓకే అయినట్టు చెప్తుంది. ఢిల్లీని మించిన సిటీ లేదని.. సరిగ్గా ఎక్స్ప్లోర్ చేసుకొమ్మని.. కెనడా గినడా.. ఆలోచనలు కట్టిపెట్టమనీ గట్టిగా మందలిస్తుంది కూతురిని. ‘‘రాత్రి ఎనిమిదైతే చాలు కాలు బయటపెట్టడానికి భయపడి చచ్చే ఢిల్లీ నీకు సేఫ్‌గా కనిపిస్తుందా? మెట్రోలో ఎక్కడమే పాపం.. ఎక్కడెక్కడో చేతులు వేసి తడమాలనుకునే పోకిరీ వెధవలున్న ఈ సిటీని సరిగ్గా ఎక్స్ప్లోర్ చేయాలా?’’ అంటూ అసంతృప్తి, ఆగ్రహం వెళ్లగక్కుతుంది కూతురు. ‘‘ఒక్కనెల టైమ్ ఇవ్వు.. నీచేత ఢిల్లీని నేను ఎక్స్ప్లోర్ చేయిస్తా.. ఇంత సేఫ్ ప్లేస్ వరల్డ్‌లో లేదనిపిస్తా’’ చాలెంజ్ చేస్తుంది డీసీపీ. నవ్వి ‘‘సరే.. అట్లాంటి ఢిల్లీని చూపిస్తే కెనడా ఆలోచన మానేస్తాలే’’ అంటూ తన కూతురు ప్రామిస్ చేసిన ఆ సంభాషణ గుర్తొస్తుంది డీసీపీకి. ఆ భావాలేవీ బయట పడనివ్వకుండా స్టాఫ్‌తో అక్కడికక్కడే ఆ కేస్ ఇన్వెస్టిగేషన్ టీమ్‌ను ఫామ్ చేసేస్తుంది. ఆ క్షణం నుంచే డ్యూటీస్నీ ఆర్డర్ చేస్తుంది. ఆ రోజు ఉదయమే .. ట్రైనీ ఐపీఎస్ నీతీ సింగ్(రసికా దుగ్గల్) .. చెక్‌పోస్ట్‌లో డ్యూటీ తీసుకోగానే ఏనుగు దంతాలను స్మగ్లర్‌ను పట్టుకుంటుంది. ఆ విషయం తెలియగానే సంతోషపడ్తుంది డీసీపీ ‘‘అందుకే అన్ని డిపార్ట్మెంట్స్లో వీలైనంత ఎక్కువ మంది ఆడవాళ్లను అప్పాయింట్ చేసుకోవాలి’’ అని. అలా ఆ అమ్మాయినీ తన టీమ్‌లో చేర్చుకుంటుంది. హాస్పిటల్లో దీపికకు, ఆమె తల్లిదండ్రులకు కేర్‌టేకర్‌గా.. మీడియాను హాస్పిటల్లోకి రానివ్వకుండా చూసుకునే డ్యూటీని అప్పజెప్తుంది ఆమెకు. ఆరుగురు నేరస్థులు.. దీపిక స్నేహితుడు ఆకాశ్ చెప్పిన ఆనవాళ్ల ప్రకారం.. వాళ్లు బస్ ఎక్కిన ప్రాంతం నుంచి వాళ్లను విసిరేసిన ప్రాంతం దాకా సీసీ ఫుటేజ్‌ను పరిశీలించి కొన్ని క్లూస్ సంపాదిస్తుంది టీమ్. అలాగే బస్‌లో ఆరుగురి మధ్య జరిగిన కన్వర్జేషన్ ఆధారంగా ముగ్గురి పేర్లను చెప్తాడు ఆకాశ్. వాళ్లో జై సింగ్ ప్రధాన నేరస్థుడని తెలుస్తుంది డీసీపీ అండ్ టీమ్‌కి. ఇన్సిడెంట్ గురించి తెల్లవారే టీవీల్లో హోరెత్తి పోతుంటే భయపడ్డ ఆరుగురూ పారిపోతారు. జైసింగ్ ఓ ప్రైవేట్ ట్రావెల్స్‌లో పనిచేస్తుంటాడు. అది స్కూల్ బస్. మరో ప్రైవేట్ కంపెనీ ఎంప్లాయ్స్కీ కమ్యూట్గానూ పనిచేస్తూంటుంది. ఈ చర్య తర్వాత జైసింగ్ బస్‌ను శుభ్రం చేసేసి పార్కింగ్ ప్లేస్‌కి తీసుకొస్తుంటే అతణ్ణి పట్టుకుంటారు పోలీసులు. ముందు తనకేం తెలియదని బుకాయిస్తాడు జై సింగ్. గట్టిగా అడిగితే ఒప్పుకుంటాడు. అప్పుడే అతని మానసిక వికారమూ బయటపడ్తుంది. జై సింగ్ నుంచి మిగిలిన వాళ్ల వివరాలనూ సేకరిస్తారు. సెల్‌ఫోన్ సిగ్నల్స్ ద్వారా ఏరియాస్‌ను డిటెక్ట్ చేసుకుంటూ ఒకొక్కరి జాడా తీస్తూ రాజస్థాన్, బీహార్‌కూ జర్నీ చేసి నేరస్థుల బలహీనతలను వాడుకుంటూ... ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తూ మొత్తానికి అయిదు రోజుల్లోపే ఆరుగురినీ పట్టుకుంటారు. ఈ ప్రయాణంలో ఆ ఆరుగురి మానసిక స్థితి, వాళ్ల కుటుంబ నేపథ్యాలు, పెరిగిన వాతావరణం, ఆర్థిక స్థితీ అర్థమవుతుంది. మొత్తానికి అయిదు రోజుల్లో ఆరుగురినీ పట్టుకుంటారు. రెండో కోణంలో... ఇన్వెస్టిగేషన్ విషయంలో వచ్చే రాజకీయంగా ఒత్తిళ్లను తట్టుకోవడం ఒకెత్తయితే.. మీడియా చూపే అత్యుత్సాహాన్ని నిరోధించడం అంతకుమించిన తలనొప్పి అవుతుంది డీసీపీ అండ్ టీమ్‌కి. ప్రజా సంఘాలు, యూత్, ఫెమినిస్ట్స్ ఆర్గనైజేషన్స్ చేసే ధర్నాలు, ర్యాలీలలో ఏ అపశ్రుతి దొర్లకుండా చూసే బాధ్యతా అదనపు భారమవుతుంది. డీసీపీతో సహా టీమ్ అంతా ఆ అయిదు రోజులూ స్టేషన్లోనే ఉంటారు ఇల్లు, కుటుంబాన్ని మరిచిపోయి. దీపిక విషయానికి వస్తే సర్జరీ అయినా ఆమె ఆరోగ్యం అంతగా మెరుగు పడదు. ఇంకా చేయాల్సిన సర్జరీలూ ఉంటాయి. ఆఖరి నేరస్థుడిని పట్టుకున్న రోజే దీపిక స్పృహలోకి వస్తుంది. మెజిస్ట్రేట్ ముందు జరిగినదంతా చెప్తూ స్టేట్మెంట్ ఇస్తుంది. ఆ నేరస్థులు కనిపిస్తే చాలు కొట్టి చంపేయాలన్నంత ఆవేశంతో ఉంటారు ఢిల్లీ ప్రజలు. పోలీస్ స్టేషన్, కోర్ట్, ఇండియా గేట్ ముందు వందల సంఖ్యలో జనాలు గుంపులు గుంపులుగా. వాళ్ల బారిన పడకుండా నేరస్థులను సురక్షితంగా కోర్ట్‌లో హాజరుపరిచి శిక్షార్హులను చేయాలన్నదే డీసీపీ అండ్ టీమ్ తపన. ఇంకే కూతురికి ఇలాంటి పరిస్థితి రాకుండా.. మరే తల్లీ, తండ్రీ ఈ క్షోభకు గురికాకుండా చూడాలన్నదే వాళ్ల దృఢనిశ్చయం. ఈ క్రమంలో తమ పట్ల ప్రజల్లో నమ్మకం పోకుండా చూసుకోవడం మరో క్రూషియల్ టాస్క్. ఆఖరకు ఆ పోరాటంలో గెలుస్తారు అనుకున్నట్టుగానే మూడో కంట పడకుండా ఆ నేరస్థులను కోర్టుకు అప్పగించి. ఆ విజయాన్ని ఇండియా గేట్ ముందు సెలబ్రేట్ చేసుకుంటూంటే.. ట్రైనీ ఐపీఎస్ నీతి సింగ్.. ‘‘దీపిక మెడికల్ రిపోర్ట్ చదివారా? ఇంటర్నల్ ఆర్గాన్స్ రిపేర్ చేయలేనంత డామేజ్ అయ్యాయి. ఆమె బతకదు.. ఈ సెలబ్రేషన్స్ ఎందుకు?’’ అన్న మాటలతో ‘‘డెల్హీ క్రైమ్’’ ఎండ్ అవుతుంది. నిర్భయ కేస్‌ను ఇన్వెస్టిగేట్ చేసిన లేడీ ఆఫీసర్ ఛాయా శర్మ స్ఫూర్తితో ఈ సిరీస్‌ను తీశారు ఇండో కెనడియన్ డైరెక్ట్ రిచీ మెహతా. – సరస్వతి రమ -
అయ్యా మోదీ.. నీ ఎన్నికల సభ కాదిది!
న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో నిర్మించిన జాతీయ యుద్ధ స్మారకాన్ని ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం ప్రారంభించి జాతికి అంకితమిచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీపై మోదీ పరోక్ష వ్యాఖ్యలు చేస్తూ గత ప్రభుత్వాల హయాంలో సైన్యం, దేశ భద్రత నేరపూరిత నిర్లక్ష్యానికి గురయ్యాయని ఆరోపించారు. గత ప్రభుత్వంలో తొలి ప్రాధాన్యత వారి సొంత కుటుంబానికి ఉండేదనీ, తాము అధికారంలోకి వచ్చిన తర్వాత తొలి ప్రాధాన్యత దేశానికి ఇచ్చామన్నారు. రక్షణ ఆయుధాల సామర్థ్యాన్ని పెంచుకోవడం, బలగాలను బలోపేతం చేయడం తదితరాలకు సంబంధించిన కీలక నిర్ణయాలు గత ప్రభుత్వం హయాంలో పెండింగ్‌లో ఉండేవనీ, తాము వచ్చాక వాటికి ఆమోదం లభించిందని మోదీ వెల్లడించారు. అయితే వార్‌మెమోరియల్ ప్రారంభ సమావేశంలో మోదీ రాజకీయ ప్రసంగం చేయడంపై పలు పార్టీల నాయకులు, మేధావులు తప్పుబడుతున్నారు. కాంగ్రెస్ అయితే.. ‘మోదీ.. ఇది నీ ఎన్నికల సభ అనుకుంటున్నావా?’ అని ఘాటుగా ప్రశ్నిస్తోంది. దేశం కోసం ప్రాణాలు అర్పించిన వీర జవాన్లను స్మరించుకునే సందర్భంలో మోదీ రాజకీయ ప్రసంగం చేయడం ఏంటని కాంగ్రెస్ అధికార ప్రతినిధి ప్రియాంక చతుర్వేది ప్రశ్నించారు. జవాన్ల మరణాన్ని కూడా ఓట్లు, రాజకీయాల కోసం మోదీ వాడుకుంటున్నారని మండిపడ్డారు. అమరుల స్మారక సభను.. ఎన్నికల ప్రచార సభగా మార్చి వీర జవాన్ల త్యాగాలను అవమానించవద్దని కాంగ్రెస్ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి రణ్‌దీప్ సింగ్ సుర్జేవాలా ఘాటుగా వ్యాఖ్యానించారు. 70 ఏళ్లుగా ఏర్పాటు కానీ జాతీయ యుద్ధ స్మారక ఏర్పాటు క్రెడిట్ మోదీదేనని, కానీ ఆయన రాజకీయ ప్రసంగమే తీవ్రంగా నిరాశపర్చిందని నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఓమర్ అబ్దుల్లా తెలిపారు. ఆయన ప్రసంగంతో స్మారక సభ కాస్త బీజేపీ ఎన్నికల ప్రచార సభగా తలిపించిందన్నారు. ప్రముఖ జర్నలిస్ట్ సాగరికా ఘోష్ సైతం ప్రధాని నరేంద్ర మోదీని తప్పుబట్టారు. దేశం కోసం ప్రాణాలర్పించిన సైనికుల శౌర్యాన్ని దేశం గుర్తు చేసుకోవాల్సిన సందర్భంలో రాజకీయప్రత్యర్థులపై విమర్శలు చేయడం సరైన సమయం కాదని అభిప్రాయపడ్డారు. ఇక బ్రిటిష్ కాలం నాటి యుద్ధాల్లో మరణించిన భారతీయ సైనికుల సంస్మరణార్థం నిర్మించిన ఇండియా గేట్ పక్కనే తాజా స్మారకాన్ని 40 ఎకరాల్లో ఏర్పాటు చేశారు. స్వాతంత్య్రానంతరం వివిధ యుద్ధాల్లోనూ, శాంతి పరిరక్షణ దళాల్లోనూ ఉంటూ మరణించిన 25,942 మంది అమర వీరుల పేర్లను ఈ స్మారకంపై సువర్ణాక్షరాలతో లిఖించారు. చదవండి: యుద్ధ స్మారకం అంకితం -
యుద్ధ స్మారకం అంకితం
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో నిర్మించిన జాతీయ యుద్ధ స్మారకాన్ని ప్రధాని మోదీ సోమవారం ప్రారంభించి జాతికి అంకితమిచ్చారు. బ్రిటిష్ కాలం నాటి యుద్ధాల్లో మరణించిన భారతీయ సైనికుల సంస్మరణార్థం నిర్మించిన ఇండియా గేట్ పక్కనే తాజా స్మారకాన్ని 40 ఎకరాల్లో ఏర్పాటు చేశారు. స్వాతంత్య్రానంతరం వివిధ యుద్ధాల్లోనూ, శాంతి పరిరక్షణ దళాల్లోనూ ఉంటూ మరణించిన 25,942 మంది అమర వీరుల పేర్లను ఈ స్మారకంపై సువర్ణాక్షరాలతో లిఖించారు. కాంగ్రెస్ పార్టీపై మోదీ పరోక్ష వ్యాఖ్యలు చేస్తూ గత ప్రభుత్వాల హయాంలో సైన్యం, దేశ భద్రత నేరపూరిత నిర్లక్ష్యానికి గురయ్యాయని ఆరోపించారు. అందుకే స్మారక నిర్మాణం ఇంత ఆలస్యమైందన్నారు. స్మారక ఆవిష్కరణకు ముందు కొంతమంది మాజీ సైనికులతో మోదీ సమావేశమై అక్కడ ప్రసంగించారు. గత ప్రభుత్వంలో తొలి ప్రాధాన్యత వారి సొంత కుటుంబానికి ఉండేదనీ, తాము అధికారంలోకి తొలి ప్రాధాన్యత దేశానికి ఇచ్చామని మోదీ అన్నారు. రక్షణ ఆయుధాల సామర్థ్యాన్ని పెంచుకోవడం, బలగాలను బలోపేతం చేయడం తదితరాలకు సంబంధించిన కీలక నిర్ణయాలు గత ప్రభుత్వం హయాంలో పెండింగ్‌లో ఉండేవనీ, తాము వచ్చాక వాటికి ఆమోదం లభించిందని మోదీ వెల్లడించారు. మాజీ సైనికుల కోసం ప్రభుత్వం మూడు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులను నెలకొల్పుతుందని చెప్పారు. నాలుగు ఏకకేంద్రక వృత్తాల్లో.. అమర చక్ర, వీరతా చక్ర, త్యాగ చక్ర, రక్షక చక్ర అనే నాలుగు ఏక కేంద్రక వృత్తాల ఆకారంలో, రూ. 176 కోట్ల నిధులతో స్మారకాన్ని ఏర్పాటు చేశారు. ఈ నాలుగు వృత్తాల కేంద్రంలో ఓ రాతి స్థూపం, అమరజ్యోతి ఉంటాయి. వీరతా చక్రలో భారత సైన్యం పోరాడిన యుద్ధాల నమూనా చిత్రాలను కాంస్య లోహంతో చేసి గోడలపై అమర్చారు. ఆర్మీ, వైమానిక దళం, నౌకాదళం యుద్ధాల్లో పోరాడినట్లుగా చూసే ఆరు కుడ్య చిత్రాలను ఇక్కడ ఏర్పాటు చేశారు. స్వాతంత్య్రానంతరం అమరులైన సైనికుల సంస్మరణ కోసం ఓ స్మారకాన్ని నిర్మించాలని దశాబ్దాలుగా ప్రతిపాదన ఉన్నప్పటికీ అడుగు ముందుకు పడలేదు. చివరకు మోదీ ప్రభుత్వం 2015లో స్మారక నిర్మాణానికి పచ్చజెండా ఊపగా, పనులు మాత్రం గతేడాది ఫిబ్రవరిలోనే ప్రారంభమయ్యాయి. ఈ స్మారకంలో గ్రాఫిక్ ప్యానెళ్లు, రాతి కుడ్య చిత్రాలు కూడా ఉన్నాయి. స్మారకం అమరసైనికులకు అంజలి ఘటించే ప్రదేశంగా ఉంటుంది. రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ జాతీయ స్మారకాన్ని ఆవిష్కరించడం ఓ చరిత్రత్మాక ఘట్టమనీ, ఇప్పుడు భారతీయుల తీర్థయాత్రలకు మరో ప్రదేశం అందుబాటులోకి వచ్చిందన్నారు. స్మారకం విశేషాలు ► ఇండియా–చైనా(1962), ఇండియా–పాక్ (1947,1965,1971), కార్గిల్(1999) యుద్ధాల సమయంలో, శ్రీలంకలో శాంతి పరిరక్షక దళంలో ఉంటూ అమరులైన 25,942 మంది భారత సైనికుల జ్ఞాపకార్థం దీనిని నిర్మించారు. ► స్మారక స్థూపం పొడవు 15.5 మీటర్లు. కింది భాగంలో అమరజ్యోతి వెలుగుతూ ఉంటుంది. ఈ రాతి స్థూపం చుట్టూ నాలుగు ఏక కేంద్రక వృత్తాకార వలయాలను నిర్మించారు. ► అన్నింటికన్నా బాహ్య వలయానికి రక్షక చక్ర అని పేరు పెట్టి ఆ వలయం మధ్యమధ్యల్లో 600 మొక్కలు నాటారు. ఈ మొక్కలే సైనికులుగా, దేశానికి కాపలా కాస్తున్న వారుగా దీనిని చిత్రీకరించారు. ► త్యాగ చక్ర వలయంలో 16 గోడలను నిర్మించారు. వీటిపైనే అమర సైనికుల పేర్లను గ్రానైట్ ఫలకాలపై బంగారు వర్ణంలో లిఖించారు. సైనికులకు నివాళి అర్పించే స్థలం ఇదే. ఈ గ్రానైట్ ఫలకాలను పురాతన కాలం నాటి భారతీయ యుద్ధ తంత్రం చక్రవ్యూహం ఆకారంలో అమర్చారు. ► స్మారకంలో భాగంగా ఏర్పాటు చేసిన పరమ్ యోధ స్థల్లో పరమ వీర చక్ర పురస్కారం పొందిన 21 మంది సైనికుల విగ్రహాలను నెలకొల్పారు. వీటిలో సజీవులైన సుబేదార్ మేజర్ బానాసింగ్, సుబేదార్ మేజర్ యోగేంద్ర సింగ్ యాదవ్, సుబేదార్ సంజయ్ కుమార్ల విగ్రహాలు ఉన్నాయి. -
ఇండియా గేట్ వద్ద ‘పాకిస్తాన్ జిందాబాద్’ అంటూ..
న్యూఢిల్లీ : ఇండియా గేట్ దగ్గర పాకిస్తాన్ జిందాబాద్ అంటూ నినాదాలు చేసిన ఓ మహిళను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. వివరాలు.. ఇండియా గేట్ వద్ద రిపబ్లిక్ డే రిహార్సల్స్ జరుగుతున్నాయి. ఆ సమయంలో ఓ మహిళ అమర్ జ్యోతి జవాన్ ప్రాంతానికి వెళ్లడానికి ప్రయత్నించింది. ఆ సమయంలో అక్కడ ఉన్న భద్రతా సిబ్బంది ఆమెను ఆపేందుకు ప్రయత్నించారు. కానీ ఆమె వారిని తోసేసి ముందుకు వెళ్లి ‘పాకిస్తాన్ జిందాబాద్’ అంటూ నినాదాలు చేయడం ప్రారంభించింది. ఆమెను అడ్డుకోబోయిన సిబ్బంది మీద దాడి చేస్తూ హల్చల్ చేసింది. ఎట్టకేలకు మహిళా కానిస్టేబుల్ వచ్చి సదరు స్త్రీని పార్లమెంట్ స్ట్రీట్‌లోని పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు. అనంతరం సదరు మహిళ గురించి విచారణ చేయగా.. ఆమెది నిజామాబాద్ అని.. ముంబైలో ఉంటున్న బంధువులను కలుసుకునేందుకు ఇంట్లో చెప్పకుండా వచ్చిందని తెలిసింది. కానీ అనుకోకుండా ఢిల్లీలో ఆగిపోవాల్సి వచ్చిందని తెలిసింది. ఆమె కనిపించకుండా పోవడంతో కుటుంబ సభ్యులు నిజామాబాద్‌లో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఢిల్లీ పోలీసులు ఈ విషయం గురించి హైదరాబాద్ అధికారులను వాకబు చేయడంతో మహిళకు సంబంధించిన వివరాలు వెలుగులోకి వచ్చాయి. అనంతరం సదరు మహిళకు వైద్య పరీక్షలు నిర్వహించగా ఆమె మానసిక స్థితి సరిగా లేదని తెలిసింది. ప్రస్తుతం ఆ మహిళను షెల్టర్ హోంలో చేర్చారు. -
మోదీ.. నోరువిప్పండి: రాహుల్
న్యూఢిల్లీ: మహిళలు, పిల్లలపై పెరుగుతున్న హింసాకాండపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మౌనం వహించడం సరికాదని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మండిపడ్డారు. ఇప్పటికైనా ప్రధాని నోరు విప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మోదీకి ప్రశ్నలు సంధించారు. ‘మహిళలు, పిల్లలపై పెరుగుతున్న హింసాకాండ గురించి మీరు ఏమనుకుంటున్నారు? అత్యాచారాలు, హత్యల్లో నిందితులను ప్రభుత్వం ఎందుకు కాపాడుతోంది? మీ స్పందన కోసం భారతదేశం ఎదురు చూస్తోంది. మాట్లాడండి..’ అని రాహుల్ గాంధీ శుక్రవారం ట్వీట్ చేశారు. కథువా, ఉన్నావ్ అత్యాచారాల కేసుల నేపథ్యంలో మహిళలకు రక్షణ కల్పించాలనే డిమాండ్‌తో గురువారం అర్ధరాత్రి రాహుల్ గాంధీ నేతృత్వంలో ఢిల్లీలోని ఇండియా గేట్ వద్ద కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు. వేలాది కార్యకర్తలతో పాటు రాహుల్, సోనియా, ప్రియాంక వాద్రా, పలువురు కాంగ్రెస్ సీనియర్ నేతలు పాల్గొన్నారు. కాగా కథువా, ఉన్నావ్ అత్యాచారాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్త ఆందోళనకు కాంగ్రెస్ పార్టీ సిద్ధమవుతోంది. -
అర్థరాత్రి కొవ్వొత్తుల ర్యాలీ, పాల్గొన్న రాహుల్, ప్రియాంక
న్యూఢిల్లీ : ‘బేటీ బచావో, బేటీ పడావో’ అంటూ గొప్ప, గొప్ప మాటలు చెప్పిన ప్రధాని మోదీ దేశంలో ఆడపిల్లలకు రక్షణ లేకుండా ఇంత భయంకరమైన పరిస్థితులు నెలకొని ఉంటే ఎందుకు మౌనంగా ఉన్నారు? అంటూ ప్రశ్నించారు కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ. బాధితులకు న్యాయం చేయాలంటూ ఆయన గురువారం అర్ధరాత్రి దేశ రాజధాని ఢిల్లీలోని ఇండియా గేట్ వద్ద కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. దేశంలో వరుసగా జరుగుతున్న అత్యాచార దారుణాలు బీజేపీని ఇరుకున పెట్టడానికి ప్రతిపక్షాలకు ఆయుధాలుగా మారుతున్నాయి. జమ్ము - కాశ్మీర్‌లోని కథువా గ్రామానికి చెందిన ఒక ఎనిమిదేళ్ల బాలిక అసిఫాను మృగాళ్లు మత్తు మందు ఇచ్చి నాలుగు రోజులు గ్యాంగ్ రేప్ చేసి అత్యంత క్రూరంగా బండరాళ్లతో మోది చంపారు. మరో రాష్ట్రం యూపీలో స్వయంగా అధికారీ పార్టీ ఎమ్మెల్యేనే 16ఏళ్ల బాలికపై అత్యాచారం చేశాడు. చేసిన పనికి సిగ్గుపడక ‘తక్కువ కులం’ వారు అంటూ నోరుపారేసుకున్నాడు. ఈ రెండు సంఘటనలపై నిరసన తెలుపుతూ బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఇండియా గేట్ వద్ద కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించాలంటూ రాహుల్ గాంధీ పిలుపునిచ్చారు. ఆయన పిలుపు మేరకు వందాలాది మంది ప్రజలు, కాంగ్రెస్ కార్యకర్తలు అర్ధరాత్రి ఇండియా గేట్ వద్దకు వచ్చి తమ మద్దతు తెలిపారు. శాంతియుతంగా, నిశ్శబ్దంగా జరిగిన ఈ ర్యాలీలో రాహుల్ గాంధీతో పాటు సోనియా గాంధీ, ప్రియాంక వాద్రా, మరికొందరు కాంగ్రెస్ సీనియర్ నేతలు కూడా పాల్గొన్నారు. ఈ నిరసన కార్యక్రమం ఐదేళ్ల క్రితం జరిగిన నిర్భయ ఘటనను గుర్తుచేస్తుంది. ఆ సమయంలో బాధితురాలికి న్యాయం చేయాలంటూ పార్లమెంటు ముందు ప్రజలు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. గురువారం అర్ధరాత్రి నిర్వహించిన ర్యాలీ సందర్భంగా రాహుల్ గాంధీ మాట్లాడుతూ ఇద్దరు ఆడపిల్లలను అత్యాచారం చేసి, చంపేశారు. ఈ సంఘటన పట్ల దేశమంతా ఆగ్రహం పెల్లుబుకుతుంది. ఇది రాజకీయ అంశం కాదు, దేశానికి సంబంధించిన అంశం. ప్రభుత్వం దీనిపై తగు చర్య తీసుకోవాలి. ప్రధాని మోదీ ఇచ్చిన ఆడపిల్లలను రక్షించుకుందాము అనే నినాదం చాలా బాగుంది, కానీ దాన్ని అమలు చేస్తే ఇంకా బాగుంటుంది. ప్రధానిగా ఇది మీ బాధ్యత అన్నారు. స్పందించిన ఇతర ప్రముఖులు.. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు గులాం నబీ అజాద్ మాట్లాడుతూ ‘ఇది రాజకీయ అంశం కాదు. ప్రభుత్వం నిద్రపోయినప్పుడు, ఈ దేశ చౌకీదారు (వాచ్మెన్) అయిన ప్రధాని నిద్రపోయినప్పుడు ఆయనను మేల్కొలిపే బాధ్యతను కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది’ అన్నారు. 2014 ఎన్నికల్లో మోదీ తనను తాను దేశానికి వాచ్‌మెన్‌గా వర్ణించుకున్నారు. ఆ విషయాన్ని ఈ ర్యాలీ సందర్భంగా ఆజాద్ గుర్తుచేశారు. ఈ ఘటనపై బాలీవుడ్ ప్రముఖులు తమ ఆవేదనను, ఆగ్రహన్ని సామాజిక మాధ్యమాల్లో వ్యక్తం చేశారు. హీరో అక్షయ్ కుమార్, దర్శక నిర్మాత కరణ్ జోహర్, నటి సోనమ్ కపూర్, ఫర్హాన్ అక్తర్, టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా ఈ ఘటనపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. మనుషులుగా తాము విఫలమయ్యామంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సంఘటనపై స్పందించిన ఒకే ఒక్క బీజేపీ నాయకుడు వీకే సింగ్. అసిఫాకు జరిగిన అన్యాయాన్ని ఆయన ఖండిస్తూ ‘అసిఫా విషయంలో మేము మనుషులుగా విఫలం అయ్యాము, కానీ ఆమెకు న్యాయం చేసే విషయంలో మాత్రం విఫలం అవ్వము’ అన్నారు. సంఘటన వివరాలు... బఖేర్వాల్ తెగకు చెందిన ఎనిమిదేళ్ల బాలిక అసిఫాను గత జనవరి 10న కొందరు దుండగులు నమ్మించి అడవికి తీసుకుపోయి అక్కడ ఆమెపై దౌర్జన్యం చేసి, మత్తు పదార్ధాన్నిచ్చి నాలుగురోజులపాటు సామూహిక అత్యాచారం జరిపి రాళ్లతో కొట్టి చంపారు. ఈ దురంతంలో పాలుపంచుకున్నవారిలో ఇద్దరు మైనర్లు, మరో ఇద్దరు పోలీసు విభాగానికి సహకరించే ప్రత్యేక పోలీసు అధికారులు(ఎస్పీఓలు) ఉన్నారు. బాలిక గురించి ఆమె కుటుంబసభ్యులు వెదు కుతున్న సమయానికి స్థానిక పోలీసుల్లో కొందరికి ఆమెను ఎక్కడ బంధించారో తెలుసు. అయినా వారు రక్షించేయత్నం చేయలేదు. జనవరిలో ఈ ఉదంతం జరిగాక తొలుత మైనర్‌ను అరెస్టు చేసిన ప్పుడు దర్యాప్తు సక్రమంగా జరగడంలేదని, దీన్ని క్రైం బ్రాంచ్‌కు అప్పగించాలని మెహబూబా కేబినెట్లోని ఇద్దరు బీజేపీ మంత్రులు డిమాండ్ చేశారు. క్రైంబ్రాంచ్ దర్యాప్తు ప్రారంభమయ్యాక ఇతర నిందితుల గుట్టు రట్టు కావడం మొదలయ్యే సరికి దీన్ని సీబీఐకి అప్పగించాలంటూ స్వరం మార్చారు. దర్యాప్తు కోసం నిందితులను అదుపులోకి తీసుకున్న సమయంలోనే ఒక మంత్రి అంత చిన్న వయసున్న వారిని ఎలా అరెస్టు చేస్తారంటూ పోలీసులపై విరుచుకుపడ్డాడు. మరో మంత్రి ఒక బాలిక మృతిపై ఇంత రాద్ధాంతం చేస్తారా... ఎంతమంది మహిళలు ఈ ప్రాంతంలో చనిపోవడంలేదని నిలదీశాడు. -
ఢిల్లీకి చేరిన ‘త్రివర్ణ పతాక జైత్రయాత్ర’
సాక్షి, న్యూఢిల్లీ: ప్రజల్లో జాతీయ భావాన్ని పెంపొందించేందుకు, జాతీయ సమైక్యతను కాపాడేందుకు ఇండియన్ ఫెడరేషన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్టుల ఆధ్వర్యంలో ఈ నెల 10న జార్ఖండ్‌లో ప్రారంభించిన జర్నలిస్టుల ‘త్రివర్ణ పతాక జైత్రయాత్ర’ ఆదివారం ఢిల్లీకి చేరింది. ఢిల్లీలోని అమర్జవాన్ల జ్యోతి (ఇండియా గేట్) వద్దకు చేరుకున్న ఈ యాత్రకు ఐఎఫ్‌డబ్ల్యూజే అధ్యక్షుడు కె.విక్రమ్‌రావు, వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన జర్నలిస్టులు ఘనస్వాగతం పలికారు. తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టుల సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు మామిడి సోమయ్య, ఉపాధ్యక్షుడు పి.ఆనందం తదితరులు ఈ యాత్రలో పాల్గొన్నారు. ఈ యాత్ర ఢిల్లీ నుంచి కత్రాలోని శ్రీ వైష్ణవిమాత దేవాలయం చేరుకొని అక్కడి నుంచి శ్రీనగర్‌లోని లాల్‌చౌక్ చేరుకోనుంది. -
ఢిల్లీ ఇండియగేట్ వద్ద బైక్ రైడింగ్
-
నేను బిగ్ బీ ని కాదు: అమితాబ్
న్యూఢిల్లీ: కేంద్రంలో ఎన్ డీఏ ప్రభుత్వం రెండేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఇండియా గేట్ వద్ద నిర్వహించిన వేడుకల్లో అరుదైన సన్నివేశం చోటు చేసుకుంది. బేటీ బచావో-బేటీ పడావో కార్యక్రమ ప్రాధాన్యాన్ని అమితాబ్ వివరించారు. ఈ సందర్భంగా బాలికలు చదువుకోవాల్సిన ఆవశ్యకత గురించి అమితాబ్ పాఠశాల విద్యార్థినులతో మాట్లాడుతున్న సందర్భంలో ఒక బాలిక ప్రశ్నకు అమితాబ్ నేలపై కూర్చొని సమాధానం చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఏడవ తరగతి విద్యార్థిని సుగమ్ అమితాబ్ ఉద్దేశించి మీరు బిగ్ బీ ఎలా అయ్యారు? మీ చిన్ననాటి విషయాలను తెలుసుకోవాలనుకుంటున్నాను? అని అడిగింది. వెంటనే అమితాబ్ కింద కూర్చొని.. ఎవరు చెప్పారు నేను బిగ్ బీ అని, చూడు నేను నీకన్నా చిన్నగా ఉన్నాను అని చమత్కరించారు. దీంతో అక్కడున్న వాళ్లందరిలో నవ్వులు విరిసాయి. బిగ్ బీ అనేది మీడియా, ప్రజలు ఇచ్చిన బిరుదు అని అన్నారు. అంతేకాని బిగ్ బీలు ఎవరూ లేరన్నారు. ప్రతీ ఒక్కరూ చదువుకొని ఉన్నత లక్ష్యం దిశగా కృషి చేయాలని వారికి అమితాబ్ సూచించారు. ఈ సందర్భంగా తన తండ్రి హరివంశరాయ్ బచ్చన్ రచించిన 'మధుశాల'లోని కొన్ని పంక్తులను అమితాబ్ ఉదహరించారు. విద్యార్థులు రాసిన రెండు పద్యాలను కూడా ఆయన చదివారు. 'బేటీ బచావో-బేటీ పడావో' ఉద్దేశాన్ని వివరిస్తూ.. ఆడ, మగ పిల్లల మధ్య ఎటుమంటి వివక్ష చూపకూడదని అన్నారు. మన పూర్వీకులు మహిళలకు ఉన్నత స్థానాన్ని ఇచ్చారని గుర్తు చేశారు. -
'ప్రభుత్వానికి ప్రజల ఆశీస్సులు ఉన్నాయి'
న్యూఢిల్లీ : తమ ప్రభుత్వానికి దేశ ప్రజల ఆశీస్సులు ఉన్నాయని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. తమ రెండేళ్ల పాలనపై శనివారం న్యూఢిల్లీలోని ఏక్ నయీ సుబాహ్ పేరుతో నరేంద్ర మోదీ ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ... ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను ప్రజలు గమనిస్తున్నారని ఆయన అన్నారు. చేసిన ప్రతి పనిని సమీక్షించుకోవాల్సిన అవసరం కూడా ఉందన్నారు. గ్యాస్ రాయితీలను ఆధార్‌తో అనుసంధానం చేశామని గుర్తు చేశారు. దీని వల్ల రూ. 15 వేల కోట్లు ఆదా అవుతున్నాయని మోదీ పేర్కొన్నారు. -
అమితాబ్ తప్ప ఎవరూ దొరకలేదా?
పనామా పేపర్ల వ్యవహారంలో అపప్రథకు గురైన అమితాబ్ బచ్చన్‌ను ప్రభుత్వ కార్యక్రమ నిర్వహణకు వ్యాఖ్యాతగా పెట్టడంపై కాంగ్రెస్ పార్టీ మండిపడింది. మోదీ సర్కారు రెండేళ్ల పాలన ముగిసిన సందర్భంగా ఇండియాగేట్ వద్ద శనివారం నిర్వహించే మెగా కార్యక్రమానికి అమితాబ్ బచ్చన్‌ను వ్యాఖ్యాతగా ఎందుకు పెట్టారని ప్రశ్నించింది. నల్లధనాన్ని వెనక్కి తెస్తానని, ఆ వ్యవహారంలో ఎవరున్నా శిక్షిస్తానని ప్రధాని మోదీ గతంలో చెప్పిన మాటలకు, ఇప్పుడు చేస్తున్న పనులకు పొంతన లేదేమని కాంగ్రెస్ నేత రణదీప్ సుర్జేవాలా ప్రశ్నించారు. మనీలాండరింగ్‌లో పాత్ర ఉన్నట్లు ఆరోపణలొచ్చిన వ్యక్తికి అంత పెద్దపీట వేయడం దర్యాప్తు సంస్థలకు ఎలాంటి సంకేతాన్ని పంపుతుందని నిలదీశారు. అమితాబ్‌ను మంచి నటుడిగా, పెద్దమనిషిగా దేశంలోని అందరూ ప్రేమిస్తారని, అయితే.. ఆయన పేరు పనామా పేపర్లలో ఉందన్న విషయం మాత్రం మర్చిపోకూడదని అన్నారు. ఢిల్లీలోని ఇండియా గేట్ నుంచి ఇప్పటివరకు ప్రత్యక్ష ప్రసారం చేసిన కార్యక్రమాల్లో ఇదే అతి పెద్దదని చెబుతున్నారు. ఈ కార్యక్రమం చివర్లో మోదీ పాల్గొంటారు. సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు జరిగే ఈ కార్యక్రమానికి 'ఓ కొత్త ఉదయం' అని పేరుపెట్టారు. ఇందులో అనిల్ కపూర్, అనుపమ్ ఖేర్, జూహీ చావ్లా లాంటి బాలీవుడ్ ప్రముఖులు పలువురు పాల్గొంటారు. అయితే.. కాంగ్రెస్ ఆరోపణలను అమితాబ్ కుమారుడు అభిషేక్ బచ్చన్ ఖండించారు. తన తండ్రి ఏమీ రాజకీయ కార్యక్రమాల్లో పాల్గొనడం లేదని, ఇండియాగేట్ వద్ద జరిగే కార్యక్రమంలో బాలికల విద్య ఆవశ్యకత మీద మాత్రమే ఆయన మాట్లాడతారని, దీన్ని రాజకీయం చేయడం తగదని అన్నారు. -
దేశం సిగ్గుపడి, గర్వించింది!
దేడ్ కహానీ - నో వన్ కిల్డ్ జెస్సికా ఒకటిన్నర దశాబ్ద కాలంలో బాలీవుడ్ గమనం... అనగనగా ఒక దేశం. సంస్కృతికి, సంప్రదాయానికి పెట్టింది పేరు. స్త్రీలను గౌరవించడంలో ప్రపంచంలోనే తలమానికం. సాక్షాత్తూ అమ్మవారి నుదుటి కుంకుమ ఆ దేశమేనని వేదాలు, పురాణాలు, కవితలు ఘోషిస్తాయి. ఆ దేశ రాజధాని మాత్రం ‘నిర్భయ’గా కామాంధులు రక్కసి కోరలు చాచి, అతివల మానభంగ భక్షణ చేసి, శిక్ష లేకుండా విడుదల కాగలిగిన విచ్చలవిడి నగరం. అయిదేళ్ల బాలికలైనా, అరవయ్యేళ్ల వృద్ధురాలైనా ఆ నగరంలో కాదేదీ మాన హరణకు అనర్హం అన్నట్టు ఉంటుంది. నీతుల రెండు నాల్కలు సాచి బుసలుకొట్టే నిర్హేతుక కృపా సర్పాల లాంటి నీచ రాజకీయ నాయకులంతా దండిగా ఒకే దగ్గిరుండి కాపు కాస్తుంటారు ఆ నగరంలో. ప్రపంచమంతా ధీర గంభీరంగా ఎదుగుతున్న ఆధునిక యువతి జీవితం... ఆ నగరంలో మాత్రం ఓ మందు గ్లాసు (బాటిల్ కూడా కాదు, గ్లాసే) విలువ కూడా చెయ్యదు. సరిగ్గా 1999లో అలాంటి సంఘటనే జరిగింది. జెస్సికాలాల్ అనే ఓ అందమైన, వర్ధమాన మోడల్... సినిమాల్లో హీరోయిన్గా అవకాశాల కోసం కలలు కంటూ, పార్ట్ టైమ్‌గా ఓ రెస్టారెంట్లో బార్ టెండర్‌గా పనిచేస్తోంది దేశ రాజధాని ఢిల్లీలో. హర్యానాకి చెందిన బడా వ్యాపారవేత్త, రాజకీయ నాయకుడి కొడుకు మనుశర్మ అనేవాడు స్నేహితులతో కలిసి ఆ రెస్టారెంటుకొచ్చాడు పార్టీకి. 12 గంటల తర్వాత మద్యం అమ్మకూడదన్న నియమం వలన మనుశర్మకి జెస్సికాలాల్ మరో గ్లాసు మద్యం అమ్మడానికి నిరాకరించింది. మాటా మాటా పెరిగి, ఆవేశంగా రివాల్వర్ తీసి రెండు బుల్లెట్లతో జెస్సికాలాల్‌ని చంపేశాడు మనుశర్మ. అప్పటి హర్యానా ముఖ్యమంత్రితో ఉన్న సాన్నిహిత్యాన్ని వాడుకుని జెస్సికా అక్క పెట్టిన కేసులో సాక్ష్యాలన్నీ కొనేసి, తారుమారు చేసేసి ఆరు సంవత్సరాల కాలయాపన తర్వాత 2006లో జెస్సికా లాల్‌ని ఎవరూ చంపలేదని (?) మనుశర్మ నిర్దోషని సెషన్స్ కోర్టు తీర్పునిచ్చింది. యావత్ భారతావని ‘సిగ్గుపడింది’. కుంచించుకుపోయింది. కానీ ప్రభుత్వాలు, చట్టం ఇక్కడ మర్చిపోయిన విషయం ఒకటుంది. 1999 తర్వాత 2000 నుంచి మిలీనియమ్‌లో భారతీయ సమాజంలో యువతరం అంతకుముందులా లేరని, టెక్నికల్‌గా ఎదుగుతూ సంఘటిత చైతన్య శక్తిగా సామాజిక మాధ్యమాల్లో ఎదుగు తున్నారని. ఇంటర్నెట్ ద్వారా, మొబైల్ ద్వారా అందరూ ఒకే అభిప్రాయానికి వచ్చి దేశ భవితవ్యాన్ని నిర్ణయించే బలంగా మారుతున్నారని. జెస్సికాలాల్‌ని మనుశర్మ చంపాడని, ఆ కేసులో రాజకీయ నాయకుల ప్రోద్బలం వల్లే దోషులు విడుదలయ్యారని ఎస్సెమ్మెస్‌ల ద్వారా జాతిని, మీడియాని మేలుకొలిపింది యువత. మీడియా సపోర్ట్‌తో సుప్రీంకోర్టుని, అప్పటి ప్రధాని, రాష్ట్రపతిని బలవంతంగా కదిలించింది. ప్రజా ప్రయోజనాల వ్యాజ్యంగా దేశ అత్యున్నత న్యాయస్థానం మూసేసిన కేసును తిరిగి తెరిచేలా, ప్రభుత్వం తలవంచి ఆ దుష్టుడి మెడ వంచేలా వాడికి యావజ్జీవ కారాగార శిక్ష పడేదాకా యువ భారతం కదం తొక్కింది. ఈసారి సాక్ష్యాలను పోలీస్ డిపార్టమెంట్ కాకుండా మీడియా సంపాదించింది. దోషులు ఖైదీలయ్యారు. దేశం ‘గర్వించింది’. ఇది జరిగిన కథ. ఇందులో సిగ్గుపడే ఫస్ట్ హాఫ్ అంతా మరణించిన జెస్సికాది, ఒంటరిగా పోరాడి ఓడిపోయిన ఆమె అక్కది. గర్వించిన సెకండ్ హాఫ్ అంతా మీడియా తరఫున ఒక జర్నలిస్టుది. చైతన్యవంతమైన యువ భారతావనిది. వాటన్నిటికీ చిత్రరూపమే... ‘నో వన్ కిల్డ్ జస్సికా’. 2006లో న్యూస్ పేపర్లో వచ్చిన హెడ్డింగే ఈ సినిమా టైటిల్. అదే ఈ కథని రాసుకోవడానికి దర్శకుడు రాజ్‌కుమార్ గుప్తాని ప్రేరేపించింది. మరణించిన జెస్సికాలాల్గా మైరా కర్ణ్ అనే అమ్మాయి నటిస్తే, ఆమె అక్క సబ్రినాలాల్గా విద్యాబాలన్ జీవించింది. దిగువ, మధ్యతరగతి అమ్మాయి తాలూకు అబలత్వాన్ని, నీరసాన్ని, గమ్యం లేని పోరాటాన్ని, బలహీనతల్ని, అణుచుకున్న ఆవేశాన్ని, నిస్సహాయతని అడుగడుగునా ప్రదర్శించేసింది విద్యాబాలన్. ఈ పాత్రకి పూర్తి విరుద్ధంగా ఆధునిక భారతదేశ వీర వనితగా, సబలగా, ఎదురు లేని జర్నలిస్టుగా మీరా గైటీ అనే పాత్రలో రాణీముఖర్జీ ఈ చిత్రం సెకండ్ హాఫ్‌కి ప్రాణం పోసింది. చాలా ఎలక్ట్రిఫయింగ్ నటన ఆమెది. అందుకే ఆ ఏటి ఫిల్మ్‌ఫేర్ ఉత్తమ సహాయ నటి అవార్డును సొంతం చేసుకుంది. ఒక సమస్యని ప్రతిబింబిస్తే... ఆ కథకుడో, దర్శకుడో దాని పరిష్కారాన్ని తమ మేథస్సుతో సూచించాలి. పరిష్కారం కూడా లభించని దేశ అత్యున్నత సమస్యని తీసేటప్పుడు కథకుడు, దర్శకుడు ప్రేక్షకుల ఆదరణ చూరగొనాలంటే చాలా జాగ్రత్తగా స్క్రిప్టు రాసుకోవాలి. అదే చేశాడు రాజ్‌కుమార్ గుప్తా. ఆ సమస్యని, పరిష్కారాన్ని తక్కువ చూపెట్టి, వాటి మధ్యనున్న పాత్రల డ్రామాని వస్తువుగా తీసుకున్నాడు. అందుకే తెలిసున్న కథే అయినా ప్రేక్షకులు 9 కోట్ల బడ్జెట్‌కి ఆరు రెట్లు కలిపి 58 కోట్ల వసూళ్లిచ్చారు నిర్మాత రోనీ స్క్రూవాలాకి. అమిత్ త్రివేది సంగీతం, అనయ్ గోస్వామి కెమెరా, ఆరతీ బజాజ్ ఎడిటింగ్ మూడూ ఒక వ్యక్తే చేసినంత సింక్‌లో ఉంటాయి ఈ సినిమాకి. అనురాగ్ కశ్యప్ దగ్గర బ్లాక్ ఫ్రైడే, నో స్మోకింగ్ అనే సినిమాలకి అసోసియేట్‌గా పనిచేసిన రాజ్‌కుమార్ గుప్తా దర్శకుడిగా నాలుగు సినిమాలు చేశాడు. కానీ ‘నో వన్ కిల్డ్ జెస్సికా’ మాత్రమే ప్రేక్షకాదరణని చూరగొంది. ఆ దర్శకుడి ప్రతిభని ప్రపంచానికి పరిచయం చేసింది. విద్యాబాలన్‌ని, రాణీముఖర్జీ ఇండియా గేట్ దగ్గిర క్యాండిల్స్‌తో నివాళి అర్పించడానికి రమ్మనే సన్నివేశం నిజంగా నిస్తేజానికి, చైతన్యానికి మధ్య సంఘర్షణ. ఒక పక్క బాధ, మరో పక్క ఆవేశం రెండు పాత్రల ద్వారా, వాటి మధ్య మాటల ద్వారా, బాడీ లాంగ్వేజ్ ద్వారా అద్భుతంగా రాసుకున్నాడు దర్శకుడు. టేకింగ్ పరంగా ఇవాళ్టి సమకాలీన దర్శకులంత బాగా సినిమా ఉండకపోయినా కంటెంట్ బలంగా ఉండటం వల్ల ప్రేక్షకుడు ఆ అంశాన్ని పెద్దగా పట్టించుకోడు. నిజంగా జరిగిన ఘటన కాబట్టి సహజంగానే చిత్రీకరించాడు. ఈ ఘోరానికి సమాజం పట్ల అసహ్యం వేసినా, మళ్లీ యువ సమాజం ఆ తప్పుని సరిదిద్దిన వైనానికి హ్యాట్సాఫ్ చెప్తూ... నవ్య సమాజ నిర్మాణానికి నడుము బిగించి కదం తొక్కే ప్రతి యువతికి, యువకుడికి అభినందనపూర్వక నమస్సుమాలర్పిస్తూ... భారతీయ మహిళకి భద్రత కల్పించాల్సిన బాధ్యత ప్రతి భారతీయుడికీ ఉందని గుర్తు చేస్తూ ముగిస్తున్నాను. -
యోగా వేడుకలకు సర్వం సిద్ధం
ఢిల్లీలో రాజ్‌పథ్ వద్ద వేలాది చాపలను సిద్ధంచేస్తున్న సిబ్బంది. సియాచిన్ గ్లేసియర్ వద్ద యోగాను అభ్యసిస్తున్న సైనికులు నేడు భారత్ సహా 192 దేశాల్లో యోగా దినోత్సవం * రాజ్‌పథ్‌లో ‘రికార్డు’ ఉత్సవాలు.. పాల్గొననున్న మోదీ, కేజ్రీవాల్ * 37 వేల చాపలు, 2,000 సినిమా స్క్రీన్లతో యోగాసనాలకు ఏర్పాట్లు సాక్షి, న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా ఆదివారం జరగనున్న తొలి అంతర్జాతీయ యోగా దినోత్సవాల కోసం భారత్ సిద్ధమైంది. రాజధాని ఢిల్లీలోని రాజ్‌పథ్‌లో ప్రధాని నరేంద్రమోదీ సహా 37 వేల మంది ఆదివారం ఉదయం యోగా చేయనున్నారు. ప్రపంచ వ్యాప్తంగా 192 దేశాల్లోని 251కి పైగా నగరాల్లో యోగా డే నిర్వహించనున్నారు. ఐరాస ప్రధాన కార్యాలయం సహా పలు దేశాల్లో యోగా ఉత్సవాలకు కేంద్ర మంత్రులు సారథ్యం వహించనున్నారు. ఢిల్లీలో రాష్ట్రపతి భవన్ నుంచి ఇండియాగేట్ వరకు రెండున్నర కిలోమీటర్ల మేర గల రాజ్‌పథ్‌లో.. ఉదయం 7 గంటల నుంచి 7:35 గంటల వరకూ యోగా నిర్వహించనున్నారు. రఫీమార్గ్ క్రాసింగ్‌లోని రాజ్‌పథ్ మధ్యలో భారీ వేదిక ఏర్పాటు చేశారు. వేదిక నుంచి ఇండియా గేట్ వరకు కిలోమీటరు పొడవున యోగాసనాల కోసం 37 వేల చాపలు పరిచారు. గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో నమోదు చేయటం లక్ష్యంగా రాజ్‌పథ్‌లో చేపడుతున్న యోగా ఉత్సవాలకు 152 విదేశీ ఎంబసీలను ఆహ్వానించారు. ఆయుష్ మంత్రిత్వశాఖ సమన్వయం చేస్తున్న ఈ యోగా ఉత్సవాలను ప్రజలు తిలకించేందుకు వీలుగా 2,000 భారీ సినిమా స్క్రీన్లను ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది. అంతర్జాతీయ యోగా డేను పురస్కరించుకుని పోస్టల్ శాఖ ముద్రించిన పోస్టల్ స్టాంపులను, ఆర్థికశాఖ ముద్రించిన రూ.10, రూ. 100 బిళ్లలను ఆదివారం రాజ్‌పథ్‌లో జరిగే కార్యక్రమంలో విడుదల చేయనున్నారు. ప్రధాని పాల్గొంటున్న ఈ కార్యక్రమానికి భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. ప్రధాని మోదీ, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, యోగా గురు బాబారాందేవ్ సహా యోగా నిపుణులు ఆసనాలు వేయనున్నారు. సినీ నటులు అమితాబ్ బచ్చన్, అమీర్‌ఖాన్ వంటి ప్రముఖులకు ప్రభుత్వం నుంచి ఆహ్వానాలు వెళ్లాయి. కేంద్ర, రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, త్రివిధ దళాల సిబ్బంది, అధికారులు, ఉద్యోగులు, క్రీడాకారులు, స్వచ్ఛంద సంస్థలు, విద్యార్థులు.. అన్ని వర్గాలకు చెందిన వారు ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఈ యోగా ఉత్సవాలను దూరదర్శన్, పీఐబీ వెబ్సైట్ ద్వారా ప్రత్యక్ష ప్రసారానికి ఏర్పాట్లు చేశారు. అన్ని రాష్ట్రాల్లోనూ ఏక కాలంలో..: లక్నో, కోల్‌కతా, పట్నా తదితర నగరాల్లోనూ భారీ స్థాయిలో యోగా కార్యక్రమాలు నిర్వహించనున్నారు. అన్ని రాష్ట్రాల్లోనూ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఏక కాలంలో నిర్వహించాలని, జిల్లా, పంచాయతీ రాజధానుల్లోనూ కార్యక్రమాలు నిర్వహించాలని అన్ని రాష్ట్రాలకూ సూచించారు. ప్రభుత్వమే కాకుండా పలు సంస్థలు కూడా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. రామ్‌దేవ్ 1,100 కార్యక్రమాలు నిర్వహించనున్నారు. అయితే.. యోగా దినోత్సవంలో యోగాసనాలు వేయడానికి చైనా నుంచి దిగుమతి చేసుకున్న యోగా చాపలను వినియోగించడాన్ని కాంగ్రెస్, ఆప్ పార్టీలు విమర్శించాయి. ‘మేక్ ఇన్ ఇండియా’ నినాదాలిచ్చే ప్రధాని మోదీ ప్రభుత్వం.. తొలి ప్రపంచ యోగా దినోత్సవ వేడుకల్లో ‘మేక్ ఇన్ చైనా’కు ప్రాధాన్యమిచ్చిందని ఎద్దేవా చేశాయి. దేశంలో యోగా ఉత్సవాల కోసం సుమారు రూ. 40 కోట్ల వరకు వ్యయం అయినట్టు తెలుస్తోంది. విదేశాల్లో మంత్రుల నేతృత్వం.. ప్రధాని మోదీగత ఏడాది ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో చేసిన ప్రతిపాదనకు 177 దేశాలు ఆమోదం తెలపటంతో.. జూన్ 21ని అంతర్జాతీయ యోగా దినోత్సవంగా ఐరాస గత ఏడాది డిసెంబర్లో ప్రకటించడం తెలిసిందే. న్యూయార్క్‌లోని ఐరాస ప్రధాన కార్యాలయంలో యోగా దినోత్సవాలకు సారథ్యం వహించేందుకు విదే శాంగ మంత్రి సుష్మాస్వరాజ్ అమెరికా చేరుకున్నారు. ఈ కార్యక్రమం తర్వాత న్యూయార్క్‌లోని టైమ్స్ స్క్వేర్‌లో 30,000 మంది యోగా చేస్తారు. ప్రతి ఒక్కరూ భాగం కావాలి ఆదివారం జరగనున్న తొలి అంతర్జాతీయ యోగా దినోత్సవంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని, ఇతరులు కూడా పాల్గొనేలా ప్రోత్సహించాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీ శనివారం ఒక ప్రకటనలో దేశ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. యోగాపై సర్కారుది నిస్సిగ్గు దురాక్రమణ: కాంగ్రెస్ ప్రాచీన భారత సంస్కృతిలో భాగమైన యోగా ను దురాక్రమించుకుని.. దానిని ప్రచార కార్యక్రమంగా, ప్రజాసంబంధాల కార్యక్రమంగా వాడుకునేందుకు మోదీ ప్రభుత్వం నిస్సిగ్గుగా ప్రయత్నిస్తోందని కాంగ్రెస్ విమర్శించింది. యోగాతో ఆరోగ్య ప్రయోజనాలు అంటూ ప్రచారం చేస్తున్న కేంద్రం.. ఆరోగ్య రంగానికి బడ్జెట్ కేటాయింపులను తగ్గించటమే కాక.. 2013-14లో రూ. 1,069 కోట్లుగా ఉన్న యోగా బడ్జెట్ కేటాయింపులను ఈ ఏడాది కేవలం రూ. 318 కోట్లకు తగ్గించటం ఏమిటని ఓ ప్రకటనలో ప్రశ్నించింది. మాజీ ప్రధాని జవహర్‌లాల్‌నెహ్రూ యోగా చేస్తున్న ఫొటోతో పాటు.. ఎవరైనా దేనినైనా తాము ఆచరించాకే ఇతరుల నుంచి ఆ ఆచరణను ఆశించాలని చెప్పే గాంధీ సూక్తితో కూడిన గాంధీ ఫొటోను విడుదల చేసింది. -
ఇండియా గేట్ వద్ద ఉరేసుకున్నాడు
న్యూఢిల్లీ: భారత రాజధానిలోని ఇండియా గేట్ వద్ద ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇండియా గేట్‌కు సమీపంలోని ఓ పార్క దగ్గర ఉన్న చెట్టుకు ఉరేసుకుని చనిపోయాడు. అతడు ఈ అఘాయిత్యానికి సోమవారం తెల్లవారు జామున మూడు నుంచి ఐదుగంటల ప్రాంతంలో పాల్పడినట్లు పోలీసులు చెప్తున్నారు. వివరాల్లోకి వెళ్లగా.. పశ్చిమ ఢిల్లీలోని నాంగ్లోయి అనే ప్రాంతానికి చెందిన శేషనాథ్ (31) అనే వ్యక్తి జన్‌పథ్‌కు వెళ్లే దారిలో ఇండియా గేట్‌కు సమీపంలో ఉన్న పార్క్‌లోని చెట్టుకు ఉరేసుకుని వేలాడుతూ కనిపించాడని చెప్పారు. కొందరు సమాచారం అందిండచడంతో వెళ్లి చూడగా అతడు అప్పటికే మరణించాడని తెలిపారు. జేబులో ఒక్క ఐడెంటీ కార్డు తప్ప స్యూసైడ్ నోట్ కనిపించలేదని, ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉందని చెప్పారు. -
అమర వీరులకు ప్రధాని మోదీ నివాళి
-
లక్ష వాట్సప్ మెసేజిలు.. ఓ పాప ఆచూకీ
ఝాన్వి.. ఈ పేరు గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారం అయ్యింది. ఆమె ఫొటో కూడా విస్తృతంగా షేర్ అయ్యింది. ఇంతకీ ఆమె ఎవరో సెలబ్రిటీ అనుకుంటున్నారా.. కాదు. న్యూఢిల్లీలోని ఇండియా గేట్ వద్ద తన అమ్మానాన్నలతో కలిసి వెళ్లి.. సెప్టెంబర్ 28వ తేదీన తప్పిపోయిన మూడేళ్ల పాప. ఆమె ఆచూకీని తెలుసుకోడానికి ఉపయోగపడిన ఏకైక సాధనం.. సోషల్ మీడియా. చిన్నారి ఝాన్వి ఫొటోను పంపి.. ఈమె ఎక్కడైనా కనపడితే ఫలానా నెంబరుకు ఫోన్ చేయించాలన్న మెసేజి వాట్సప్‌లో లక్ష సార్లు షేర్ అయ్యింది. ఫేస్బుక్లో ఆమె ఆచూకీ కనుక్కొనేందుకు ఒక ప్రత్యేక పేజీ ప్రారంభించారు. దాంతో దాదాపు వారం రోజుల తర్వాత అక్టోబర్ 5వ తేదీన ఆమె ఢిల్లీలోని జనక్‌పురి ప్రాంతంలో కనిపించింది. అప్పటికి ఆమెకు గుండు చేసి, మెడలో ఆమె పేరుతో ఒక ప్లకార్డు వేలాడుతూ ఉంది. ఝాన్వి మేనమామ తరుణ్ గ్రోవర్ ఈ వెతుకులాట గురించి వివరించారు. తాము మొత్తం పది మంది అన్నదమ్ములు, అక్కచెల్లెళ్లం ఉన్నామని, అంతా బృందాలుగా విడిపోయి వెతికామని అన్నారు. హోం మంత్రి దగ్గర నుంచి అందరినీ కలిశామని, పోలీసులతో కూడా సమన్వయం చేసుకున్నామని తెలిపారు. చివరకు సోషల్ మీడియాను ఆశ్రయించామన్నారు. అయితే ఎవరికి వాళ్లు షేర్ చేయాలంటే కష్టం కాబట్టి ఫేస్బుక్, వాట్సప్‌లకు తాము డబ్బు చెల్లించి ప్రకటనలా ఈ మెసేజి పంపామని, వాట్సప్‌లో అయితే లక్ష మెసెజిలు వెళ్లాయని ఆయన వివరించారు. అయితే మరీ ఇంతలా ప్రచారం చేస్తే పాపకు ఏదైనా అపాయం తలపెట్టే అవకాశం ఉందని కూడా పోలీసులు ఓ సమయంలో భయపడ్డారు. అయితే, ఝాన్విని ఎత్తుకెళ్లినవాళ్లు డబ్బు మాత్రం డిమాండు చేయలేదు. బహుశా పిల్లలు లేనివాళ్లు తీసుకెళ్లి ఉంటారని, ఆమెను గుర్తుపట్టకుండా ఉండేందుకు గుండు చేశారేమోనని పోలీసులు భావిస్తున్నారు. అయితే అన్ని మీడియాల్లో పాప ఫొటో బాగా ప్రచారం కావడంతో భయపడి వదిలేసి ఉంటారని అదనపు కమిషనర్ త్యాగి చెప్పారు. -
వారం తర్వాత ఇంటికి
న్యూఢిల్లీ: అటు పోలీసు శాఖ అధికారులతోపాటు కుటుంబసభ్యులను తీవ్ర గందరగోళానికి గురిచేసిన చిన్నారి జాహ్నవి ఆహుజా ఆదివారం రోజుల తర్వాత ఇంటికి చేరుకుంది. దీంతో జాహ్నవి కుటుంబసభ్యుల ఆనందానికి అంతేలేకుండాపోయింది. ఈ విషయమై జాహ్నవి తండ్రి రాజేశ్ ఆహుజా సోమవారం మీడియాతో మాట్లాడుతూ ‘ఇంటికొచ్చిన వెంటనే అందరినీ గమనించిన జాహ్నవి నాన్నా అంటూ నన్ను పిలిచింది. ఏడవడం ప్రారంభించింది. ఆ తరువాత ఓ అడుగు ముందుకేసి నా ఒడిలో వాలిపోయింది. మాకు ఒకటే అమ్మాయి. దానికి ఫ్రూటీ అంటే ఎంతో ఇష్టం. ఇంటిలోకి రాగానే తింటానికి ఏదో ఒకటి ఇచ్చా’ అని అన్నాడు. ప్రస్తుతం తిండి బాగానే తింటోందని, బాగానే ఆడుకుంటోందని, రాత్రి బాగా నిద్రపోయిందన్నాడు. కాగా జాతీయ రాజధాని నడిబొడ్డునగల ఇండియా గేట్ వద్ద జాహ్నవి వారం క్రితం తప్పిపోయిన సంగతి విదితమే. జాహ్నవిని వెంటబెట్టుకుని ఆదివారం సాయంత్రం సరదాగా కుటుంబసభ్యులంతా ఇండియాగేట్ వద్దకు వచ్చారు. అయితే రాత్రి తొమ్మిది గంటల సమయంలో జాహ్నవి కనిపించలేదు. దీంతో కుటుంబసభ్యులు తిలక్‌మార్గ్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కిడ్నాప్ కేసు నమోదు చేశారు. అనంతరం నగర పోలీసు విభాగం సిబ్బందితోపాటు క్రైంబ్రాంచ్, స్పెషల్ సెల్‌కుచెందిన బృందాలు జాహ్నవి ఆచూకీ కోసం గాలింపు చర్యలను చేపట్టిన సంగతి విదితమే. ఇండియాగేట్ వద్ద తప్పిపోయిన మూడేళ్ల పసిపాప జాహ్నవి ఆచూకీ కనుగొన్నవారికి రూ. 50 వేల నగదు బహుమతిని అందజేస్తామంటూ నగర పోలీస్ కమిషనర్ భీంసేన్ బసి ప్రకటించిన సంగతి కూడా తెలిసిందే. కాగా ఆదివారం సాయంత్రం జాహ్నవి నగరంలోని మాయాపురి పోలీస్‌స్టేషన్ సమీపంలో ధీరేందర్ అనే ఓ కళాశాల విద్యార్థి కంటపడింది. ఆ సమయంలో పాప మెడలో ఆమె పేరుతోపాటు ఓ ఫోన్ నంబర్ ఉండడాన్ని గమనించిన ఆ విద్యార్థి పోలీసులకు సమాచారం అందించాడు. రంగంలోకి దిగిన పోలీసులు జాహ్నవిని వారి కుటుంబసభ్యులకు అప్పగించారు. నిందితులింకా పరారీలోనే... జాహ్నవిని అపహరించిన వ్యక్తులు ఇప్పటి కీ పరారీలోనే ఉన్నారు. అపహరణ అనంతర పరిణామాల క్రమాన్ని గుర్తించేందుకు యత్నిస్తున్నామని సంబంధిత అధికారి ఒకరు తెలియజేశారు. ఇంటికొచ్చే సమయానికి జాహ్నవి ఒంటిపై గల్లంతైన సమయంలో ధరించిన దుస్తులే ఉన్నాయి. నిందితులు జాహ్నవిని మురికిప్రదేశంలో ఉంచలేదని, కొట్టడం వంటివి చేయలేదని, పాపశరీరంపై ఎటువంటి గాయాలూ కనిపించలేదని ఆయన వివరించారు. -
‘చెత్తశుద్ధి’ లేని వీఐపీలు
ప్రధానమంత్రి నరేంద్రమోదీ అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన కార్యక్రమం స్వచ్ఛభారత్. దేశాన్ని పరిశుభ్రమైన భారత్‌గా తీర్చిదిద్దాలనేది ఆయన లక్ష్యం. అయితే ఇండియా గేట్ వద్ద నిర్వహించిన ప్రారంభ కార్యక్రమానికి అతిథులుగా హాజరైన వీఐపీలకు స్వచ్ఛ భారత్ స్ఫూర్తి అర్థం అయినట్టు కనిపించలేదు. ఈ కార్యక్రమం పూర్తయిన అనంతరం వీరంతా తమ సీట్ల వద్దే ఖాళీ వాటర్ బాటిళ్లు, కరపత్రాలను వదిలేశారు. వారికి సమీపంలోనే భారీ డస్ట్ బిన్ను నిర్వాహకులు ఏర్పాటు చేసినా ఎవరూ దానిని పట్టించుకోలేదు. కార్యక్రమం పూర్తయిన వెంటనే మోదీ వెంట వెళ్లేందుకు తొందరపడిన వీఐపీలు చెత్తను అక్కడే వదిలేశారు. చెత్తను వేసేందుకు ఏర్పాటు చేసిన డస్ట్ బిన్ కిందపడి.. అందులోని వ్యర్థాలు, ఖాళీ వాటర్ బాటిళ్లు బయటపడి ఆ ప్రదేశమంతా చిందరవందరగా తయారైంది. స్వచ్ఛ భారత్ కార్యక్రమానికి మద్దతిచ్చేందుకు బాలీవుడ్ నటుడు ఆమిర్‌ఖాన్ వచ్చిన సమయంలో వీవీఐపీ, మీడియా ఎన్‌క్లోజర్‌లో గందరగోళం చెలరేగింది. ఆమిర్‌ను కలిసేందుకు మీడియా ప్రతినిధులు, సీనియర్ అధికారులు ప్రయత్నించడంతో ఒక దశలో తొక్కిసలాట జరుగుతుందేమో అన్న పరిస్థితి నెలకొంది. స్వచ్ఛ భారత్ ప్రారంభోత్సవంలో స్కూలు విద్యార్థులే ప్రత్యేక ఆకర్షణ. వివిధ ప్రభుత్వ పాఠశాలల నుంచి 5 వేల మంది విద్యార్థులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. వీరంతా మోదీతో పాటు స్వచ్ఛతా ప్రతిజ్ఞ చేయడమే కాక.. ఆయన చెప్పిన పరిశుభ్రతా సూచనలను పాటిస్తూ అందరినీ ఆకర్షించారు. కార్యక్రమం సాగినంత సేపూ విద్యార్థులు మూడు రంగుల బెలూన్లు, రంగురంగుల పోస్టర్లు చేత పట్టుకుని హంగామా చేశారు. దక్షిణాది నుంచి వచ్చినవారికి హిందీలో చెప్పిన స్వచ్ఛతా సందేశం అర్థం కాలేదని, అందువల్ల తాను ఇంగ్లిష్‌లో ప్రసంగిస్తానని కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రి వెంకయ్యనాయుడు చెప్పడంతో సభికులంతా చప్పట్లు కొట్టారు. స్వచ్ఛ భారత్... యూపీఏ పథకమే: స్వచ్ఛ భారత్ పథకం కొత్తదేమీ కాదని సీనియర్ కాంగ్రెస్ నేత, మాజీ కేంద్ర ఆర్థిక మంత్రి పి. చిదంబరం చెప్పుకొచ్చారు. యూపీఏ హయాంలో చేపట్టిన నిర్మల్ భారత్ అభియాన్ పేరు మార్చి మోదీ సర్కారు స్వచ్ఛ భారత్‌ను ప్రారంభించిందన్నారు. ఈ పథకాన్ని కేంద్రం వాస్తవిక కోణంలో అమలు చేయాలని లేకుంటే ఇది ఫొటో ప్రదర్శనగా మారవచ్చని కాంగ్రెస్ ప్రతినిధి అభిషేక్ సింఘ్వీ పేర్కొన్నారు. -
‘స్వచ్ఛ భారత్’కు నేడే శ్రీకారం
ఢిల్లీలో లాంఛనంగా ప్రారంభించనున్న ప్రధాని మోదీ ఐదేళ్లలో దేశాన్ని పరిశుభ్రంగా తీర్చిదిద్దడమే లక్ష్యం రాజ్‌పథ్ మార్గంలో రిపబ్లిక్ డే తరహా భద్రతా ఏర్పాట్లు ‘స్వచ్ఛతా ప్రతిజ్ఞ’ చేయనున్న 31 లక్షల మంది కేంద్ర ఉద్యోగులు న్యూఢిల్లీ: రిపబ్లిక్ డే భద్రతా ఏర్పాట్లను పోలిన అసాధారణ భద్రత నడుమ ప్రధాని నరేంద్ర మోదీ తన మదిలో మెదిలిన ‘స్వచ్ఛ భారత్’ కార్యక్రమాన్ని గురువారం గాంధీ జయంతిని పురస్కరించుకొని ఢిల్లీలోని ఇండియా గేట్/రాజ్‌పథ్ మార్గం లో లాంఛనంగా ప్రారంభించనున్నారు. గాంధీజీ కలలుగన్న పరిశుభ్ర భారతావనిని వచ్చే ఐదేళ్లలో సాధించడమే లక్ష్యంగా చేపట్టనున్న ఈ కార్యక్రమంలో మోదీ స్వయంగా చీపురుపట్టనున్నారు. పరిశుభ్రతను జాతీయ ఉద్యమంగా చేపట్టాలని ప్రజలకు పిలుపునివ్వనున్నారు. ఈ సందర్భంగా నడక పోటీని జెండా ఊపి ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమానికి భద్రతాపరంగా ఎటువంటి అవరోధాలు ఎదురుకారాదన్న ఉద్దేశంతో భద్రతా దళాలు ఉపరితలం నుంచి గగనతలం వరకూ పహారా కాయనున్నాయి. ఢిల్లీ నగరాన్ని బుధవారమే తమ అధీనంలోకి తీసుకున్నాయి. రాజ్‌పథ్ చుట్టుపక్కల ఉన్న అన్ని ప్రభుత్వ కార్యాలయాలను మధ్యాహ్నం 1 గంటకల్లా ఖాళీ చేయించి మూసేశాయి. కార్యక్రమం జరిగేంత సేపూ జాతీయ భద్రతా దళానికి చెందిన స్నైపర్లు (షార్ప్ షూటర్లు) ప్రభుత్వ భవనాలపై గస్తీ కాస్తారు. ఎన్ఎస్జీకితోడు పారామిలిటరీ, ఢిల్లీ పోలీసు కమాండోలు యాంటీ-ఎయిర్‌క్రాఫ్ట్ తుపాకులు, మొబైల్ బృందాలతో అనుక్షణం కాపలా కాస్తారు. ఈ కార్యక్రమంలో సుమారు 5 వేల మంది స్కూలు విద్యార్థులతోపాటు ప్రభుత్వాధికారులు, కార్పొరేట్ కంపెనీల ప్రతినిధులు, కాలేజీల విద్యార్థులు పాల్గొంటారు. కార్యక్రమం ప్రారంభానికి ముందు మోదీ రాజ్‌ఘాట్‌లోని గాంధీజీ సమాధి వద్ద నివాళులర్పించి ఆ తర్వాత దళిత కాలనీని సందర్శిస్తారు. స్వచ్ఛభారత్‌పై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు గత కొన్ని రోజులుగా కేంద్ర మంత్రులంతా చీపుర్లు పట్టారు. 31 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల ప్రతిజ్ఞ ‘స్వచ్ఛ భారత్’ కార్యక్రమంలో భాగంగా దాదాపు 31 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు పరిశుభ్ర భారతావని లక్ష్యం కోసం పాటుపడతామని ప్రమాణం చేస్తారు. కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల్లో ఏర్పాటు చేసే కార్యక్రమాల్లో ఉద్యోగుల చేత అధికారులు ‘స్వచ్ఛతా శపథ్’ (పరిశుభ్రత ప్రతిజ్ఞ) చేయించ నున్నారు. కేంద్ర హోంశాఖ కార్యదర్శి అనిల్ గోస్వామి ఉద్యోగుల చేత ‘నార్త్ బ్లాక్’ ఆవరణలో ప్రమాణం చేయించనున్నారు. ఈ కార్యక్రమంలో పాలుపంచుకోవాల్సిందిగా అన్ని రాష్ట్రాల ప్రభుత్వ ఉద్యోగులను కేంద్రం కోరింది. మరోవైపు ‘స్వచ్ఛ భారత్’ ఉద్యమాన్ని జాతీయ ఆకాంక్షగా చేపట్టాలని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. స్వచ్ఛ విద్యాలయ ప్రచార పుస్తకం విడుదల స్కూలు ప్రాంగణాలను పరిశుభ్రంగా ఉంచేందుకు విద్యార్థులు పాటించాల్సిన పద్ధతులను వివరించే స్వచ్ఛ భారత్-స్వచ్ఛ విద్యాలయ ప్రచార పుస్తకాన్ని కేంద్ర మానవవనరుల అభివృద్ధిశాఖ మంత్రి స్మృతి ఇరానీ బుధవారం ఢిల్లీలో విడుదల చేశారు. స్వచ్ఛమైన మంచినీరు, పరిశుభ్రమైన టాయ్లెట్ల కోసం ఆచరించాల్సిన విషయాలను ఇందులో పొందుపరిచారు. మరోవైపు స్వచ్ఛ భారత్ ప్రచారంలో భాగంగా ప్రభుత్వరంగ సంస్థలైన కోల్ ఇండియా, ఎన్టీపీసీ ఏడాది వ్యవధిలో 50 వేల టాయ్లెట్లను నిర్మించనున్నాయి. ఇది ప్రజా ఉద్యమం: వెంకయ్య నాయుడు న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా చేపట్టనున్న స్వచ్ఛ్ భారత్ అభియాన్ కేవలం ప్రభుత్వ కార్యక్రమంగా కాకుండా ఓ ప్రజా ఉద్యమంగా చేయడమే తమ ఉద్దేశమని కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ మంత్రి ఎం వెంకయ్యనాయుడు తెలిపారు. బుధవారం ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ మన ఇళ్లలో, పరిసరాల్లో, కార్యాలయాల్లో పరిశుభ్రత కోసం వారానికి2 గంటలు కేటాయిద్దామన్న ప్రతిజ్ఞను ప్రధాని మోదీ ప్రజలతో చేయిస్తారన్నారు. పరిశుభ్రతతోనే అభివృద్ధి: అశోక్ గజపతి పరిసరాలు పరిశుభ్రంగా ఉంటేనే అభివృద్ధి సాధ్యమవుతుంద ని పౌరవిమానయానశాఖ మంత్రి అశోక్‌గజపతిరాజు అన్నా రు. దేశం, రాష్ట్రం, పురపాలక సంఘాలు, గ్రామాలను శుభ్రం చేసుకుంటుంటే దేశమంతా శుభ్రంగా ఉంటుందన్నారు. -
ఇండియా గేట్ వద్ద రెండున స్వచ్ఛ్ భారత్ ప్రతిజ్ఙ
సాక్షి, న్యూఢిలీ: వచ్చే నెల రెండో తేదీన ఇండియా గేట్ వద్ద ‘స్వచ్ఛ్ భారత్ ప్రతిజ్ఙ’ కార్యక్రమం జరగనుంది. ఇందులోభాగంగా ప్రధానమంత్రి నరేంద్రమోడీతో పాటు బీజేపీ నేతలు అధికారులు దేశాన్ని పరిశుభ్రంగా తీర్చిదిద్దుతామంటూ ప్రతిజ్ఞ చేయనున్నారు. స్వచ్ఛ్ భారత్ మిషన్ ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకుని ఇండియా గేట్ వద్ద మారథాన్‌తోపాటు గాలిపటాలను ఎగురవేసే కార్యక్రమాన్ని నిర్వహించడం కోసం పట్టణ అభివృద్ధి మంత్రిత్వశాఖ ఏర్పాట్లు చేస్తోంది. ప్రతిష్టాత్మంగా నిర్వహించే ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసే బాధ్యతను రాష్ట్ర బీజేపీ శాఖ స్వీకరించింది. వీలైనంత ఎక్కువ మంది ఈ కార్యక్రమంలో పాల్గొనేవిధంగా చేయడం కోసం ఆ పార్టీ నేతలు శ్రమిస్తున్నారు. ఇండియా గేట్ వద్దకు కనీసం 15 వేల మందిని చేర్చాలని యోచిస్తున్నారు. బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, కౌన్సిలర్లు, కార్యకర్తలు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం కోసం ప్రజలకు దీనిపై అవగాహన కల్పిస్తున్నారు. జిల్లా మండల స్థాయిలలో కార్యకర్తల సమావేశాలు జరుగుతున్నాయి. వీలైనంత ఎక్కువమంది యువత ఈ కార్యక్రమంలో పాల్గొనేవిధంగా చూడాలని బీజేపీ నేతలు కార్యకర్తలను కోరుతున్నారు. మరోవైపు వాల్మీకీ బస్తీలో స్వచ్చ్ భారత్ మిషన్ కోసం ఏర్పాట్లు జోరుగా జరుగుతున్నాయి. ఈ కాలనీలో ఇప్పటికే మరమ్మతు పనులు మొదలయ్యాయి. శిథిలావస్థలో ఉన్న రోడ్డు డివైడర్‌కు మరమ్మతులు చేశారు. ఇక్కడే ఉన్న పార్కులో గడ్డి కత్తిరించే పని కూడా ఇప్పటికే పూర్తి చేశారు. 300 కుటుంబాలు నివసించే ఈ కాలనీలో ప్రతి ఒక్కరూఎంతో ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారని రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ (ఆర్డబ్ల్యూఎస్) సభ్యుడు ప్రధాన్ వీరేంద్ర రాజ్‌పుత్ తెలిపారు. 20 మంది బీజేపీ కార్యకర్తలతో కలిసి ప్రధాని మోడీ వాల్మీకీ మందిర్ వద్ద చీపురు పడతారని అంటున్నారు. ఈ ఆలయం పక్కనే మహ్మాత్మా గాంధీ నివసించిన గది కూడా ఉంది. ఇక్కడ గాంధీజీ 214 రోజులు గడిపారు .ఆ సమయంలో ఆయన వాల్మీకీ వర్గానికి చెందిన పిల్లలకు చదువు చెప్పారు. నరేంద్ర మోడీ ఆ రోజున మహాత్మా గాంధీ గదిని సందర్శించడంతో పాటు డీఆర్డీఓ టెక్నాలజీతో నిర్మించిన మరుగుదొడ్డిని కూడా ప్రారంభిస్తారు. వికలాంగులకు కూడా అనువుగా ఉండే డిజైన్‌తో కూడిన ఈ టాయిలెట్ నిర్మాణ పనులు ప్రసుతం జోరుగా జరుగుతున్నాయి. కేంద్ర మంత్రులు వెంకయ్యనాయుడు, నితిన్ గడ్కరీ కూడా ఎన్డీఎంసీ ఏరియాలో వేర్వేరు చోట్ల జరిగే పారిశుధ్య కార్యక్రమాలలో పాల్గొంటారు. ఏడుగురు బీజేపీ ఎంపీలు కూడా తమ తమ పార్లమెంటరీ నియోజకవర్గాల పరిధిలో పారిశుధ్య కార్యక్రమాలను ప్రారంభిస్తారు. -
రూ.105 కోట్లతో నూతన ప్రకాశం భవనం
ఒంగోలు టౌన్: జిల్లాకే తలమానికంగా నూతన ప్రకాశం భవనం నిర్మించేందుకు ప్రభుత్వం 105 కోట్ల రూపాయలు మంజూరు చేసిందని కలెక్టర్ జీఎస్ఆర్కేఆర్ విజయకుమార్ వెల్లడించారు. మూడేళ్లలో నూతన ప్రకాశం భవనం నిర్మించేలా ప్రణాళికలు రూపొందించాలన్నారు. స్థానిక కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో శుక్రవారం అధికారులతో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రస్తుతం ఉన్న కలెక్టరేట్, దానికి ఎదురుగా ఉన్న ప్రభుత్వ కార్యాలయాల సముదాయంలో వంద అడుగుల ఎత్తులో ఇండియా గేట్ నమూనాలో రెండు కాంప్లెక్స్‌లను అనుసంధానం చేస్తారన్నారు. 60 ప్రభుత్వ శాఖల కార్యాలయాలు, సువిశాలమైన మీటింగ్ హాల్ మొత్తం 8 ఎకరాల్లో ఒకే ప్రాంతంలో ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కొత్తపట్నం రోడ్డులోని అల్లూరు ప్రాంతంలో 15 ఎకరాల స్థలంలో స్టేడియం నిర్మించేందుకు పరిశీలించాలన్నారు. రూ.15 కోట్లతో నగరంలో అభివృద్ధి పనులు: ఒంగోలు నగరంలో 15 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేపట్టేందుకు ప్రణాళికలు రూపొందించాలని కలెక్టర్ జీఎస్ఆర్కేఆర్ విజయకుమార్ ఆదేశించారు. ఒంగోలు నగరపాలక సంస్థ కార్యాలయాన్ని 7 కోట్ల రూపాయలతో ఐదంతస్తుల్లో నిర్మించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. కార్పొరేట్ కార్యాలయాలకు దీటుగా రానున్న 20ఏళ్లకు సరిపోయేలా నిర్మించాలన్నారు. అలాగే ఊరచెరువు ప్రాంతంలో కన్వెన్షన్ హాలు నిర్మించేందుకు ప్రతిపాదనలు తయారు చేయాలని ఆదేశించారు. 3 కోట్ల రూపాయలతో నెల్లూరు బస్టాండు కళా ప్రాంగణంలో అంబేద్కర్ క్షేత్రాన్ని నిర్మించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ఇప్పటికే ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ నుండి నిధులు మంజూరయ్యాయని చెప్పారు. రంగారాయుడు చెరువు తూర్పువైపు రోడ్డును 100 అడుగుల రోడ్డుగా, దక్షిణం వైపు మంగమూరు రోడ్డును 100 అడుగుల రోడ్డుగా అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. 15 ప్రాంతాల్లో ఎన్టీఆర్ సుజల పథకం:ఒంగోలు నగరంలో ఎన్టీఆర్ సుజల స్రవంతి పథకాన్ని ఏర్పాటు చేసేందుకు 15 ప్రాంతాలను గుర్తించామని కలెక్టర్ వెల్లడించారు. ఒక్కో ఆర్ఓ ప్లాంట్‌ను 3 లక్షల 60 వేల రూపాయలతో నిర్మిస్తారన్నారు. వీటిని దాతల సహకారంతో త్వరలో ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. ఒక్కో కుటుంబానికి 2 రూపాయలకే 20 లీటర్ల తాగునీరు అందిస్తారన్నారు. ఒంగోలు నగరంలోని ఆర్టీసీ బస్టాండు, రిమ్స్ హాస్పిటల్ వద్ద అన్నా క్యాంటిన్లు ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సమావేశంలో ఒంగోలు శాసనసభ్యుడు దామచర్ల జనార్దన్‌రావు, కొండపి శాసనసభ్యుడు బాలవీరాంజనేయస్వామి, ఒంగోలు ఆర్డీవో ఎంఎస్ మురళి, ఒంగోలు నగర పాలక సంస్థ కమిషనర్ సీహెచ్ విజయలక్ష్మి, ఒంగోలు తహసీల్దార్ మూడమంచు వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. తొలుత నగరంలో చేపట్టనున్న అభివృద్ధి పనులకు సంబంధించిన వివరాలను కలెక్టర్ పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరించారు. -
త్రివర్ణ శోభ
సాక్షి, న్యూఢిల్లీ: గణతంత్ర వేడుకలను పురస్కరించుకొని రాజ్‌పథ్‌ను మూడు రంగుల జెండాలతో అలంకరిం చారు. ఎటు చూసినా మువ్వన్నెల రెపరెపలతో రైసినాహిల్స్ ప్రాంతం శోభాయమానంగా మారిపోయింది. రాష్ట్రపతిభవన్, నార్త్‌బ్లాక్, సౌత్‌బ్లాక్,పార్లమెంట్ భవనాలను విద్యుత్‌దీపాలతో అలంకరిం చారు. గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ఎలాంటి అపశ్రుతి చోటు చేసుకోకుండా సాయుధ బలగాలు డేగకళ్లతో పహారా కాస్తున్నాయి. ఇండియాగేట్తోసహా రాజ్‌పథ్ మార్గానికి ఇరువైపులా ఏర్పాటు చేసిన గ్యాలరీలను అనువణుకు తనికీ చేశారు. రాత్రి వేళ ల్లో తిరిగే వాహనాలను క్షణ్ణంగా తనిఖీ చేసిన తర్వా తే వదులుతున్నారు. ఇప్పటికే సెంట్రల్ ఢిల్లీతోపాటు పలు ప్రాంతాలను పోలీసు బలగాలు అదుపులోకి తీసుకున్నాయి. పలుచోట్ల ట్రాఫిక్ ఆంక్షలు.. గణతంత్య్ర దినోత్సవంగా సందర్భంగా నిర్వహించనున్న వేడుకలతో పలు రూట్లలో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్టు ట్రాఫిక్ జాయింట్ సీపీ అనిల్‌శుక్లా తెలిపారు. ఆదివారం ఉదయం 9.50 గంటలకు పరేడ్ విజయ్‌చౌక్ నుంచి రాజ్‌పథ్, ఇండియాగేట్, తిలక్‌మార్గ్, బహదూర్ షాజాఫర్ మార్గ్, నేతాజీ సుభాష్ మార్గ్ మీదుగా ఎర్రకోట చేరుకుంటుందన్నారు. ఈ ప్రాంతాల్లో ట్రాఫిక్ నిషేధం... కౌటిల్యమార్గ్, ఔరంగజేబ్ రోడ్ క్యూ పాయింట్, హుమాయున్రోడ్, సుబ్రహ్మణ్య భారతిమార్గ్, మధురరోడ్, భగవాన్దాస్రోడ్, ఫిరోజ్‌షారోడ్, విన్డ్సర్ప్లేస్, అశోకరోడ్, బాబా కడక్‌సింగ్ మార్గ్, మధర్ థెరిస్సా క్రిసెంట్, సర్దార్‌పటేల్ మార్గ్‌ల్లో ట్రాఫిక్ నిషేధం అమలులో ఉంటుంది. కేవ లం అనుమతి ఉన్న వాహనాలను మాత్రమే ఉదయం ఆరుగంటల నుంచి 12.30 వరకు అనుమతిస్తారని సంబంధిత అధికారి ఒకరు తెలిపారు. న్యూఢిల్లీ రైల్వే స్టేషన్‌కి వెళ్లేందుకు.. సౌత్ ఢిల్లీ నుంచి: మధర్‌థెరిస్సా క్రిసెంట్-ఆర్ఎమ్ఎల్ హాస్పిటల్-బాబా కడక్‌సింగ్ మార్గ్-ఔటర్ సర్కిల్ కన్నాట్‌ప్లేస్-చెమ్స్‌ఫోర్డ్ రోడ్ మీదుగా పహార్గంజ్వైపు, అజ్మీర్గేట్వైపునకు మింట్‌రోడ్, భావ్బుతిమార్గ్ మీదుగా వెళ్లొచ్చు. నార్త్ ఢిల్లీ నుంచి: జండేవాలన్ వయా రాణిఝాన్సీ రోడ్డు,డీబీరోడ్,షీలాసినిమారోడ్, పహార్గంజ్ మీదుగా వెళ్లొచ్చు. ఈస్ట్ ఢిల్లీ నుంచి: బోలీవర్డ్రోడ్ వయా ఐఎస్బీటీ బ్రిడ్జి మీదుగా రాణిఝాన్సీ రోడ్-జండేవాలన్,డీబీ.గుప్తా రోడ్-షీలాసినిమా రోడ్-పహార్గంజ్ మీదుగా వెళ్లొచ్చు. పాత ఢిల్లీ రైల్వే స్టేషన్‌కి వెళ్లేందుకు... సౌత్ ఢిల్లీ నుంచి: రింగ్‌రోడ్-ఆశ్రమ్‌చౌక్-సరాయికలేఖాన్-రింగ్‌రోడ్-రాజ్‌ఘాట్-రింగ్‌రోడ్-చౌక్యమునా బజార్-ఎస్పీ.ముఖర్జీ మార్గ్-చత్తర్రైల్-కరాయిబ్రిడ్జిమీదుగా వెళ్లొచ్చు. నార్త్ ఢిల్లీ నుంచి: బోలీవర్డ్ రోడ్-మోరీగేట్,పుల్డుఫ్రిన్-ఎస్పీ.ముఖర్జీమార్గ్ మీదుగా వెళ్లొచ్చు. -
ఇండియా గేట్ వద్ద క్వీన్స్ బ్యాటన్
న్యూఢిల్లీ: భారత్‌కు చేరుకున్న గ్లాస్గో కామన్వెల్త్ గేమ్స్ బ్యాటన్‌ను ప్రతిష్టాత్మక ఇండియా గేట్ వద్ద శనివారం ప్రదర్శించారు. డిస్కస్ త్రోయర్ కృష్ణ పూనియా, షూటర్ సమరేశ్ జంగ్, వెయిట్ లిఫ్టర్ కత్తుల రవికుమార్, రెజ్లర్లు యోగేశ్వర్ దత్, అమిత్ కుమార్, అనిల్ కుమార్, అనితా తొమర్, హాకీ ప్లేయర్లు శ్రీజేష్, రఘునాథ్, సునీల్ బ్యాటన్‌ను ఇక్కడికి తీసుకొచ్చారు. శుక్రవారం రాత్రి భారత్‌కు చేరుకున్న బ్యాటన్‌ను శనివారం ఉదయం ఆగ్రాకు తీసుకెళ్లారు. గంటపాటు తాజ్‌మహల్ వద్ద ఉంచి.. ఆ తర్వాత తిరిగి ఢిల్లీ తీసుకొచ్చారు. -
‘గేట్’ తెరుచుకుంది!
సాక్షి, న్యూఢిల్లీ: సందర్శకులు లేక వెలవెలబోయిన ఇండియాగేట్ పరిసరాలు ఇకపై జనకళ సంతరించుకోనున్నాయి. ఢిల్లీవాసులతోపాటు, రాజధాని పర్యటనకు వచ్చే సందర్శకులు ఎంతో ఇష్టపడే ఇండియాగేట్ పరిసరాల్లో గత కొద్ది నెలలుగా నిషేదాజ్ఞలు అమలులో ఉన్న విషయం తెలిసిందే. డిసెంబర్ 16 నిర్భయ ఘటన తర్వాత ఉవ్వెత్తున ఎగసిన ఉద్యమం, ఇండియాగేట్ పరిసరాల్లో చెలరేగిన ఆందోళనలతో పోలీసులు ఈ ప్రాంతంలో అనేక ఆంక్షలు అమలులోకి తెచ్చారు. సందర్శకులకు అనుమతి నిరాకరిస్తూ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. దీంతో దాదాపు పది నెలలుగా ఈ పరిసరాల్లో సందర్శకుల సందడి పూర్తిగా తగ్గిపోయింది. శాంతిభద్రతల పరిస్థితి కాస్త మెరుగుపడడంతో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు సందర్శకులకు అనుమతిస్తూ ఢిల్లీ పోలీస్ కమిషనర్ బస్సీ ఆదేశాలు జారీ చేశారు. మిగిలిన సమయంలో బందోబస్తు పూర్తి స్థాయిలో ఉండనుంది. పరిస్థితి మరింత మెరుగైతే కొన్ని రోజుల తర్వాత సాయంత్ర వేళల్లో కూడా సందర్శకులను అనుమతించాలని అధికారులు భావిస్తున్న ట్లు సమాచారం. ఢిల్లీపోలీస్ కమిషనర్ బీఎస్ బస్సీ ఆదేశానుసారంగా సందర్శకులను అనుమతిస్తున్నట్టు పోలీసు ఉన్నతాధికారి తెలిపారు. ఢి ల్లీవాసుల పిక్నిక్ స్పాట్ అయిన ఇండియాగేట్ పరిసరాల్లో తిరిగేందుకు అనుమతి లభించడంపై పలువురు రాజధాని వాసులు సంతోషం వ్యక్తం చేశారు. అమర జవాన్ జ్యోతి వరకే... మునుపటిలా ఇండియాగేట్ పరిసరాల్లో సందర్శకులు స్వేచ్చగా తిరిగేందుకు అవకాశం లేదు. కేవ లం అమర జవాన్ జ్యోతి వరకు మాత్రమే సందర్శకులను అనుమతిస్తారు. అక్కడే ఫొటోలు తీసుకోవచ్చు. అక్కడ కూర్చోవడానికి కూడా అనుమతి లేదు. ఇండియాగేట్ పరిసరాల్లోని పార్కుల్లో కూర్చునేందుకూ వీలులేదు. ఇండియాగేట్ నాలుగు వైపులా వీధి వ్యాపారులను అనుమతించరు. ఐస్‌క్రీమ్, గోల్గప్పా, చాట్, పాప్‌కార్న్ ఇలా ఏది కొనుక్కోవాలన్నా సదరు పరిసరాల్లోనుంచి బయటకు రావాల్సిందేనని పోలీసులు తెలిపారు. ఎవరైనా ఏదైనా తినాలనుకుంటే రోడ్డుదాటుకుని ముందుకు రావాల్సి ఉంటుంది. దీంతోపాటు షాజహాన్ రోడ్డు, కస్తూర్బా గాంధీ రోడ్డు వైపు ఉన్న పార్కింగ్‌ను కూడా తెరిచారు. ఇక్కడే టూరిస్టు బస్సులు పార్క్ చేసుకునే వీలుంటుంది. వీధి వ్యాపారులకు తప్పని కష్టాలు... ఇండిగేట్ పరిసరాల్లో సందర్శకుల అవసరాలు తీరుస్తూ పొట్టనింపుకునే ఎందరో వీధి వ్యాపారులు గత పది నెలలుగా ఉపాధి కోల్పోయారు. ఇండియాగేట్ పరిసరాల్లో నిషేదాజ్ఞలు అమలులోకి రావడంతో సందర్శకుల సంఖ్య పూర్తిగా తగ్గిపోయింది. కుటుంబ సభ్యులు, స్నేహితులతో వచ్చి గంటల తరబడి గడిపేవారంతా పూర్తిగా మానేశారు. దీంతో ఐస్‌క్రీమ్‌లు, స్నాక్స్, కూల్‌డ్రింక్స్, వాటర్ బాటిల్స్, చిన్నచిన్న బొమ్మలు, బెలూన్లు విక్రయించే వ్యాపారులు తమ ఉపాధిని కోల్పోయారు. ఒక్కొక్కరు రోజుకు రూ.500 వరకు సంపాదించేవారు. పోలీసు ఆజ్ఞలతో వీరి రోజువారీ సంపాదనపై ఎంతో ప్రభావం పడింది. పది నెలల తర్వాత నిషేదాజ్ఞలను సడలించినప్పటికీ చిరు వ్యాపారులను అనుమతించడం లేదు. భద్రతా కారణాల వల్ల ఇండి యాగేట్ పరిసరాల్లో చిరువ్యాపారులపై నిషేధం కొనసాగుతుందని పోలీస్ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. దీంతో వారు పరిసరాల అవతలే వ్యాపారం చేసుకోక తప్పడం లేదు. పరిస్థితి మెరుగుపడితే నిబంధలను మరింత సడలిస్తామని పోలీసులు చెబుతున్నారు.