న్యూ ఇయర్ సందర్భంగా ఇండియా గేట్ వద్ద భారీగా జనం పోటెత్తారు. అదీగాక గత రెండేళ్లుగా కరోనా ఆంక్షల నేపథ్యంలో జనం చుట్టుపక్కల ఉన్న షాపింగ్ మాల్స్‌కి, దుకాణాలకు, ఫేమస్ ప్రదేశాలకు వెల్లువలా బయటకు వచ్చారు. దీంతో రహదారులన్నీ ఒక్కసారిగా బ్లాక్ అయ్యాయి. ఇదే సమయంలో జైనుల పుణ్య క్షేత్రమైన సమ్మేద్ షిఖార్జీని పర్యాటక ప్రదేశంగా ప్రకటించాలనే జార్ఖండ్ ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా జైన్ మతానికి చెందిన కొంతమంది వ్యక్తులు ఇండియా గేట్ నుంచి రాష్ట్రపతి భవన్ వరకు ర్యాలీ చేయాలనుకున్నారు.
దీంతో ఒక్కసారిగా అప్రమత్తమైన పోలీసులు ఆందోళకనకారులను కొంత దూరంలోనే నిలిపేశారు. సరిగ్గా ఈ ప్రదేశంలోనే ఢిల్లీ వాసులు తమ కుటుంబ సభ్యులతో సెల్ఫీలతో సందడిగా ఉన్నారు. ఆ ప్రదేశం అంతా పికినిక్ స్పాట్‌గా మారింది. దీంతో ఢిల్లీలోని ఐటీఓ, మండిహౌస్, ఆశ్రమం, మధుర రోడ్, గ్రీన్‌పార్క్, డీఎన్‌డీ వంటి తదితర ప్రాంతాలలో చాలా దారుణమైన ట్రాఫిక్ ఏర్పడి వాహనాలన్ని ఎక్కడికక్కడే నిలిచిపోయాయి.
Delhi | Members of the Jain community protest at India Gate against the decision of the Jharkhand govt to declare 'sacred' Shri Sammed Shikharji a tourist place pic.twitter.com/6WCKHq3UII
— ANI (@ANI) January 1, 2023
(చదవండి: న్యూ ఇయర్ గిఫ్ట్ అంటూ..పాముతో కాటు వేయించుకుని మరీ చనిపోయాడు)
Comments
Please login to add a commentAdd a comment