ప్రతీకాత్మక చిత్రం
న్యూఢిల్లీ : ‘పౌరసత్వ’ నిరసనకారులకు టీ అందించి ఇద్దరు సిక్కు సోదరులు మానవత్వం చాటుకున్నారు. పౌరసత్వం సవరణ చట్టం (సీఏఏ)పై నిరసనలు తెలిపిన జామియా మిలియా యూనివర్సిటీ విద్యార్థులపై పోలీసులు ఆదివారం లాఠీచార్జి చేసిన సంగతి తెలిసిందే. దీంతో పోలీసుల దౌర్జన్యకాండను నిరసిస్తూ విద్యార్థులు పెద్దఎత్తున ఇండియాగేట్ వద్ద సోమవారం ఆందోళన నిర్వహించారు. వేలాదిమంది మానవహారం నిర్వహించి.. తమ మొబైల్ టార్చ్‌లతో శాంతియుతంగా నిరసన తెలిపారు.
ఈక్రమంలో నిరసనకారులకు మద్దతు తెలపడమేకాకుండా.. ఇద్దరు సిక్కు సోదరులు వారికి టీ కూడా సప్లై చేశారు. స్వయంగా అందరికీ టీ అందించారు. దీంతో ఈ అన్నదమ్ముపై సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం కురుస్తోంది. ఇదిలాఉండగా... జామియా యూనివర్సిటీ విద్యార్థులపై పోలీసుల దాడిని సిక్కులు ఖండించారు. జనవరి 05 వరకు యూనివర్సిటీని మూసివేసిన నేపథ్యంలో విద్యార్థులకు భోజన వసతి కల్పించాలని స్థానిక గురుద్వారాలు నిర్ణయించాయి. ఇండియాగేట్ నిరసనకు పలు హక్కుల సంఘాలు.. 20 కాలేజీలు, యూనివర్సిటీల విద్యార్థులు మద్దతు పలికారు.
Comments
Please login to add a commentAdd a comment