ఇండియా గేట్ వద్ద క్వీన్స్ బ్యాటన్ | Queens Baton at India Gate | Sakshi
Sakshi News home page

ఇండియా గేట్ వద్ద క్వీన్స్ బ్యాటన్

Published Sun, Oct 13 2013 1:16 AM | Last Updated on Fri, Sep 1 2017 11:36 PM

ఇండియా గేట్ వద్ద క్వీన్స్ బ్యాటన్

ఇండియా గేట్ వద్ద క్వీన్స్ బ్యాటన్

న్యూఢిల్లీ: భారత్‌కు చేరుకున్న గ్లాస్గో కామన్వెల్త్ గేమ్స్ బ్యాటన్‌ను ప్రతిష్టాత్మక ఇండియా గేట్ వద్ద శనివారం ప్రదర్శించారు.
 
 డిస్కస్ త్రోయర్ కృష్ణ పూనియా, షూటర్ సమరేశ్ జంగ్, వెయిట్ లిఫ్టర్ కత్తుల రవికుమార్, రెజ్లర్లు యోగేశ్వర్ దత్, అమిత్ కుమార్, అనిల్ కుమార్, అనితా తొమర్, హాకీ ప్లేయర్లు శ్రీజేష్, రఘునాథ్, సునీల్ బ్యాటన్‌ను ఇక్కడికి తీసుకొచ్చారు. శుక్రవారం రాత్రి భారత్‌కు చేరుకున్న బ్యాటన్‌ను శనివారం ఉదయం ఆగ్రాకు తీసుకెళ్లారు. గంటపాటు తాజ్‌మహల్ వద్ద ఉంచి.. ఆ తర్వాత తిరిగి ఢిల్లీ తీసుకొచ్చారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement