ఢిల్లీకి చేరిన ‘త్రివర్ణ పతాక జైత్రయాత్ర’
సాక్షి, న్యూఢిల్లీ: ప్రజల్లో జాతీయ భావాన్ని పెంపొందించేందుకు, జాతీయ సమైక్యతను కాపాడేందుకు ఇండియన్ ఫెడరేషన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్టుల ఆధ్వర్యంలో ఈ నెల 10న జార్ఖండ్‌లో ప్రారంభించిన జర్నలిస్టుల ‘త్రివర్ణ పతాక జైత్రయాత్ర’ ఆదివారం ఢిల్లీకి చేరింది. ఢిల్లీలోని అమర్‌జవాన్ల జ్యోతి (ఇండియా గేట్) వద్దకు చేరుకున్న ఈ యాత్రకు ఐఎఫ్‌డబ్ల్యూజే అధ్యక్షుడు కె.విక్రమ్‌రావు, వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన జర్నలిస్టులు ఘనస్వాగతం పలికారు.
తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టుల సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు మామిడి సోమయ్య, ఉపాధ్యక్షుడు పి.ఆనందం తదితరులు ఈ యాత్రలో పాల్గొన్నారు. ఈ యాత్ర ఢిల్లీ నుంచి కత్రాలోని శ్రీ వైష్ణవిమాత దేవాలయం చేరుకొని అక్కడి నుంచి శ్రీనగర్‌లోని లాల్‌చౌక్ చేరుకోనుంది.