పౌరసత్వ సవరణ చట్టంపై కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ నిరసన చేపట్టారు. ఢిల్లీలోని ఇండియా గేట్ వద్ద పార్టీ శ్రేణులతో కలిసి ఆమె ధర్నాకు దిగారు. విద్యార్థులు, ఆందోళనకారులపై పోలీసుల చర్యలను తప్పుపడుతూ ఆమె నిరసన వ్యక్తం చేశారు. పౌరసత్వ చట్టాన్ని వ్యతిరేకిస్తూ ఆందోళన చేపట్టిన జామియా మిలియా వర్సిటీ విద్యార్థులపై దాడిని ఆమె ఖండించారు. ఈ సందర్భంగా ఆందోళనకారుల నిరసనలకు ఆమె సంఘీభావం తెలిపారు.