
హ్యాక్‌కు గురైన సందర్భంగా యూనివర్సిటీ వెబ్‌సైట్
సాక్షి, న్యూఢిల్లీ : ఢిల్లీలోని ప్రసిద్ధ జామియా మిలియా ఇస్లామియా యూనివర్శిటీ వెబ్‌సైట్‌లో‘హ్యాపి బర్త్ డే పూజ’ అనే పేరు ప్రత్యక్షమైంది. ఎవరో ఆకతాయి తన ప్రేమ శుభాకాంక్షలు తెలపడానికి వెబ్‌సైట్‌ను హ్యాక్ చేసి ఈ తుంటరి పనికి పాల్పడ్డాడు. కాగా, ఈ ఈ ఘటనపై ట్విట్టర్‌లో జోకులు పేలాయి. పూజ అనే అమ్మాయి చాలా అదృష్టవంతురాలని కొందరు స్పందిస్తే, మరికొందరు తన ప్రేమను చాటుకోవటానికి ఇదే దొరికిందా అంటూ ఆ ప్రేమదాసును కడిగి పారేశారు. జామియా యూనివర్శిటీ అధికారులు మాత్రం దీనిపై ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు.
వెబ్‌సైట్‌ను తిరిగి తమ ఆధీనంలోకి తీసుకున్న విశ్వవిద్యాలయ అధికారుల బృందం తిరిగి కార్యకలాపాలను ప్రారంభించింది. ఇది చాలా పెద్ద సమస్యని, ప్రభుత్వ ఆధీనంలోని ఒక సంస్థ వెబ్‌సైట్‌ను ఆకతాయి పూర్తిగా తన ఆధీనంలోకి తెచ్చుకోవటం, సామాజిక మాధ్యమ రంగంలో ఆమోదయోగ్యం కాదని పేర్కొన్నారు.