Delhi Liquor Case: MLC Kavitha Request To Come For ED Inquiry On March 15 - Sakshi
Sakshi News home page

రేపు హాజరు కాలేను.. ఈడీకి కవిత లేఖ

Published Wed, Mar 8 2023 1:02 PM | Last Updated on Wed, Mar 8 2023 3:09 PM

MLC Kavitha Request To Come For ED Inquiry On March 15 - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఢిల్లీ లిక్కర్‌ స్కాం కేసులో ఎమ్మెల్సీ కవితకు ఈడీ నోటీసులు అందజేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఈడీకి ఎమ్మెల్సీ కవిత.. లేఖ రాశారు. రేపటి విచారణను హాజరు కాలేనని లేఖ కవిత పేర్కొన్నారు. 

వివరాల ప్రకారం.. లిక్కర్‌ స్కా​ం కేసులో భాగంగా ఈడీ విచారణకు హాజరు కావాలని కవితకు నోటీసులు ఇచ్చారు అధికారులు. ఈ క్రమంలో ఈడీకి కవిత లేఖను రాశారు. లేఖలో భాగంగా రేపు(గురువారం) ఈడీ విచారణకు హాజరు కాలేనని స్పష్టం చేశారు. కాగా, ఈనెల 15వ లేదీన హాజరు అవుతానని లేఖలో​ వెల్లడించారు. ఈనెల 10వ తేదీన జంతర్‌మంతర్‌ వద్ద ధర్నా, ఇతర కార్యక్రమాలతో బిజీ షెడ్యూల్‌ ఫిక్స్‌ అయిన కారణంగా హాజరు కాలేనని తెలిపారు. అందుకే సమయం కావాలని కోరారు. ఈ నేపథ్యంలో ఈడీ స్పందనపై ఉత్కంఠ నెలకొంది. ఇక, ధర్నా కోసం రేపు మధ్యాహ్నం కవిత ఢిల్లీలోకి వెళ్లనున్నారు. ఎల్లుండి జంతర్‌ మంతర్‌ వద్ద కవిత ధర్నాలో పాల్గొననున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement