న్యూఢిల్లీ: డబ్ల్యూఎఫ్ఐ చీఫ్, బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌పై వ్యతిరేకంగా భారత రెజ్లర్లు గత నెల రోజులుగా ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరసనలు చేపడుతున్న సంగతి తెలిసిందే. ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఈ రాజకీయ ప్రముఖుడిపై కేంద్రం సరిగా స్పందించకపోవడంతో రెజర్లు ఆదివారం ప్రధాని మోదీ ప్రారంభించిన కొత్త పార్లమెంటు భవనం వైపు ర్యాలీగా వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో ఢిల్లీ పోలీసులు వారి అడ్డుకుని, అదుపులోకి తీసుకున్నారు.
జంతర్ మంతర్ వద్ద రెజర్ల విషయంలో పోలీసులు వ్యవహరించిన తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా ఈ వ్యవహారంపై రిటైర్డ్ ఐపీఎస్ ఒకరు ట్విట్టర్ లో తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అందుకు ఒలింపిక్ మెడలిస్ట్ బజరంగ్ పూనియా..ధీటుగా బదులిచ్చారు. కాల్పుల అంశంపై పునియా అన్నట్లు వస్తున్న వార్తలపై స్పందిస్తూ రిటైర్డ్ ఐపీఎస్, కేరళ పోలీస్ మాజీ చీఫ్ ఎన్ సీ ఆస్తానా ఈ రకంగా ట్వీట్ చేశారు.
‘పరిస్థితులు బట్టి మీపై కాల్పులు జరుపుతారు తప్ప మీరు చెబితే కాదు. ఒక బస్తా చెత్తను పడేసినట్లే.. మిమ్మల్ని లాగి పడవేస్తాం. సెక్షన్ 129 ప్రకారం పోలీసులకు కాల్చులు జరిపే అధికారం ఉంది. సమయం వస్తే ఆ కోరిక నెరవేరుతుంది. అందుకే మీరు ముందుకు చదువుకుని ఉండాలి. పోస్ట్‌మార్టం టేబుల్‌పై మళ్లీ కలుద్దాం’’ అంటూ రెజర్లను ఉద్దేశించి ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ ట్వీట్ పై పునియా స్పందిస్తూ.. ‘‘ఈ ఐపీఎస్ అధికారి మమ్మల్ని కాల్చడం గురించి మాట్లాడుతున్నారు. సోదరా, మేము మీ ముందు ఉన్నాం, ఎక్కడికి రావాలో చెప్పండి. మీ బుల్లెట్లకు మా చాతీని చూపుతామని మీకు ప్రమాణం చేస్తున్నా. ఇప్పటి వరకు రెజర్లు బుల్లెట్లు మినహా మిగతావన్నింటినీ ఎదుర్కొన్నారు. ఇక మిగిలింది అదొక్కటే, అది కూడా తీసుకురండి’’ అంటూ హిందీలో ట్వీట్ చేశారు.
ఇదిలా ఉంటే.. ఢిల్లీ పోలీసులు వ్యవహరించిన తీరుపై సోషల్ మీడియా భగ్గుమంది. అయితే.. రెజ్లర్లు అల్లర్లు, చట్టవిరుద్ధమైన సమావేశాల ద్వారా తమ విధులను చేయకుండా అడ్డుకున్నారని ఢిల్లీ పోలీసులు ఆరోపించారు. వినేష్ ఫోగట్, సాక్షి మాలిక్, బజరంగ్ పునియాతో సహా నిరసనలో పాల్గొన్న రెజ్లర్లందరినీ ఈ కేసులో ప్రస్తావించారు.
ये IPS ऑफिसर हमें गोली मारने की बात कर रहा है। भाई सामने खड़े हैं, बता कहाँ आना है गोली खाने… क़सम है पीठ नहीं दिखाएँगे, सीने पे खाएँगे तेरी गोली। यो ही रह गया है अब हमारे साथ करना तो यो भी सही। https://t.co/jgZofGj5QC
— Bajrang Punia 🇮🇳 (@BajrangPunia) May 29, 2023
చదవండి: Delhi Shahbad Dairy Case:: గాళ్‌ఫ్రెండ్‌తో గొడవ.. అందరూ చూస్తుండగానే..!
Comments
Please login to add a commentAdd a comment