లోక్‌పాల్‌పై ఎన్‌ఎస్‌యూఐ సంబరాలు
Published Tue, Dec 31 2013 12:48 AM | Last Updated on Mon, Mar 18 2019 7:55 PM
సాక్షి, న్యూఢిల్లీ: కాంగ్రెస్‌పార్టీ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం లోక్‌పాల్ బిల్లులు ఆమోదించడంపై నేషనల్ స్టూడెంట్ యూనియన్ ఆఫ్ ఇండియా (ఎన్‌ఎస్‌యూఐ) కార్యకర్తలు హర్షం వ్యక్తం చేశారు. ఇదే తరహాలో దేశంలోంచి అవినీ తిని పారద్రోలేందుకు అవసరమైన మరిన్ని చట్టాలను చేయాలంటూ జంతర్‌మంతర్ వద్ద సోమవా రం నిర్వహించిన కార్యక్రమంలో డిమాండ్ చేశారు. దేశంలోని వివిధ రాష్ట్ర్రాల నుంచి తరలివచ్చిన వందలాదిమంది ఎన్‌ఎస్‌యూఐ కార్యకర్తలతో జంతర్‌మంతర్ నిండిపోయింది. ఈ సందర్భంగా పలువురు నాయకులు ప్రసంగించారు. ఎన్నోఏళ్లు గా పెండింగ్‌లో ఉన్న లోక్‌పాల్ బిల్లు ఆమోదంలో కాంగ్రెస్‌పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ పాత్ర ఉందని వారు అభినందించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సంగీత కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి.
Advertisement
Advertisement