ఏడేళ్ల తర్వాత ఎన్‌ఎస్‌యూఐ గెలుపు
న్యూఢిల్లీ: ఢిల్లీ యూనివర్సిటీ విద్యార్థి సంఘం(డీయూఎస్‌యూ) ఎన్నికల్లో కాంగ్రెస్ అనుబంధ నేషనల్ స్టూడెంట్ యూనియన్ ఆఫ్ ఇండియా(ఎన్‌ఎస్‌యూఐ) ఘన విజయం సాధించింది. ఏడేళ్ల తర్వాత ప్రెసిడెంట్, జాయింట్ సెక్రటరీ పోస్టులను ఈ సంఘం గెలుచుకుంది. అదే సమయంలో, ఆర్‌ఎస్‌ఎస్ అనుబంధ భారతీయ విద్యార్థి పరిషత్(ఏబీవీపీ)కి వైస్ ప్రెసిడెంట్, సెక్రటరీ పోస్టులను సాధించుకోవడం విశేషం.
ప్రెసిడెంట్ పదవికి జరిగిన పోటీలో ఏబీవీపీకి చెందిన రిషబ్ చౌదరిపై ఎన్‌ఎస్‌యూఐ అభ్యర్థి రౌనక్ ఖత్రి 1,300కుపైగా ఓట్ల తేడాతో ఘన విజయం సాధించారు. ఎన్‌ఎస్‌యూఐ చివరిగా సారిగా 2017లో డీయూఎస్‌యూ ప్రెసిడెంట్ పదవిని దక్కించుకుంది. ఫలితాలు వెల్లడవ్వగానే ఎన్‌ఎస్‌యూఐ పక్షం విద్యార్థులు తమ నేతలను భుజాలపై మోసుకుంటూ ర్యాలీ నిర్వహించారు. క్యాంపస్ ఆవరణలో లౌడ్ స్పీకర్ల వాడకం, బాణసంచా కాల్చడం, డోళ్లు వాయించడంపై నిషేధం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment