delhi university student union
-
ఢిల్లీ వర్సిటీ విద్యార్థి సంఘం ఎన్నికలు..
న్యూఢిల్లీ: ఢిల్లీ యూనివర్సిటీ విద్యార్థి సంఘం(డీయూఎస్‌యూ) ఎన్నికల్లో కాంగ్రెస్ అనుబంధ నేషనల్ స్టూడెంట్ యూనియన్ ఆఫ్ ఇండియా(ఎన్ఎస్యూఐ) ఘన విజయం సాధించింది. ఏడేళ్ల తర్వాత ప్రెసిడెంట్, జాయింట్ సెక్రటరీ పోస్టులను ఈ సంఘం గెలుచుకుంది. అదే సమయంలో, ఆర్ఎస్ఎస్ అనుబంధ భారతీయ విద్యార్థి పరిషత్(ఏబీవీపీ)కి వైస్ ప్రెసిడెంట్, సెక్రటరీ పోస్టులను సాధించుకోవడం విశేషం. ప్రెసిడెంట్ పదవికి జరిగిన పోటీలో ఏబీవీపీకి చెందిన రిషబ్ చౌదరిపై ఎన్ఎస్యూఐ అభ్యర్థి రౌనక్ ఖత్రి 1,300కుపైగా ఓట్ల తేడాతో ఘన విజయం సాధించారు. ఎన్ఎస్యూఐ చివరిగా సారిగా 2017లో డీయూఎస్‌యూ ప్రెసిడెంట్ పదవిని దక్కించుకుంది. ఫలితాలు వెల్లడవ్వగానే ఎన్ఎస్యూఐ పక్షం విద్యార్థులు తమ నేతలను భుజాలపై మోసుకుంటూ ర్యాలీ నిర్వహించారు. క్యాంపస్ ఆవరణలో లౌడ్ స్పీకర్ల వాడకం, బాణసంచా కాల్చడం, డోళ్లు వాయించడంపై నిషేధం ఉంది. -
ఢిల్లీ వర్సిటీ ఎన్నికల్లో ఏబీవీపీ క్లీన్ స్వీప్
18 ఏళ్ల నిరీక్షణ ముగిసింది. ప్రతిష్టాత్మక ఢిల్లీ యూనివర్సిటీలో మళ్లీ అఖిల భార త విద్యార్థి పరిషత్( ఏబీవీపీ) జెండా ఎగిరింది. శనివారం వెలువడ్డ ఢిల్లీ యూనివర్సిటీ స్టూడెంట్ యూనియన్ (డూసూ) ఎన్నికల ఫలితాల్లో ఆ విద్యార్థి సంఘం విజయకేతనం ఎగురవేసింది. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటినుంచి ఊపుమీదున్న ఏబీవీపీ ఈ దఫా డూసూ ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలనే పట్టుదలతో ప్రయత్నించగా, ఏడాదిన్నరగా మోదీ వైఫల్యాలనే ఆయుధంగా కాంగ్రెస్‌కు చెందిన ఎన్ఎస్యూఐ తలపడింది. ఉత్కంఠబరితంగా సాగిన పోరులో చివరికి ఏబీవీపీయే విజయం సాధించింది. డూసూలో దాదాపు రెండు లక్షల పైచిలుకు ఓటర్లుండగా ఈ ఎన్నికల్లో లక్షమందికిపైగా ఓటు వేశారు. పోటీజరిగిన నాలుగు స్థానాలను ఏబీవీపీ కైవసం చేసుకుంది. సతీందర్ అవానా, సన్నీ దేడా, అంజలీ రానా, ఛత్రపాల్ యాదవ్‌లు ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, సెక్రటరీ, జాయింట్ సెక్రటరీ పదవులను గెలుపొందారు. అసెంబ్లీ ఎన్నికల్లో కేజ్రీవాల్ లాగా మెరుపు విజయం సాధిస్తామనుకున్ ఆప్ విద్యార్థి సంఘం కనీస పోటీ కూడా ఇవ్వలేకపోయింది.