ఢిల్లీ వర్సిటీ ఎన్నికల్లో ఏబీవీపీ క్లీన్ స్వీప్ | abvp wins in delhi university student union elections | Sakshi
Sakshi News home page

ఢిల్లీ వర్సిటీ ఎన్నికల్లో ఏబీవీపీ క్లీన్ స్వీప్

Published Sat, Sep 12 2015 12:53 PM | Last Updated on Tue, Aug 14 2018 5:56 PM

ఢిల్లీ వర్సిటీ ఎన్నికల్లో ఏబీవీపీ క్లీన్ స్వీప్ - Sakshi

ఢిల్లీ వర్సిటీ ఎన్నికల్లో ఏబీవీపీ క్లీన్ స్వీప్

18 ఏళ్ల నిరీక్షణ ముగిసింది. ప్రతిష్టాత్మక ఢిల్లీ యూనివర్సిటీలో మళ్లీ అఖిల భార త విద్యార్థి పరిషత్( ఏబీవీపీ) జెండా ఎగిరింది. శనివారం వెలువడ్డ ఢిల్లీ యూనివర్సిటీ స్టూడెంట్ యూనియన్ (డూసూ) ఎన్నికల ఫలితాల్లో ఆ విద్యార్థి సంఘం విజయకేతనం ఎగురవేసింది.

కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటినుంచి ఊపుమీదున్న ఏబీవీపీ ఈ దఫా డూసూ ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలనే పట్టుదలతో ప్రయత్నించగా, ఏడాదిన్నరగా మోదీ వైఫల్యాలనే ఆయుధంగా కాంగ్రెస్‌కు చెందిన ఎన్‌ఎస్‌యూఐ తలపడింది. ఉత్కంఠబరితంగా సాగిన పోరులో చివరికి ఏబీవీపీయే విజయం సాధించింది. డూసూలో దాదాపు రెండు లక్షల పైచిలుకు ఓటర్లుండగా ఈ ఎన్నికల్లో లక్షమందికిపైగా ఓటు వేశారు. 

పోటీజరిగిన  నాలుగు స్థానాలను ఏబీవీపీ కైవసం చేసుకుంది. సతీందర్ అవానా, సన్నీ దేడా, అంజలీ రానా, ఛత్రపాల్ యాదవ్లు ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, సెక్రటరీ, జాయింట్ సెక్రటరీ పదవులను గెలుపొందారు. అసెంబ్లీ ఎన్నికల్లో కేజ్రీవాల్ లాగా మెరుపు విజయం సాధిస్తామనుకున్ ఆప్ విద్యార్థి సంఘం కనీస పోటీ కూడా ఇవ్వలేకపోయింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement