న్యూఢిల్లీ: ప్రతిష్ఠాత్మక ఢిల్లీ విశ్వవిద్యాలయంలో ఎన్నికల పోరు మొదలైంది. మొత్తం 50మంది అభ్యర్థుల భవితవ్యం నేడు తేలనుంది. ఉత్కంఠ పరిస్థితుల మధ్య ఢిల్లీ విశ్వవిద్యాలయంలోని రెండు క్యాంపస్లకు విద్యార్థి నాయకుల ఎన్నికలు జరగనున్నాయి. గతంలో ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి చెందిన నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ ఇండియా(ఎన్ఎస్యూఐ), బీజేపీకి చెందిన స్టూడెంట్ విభాగం అఖిల భారత విద్యార్థి పరిషత్(ఏబీవీపీ) ప్రధాన పోటీదారులుగా నిలవగా చత్ర యువ సంఘర్ష్ సమితి (సీవైఎస్ఎస్) పేరుతో ఢిల్లీ శాసన సభ ఎన్నికల్లో అఖండ విజయం సాధించిన ఆమ్ఆద్మీపార్టీ తన తరుపున విద్యార్థి విభాగ అభ్యర్థులను నిలిపింది.
కాగా, వర్సిటీ ఆఫీస్ బేరర్ పోస్టులకోసం 35మంది అభ్యర్థులు బరిలో ఉండగా తొమ్మిది మంది అధ్యక్ష పదవి కోసం, ఎనిమిదిమంది ఉపాధ్యక్ష పదవి కోసం నామినేషన్ దాఖలు చేశారు. ఈ వర్సిటీకి కింద మొత్తం మొత్తం 42 కాలేజీలు ఉండగా.. ఎన్నికల నిర్వహణకు 127 పోలింగ్ బూత్లు ఏర్పాటుచేశారు. మొత్తం 1,35,298మంది విద్యార్థులు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు.
ఉత్కంఠ పోరు మధ్య విశ్వవిద్యాలయం
Published Fri, Sep 11 2015 8:38 AM | Last Updated on Tue, Aug 14 2018 5:56 PM
Advertisement