president post
-
ఢిల్లీ వర్సిటీ విద్యార్థి సంఘం ఎన్నికలు..
న్యూఢిల్లీ: ఢిల్లీ యూనివర్సిటీ విద్యార్థి సంఘం(డీయూఎస్‌యూ) ఎన్నికల్లో కాంగ్రెస్ అనుబంధ నేషనల్ స్టూడెంట్ యూనియన్ ఆఫ్ ఇండియా(ఎన్ఎస్యూఐ) ఘన విజయం సాధించింది. ఏడేళ్ల తర్వాత ప్రెసిడెంట్, జాయింట్ సెక్రటరీ పోస్టులను ఈ సంఘం గెలుచుకుంది. అదే సమయంలో, ఆర్ఎస్ఎస్ అనుబంధ భారతీయ విద్యార్థి పరిషత్(ఏబీవీపీ)కి వైస్ ప్రెసిడెంట్, సెక్రటరీ పోస్టులను సాధించుకోవడం విశేషం. ప్రెసిడెంట్ పదవికి జరిగిన పోటీలో ఏబీవీపీకి చెందిన రిషబ్ చౌదరిపై ఎన్ఎస్యూఐ అభ్యర్థి రౌనక్ ఖత్రి 1,300కుపైగా ఓట్ల తేడాతో ఘన విజయం సాధించారు. ఎన్ఎస్యూఐ చివరిగా సారిగా 2017లో డీయూఎస్‌యూ ప్రెసిడెంట్ పదవిని దక్కించుకుంది. ఫలితాలు వెల్లడవ్వగానే ఎన్ఎస్యూఐ పక్షం విద్యార్థులు తమ నేతలను భుజాలపై మోసుకుంటూ ర్యాలీ నిర్వహించారు. క్యాంపస్ ఆవరణలో లౌడ్ స్పీకర్ల వాడకం, బాణసంచా కాల్చడం, డోళ్లు వాయించడంపై నిషేధం ఉంది. -
అనిత X సంజయ్
న్యూఢిల్లీ: ఇన్నాళ్లు రెజ్లర్ల ఆరోపణలు, నిరసనలతో తరచూ వార్తల్లోకెక్కిన భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ) ఇప్పుడు ఎన్నికల హడావిడిలో ఉంది. 2010 ఢిల్లీ కామన్వెల్త్ గేమ్స్ చాంపియన్ రెజ్లర్ అనిత షెరాన్ అధ్యక్ష పదవి కోసం నామినేషన్ వేయగా, వివాదాస్పద డబ్ల్యూఎఫ్ఐ చీఫ్ బ్రిజ్‌భూషణ్ తన వీర విధేయుడు సంజయ్ కుమార్ సింగ్‌ను బరిలో దించాడు. నామినేషన్ల దాఖలు గడువు ముగియడంతో అధ్యక్ష పోటీ ఇప్పుడు మాజీ రెజ్లర్ అనిత, బ్రిజ్‌భూషణ్ నమ్మిన బంటు సంజయ్‌ల మధ్యే నెలకొంది. నిరసన దీక్షలో పాల్గొన్న రెజ్లర్లకు వెన్నుదన్నుగా నిలిచి మాట్లాడిన 38 ఏళ్ల అనితకు రెజ్లర్ల మద్దతు ఉంది. ఇప్పటికే విడుదలైన ఎన్నికల షెడ్యూలు ప్రకారం ఈ నెల 12న ఓటింగ్, అదే రోజు ఫలితాలు విడుదలవుతాయి. -
బీజేపీ రాష్ట్ర శాఖలకు కొత్త సారథులు
న్యూఢిల్లీ: 2024 లోక్‌సభ ఎన్నికలు, కొన్ని రాష్ట్లాల్లో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ కేంద్రంలోని అధికార బీజేపీ సంస్థాగతంగా కీలక మార్పులు చేపట్టింది. దీంతో, త్వరలోనే కేంద్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ ఉంటుందంటూ కొన్ని రోజులుగా వస్తున్న ఊహాగానాలకు బలం చేకూరినట్లయింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, పంజాబ్, జార్ఖండ్ రాష్ట్రాల్లో పార్టీకి కొత్త సారథులను నియమించింది. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డిని, ఏపీ చీఫ్‌గా కేంద్ర మాజీ మంత్రి డి.పురందేశ్వరిని నియమించింది. అదేవిధంగా, పంజాబ్ బాధ్యతలు సునీల్ జాఖడ్‌కు, జార్ఖండ్ చీఫ్‌గా బాబూలాల్ మరాండీకి బాధ్యతలు అ ప్పగిస్తున్నట్లు బీజేపీ మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొంది. తెలంగాణ ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్పర్సన్ బాధ్యతలను ఓబీసీ నేత ఈటెల రాజేందర్‌కు అప్పగిస్తున్నట్లు తెలిపింది. మరికొద్ది నెలల్లో తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికలు జరగనుండగా అధికార భారత రాష్ట్ర సమితిని దీటుగా ఎదుర్కొనేందుకు వీలుగా ఈ మార్పులు చేపట్టినట్లు భావిస్తున్నారు. చదవండి: బండి సంజయ్ ను ఎందుకు తప్పించారు? ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు స్థానంలో కేంద్ర మాజీ మంత్రి డి.పురందేశ్వరికి బాధ్యతలు అప్పగించింది. ఈమె యూపీఏ ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగా పనిచేశారు. అలాగే, పంజాబ్ బీజేపీ అధ్యక్షుడు దీపక్ ప్రకాశ్ స్థానంలో రాష్ట్ర కాంగ్రెస్ మాజీ చీఫ్ సునీల్ జాఖడ్‌కు పగ్గాలు అప్పగించింది. అదేవిధంగా, జార్ఖండ్‌లో గిరిజన నేత, సీఎం హేమంత్ సోరెన్‌ను ఢీకొట్టేందుకు అదే వర్గానికి చెందిన మాజీ సీఎం మరాండీని రంగంలోకి దించింది. మరాండీ తన జార్ఖండ్ వికాస్ మోర్చా(ప్రజాతాంత్రిక్)ను 2020లో బీజేపీలో విలీనం చేశారు. -
కాంగి‘రేసు’.. కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలపైనే అందరి దృష్టి
కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ఎన్నిక ఉత్కంఠ రేపుతోంది. గాంధీ కుటుంబానికి చెందిన సోనియా, రాహుల్, ప్రియాంకా గాంధీలు అధ్యక్ష పగ్గాలు చేపట్టడానికి విముఖంగా ఉండడంతో పోటీ అనివార్యమైంది. స్వాతంత్య్రానంతరం కాంగ్రెస్ అధ్యక్ష పదవికి ఎన్నిక జరగడం ఇది నాలుగోసారి.1998లో సోనియా గాంధీ కాంగ్రెస్ పార్టీ పగ్గాలు చేపట్టాక అన్నిసార్లు ఏకగ్రీవంగానే ఎన్నిక జరిగింది. ఈ సారే అధ్యక్ష ఎన్నికకు పోటీ జరుగుతోంది. ఎన్నిక ప్రక్రియ సాగేదిలా.. కాంగ్రెస్ పార్టీ నియమావళిలోని సెక్షన్ గీVఐఐఐ ప్రకారం అధ్యక్ష ఎన్నికలు జరుగుతాయి. సోనియాగాంధీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా ఉన్నప్పుడే సంస్థాగతంగా ఎన్నో సంస్కరణలు తీసుకువచ్చారు. పార్టీ అధ్యక్ష ఎన్నిక నిర్వహణకు స్వతంత్రంగా వ్యవహరించే సెంట్రల్ ఎలక్షన్ అథారిటీ (సీఈఏ) ఏర్పాటు చేశారు. గుజరాత్ మాజీ ఎంపీ మధుసూదన్ మిస్ట్రీ ప్రస్తుతం సీఈఏ చైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. దీని ఆధ్వర్యంలోనే అధ్యక్ష ఎన్నిక జరుగుతుంది. పార్టీ ఎలక్టోరల్ కాలేజీలో 9 వేల మందికి పైగా ప్రతినిధులు ఉన్నారు. వీరందరికీ ఓటు వేసే హక్కు ఉంది. పార్టీలో ప్రతినిధుల్ని ఎన్నుకొనే ప్రక్రియ కూడా ఒక క్రమ పద్ధతిలో సాగుతుంది. క్షేత్రస్థాయిలో ఉన్న బ్లాక్ కాంగ్రెస్ కమిటీలు పీసీసీ ప్రతినిధుల్ని ఎన్నుకుంటారు. పీసీసీ ప్రతినిధులు ఏఐసీసీ ప్రతినిధుల్ని ఎన్నుకుంటారు. వీరితో పాటు పీసీసీ అధ్యక్షులుగా కనీసం ఒక సంవత్సరం పదవిలో ఉన్న వారు, జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు, రాష్ట్రాల ఇన్‌చార్జ్‌లుగా వ్యవహరించే ఏఐసీసీ సభ్యులు, పార్టీ ఎమ్మెల్యేలు, పీసీసీ ఎగ్జిక్యూటివ్ సభ్యులందరూ ప్రతినిధులుగానే ఉంటారు. అధ్యక్ష పదవికి పోటీ చేయాలనుకునే వారు తప్పనిసరిగా పార్టీలో ప్రతినిధి అయి ఉండాలి. పార్టీ ప్రతినిధుల్లో 10 మంది వారిని ప్రతిపాదించాల్సి ఉంటుంది. నామినేషన్ ఉపసంహరణ ప్రక్రియ ముగిశాక ఇద్దరు పోటీలో ఉంటే ఎన్నిక నిర్వహిస్తారు. ఒక్కరే ఉంటే వారి ఎన్నిక ఏకగ్రీవమవుతుంది. అధ్యక్ష ఎన్నికలు ఎప్పుడెప్పుడు జరిగాయంటే ► 1950లో జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో ఆచార్య కృపలాని, పురుషోత్తమ్ దాస్ టాండన్ మధ్య గట్టి పోటీ జరిగింది. అప్పట్లో ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ మద్దతునిచ్చిన కృపలాని ఓడిపోయారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ అనుచరుడిగా ముద్ర పడిన టాండన్ అధ్యక్షుడయ్యారు. టాండన్‌కు 1,306 ఓట్లు వస్తే, కృపలానీకి 1,092 ఓట్లు వచ్చాయి. ► ఆ తర్వాత మళ్లీ కాంగ్రెస్‌లో 47 ఏళ్ల తర్వాత ఎన్నిక నిర్వహించాల్సి వచ్చింది. 1997లో జరిగిన ఎన్నికల్లో త్రిముఖ పోటీ జరిగింది. సీతారామ్ కేసరి, శరద్ పవార్, రాజేశ్ పైలట్ పోటీ పడ్డారు. ఈ ఎన్నికల్లో సీతారాం కేసరి బంపర్ మెజార్టీ సాధించారు. మహారాష్ట, యూపీ మినహాయించి అన్ని రాష్ట్రాల యూనిట్లు కేసరికే జై కొట్టారు. కేసరికి 6,224 ఓట్లు వస్తే, పవార్‌కు 882, పైలెట్‌కు 354 ఓట్లు వచ్చాయి. ► 2000లో కూడా అధ్యక్ష ఎన్నిక జరిగింది. సోనియాగాంధీపైన జితేంద్ర ప్రసాద సవాల్ విసిరారు. ప్రసాద ఘోరమైన ఓటమి చవిచూడాల్సి వచ్చింది. సోనియాకు 7,400 ఓట్లు లభిస్తే జితేంద్ర ప్రసాదకి 94 ఓట్లు వచ్చాయి. ► 22 ఏళ్ల తర్వాత ఇప్పుడు మరోసారి అధ్యక్ష ఎన్నిక అనివార్యంగా మారింది. 75 ఏళ్లలో 16 మంది అధ్యక్షులు ఈ 75 ఏళ్లలో 40 ఏళ్లపాటు గాంధీ కుటుంబమే పార్టీని నడిపించింది.స్వాతంత్య్రానంతరం కాంగ్రెస్‌కి 16 మంది అధ్యక్షులైతే వారిలో అయిదుగురు గాంధీ కుటుంబానికి చెందినవారే. నలుగురు తెలుగువాళ్లు పట్టాభి సీతారామయ్య, దామోదరం సంజీవయ్య, నీలం సంజీవరెడ్డి, పీవి నరసింహారావు అధ్యక్షులుగా వ్యవహరించారు. 1947లో ఆచార్య కృపలాని, 1948–49లో పట్టాభి సీతారామయ్య ఆ తర్వాత టాండన్ అధ్యక్షుడిగా ఉన్నారు. నెహ్రూ 1951–55 వరకు, ఆ తర్వాత యూఎన్ ధేబర్ పగ్గాలు చేపట్టారు. 1959లో ఇందిరతొలిసారి అధ్యక్షురాలయ్యారు. ఆ తర్వాత నీలం సంజీవరెడ్డి, దామోదరం సంజీవయ్య, కామరాజ్, నిజలింగప్ప, జగజ్జీవన్ రామ్, శంకర్ దయాళ్ శర్మ, దేవకాంత్ బారువా అధ్యక్షులుగా ఉన్నారు. 1978–1984 సంవత్సరాల మధ్యలో ఇందిర మళ్లీ పగ్గాలు చేపట్టారు. ఇందిర హత్యానంతరం రాజీవ్ గాంధీ అధ్యక్ష పగ్గాలు చేపట్టి 1991 వరకు ఉన్నారు. రాజీవ్ హత్యానంతరం పీవీ నరసింహారావు పగ్గాలు చేపట్టి 1996 వరకు కొనసాగారు. 1996–98 మధ్య సీతారాం కేసరి అధ్యక్షుడిగా ఉన్నారు. 1998లో అధ్యక్షురాలైన సోనియా 19 ఏళ్లు పదవిలో ఉండి రికార్డు సృష్టించారు. 2017–2019 కాలంలో రాహుల్ గాంధీ అధ్యక్షుడిగా వ్యవహరించారు. 2019 నుంచి సోనియా కొనసాగుతున్నారు. నామినేషన్ల ఉపసంహరణకు గడువు : అక్టోబర్ 8 పోలింగ్ తేదీ : అక్టోబర్ 17 ఫలితాల ప్రకటన : అక్టోబర్ 19 – నేషనల్ డెస్క్, సాక్షి -
కాంగ్రెస్ అధ్యక్ష బరిలో దిగ్విజయ్!
బెంగళూరు/న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడి ఎన్నిక అనూహ్య మలుపులు తిరుగుతోంది. రాజస్తాన్ సీఎం అశోక్ గెహ్లాట్ ధిక్కార స్వరం వినిపిస్తుండడంతో తాజాగా సీనియర్ నేత, మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దిగ్విజయ్ సింగ్ పేరు తెరపైకి వచ్చింది. అధ్యక్ష ఎన్నికలో దిగ్విజయ్ బరిలోకి దిగడం ఖాయమని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. పార్టీ అధినేత్రి సోనియా గాంధీ ఆయనవైపే మొగ్గు చూపుతున్నట్లు ప్రచారం సాగుతోంది. నామినేషన్ల ప్రక్రియ మరో రెండు రోజుల్లో ముగియనున్న నేపథ్యంలో సోనియా గాంధీ బుధవారం సీనియర్ నాయకుడు, పార్టీకి విధేయుడైన ఏకే ఆంటోనీతో సమావేశయ్యారు. అధ్యక్ష ఎన్నికల బరిలోకి దింపాల్సిన అభ్యర్థిపై గంటన్నరకు పైగా చర్చించినట్లు తెలిసింది. మరోవైపు అశోక్ గెహ్లాట్ గురువారం సోనియాతో భేటీ అయ్యే అవకాశం ఉంది. తన వర్గం ఎమ్మెల్యేలు అధిష్టానంపై ప్రదర్శించిన ధిక్కార వైఖరి పట్ల సోనియాకు గెహ్లాట్ ఫోన్లో ఇప్పటికే వివరణ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యేల తిరుగుబాటు వెనక తన హస్తం లేదని ఆయన చెప్పినట్టు సమాచారం. అది దిగ్విజయ్ వ్యక్తిగత నిర్ణయం దిగ్విజయ్ సింగ్ సాధ్యమైనంత త్వరగా ఢిల్లీకి చేరుకుంటారని, శుక్రవారం నామినేషన్ దాఖలు చేసే అవకాశం ఉందని ఆయన సన్నిహిత వర్గాలు తెలిపాయి. కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలో పోటీ చేయాలన్నది ఆయన వ్యక్తిగత నిర్ణయమని, ఇందులో పార్టీ నాయకత్వం ప్రమేయం లేదని వెల్లడించాయి. దిగ్విజయ్ ప్రస్తుతం కేరళలో భారత్ జోడో యాత్రలో పాల్గొంటున్నారు. ఇదిలా ఉండగా, తాను సైతం బరిలో ఉంటానని సీనియర్ నేత, తిరువనంతపురం ఎంపీ శశీ థరూర్ ప్రకటించిన సంగతి తెలిసిందే. శుక్రవారం నామినేషన్ దాఖలు చేయబోతున్నానని ఆయన ఇటీవలే తేల్చిచెప్పారు. అధినేత్రి సోనియాగాంధీ ఆదేశిస్తే కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నిక బరిలో దిగేందుకు పార్టీ సీనియర్ నాయకుడు మల్లికార్జున ఖర్గే (80) సిద్ధమని ఆయన సన్నిహితుడొకరు బుధవారం చెప్పారు. అధ్యక్ష బరిలో దిగేందుకు తనకు ఆసక్తి లేదని సీనియర్ నేత కమల్‌నాథ్ మరోసారి స్పష్టం చేశారు. తన దృష్టంతా ఏడాదిలో జరగనున్న మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలపైనే ఉందన్నారు. -
Rajasthan political crisis: గెహ్లాట్ వర్గం ధిక్కారం!
జైపూర్/న్యూఢిల్లీ: రాజస్తాన్‌లో రాజకీయ ప్రతిష్టంభన ముదురుపాకాన పడింది. రాష్ట్రంలో నాయకత్వ మార్పు కోసం కాంగ్రెస్ అధిష్టానం చేసిన ప్రయత్నం కాస్తా బెడిసికొట్టి సంక్షోభంగా మారింది. పార్టీ అధ్యక్ష ఎన్నిక వేళ తలనొప్పులను మరింతగా పెంచుతోంది. అధ్యక్ష బరిలో దింపాలని భావించిన సీనియర్ నాయకుడు అశోక్ గెహ్లాట్ రాజస్తాన్ సీఎం పీఠం వదులుకోవడానికి సుముఖంగా లేకపోవడంతో పార్టీ పెద్దలకు ఎటూ పాలుపోవడం లేదు. సీఎంగా కొనసాగుతూనే అధ్యక్ష పదవికి పోటీ చేస్తానని గెహ్లాట్ భీష్మించుకున్నారు. ఒకరికి ఒకే పదవి నిబంధన ఈ విషయంలో వర్తించదని ఆయన వాదిస్తున్న సంగతి తెలిసిందే. ఫలితాలు వచ్చేదాకా గెహ్లాట్‌నే సీఎంగా కొనసాగించాలన్న డిమాండ్‌పై వెనక్కు తగ్గేందుకు ఆయన వర్గం ఎమ్మెల్యేలు కూడా ససేమిరా అంటున్నారు. ఈ క్రమంలో వారంతా అధిష్టానాన్నే ధిక్కరించేలా వ్యవహరించి గట్టి షాకిచ్చారు! గెహ్లాట్ స్థానంలో ఆయన రాజకీయ ప్రత్యర్థి సచిన్ పైలట్‌ను సీఎం చేయాలన్న అధిష్టానం యోచనను వ్యతిరేకిస్తూ 108 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేల్లో ఏకంగా 82 మంది ఆదివారం స్పీకర్‌కు రాజీనామా సమర్పించడం తెలిసిందే. పరిస్థితిని చక్కదిద్దేందుకు మల్లికార్జున ఖర్గే, అజయ్ మాకెన్‌లను ఆదివారం రాత్రి హుటాహుటిన రాజస్తాన్‌కు పరిశీలకులగా పంపిన అధిష్టానానికి మింగుడు పడని రీతిలో మరిన్ని షాకులు తగిలాయి. ఎమ్మెల్యేలు కనీవినీ ఎరగని స్థాయిలో ధిక్కార స్వరం విన్పించారు. దీనిపై బీజేపీ కూడా వ్యంగ్యాస్త్రాలు విసిరింది. పార్టీ నుంచి నేతల నిష్క్రమణ, వరుసగా ఓటములు తదితరాలతో ఇప్పటికే కుదేలైన కాంగ్రెస్ అధిష్టానం ఈ సంక్షోభాన్ని ఎలా పరిష్కరిస్తుందన్నది ఆసక్తికరంగా మారింది. ఈ పరిణామాలతో గెహ్లాట్ కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నిక బరిలోకి దిగడం అనుమానంగా మారింది. అధిష్టానానికి విశ్వాసపాత్రులైన మల్లికార్జున ఖర్గే, దిగ్విజయ్‌సింగ్, కమల్‌నాథ్, సుశీల్‌కుమార్ షిండే, ముకుల్ వాస్నిక్, కుమారి సెల్జా పేర్లు విన్పిస్తున్నాయి. తాను పోటీ చేయబోనని దిగ్విజయ్ ఇప్పటికే ప్రకటించడం తెలిసిందే. కమల్‌నాథ్ కూడా సోమవారం అదే మాట చెప్పారు. పరిశీలకులకు గెహ్లాట్ వర్గం షాకులు సీఎం గెహ్లాట్ నివాసంలో ఖర్గే, మాకెన్ ఆదివారం రాత్రి అత్యవసరంగా సీఎల్పీ సమావేశం ఏర్పాటు చేశారు. కానీ గెహ్లాట్ వర్గం ఎమ్మెల్యేలంతా దాన్ని బహిష్కరించడంతో వారు దిమ్మెరపోయారు! చాలాసేపు ఎదురు చూసినా ఎమ్మెల్యేలు రాకపోవడంతో భేటీని రద్దు చేసుకోవాల్సి వచ్చింది. చివరికి ఒక్కొక్కరిగా వచ్చి తమతో సమావేశం కావాల్సిందిగా ఆదేశించినా ఎమ్మెల్యేలు పట్టించుకోలేదు. పైగా అదే సమయంలో వారంతా కలిసి ఓ మంత్రి ఇంట్లో విడిగా సమావేశమయ్యారు! ‘‘గెహ్లాట్‌ను తప్పిస్తే ప్రభుత్వ మనుగడే ప్రమాదంలో పడుతుంది. రాష్ట్రంలో కాంగ్రెస్ కూడా చిక్కుల్లో పడుతుంది’’ అంటూ వ్యాఖ్యలు చేశారు. దీని తాలూకు వీడియో కూడా మీడియాకు లీకైంది! అనంతరం నవరాత్రి ఉత్సవాల్లో పాల్గొనాల్సి ఉందంటూ ఎమ్మెల్యేలంతా తమ తమ నియోజకవర్గాలకు వెళ్లిపోయారు! అనంతరం ఎమ్మెల్యేల తరఫున మంత్రులు శాంతి ధరీవాల్, మహేశ్ జోషి, ప్రతాప్‌సింగ్ పరిశీలకులతో భేటీ అయ్యారు. ‘‘సీఎం ఎవరనే దానిపై అక్టోబర్ 19 తర్వాత కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడే నిర్ణయం తీసుకోవాలి. రెండేళ్ల క్రితం పైలట్ తిరుగుబాటు సమయంలో ప్రభుత్వానికి విధేయులుగా నిలిచిన ఎమ్మెల్యేల నుంచే సీఎంను ఎన్నుకోవాలి. ఒక్కో ఎమ్మెల్యేలతో విడిగా కాకుండా అందరితో కలిసే మీరు భేటీ అవాలి’’ అంటూ షరతుల చిట్టాను వారి ముందుంచారు. ముందుగా ఎమ్మెల్యేల అనుమానాలను అధిష్టానం నివృత్తి చేయాలని చీఫ్ విప్ మహేశ్ జోషి కూడా డిమాండ్ చేశారు. ఎవరిని సీఎం చేసినా అభ్యంతరం లేదంటూనే, అది తమకు అంగీకారయోగ్యంగా ఉండాల్సిందేనంటూ కుండబద్దలు కొట్టారు. దాంతో విస్తుపోవడం ఖర్గే, మాకెన్ వంతయింది. ఈ వరుస భంగపాట్ల నేపథ్యంలో వారిద్దరూ సోమవారం ఉదయమే హస్తినకు తిరుగుముఖం పట్టారు. అధినేత్రి సోనియాగాంధీ నివాసానికి వెళ్లి జరిగిందంతా వివరించారు. దాంతో ఆగ్రహించిన సోనియా మొత్తం ఉదంతంపై లిఖితపూర్వక మంగళవారానికల్లా నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. గెహ్లాట్‌తో సన్నిహిత సంబంధాలున్న మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సీనియర్ నాయకుడు కమల్‌నాథ్‌ను హుటాహుటిన ఢిల్లీకి పిలిపించారు. ఆయన సోనియాతో గంటపాటు భేటీ అయ్యారు. గెహ్లాట్‌ను రాజీకి రప్పించేందుకు కమల్‌నాథ్‌ను నియోగించవచ్చంటున్నారు. తీర్మానంలో షరతులా: మాకెన్ గెహ్లాట్ వారసున్ని నిర్ణయించే అధికారాన్ని పార్టీ చీఫ్‌కు కట్టబెడుతూ సీఎల్పీ భేటీలో ఏకవాక్య తీర్మానం ఆమోదింపజేయాలని ఖర్గే, మాకెన్ తలపోయగా, అధ్యక్షునిగా ఎన్నికయ్యేదాకా గెహ్లాట్ సీఎంగా కొనసాగుతారంటూ అందులో చేర్చాలని ఆయన వర్గం ఎమ్మెల్యేలు పట్టుబట్టారు. ఇది క్రమశిక్షణ రాహిత్యమేనంటూ మాకెన్ మండిపడ్డారు. సోనియాతో భేటీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘తీర్మానమంటే కేవలం ఏకవాక్యంతో ఉంటుంది. అంతే తప్ప షరతులతో కూడిన తీర్మానాలు కాంగ్రెస్ చరిత్రలో ఎన్నడూ లేవు. సీఎల్పీ భేటీకి డుమ్మా కొట్టి విడిగా సమావేశం కావడం క్షమించరాని విషయం’’ అంటూ ఆగ్రహించారు. ‘‘సీఎంగా తీర్మానాన్ని ప్రవేశపెట్టాల్సింది గెహ్లాటే. తర్వాత అధ్యక్ష పదవికి పోటీ పడేదీ ఆయనే. గెలిస్తే తను సీఎంగా కొనసాగాలో లేదో నిర్ణయించేదీ ఆయనే. ఇది కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అవదా?’’ అంటూ మండిపడ్డారు. -
30న శశి థరూర్ నామినేషన్!
న్యూఢిల్లీ: కాంగ్రెస్ అధ్యక్ష పదవికి పార్టీ ఎంపీ శశి థరూర్ సెప్టెంబర్ 30న నామినేషన్ వేసే అవకాశముంది. శనివారం ఢిల్లీలో ఏఐసీసీ కార్యాలయంలో నామినేషన్ పత్రాలను థరూర్ ప్రతినిధి స్వీకరించారు. ఆయన దేశవ్యాప్తంగా తనకు మద్దతుగా సంతకాలు సేకరిస్తారని సమాచారం. రాజస్తాన్ సీఎం అశోక్ గెహ్లాట్‌తో థరూర్ తలపడనున్నారు. పోటీలో అశోక్ గెహ్లాట్.. కాంగ్రెస్ అధ్యక్ష పదవికి పోటీ చేస్తానని పార్టీ సీనియర్ నేత, రాజస్తాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ ప్రకటించారు. తన తర్వాత రాజస్తాన్ సీఎం ఎవరన్నది కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి అజయ్ మాకెన్ నిర్ణయిస్తారన్నారు. పార్టీలో ఇటీవల తెరపైకి వచ్చిన ‘ఒక వ్యక్తికి ఒకే పదవి’ అంశంపై చర్చ అనవసరమన్నారు. గెహ్లాట్ శుక్రవారం మహారాష్ట్రలోని షిర్డీలో మీడియాతో మాట్లాడారు. గాంధీ కుటుంబం నుంచి ఎవరూ పోటీలో ఉండరని రాహుల్ గాంధీ తనతో చెప్పారన్నారు. నామినేషన్ ఎప్పుడు దాఖలు చేయాలన్నది రాజస్తాన్ వెళ్లాక నిర్ణయించుకుంటానన్నారు. ఎన్నికలో పోటీ చేయడం అనేది ప్రజాస్వామ్యానికి సంబంధించిన అంశమని, నూతన ప్రారంభానికి శ్రీకారం చుడతామని వ్యాఖ్యానించారు. ఇదీ చదవండి: అధ్యక్షుడు ఎవరైనా.. పార్టీ మొత్తానికి నాయకుడు మాత్రం అతడే! -
ఆయనే ‘సరైనోడు’.. మల్లికార్జున్ ఖర్గే ఆసక్తికర వ్యాఖ్యలు
సాక్షి,న్యూఢిల్లీ: కాంగ్రెస్ అధ్యక్ష పదవికి మరికొన్ని రోజుల్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆ పార్టీ రాజ్యసభా పక్షనేత మల్లికార్జున్ ఖర్గే ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అధ్యక్ష పదవిని రాహుల్ గాంధీనే చేపట్టేందుకు తమవంతు ప్రయత్నం చేస్తామన్నారు. ఆయనలా దేశవ్యాప్తంగా ఆదరణ గల నేతలెవరూ కాంగ్రెస్‌లో లేరని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టే వ్యక్తికి కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, గుజరాత్ నుంచి పశ్చిమ బెంగాల్ వరకు మద్దతు ఉండాలని ఖర్గే అన్నారు. దేశవ్యాప్తంగా అందరూ ఆమెదించేలా, అత్యంత జనాదరణ కలిగిన నేత అయి ఉండాలన్నారు. పార్టీలో రాహుల్ మినహా అలాంటి వ్యక్తులెవరూ లేరని ఖర్గే అభిప్రాయం వ్యక్తం చేశారు. అందుకే అధ్యక్ష ఎన్నికలకు ముందే చాలా మంది నేతలు రాహుల్ గాంధీనే పార్టీ పగ్గాలు చేపట్టాలని విజ్ఞప్తి చేస్తున్నారని చెప్పారు. అధ్యక్ష బాధ్యతలు చేపట్టేందుకు రాహుల్ సుముఖంగా లేరని ప్రచారం జరుగుతన్న తరుణంలో ఈ విషయంపై ఖర్గే స్పందించారు. ఆయన సుముఖంగా లేకపోయినా పార్టీ నేతలమంతా కలిసి విజ్ఞప్తి చేస్తామన్నారు. పార్టీ కోసం, దేశం కోసం, ఆర్ఎస్ఎస్-బీజేపీపై పోరాటం చేసేందుకు పగ్గాలు చేపట్టాలని కోరతామన్నారు. అవసరమైతే బలవంతం చేస్తామన్నారు. అందరం ఆయన వెనకాలే ఉండి ఒప్పించే ప్రయత్నం చేస్తామన్నారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర పరాభవం అనంతరం అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు రాహుల్ గాంధీ. ఆ తర్వాత తాత్కాలిక అధ్యక్షురాలిగా సోనియా గాంధీ బాధ్యతలు చేపట్టారు. నూతన అధ్యక్షుడి కోసం ఎన్నికలు ఎప్పుడో జరగాల్సి ఉన్నా.. వివిధ కారణాల వల్ల వాయిదా పడుతూ వస్తున్నాయి. చివరకు సెప్టెంబర్‌లో ఎన్నికలు నిర్వహించేందుకు పార్టీ సిద్ధమవుతోంది. అయితే ఈసారి కూడా మళ్లీ వాయిదా పడే అవకాశాలున్నాయని పార్టీ వర్గాలు తెలిపాయి. కొన్నివారాల పాటు ఆలస్యమవుతాయని పేర్కొన్నాయి. చదవండి: మాజీ ఎమ్మెల్యే ఇంట్రెస్టింగ్ కామెంట్స్.. ఆజాద్ రాజీనామా అందుకేనా? -
సాక్షి కార్టూన్ 21-08-2022
సాక్షి కార్టూన్ 21-08-2022 -
టీఆర్ఎస్ అధ్యక్ష పదవికి నామినేషన్లు
సాక్షి, హైదరాబాద్: టీఆర్ఎస్ అధ్యక్ష పదవికి ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్‌రావు(కేసీఆర్) తరఫున 5 సెట్ల నామినేషన్లు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు దాఖలు చేశారు. నేటి నుంచి ఈ నెల 22 వరకు నామినేషన్ల స్వీకరణ జరగనుంది. ఈ నెల 25న టీఆర్ఎస్ పార్టీ అధ్యక్ష ఎన్నిక నిర్వహించనున్నారు. మంత్రులు సత్యవతి రాథోడ్, సబితా ఇంద్రారెడ్డి, మహమూద్ అలీ, ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఇంద్రకరణ్ రెడ్డి, నిరంజన్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, తలసాని శ్రీనివాస్ యాదవ్, జగదీశ్ రెడ్డి, మల్లారెడ్డి, అజయ కుమార్ నామినేషన్ పత్రాలు అందజేశారు. -
Hyderabad: గ్రేటర్ టీఆర్ఎస్లో అంతర్గత విభేదాలు
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ టీఆర్ఎస్లో అంతర్గత పోరు చినికిచినికి గాలివానలా మారుతోంది. సీనియర్ నేతలు, ఎమ్మెల్యేల మధ్య సయోధ్య కరువై పార్టీ డివిజన్, బస్తీ కమిటీల ఎంపిక ప్రక్రియ ప్రహసనంగా మారుతోంది. అధినేత కేటీఆర్ ఆదేశాల మేరకు ఈ కమిటీల ఏర్పాటు సెప్టెంబరు 30లోగా పూర్తికావాలి. కానీ మహానగరం పరిధిలోని మెజార్టీ నియోజకవర్గాల్లో ఈ వ్యవహారం కొలిక్కిరాకపోవడం గమనార్హం. ప్రధానంగా అంబర్పేట్ నియోజకవర్గంలో అధికార పార్టీ ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్, మాజీ కార్పొరేటర్లు, ప్రస్తుత కార్పొరేటర్ల మధ్య విబేధాలు భగ్గుమనడం సంచలనం సృష్టిస్తోంది. సీనియర్ నేతల అభిప్రాయాలను పక్కనపెట్టి తాజాగా ఎమ్మెల్యే ఏకపక్షంగా డివిజన్ అధ్యక్షులను ప్రకటించడంతో విభేదాలు తారాస్థాయికి చేరుకున్నట్లు సుస్పష్టమౌతోంది. ► ఇక ముషీరాబాద్, ఖైరతాబాద్, ఎల్బీనగర్, గోషామహల్, సికింద్రాబాద్, కంటోన్మెంట్ నియోజకవర్గాల్లో పార్టీ కమిటీల ఏర్పాటుపై నేతల మధ్య ఏకాభిప్రాయం కరువైంది. పలు నియోజకవర్గాల పరిధిలో పార్టీలో అంతర్గత కుమ్ములాటలపై కొందరు సీనియర్ నేతలు మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌కు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. ► కొన్ని నియోజకవర్గాల్లో పార్టీ ఎమ్మెల్యేలు, ద్వితీయశ్రేణి నాయకులు, కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్ల మధ్య సయోధ్య కుదిర్చే బాధ్యతలను నగర మంత్రులు తీసుకుంటే తప్ప విబేధాలు పరిష్కారం కావన్న సంకేతాలు వెలువడుతున్నాయి. మరికొన్ని చోట్ల పార్టీ వర్కింగ్‌ప్రెసిడెంట్ కేటీఆర్ జోక్యంతోనే విభేదాలు సద్దుమణిగే సూచనలు కనిపిస్తుండడం గమనార్హం. ► కాగా పలు నియోజకవర్గాల్లో ఈ నెలాఖరువరకైనా కమిటీల ఎంపిక ప్రక్రియ పూర్తవుతుందా లేదా అన్న అంశం సస్పెన్స్‌గా మారింది. దసరాకు కొత్త అధ్యక్షుడు..? విజయదశమి రోజున గ్రేటర్ టీఆర్ఎస్కు నూతన సారథిని ప్రకటించే అవకాశాలున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. అధ్యక్ష రేసులో రోజుకో కొత్త పేరు వినిపిస్తోంది. ప్రధానంగా మంత్రి తలసాని కుమారుడు సాయికిరణ్‌యాదవ్, గ్రేటర్ పార్టీ మాజీ అధ్యక్షులు కట్టెల శ్రీనివాస్ యాదవ్ పేర్లు తాజాగా తెరమీదకు వచ్చాయి. వీరిద్దరు కాకుండా ఇతర సీనియర్ నేతల అభ్యర్థిత్వాలను సైతం అధినేత కేసీఆర్, కేటీఆర్‌లు పరిశీలించే అవకాశాలు లేకపోలేదని పార్టీ నేతలు చెబుతున్నారు. అధ్యక్ష ఎంపిక విషయంలో వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిర్ణయమే తమకు శిరోధార్యమని పలువురు నేతలు స్పష్టంచేస్తున్నారు. -
అజహరుద్దీన్‌పై వేటు!
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ)లో అనూహ్య పరిణామం! నిబంధనలకు విరుద్ధంగా, ఉద్దేశపూర్వకంగా హెచ్‌సీఏ ప్రయోజనాలు దెబ్బ తీసే విధంగా వ్యవహరిస్తున్నారంటూ స్వయంగా అధ్యక్షుడిపైనే హెచ్‌సీఏ చర్య తీసుకుంది. అసోసియేషన్ అధ్యక్షుడు, భారత మాజీ కెప్టెన్ మొహమ్మద్ అజహరుద్దీన్‌ను ఆ పదవినుంచి తప్పిస్తున్నట్లు హెచ్‌సీఏ అపెక్స్ కౌన్సిల్ ప్రకటించింది. ఆయన హెచ్‌సీఏ సభ్యత్వం కూడా రద్దు చేస్తున్నట్లు వెల్లడించింది. అజహర్‌పై పలు ఆరోపణలు చేస్తూ ఈ నెల 10న అతనికి షోకాజ్ నోటీసు జారీ చేయగా...అందుకు అజహర్ స్పందించకపోవడంతో ఈ చర్య తీసుకున్నట్లు అపెక్స్ కౌన్సిల్ స్పష్టం చేసింది. యూఏఈలో జరిగిన అనధికారిక టి10 టోర్నీలో ఒక జట్టుకు మెంటార్‌గా వ్యవహరించడం, తన రిటైర్మెంట్ తేదీపై తప్పుడు సమాచారం ఇవ్వడం, హెచ్‌సీఏ ఖాతాలను స్థంభింపజేయడం, అంబుడ్స్‌మన్ ని యామకం, ఆటగాళ్ల ఎంపికలో జోక్యం చేసుకోవడం, హెచ్‌సీఏ సమావేశాలకు హాజరు కాకపోవడం తదితర అంశాలపై ఆరోపణలు చేసిన అపెక్స్ కౌన్సిల్...ఇకపై అసోసియేషన్ కార్యకలాపాల్లో అజహర్ పాల్గొనరాదని నిషేధం విధించింది. గత కొంత కాలంగా అజహర్‌కు, అపెక్స్ కౌన్సిల్ సభ్యులకు మధ్య తీవ్ర విభేదాలు నడుస్తున్నాయి. పరస్పర ఆరోపణలు, ప్రత్యారోపణలతో అవతలి పక్షంపై ఇరు వర్గాలు విరుచుకు పడుతున్నాయి. వివాదం బీసీసీఐ వరకు చేరినా, దీనిపై బోర్డు పెద్దగా స్పందించలేదు. ఇదే అపెక్స్ కౌన్సిల్ విభేదించినా సరే... ఇటీవల జరిగిన ఎస్‌జీఎంలో కూడా హెచ్‌సీఏ ప్రతినిధిగా అజహర్ పాల్గొనే అవకాశం బీసీసీఐ కల్పించింది. అపెక్స్ కౌన్సిల్ నిర్ణయానికి చట్టబద్ధత ఉందా లేదా అనే అంశంపై స్పష్టత లేని నేపథ్యంలో అజహర్‌పై వేటు అంశం ఆసక్తికరంగా మారింది. -
టీపీసీసీ రేసు నుంచి మరొకరు ఔట్: పోటీలోలేనట్టు ప్రకటన
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్ పార్టీ (టీపీసీసీ) అధ్యక్ష పదవిపై తనకు ఎటువంటి ఆసక్తి లేదని కాంగ్రెస్ సీనియర్ ఎమ్మెల్యే, మాజీమంత్రి డి.శ్రీధర్‌బాబు స్పష్టం చేశారు. ఆ పదవి రేసులో కూడా తాను లేనని పేర్కొన్నారు. హైదరాబాద్‌లోని అసెంబ్లీ మీడియా పాయింట్లో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. పీసీసీ ఎవరన్నది ఏఐసీసీ నిర్ణయిస్తుందని, ఆ నిర్ణయానికి తాను కట్టుబడి ఉంటానని చెప్పారు. -
భవిష్యత్‌లో ఆలోచిస్తా!
న్యూఢిల్లీ: అఖిల భారత ఫుట్‌బాల్ సమాఖ్య (ఏఐఎఫ్ఎఫ్) అధ్యక్ష పదవి గురించి భవిష్యత్‌లో కచ్చితంగా ఆలోచిస్తానని భారత ఫుట్‌బాల్ జట్టు మాజీ కెప్టెన్ బైచుంగ్ భూటియా అన్నాడు. ఫేస్బుక్ చిట్‌చాట్‌లో అభిమానులు అడిగిన ప్రశ్నకు సమాధానంగా భూటియా తన ఆకాంక్షను బయటపెట్టాడు. 2011లో కెరీర్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన ఈ సిక్కిం ఆటగాడు ప్రస్తుతం తన దృష్టంతా క్షేత్రస్థాయిలో ఫుట్‌బాల్ అభివృద్ధిపైనే ఉందని పేర్కొన్నాడు. ‘ఏఐఎఫ్ఎఫ్ అధ్యక్ష పదవికి భవిష్యత్‌లో ఏదో ఒక రోజు పోటీదారుగా ఉంటా. కానీ ప్రస్తుతానికైతే క్షేత్రస్థాయి నుంచి ఫుట్‌బాల్ క్రీడ అభివృద్ధి చేయడమే నా లక్ష్యం. బైచుంగ్ భూటియా ఫుట్‌బాల్ స్కూల్, యునైటెడ్ సిక్కిం క్లబ్‌ల ద్వారా నేను అదే పనిలో ఉన్నా’ అని 43 ఏళ్ల భూటియా అన్నాడు. ఫుట్‌బాల్‌లో అపార నైపుణ్యం ఉన్న భూటియా భారత్‌కు చెందిన మిడ్‌ఫీల్డర్ బ్రాండన్ ఫెర్నాండోస్పై ప్రశంసల వర్షం కురిపించాడు ‘ఈ కాలం స్ట్రయికర్లలో సునీల్ ఛెత్రి, మిడ్ ఫీల్డర్లలో బ్రాండన్ ఫెర్నాండోస్ ఉత్తమ ప్లేయర్లు. ఐఎస్ఎల్లో ఎఫ్‌సీ గోవా తరఫున బ్రాండన్ అద్భుతంగా ఆడుతున్నాడు. మైదానంలో అతని నైపుణ్యాలు గొప్పగా ఉంటాయి’ అని భూటియా తెలిపాడు. 1995 నుంచి 2011 వరకు భారత్‌కు ప్రాతినిధ్యం వహించిన భూటియా జూనియర్, సీనియర్ స్థాయిలలో కలిపి మొత్తం 104 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడి 40 గోల్స్ సాధించాడు. -
మోదీ ఆఫర్ ఇచ్చారు.. నేనే వద్దన్నా!
ముంబై: ప్రధాని మోదీ కలిసి పనిచేద్దామంటూ ఇచ్చిన ఆహ్వానాన్ని తానే తిరస్కరించానని ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ తెలిపారు. రాష్ట్రపతి పదవిని తనకు ప్రధాని ఇవ్వజూపారన్న వార్తలను పవార్ కొట్టిపారేశారు. ఓ మరాఠా టీవీ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన. గత నెలలో ప్రధాని మోదీతో భేటీ, అనంతర రాజకీయ పరిణామాలకు సంబంధించి పలు విషయాలు వెల్లడించారు. ‘కలిసి పనిచేద్దామంటూ మోదీ నన్ను అడిగారు. మన మధ్య వ్యక్తిగత సంబంధాలు చాలా బాగున్నాయి. వాటిని అలాగే కొనసాగనివ్వండి. కానీ, కలిసి పనిచేయడం మాత్రం కుదరదు అని ప్రధానికి తెలిపా’నన్నారు. ఆ భేటీలో తనకు రాష్ట్రపతి పదవి ఇవ్వజూపారంటూ వచ్చిన వార్తలపై ఆయన స్పందిస్తూ..‘అలాంటిదేమీ లేదు. కానీ, నా కుమార్తె సుప్రియా సూలేకు కేబినెట్లో చోటు కల్పిస్తామని చెప్పారు’అని పవార్ వివరించారు. దేవేంద్ర ఫడ్నవీస్‌తో అనూహ్యంగా చేతులు కలిపినందుకే అజిత్ పవార్‌కు ఉద్ధవ్ ఠాక్రే కేబినెట్లో స్థానం కల్పించలేదన్నారు. ‘అజిత్ ప్లేటు ఫిరాయించిన విషయం తెలియగానే మొట్టమొదటగా ఉద్ధవ్ ఠాక్రేకు ఫోన్ చేశా. అజిత్ అలా చేసి ఉండకూడదు.. నాపై నమ్మకముంచండి.. ఆ తిరుగుబాటును అణిచివేస్తానని ఠాక్రేకు తెలిపా’అని చెప్పారు. ‘అజిత్‌కు ఎన్సీపీ మద్దతు లేదని తెలియగానే అతడి వెంట ఉన్న ఎమ్మెల్యేలపై ఒత్తిడి పెరిగిపోయింది. అందుకే వెంటనే వచ్చేశారు’అని వివరించారు. ‘ఫడ్నవీస్ పక్షంను వీడి రావాలంటూ నా కుటుంబ సభ్యులు ఎవరైనా అజిత్‌ను కోరిన విషయం నాకు తెలియదు. కానీ, అజిత్ చేసింది తప్పని అంతా భావించారు’ అని తెలిపారు. ‘నువ్వు క్షమించరాని పని చేశావు. దీనికి ఫలితం ఎవరైనా సరే అనుభవించాల్సిందే. నువ్వు అందుకు మినహాయింపు కాదు’అని అజిత్‌కు చెప్పానన్నారు. -
ఇతరులూ కాంగ్రెస్ చీఫ్ కావొచ్చు
న్యూఢిల్లీ: కాంగ్రెస్‌లో గాంధీ కుటుంబం వారు కాకుండా ఎవరైనా అధ్యక్షుడు కావొచ్చని.. అయితే కచ్చితంగా గాంధీ కుటుంబం మాత్రం పార్టీలో చురుకుగా ఉండాల్సి ఉంటుందని కాంగ్రెస్ సీనియర్ నేత మణిశంకర్ అయ్యర్ అన్నారు. గాంధీ ముక్త్ కాంగ్రెస్ పేరుతో కాంగ్రెస్ ముక్త్ భారత్ చేయడమే బీజేపీ అసలు లక్ష్యమని ఒక ఇంటర్వ్యూలో ఆరోపించారు. లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ వైఫల్యంతో పార్టీ చీఫ్ ఎవరనే ప్రతిష్టంభనపై అయ్యర్ స్పందించారు. రాహుల్ కాంగ్రెస్ చీఫ్‌గా ఉండటమే మంచిదని.. అయితే ఆయన అభిప్రాయాలను నాయకులు, కార్యకర్తలు గౌరవించాలని అభిప్రాయపడ్డారు. గాంధీ–నెహ్రూ కుటుంబాలు అధ్యక్ష పదవిలో లేకున్నాపార్టీ మనగలుగుతుంది. క్లిష్ట పరిస్థితులు తలెత్తినప్పుడు.. నేతల మధ్య అభిప్రాయ భేదాలు వచ్చినప్పుడు వాటిని పరిష్కరించే సత్తా వారికే ఉందని చెప్పారు. నెహ్రూ–గాంధీ కుటుంబంలోని వారు అధ్యక్ష పదవిలో ఉన్నప్పుడు పార్టీలో నేతల మధ్య తలెత్తిన సమస్యలను ఏ విధంగా పరిష్కరించారో ఉదహరించారు. చీఫ్‌గా రాహులే ఉంటారా? ఇతరులు వస్తారా? అన్న దానికి వేచి చూడాల్సిందే అని అయ్యర్ చెప్పారు. లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ వైఫల్యంతో పార్టీ చీఫ్ పదవి నుంచి తప్పుకోవడానికి రాహుల్ ప్రతిపాదించగా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ తిరస్కరించింది. అయితే, చీఫ్‌గా ఎవరుండాలనేది పార్టీనే నిర్ణయిస్తుందని రాహుల్ ప్రకటించారు. -
ప్రపంచ బ్యాంకు సారథిగా ఇంద్రా నూయి?
న్యూయార్క్: ప్రపంచ బ్యాంకు ప్రెసిడెంట్ పదవి రేసులో పెప్సీకో మాజీ సీఈవో, జన్మతః భారతీయురాలైన ఇంద్రా నూయి పేరు తెరపైకి వచ్చింది. విశ్వసనీయ వర్గాల సమాచారం ఆధారంగా న్యూయార్క్ టైమ్స్ ఈ మేరకు ఓ కథనాన్ని ప్రచురించింది. అభ్యర్థుల ఎంపికలో కీలక పాత్ర పోషిస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పెద్ద కుమార్తె ఇవాంక, ఇంద్రా నూయి పేరును ప్రతిపాదించారు. ఇంద్రా నూయిని మార్గదర్శిగా, స్ఫూర్తినీయురాలిగా పేర్కొంటూ ఇవాంకా గత ఆగస్ట్‌లో ఓ ట్వీట్ కూడా చేశారు. అయితే, తన నామినేషన్‌ను ఇంద్రా నూయి అంగీకరిస్తారా, లేదా అన్న దానిపై ప్రస్తుతానికి స్పష్టత లేదు. ప్రపంచ బ్యాంకు ప్రస్తుత ప్రెసిడెంట్ జిమ్‌యాంగ్ కిమ్ ఫిబ్రవరిలో తన పదవి నుంచి తప్పుకోనున్నట్టు ఇటీవలే ప్రకటించారు. ప్రైవేటు ఇన్ఫ్రా కంపెనీలో చేరనున్నట్టు ఆయన చెప్పారు. నిర్ణీత పదవీ కాలం కంటే మూడేళ్ల ముందే ఆయన తప్పుకుంటున్నారు. కిమ్ వారసుల ఎంపిక ప్రక్రియను ట్రెజరీ సెక్రటరీ స్టీవెన్ ముంచిన్, ఇవాంకా చూస్తున్నారు. ఈ కమిటీ అభ్యర్థుల నామినేషన్లతో కూడిన జాబితాను ట్రంప్ ముందు ఉంచనున్నారు. ఇవాంక మద్దతుతో నూయి ప్రధాన పోటీదారుగా మారడం ఆసక్తికరం. రేసులో మరో ఇద్దరు... ఇక ప్రపంచ బ్యాంకు ప్రెసిడెంట్ పదవికి....అమెరికా అంతర్జాతీయ వ్యవహారాల మంత్రి డేవిడ్ మల్పాస్, ఓవర్సీస్ ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ కార్పొరేషన్ ప్రెసిడెంట్ రే వాష్బర్న్ల పేర్లు కూడా పరిశీలనలో ఉన్నాయి. ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడిని ప్రపంచ బ్యాంక్ బోర్డ్ నియమిస్తుంది. అయితే అమెరికా అధ్యక్షడు నామినేట్ చేసిన వ్యక్తే ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడు కావడం రివాజు. వైట్ హౌస్ సీనియర్ సలహాదారు పదవిలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన కూతురిని నియమించడం పట్ల ఇప్పటికే విమర్శలు తలెత్తుతున్నాయి. ఇప్పుడు ప్రపంచ బ్యాంక్ అధ్యక్ష పదవి విషయంలో ఇవాంకా జోక్యం చేసుకోవడంతో ఈ విమర్శలు మరింతగా పెరుగుతున్నాయి. తన స్వప్రయోజనాల కోసం ఇవాంకా అంతర్జాతీయ ఆర్థిక వ్యవహారాల్లో తలదూర్చుతున్నారన్న విమర్శలున్నాయి. -
రూ. 50 కోట్లతో రాష్ట్రపతి అవసరమా?
న్యూఢిల్లీ: పార్లమెంట్ భవన్లో మంగళవారం మధ్యాహ్నం రాష్ట్రపతిగా రామ్‌నాథ్ కోవింద్ ప్రమాణ స్వీకారోత్సవం అట్టహాసంగా జరిగింది. 21 తుపాకులతో గౌరవ వందనం, అనంతరం శ్వేతవర్ణ దుస్తులు ధరించిన భద్రతా సిబ్బంది రాచరిక చిహ్నంగా కత్తులతో అశ్వారోహకులై ముందు కవాతుతో కదంతొక్కుతుండగా కోవింద్ కారు మందగమనంతో ముందుకు సాగింది. దారి పొడువున వివిధ భద్రతా దళాల సాల్యూట్ను స్వీకరిస్తూ కోవింద్ రాష్ట్రపతి భవన్ చేరుకున్నారు. రాజు వెడల రవితేజములరయగా.....అన్నట్లూ ఆర్భాటం చూస్తే ఆహా! ఎంత శోభాయమానంగా ఉందని ఎవరైనా అనుకోవచ్చు! నేటి భారత పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థకు రాష్ట్రపతి పదవి అవసరమా ? అన్నదే ఇక్కడ అసలు ప్రశ్న. రాష్ట్రపతికి నిజమైన అధికారాలు ఇవ్వడం లేదని, అలంకార ప్రాయమైన పదవని రాజ్యాంగ నిర్మాతలే అభివర్ణించారు. రాష్ట్రపతి అన్న పదవి 'జాతికి ఒక చిహ్నం' అని బాబా సాహెబ్ అంబేడ్కర్ స్వయంగా వ్యాఖ్యానించారు. రాష్ట్రపతి 'గొప్ప ఉత్సవ విగ్రహం' అని తొలి ప్రధాన మంత్రి జవహర్ లాల్ నెహ్రూ అభివర్ణించారు. దేశాన్ని పరిపాలించని గౌరవ ప్రధమైన అధికారి మాత్రమేనని, ఇంగ్లండ్‌లో రాచరిక వ్యవస్థకు చిహ్నంగా భారత రాష్ట్రపతి పదవి అన్న ఎంతో మంది పెద్దలు ఉన్నారు. ఈ పదవిని రద్దు చేయాలంటూ డిమాండ్ చేస్తూ వస్తున్న వారు కూడా ఎక్కువే ఉన్నారు. మరి అలంకార ప్రాయమైన భారత రాష్ట్రపతి పదవిని కొనసాగించడానికి ఏడాదికి 40 నుంచి 50 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని ఖర్చు పెట్టడం ఎంతమేరకు సమంజసం. 2014-2015 ఆర్థిక సంవత్సరానికి రాష్ట్రపతి భవనం నిర్వహణ కోసం 41.96 కోట్ల రూపాయలను దేశ ప్రభుత్వం కేటాయించింది. ముంబయికి చెందిన మన్సూర్ దార్వేష్ (65) దాఖలు చేసిన ఆర్టీఐ కింద రాష్ట్రపతి భవన్ బడ్జెట్ వివరాలు వెలుగులోకి వచ్చాయి. రాష్ట్రపతి భవన్లో 754 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. వారిలో 9 మంది ప్రైవేటు కార్యదర్శులు, 8 మంది టెలిఫోన్ ఆపరేటర్లు, 27 మంది డ్రైవర్లు, 64 మంది వివిధ రకాలు పనులు చేసే వారున్నారు. వీరందరికి జీతాల కింద నెలకు కోటిన్నర నుంచి దాదాపు రెండు కోట్ల రూపాయల వరకు ఖర్చవుతోంది. 2015, మే నెలకు చెల్లించిన జీతాల మొత్తం 1.52 కోట్ల రూపాయలు. అదే ఏడాది మార్చి, ఏప్రిల్ నెలలకు గాను టెలిఫోన్ బిల్లులు 4.25 లక్షలు, 5.01 లక్షల రూపాయలుగా వచ్చాయి. విద్యుత్ ఛార్జీలు, భద్రతా సిబ్బంది జీతభత్యాలకు ఎంత ఖర్చవుతుందో తెలియదు. ఆ వివరాలను ఆర్టీఐ కింద వెల్లడించడానికి రాష్ట్రపతి భవన్ తిరస్కరించింది. అలంకారప్రాయమైన పదవిని ఇంతఖర్చుతో కొనసాగించాల్సిన అవసరం ఉందా? రాష్ట్రపతి పదవికి అతి తక్కువ అధికారాలు ఉన్నప్పటికీ రాజకీయ సంక్షోభ పరిస్థితుల్లో ఆయన నిర్వహించే పాత్ర పెద్దదని వాదించే ప్రజాస్వామిక వాదులు కూడా ఉన్నారు. 1990వ దశకంలో లాగా ఏ రాజకీయ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాని సందర్భాల్లో రాష్ట్రపతి కీలకం అవుతారని, 1975లో నాటి రాష్ట్రపతి సంతకం చేస్తేనే ఎమర్జెన్సీ ఉత్తర్వులు అమల్లోకి వచ్చాయన్నది వారి వాదన. ఎమర్జెన్సీ వల్ల మంచికన్నా చెడే ఎక్కువ జరిగిందన్నది అందరికి తెల్సిందే. నాడు రాష్ట్రపతి సంతకం చేయకపోతే ఎమర్జెన్సీ ఆగిపోయేదా! స్పష్టత లేదు. పార్లమెంట్ వెలుపల ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రానప్పుడు తలెత్తే పరిస్థితిని కోర్టుల ద్వారా చక్కబెట్టుకోవచ్చు. లోక్‌సభలో సంపూర్ణ మెజారిటీ ఉండి, రాజ్యసభలో కూడా మెజారిటీ దిశగా పాలకపక్షం పయనిస్తున్న నేపథ్యంలో రామ్‌నాథ్ కోవింద్ లాంటి వ్యక్తులు ఏ మేరకు ప్రజాస్వామ్య పరిరక్షకులుగా ఉండగలరనేది కోటి రూకల ప్రశ్న. ఆర్డినెన్స్‌ల తప్పుడు సంప్రదాయానికి చరమగీతం పాడాలంటూ పదవి నుంచి తప్పుకుంటూ ప్రణబ్ ముఖర్జీ పిలుపునిచ్చారు. మోదీ ప్రభుత్వం నుంచి వచ్చే ఆర్డినెన్స్‌లను రామ్‌నాథ్ లాంటి వారు తిప్పి పంపగలరా? మోదీ విధేయులే రాష్ట్రపతి భవన్ అధికారులుగా నియమితులైనట్లు వార్తలొస్తున్న నేపథ్యంలో అది సాధ్యమయ్యే పనేనా? మరి ఎందుకీ పదవి? ఎవరి కోసం!? -
అమ్మకానికి తెలుగు యువత అధ్యక్ష పదవి
-
ఏపీ ఒలంపిక్సంఘం అద్యక్షపదవిలో మరోట్విస్ట్