సీఎంది దొంగ దీక్ష
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిపై భువనగిరి ఎంపి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బుధవారం న్యూఢిల్లీలో తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కిరణ్ దొంగ దీక్షలు చేస్తున్నారని ఆరోపించారు. కిరణ్కు చిత్తశుద్ధి ఉంటే వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని రాజగోపాల్ రెడ్డి ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. రానున్న ఎన్నికల కిరణ్ ఎమ్మెల్యేగా గెలిచే దమ్ము లేదని ఆయన వ్యాఖ్యానించారు. ఎన్నికల సమీపిస్తున్న తరుణంలో కిరణ్ నాటకాలు ఆడుతున్నారని ఎద్దేవా చేశారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లు తప్పుల తడకగా ఉన్న నేపథ్యంలో ఆ బిల్లును తిప్పి రాష్ట్ర అసెంబ్లీ తిప్పి రాష్ట్రపతికి పంపింది. అయిన రాష్ట్ర విభజన విషయంలో కేంద్ర తనదైన శైలిలో దూసుకుపోతుంది. దాంతో సీఎం కిరణ్ తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. దీంతో బుధవారం మాజీ ప్రధాని ఇందిరా గాంధీ సమాధి శక్తిస్థల్ వద్ద మౌన దీక్ష చేపట్టాలని ఆయన భావించారు. అనివార్య కారణాల వల్ల శక్తిస్థల్ వద్ద దీక్ష రద్దు అయింది. దాంతో సీఎం మౌన దీక్ష జంతర్ మంతర్ వద్దకు మార్చారు. దీంతో సీఎంతోపాటు సీమాంధ్రకు చెందిన కేంద్రంమంత్రలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పలువురు నాయకలు పాల్గొన్నారు. దీంతో సీఎం మౌన దీక్షపై కోమటిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేస్తుపై విధంగా స్పందించారు.