జంతర్ మంతర్ వద్ద కిరణ్ మౌనదీక్ష
న్యూఢిల్లీ : ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి బుధవారం జంతర్ మంతర్ వద్ద మౌనదీక్ష ప్రారంభించారు. ఆయన దీక్షలో సీమాంధ్ర ప్రాంత మంత్రులు, ఎంపీలు పాల్గొన్నారు. అంతకు ముందు ఏపీ భవన్లో తెలంగాణవాదుల నిరసనలు, నినాదాల మధ్య ఎట్టకేలకు కిరణ్‌కుమార్ రెడ్డి రాజ్‌ఘాట్‌కు చేరుకున్నారు. మహాత్ముడికి నివాళులు అర్పించిన అనంతరం ఆయన అక్కడినుంచి జంతర్ మంతర్‌కు చేరుకున్నారు.
సీఎంతో పాటు మంత్రులు ఏరాసు ప్రతాప్‌రెడ్డి, ఆనం వివేకానంద రెడ్డి , పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ నివాళులు అర్పించారు. దీక్ష అనంతరం ముఖ్యమంత్రి నేతృత్వంలోని బృందం రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కలవనుంది. విభజన బిల్లును పార్లమెంట్‌లో ప్రవేశపెట్టకుండా చూడాలని విన్నవించనుంది.