kiran deeksha
-
జంతర్ మంతర్ వద్ద కిరణ్ మౌనదీక్ష
-
జంతర్ మంతర్ వద్ద కిరణ్ మౌనదీక్ష
న్యూఢిల్లీ : ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి బుధవారం జంతర్ మంతర్ వద్ద మౌనదీక్ష ప్రారంభించారు. ఆయన దీక్షలో సీమాంధ్ర ప్రాంత మంత్రులు, ఎంపీలు పాల్గొన్నారు. అంతకు ముందు ఏపీ భవన్లో తెలంగాణవాదుల నిరసనలు, నినాదాల మధ్య ఎట్టకేలకు కిరణ్‌కుమార్ రెడ్డి రాజ్‌ఘాట్‌కు చేరుకున్నారు. మహాత్ముడికి నివాళులు అర్పించిన అనంతరం ఆయన అక్కడినుంచి జంతర్ మంతర్‌కు చేరుకున్నారు. సీఎంతో పాటు మంత్రులు ఏరాసు ప్రతాప్‌రెడ్డి, ఆనం వివేకానంద రెడ్డి , పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ నివాళులు అర్పించారు. దీక్ష అనంతరం ముఖ్యమంత్రి నేతృత్వంలోని బృందం రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కలవనుంది. విభజన బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టకుండా చూడాలని విన్నవించనుంది. -
అధిష్టానం పిలుపుతో హస్తినకు కిరణ్
హైదరాబాద్ : అధిష్టానం పిలుపు మేరకు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మంగళవార ఉదయం ఢిల్లీ బయల్దేరారు. కాగా రాష్ట్ర విభజన వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఢిల్లీలో దీక్ష చేయాలని సీమాంధ్ర కాంగ్రెస్‌నేతలు నిర్ణయించుకున్న విషయం తెలిసిందే. కిరణ్‌కుమార్‌రెడ్డి నేతృత్వంలో బుధవారం ఢిల్లీలోని ఇందిరాగాంధీ స్మారక చిహ్నమైన శక్తిస్థల్ వద్ద నిరసన దీక్షను చేపట్టనున్నట్లు తెలుస్తోంది. ఢిల్లీలో తాము చేపట్టాల్సిన కార్యక్రమాలపై ముఖ్యమంత్రి గత రెండురోజులుగా కొందరు మంత్రులు, ఇతర నేతలతో సమావేశమై చర్చించారు. బిల్లుకు మద్దతు పలకరాదని కోరేందుకు ఇతర పార్టీల నేతలను కలవాలా? లేదా? అన్న అంశంపై తర్జనభర్జనలు సాగించారు. కాగా రాష్ట్రపతి అపాయింట్మెంట్ ఐదో తేదీకి ఖరారైన నేపథ్యంలో రేపు ఢిల్లీ వెళ్లాలని సీఎం భావించారు. అయితే అధిష్టానం పిలుపుతో ఒకరోజు ముందే బయల్దేరారు. -
'ఢిల్లీలో కిరణ్ దీక్షపై నిర్ణయం తీసుకోలేదు'
హైదరాబాద్ : సమైక్యాంధ్రకు మద్దతుగా ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఢిల్లీలో దీక్ష చేపట్టే అంశంపై ఇంకా నిర్ణయానికి రాలేదని, పరిశీలనలో ఉందని మంత్రి సి. రామచంద్రయ్య అన్నారు. ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయంలో సీమాంధ్ర ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల భేటీ ముగిసింది. భేటీ అనంతరం రామచంద్రయ్య మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలోని ఉభయ సభల్లో తెలంగాణ బిల్లును తిరస్కరించాలన్న తీర్మానం నెగ్గిన విషయాన్ని రాష్ట్రపతి దృష్టికి తీసుకువెళతామని తెలిపారు. ఈనెల 4,5వ తేదీల్లో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ అపాయింట్మెంట్ కోరినట్లు ఆయన చెప్పారు. తమకు మద్దతుగా అన్ని పార్టీల ఫ్లోర్ లీడర్లను కూడా ఢిల్లీకి ఆహ్వానిస్తామని రామచంద్రయ్య తెలిపారు.