'ఢిల్లీలో కిరణ్ దీక్షపై నిర్ణయం తీసుకోలేదు' | not yet decided on kiran kumar reddy fasting in delhi | Sakshi

'ఢిల్లీలో కిరణ్ దీక్షపై నిర్ణయం తీసుకోలేదు'

Published Sat, Feb 1 2014 2:45 PM | Last Updated on Mon, Jul 29 2019 5:31 PM

ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయంలో సీమాంధ్ర ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల భేటీ ముగిసింది.

హైదరాబాద్ : సమైక్యాంధ్రకు మద్దతుగా ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఢిల్లీలో దీక్ష చేపట్టే అంశంపై ఇంకా నిర్ణయానికి రాలేదని, పరిశీలనలో ఉందని మంత్రి సి. రామచంద్రయ్య అన్నారు.  ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయంలో సీమాంధ్ర ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల భేటీ ముగిసింది.

భేటీ అనంతరం రామచంద్రయ్య మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలోని ఉభయ సభల్లో తెలంగాణ బిల్లును తిరస్కరించాలన్న తీర్మానం నెగ్గిన విషయాన్ని రాష్ట్రపతి దృష్టికి తీసుకువెళతామని తెలిపారు. ఈనెల 4,5వ తేదీల్లో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ అపాయింట్మెంట్ కోరినట్లు ఆయన చెప్పారు. తమకు మద్దతుగా అన్ని పార్టీల ఫ్లోర్ లీడర్లను కూడా ఢిల్లీకి ఆహ్వానిస్తామని రామచంద్రయ్య తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement