నర్సాపూర్, న్యూస్‌లైన్: రాష్ట్ర శాసనసభలో ప్రత్యేక తెలంగాణ ముసాయిదా బిల్లుపై సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి వ్యాఖ్యలు బాధాకరమని రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సునీతాలక్ష్మారెడ్డి అన్నా రు. ఆమె గురువారం సాయంత్రం స్థానిక విలేకరులతో మాట్లాడారు. ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు చేస్తే సీమాంధ్రలో కాంగ్రెస్‌కు నష్టం వాటిల్లుతుందని తెలిసే సోనియాగాంధీ తెలంగాణ ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నారని చెప్పారు. పార్టీ నాయకుడిగా, సీఎంగా ఉంటూ తాను రాష్ట్ర విభజనకు వ్యతిరేకమని ప్రకటించడం సబబుకాదన్నారు. మంత్రి బాలరాజు సభలో మాట్లాడుతూ తాను సమైఖ్యవాదిని అయినా పార్టీ అధిష్టాన నిర్ణయానికి కట్టుబడి ఉన్నట్లు ప్రకటించడం అభినందించారు. రాష్ట్రపతి 30వరకు గడువు పెంచడం పట్ల ఆమె స్పందిస్తూ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు నిదర్శనమని చెప్పారు.
జగన్నాథరావు ఆశయాలు కొనసాగిస్తాం
స్థానిక కాంగ్రెస్ నాయకుడు, దివంగత మాజీ డిప్యూటీ సీఎం జగన్నాథరావు రెండవ వర్ధం తిని పురస్కరించుకుని గురువారం సాయంత్రం మంత్రి సునీతాలక్ష్మారెడ్డి నర్సాపూర్ లోని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. మంత్రి వెంట సర్పంచ్ వెంకటరమణారావు, కాంగ్రెస్ నాయకులు ఆంజనేయులుగౌడ్, సత్యంగౌడ్, శ్రీనివాస్‌గుప్తా, అనిల్‌గౌడ్, నయీం, విష్ణువర్ధన్‌రెడ్డి,వెంకటేశం పాల్గొన్నారు.
మాజీ డిప్యూటీ సీఎంకు ఘన నివాళి
స్థానిక కాంగ్రెస్ నాయకుడు, దివంగత మాజీ డిప్యూటీ సీఎం చౌటి జగన్నాథరావు రెండో వర్ధంతి సందర్భంగా గురువారం స్థానిక ఆయన విగ్రహం వద్ద ఆయన కుటుంబ సభ్యులతో పాటు పలు పార్టీల నాయకులు ఘనంగా నివాళ్లర్పించారు. ఆయన భార్య వనమాల, కుమారుడు శ్రీనివాసరావు, కోడలు రమాదేవితోపాటు ఇతర కుటుంబ సభ్యులతో పాటు ఆయా పార్టీల నాయకులు పాల్గొని జగన్నాథరావు విగ్రహానికి పూలమాలలు వేశారు. అనంతరం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు.
సీఎం వ్యాఖ్యలు బాధాకరం
Published Fri, Jan 24 2014 12:13 AM | Last Updated on Mon, Jul 29 2019 5:31 PM
Advertisement