సీఎం పేషీ అధికారులకు పోస్టింగ్ | Kiran Kumar Reddy Peshis Reshuffled | Sakshi
Sakshi News home page

సీఎం పేషీ అధికారులకు పోస్టింగ్

Published Mon, Feb 17 2014 8:37 PM | Last Updated on Mon, Jul 29 2019 5:31 PM

సీఎం పేషీ అధికారులకు పోస్టింగ్ - Sakshi

సీఎం పేషీ అధికారులకు పోస్టింగ్

హైదరాబాద్: సీఎం పేషీ అదికారులందరికీ పోస్టింగ్ కల్పించే పనిలో పడ్డారు కిరణ్ కుమార్ రెడ్డి.  సీఎం పేషీలో సెక్రటరీలుగా పనిచేస్తున్న అధికారులకు కీలక శాఖల్లో పునారావాసం కల్పించే దిశగా  కిరణ్ చర్యలు చేపట్టారు. ఈ క్రమంలోనే ఏపీజెన్కో ఎండీగా ఎస్ఎస్ రావత్,  ప్రెస్ అకాడమీ చైర్మన్ గా సత్యారావు, ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శిగా అజయ్ కల్లాం, ఇరిగేషన్ శాఖ ముఖ్య కార్యదర్శిగా జవహర్ రెడ్డి, డిస్టలరీస్ ఎండీగా శ్రీధర్ లు పోస్టింగ్ లు అందుకోనున్నారు.

 

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర పునర్‌వ్యవస్థీకరణ బిల్లుపై లోక్సభలో చర్చ ప్రారంభం కాగానే రాజీనామా చేయాలని సిఎం  నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. బిల్లుపై లోక్సభలో రేపు చర్చ ప్రారంభమవుతుంది.  సచివాలయంలోని సిఎం పేషీలో వ్యక్తిగత వస్తువులను సిబ్బంది తీసుకువెళ్లినట్లు  తెలుస్తోంది. రేపు సీఎంగా కిరణ్ రాజీనామా చేస్తారన్న వార్తల నేపథ్యంలో ఆయన పేషీ అధికారులకు కీలక శాఖలకు బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారని విశ్వసనీయ సమాచారం.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement