అసెంబ్లీ తిరస్కరించిన బిల్లు పార్లమెంటుకు పంపకూడదు | Do not send the rejected bill to Parliament: Kirankumar Reddy | Sakshi
Sakshi News home page

అసెంబ్లీ తిరస్కరించిన బిల్లు పార్లమెంటుకు పంపకూడదు

Published Wed, Feb 5 2014 3:49 PM | Last Updated on Mon, Jul 29 2019 5:28 PM

ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి - Sakshi

ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి

ఢిల్లీ: అసెంబ్లీ తిరస్కరించిన ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర పునర్‌వ్యవస్థీకరణ బిల్లు (తెలంగాణ బిల్లు)ను రాష్ట్రపతి పార్లమెంట్‌కు పంపకూడదని  ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ అంశాన్ని జాతీయస్థాయికి తీసుకెళ్లేందుకే తాను మౌనదీక్ష చేపట్టినట్లు తెలిపారు.

రాష్ట్ర విభజనను ఎస్ఆర్సి(స్టేట్స్ రీఆర్గనైజేషన్ కమిషన్-రాష్ట్రాల పునర్వవస్థీకరణ కమిషన్) గానీ, శాసనసభ గానీ ప్రతిపాదించలేదని తెలిపారు. ఏ ప్రాతిపదిక లేకుండా విభజన చేయడం అనూహ్యపరిణామంగా  పేర్కొన్నారు. రాష్ట్ర విభజన వల్ల మూడు ప్రాంతాలకూ ప్రయోజనం సీఎం లేదని తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement