సాక్షి, ఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వంలో విపక్ష పార్టీ నేతలను టార్గెట్ చేసి దాడులు చేస్తున్నారని వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.
ఢిల్లీ జంతర్ మంతర్‌లో ధర్నా సందర్భంగా వైఎస్ జగన్ మీడియాతో మాట్లాడారు. ఈ క్రమంలో వైఎస్ జగన్.. ఏపీలో వైఎస్సార్‌సీపీ పార్లమెంటరీ పార్టీ నేతలపైనే దాడి చేశారు. మాజీ ఎంపీ, దళిత నేత రెడ్డప్ప ఇంటిపై దాడికి పాల్పడ్డారు. రెడ్డప్ప ఇంటిపై దాడి చేసి కార్లను ధ్వంసం చేశారు. ఏపీలో లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోంది. ఏపీలో లోకేష్ రెడ్ బుక్ హోర్డింగ్స్ పెట్టారు. పోలీసులు రెడ్ బుక్ రాజ్యాంగం ప్రకారమే నడుచుకుంటున్నారు. మేము అధికారంలో ఉన్నప్పుడు ప్రతికార చర్యలను ప్రోత్సహించలేదు. ఏకంగా మా పార్టీ ఎంపీ, మాజీ ఎంపీపైనే దాడి చేశారు. దాడులు చేసి, తిరిగి బాధితులపైనే కేసులు బనాయిస్తున్నారు అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రజాస్వామ్య స్ఫూర్తికి విఘాతం కలిగించడంతో పాటు, చట్టం ముందు అందరూ సమానులే అన్న స్ఫూర్తికి కూడా విఘాతం కలుగుతున్న నేపథ్యంలో ఇక్కడ మీడియా ముందుకు రావాల్సి వస్తోంది. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 45 రోజుల్లోనే 35 రాజకీయ హత్యలు జరిగాయి. వందల ఇళ్లను ధ్వంసం చేశారు. ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్తుల్ని ధ్వంసం చేశారు. వెయ్యికి పైగా అక్రమ కేసులో పెట్టారు. శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయి. అసలు రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా? అని ప్రశ్నించారు.
Comments
Please login to add a commentAdd a comment