ఢిల్లీ : ఉత్తరప్రదేశ్ హత్రాస్ ఘటనలో దోషులను వీలైనంత త్వరగా ఉరితీయాలని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ అన్నారు. ఈ విషయంలో యూపీ ప్రభుత్వాన్ని చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తున్నాను అని తెలిపారు. వారికి విధించే శిక్షతో అలాంటి నేరం చేయాలన్న ఆలోచన కూడా రాకూడదు. ఆ బిడ్డ ఆత్మకు శాంతి లభించాలని దేవుడిని ప్రార్థిస్తున్నా అంటూ సీఎం పేర్కొన్నారు. హత్రాస్ నిర్భయ ఘటనపై యూపీ ప్రభుత్వతీరుకు నిరసనగా ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ ,భీమ్ ఆర్మీ చీఫ్ చంద్రశేఖర్ ఆజాద్‌తో కలిసి ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద నిరనస ర్యాలీలో పాల్గొన్నారు. బాధితురాలికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ప్రతిపక్ష పార్టీ నాయకులు సహా వందలాది మంది ప్రజలు నిరసన గళం వినిపించారు. ఇంత దారుణమైన నేరం జరిగినా అక్కడి ప్రభుత్వం స్పందించక పోవడం వారి నేర చరిత్రకు అద్దం పడుతుందని సిపిఐ (ఎం) నాయకుడు సీతారాం ఏచూరీ అన్నారు. యెగి ఆదిత్యనాథ్‌కు అధికారంలో కొనసాగడానికి హక్కు లేదంటూ విమర్శించారు. (యూపీ నిర్భయ పట్ల అమానవీయం)
కాగా ఉత్తర్‌ప్రదేశ్‌లోని హత్రాస్‌కు చెందిన 20 ఏళ్ల యువతిపై నలుగురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడిన విషయం విదితమే. పొలంలో పనిచేసుకుంటున్న బాధితురాలిని లాక్కెళ్లి చిత్ర హింసలకు గురిచేసి లైంగిక దాడికి పాల్పడ్డారు. నాలుక కోసి, వెన్నెముక విరిగేలా రాక్షసంగా వ్యవహరించారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ఆమెకు తొలుత అలీఘర్‌లో చికిత్స అందించినా ఫలితం లేకపోవడంతో, ఢిల్లీలోని సఫ్దార్‌జంగ్ ఆస్పత్రికి తరలించారు. పక్షవాతంతో పాటు శరీరంలోని కీలక అవయవాలు తీవ్రంగా దెబ్బతినడంతో రెండు వారాలుగా చిత్రవధ అనుభవించిన బాధితురాలు మృత్యువుతో పోరాడుతూ కన్నుమూశారు. (యూపీ సర్కార్‌కు ఎన్‌హెచ్‌ఆర్‌సీ నోటీసులు)
Comments
Please login to add a commentAdd a comment