ప్రత్యేక తెలంగాణ రాష్ర్ట ప్రకటనతో విదర్భ ఉద్యమం మరింత ఊపందుకుంది. కేంద్ర ప్రభుత్వం తక్ష ణమే ప్రత్యేక విదర్భ రాష్ట్ర ప్రకటన చేయాలని డిమాండ్ చేస్తూ విదర్భ జాయింట్ యాక్షన్ కమిటీ (వీజాక్) సభ్యులు నగరంలోని జంతర్‌మంతర్‌వద్ద సోమవారం ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం ఐదు గంటలదాకా ఆందోళన నిర్వహించారు.
ప్రత్యేక తెలంగాణ రాష్ర్ట ప్రకటనతో విదర్భ ఉద్యమం మరింత ఊపందుకుంది. కేంద్ర ప్రభుత్వం తక్ష ణమే ప్రత్యేక విదర్భ రాష్ట్ర ప్రకటన చేయాలని డిమాండ్ చేస్తూ విదర్భ జాయింట్ యాక్షన్ కమిటీ (వీజాక్) సభ్యులు నగరంలోని జంతర్‌మంతర్‌వద్ద సోమవారం ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం ఐదు గంటలదాకా ఆందోళన నిర్వహించారు. ఈ ఆందోళనలో విదర్భ ఆర్థిక అభివృద్ధి మండలి (వీఈడీసీ) అధ్యక్షుడు దేవేంద్ర పరేఖ్, మాజీ మంత్రి రంజిత్ దేశ్‌ముఖ్ కుమారుడు ఆశిష్ దేశ్‌ముఖ్, ఆమ్ ఆద్మీ పార్టీ (ఏఏపీ) నాయకుడు అజయ్ సంఘి, రాం నెవ్లే, అరుణ్ కేదార్, అహ్మద్ కదర్, రవికాంత్ ఖోబ్రగడే, ప్రతిభా ఖపర్దే, ట్రేడియస్ పీటర్‌తోపాటు ప్రముఖ ఆర్థికవేత్త శ్రీనివాస్ ఖండేవాలే, దీపక్ నిలావర్ తదితరులు పాల్గొన్నారు. ఆందోళన అనంతరం కొందరు నాయకులు మీడియాతో మాట్లాడుతూ తెలంగాణతోపాటే విదర్భకు ప్రత్యేక రాష్ట్ర ప్రతిపత్తి కల్పించాలని డిమాండ్ చేశారు. అవకాశం లభిస్తే ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీ, ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్, బీజేపీ జాతీయ అధ్యక్షుడు రాజ్‌నాథ్‌సింగ్‌లను కలసిఈ అంశాన్ని వారి దృష్టికి తీసుకెళతామన్నారు.
పదాధికారులను ఎన్నుకోం
వీజాక్‌కు పదాధికారులను ఎన్నుకోకూడదని నిర్ణయించినట్టు సభ్యులు తెలిపారు. కేవలం ఈ పదవుల కోసం గతంలో విదర్భ ఉద్యమం దెబ్బతిందని, నాయకుల మధ్య విభేదాలు తలెత్తాయని అన్నారు. అందువల్లనే ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. తమది సమాఖ్య మాత్రమేనన్నారు.
విడిపోతేనే పురోగతి
మహారాష్ట్ర నుంచి విదర్భ విడిపోతేనే త్వరిగతిన అభివృద్ధి చెందుతుందని జాక్ సభ్యులు పేర్కొన్నారు. కొత్త రాష్ట్ర ఆవిర్భావం వల్ల కొత్త కొత్త పరిశ్రమలు ఆవిర ్భవిస్తాయని, దాంతోపాటే ఉద్యోగావకాశాలు మెరుగుపడతాయని అన్నారు. ఇది నిరుద్యోగ నిర్మూలనకు దోహదం చేస్తుందన్నారు.