జల్‌గావ్ సందర్శించాలని మోడీకి ఆహ్వానం | Jalgav invitation to Modi to visit | Sakshi
Sakshi News home page

జల్‌గావ్ సందర్శించాలని మోడీకి ఆహ్వానం

Published Thu, Aug 8 2013 12:02 AM | Last Updated on Wed, Aug 15 2018 2:14 PM

Jalgav invitation to Modi to visit

 సాక్షి, ముంబై: గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీకి మహారాష్ట్రలోని జల్‌గావ్ రావాలని ఆహ్వానం అందింది. స్థానిక బీజేపీ ఎంపీ హరిబావ్ జావలే ఆయనను జల్‌గావ్‌ను సందర్శించాలని కోరారు. ఈ విషయంపై బీజేపీకి చెందిన ఎంపీల బృందం గుజరాత్ ముఖ్యమంత్రితో మంగళవారం భేటీ అయింది. స్థానికంగా జరగనున్న వ్యవసాయ సదస్సులో పాల్గొనాలని వారు మోడీని కోరారు. ముఖ్యంగా పత్తి అధికంగా పండే ఈ ప్రాంతంలో పత్తి అనుబంధ పరిశ్రమలను ఏర్పాటు చేసినట్లయి తే రైతులకు లాభం చేకూరనుందని వీరు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ విషయంపై నరేంద్ర మోడీకి అన్ని వివరాలు తెలిపి జల్‌గావ్‌కు రావాలని ఆహ్వానం పంపారు. ఆయన జల్‌గావ్ వచ్చినట్టయితే ఖందేశ్ ప్రాంతంలో కూడా బీజేపీ కార్యకర్తల్లో కొత్త ఉత్సాహం నింపినట్లవుతుందని పార్టీ భావిస్తోంది. మోడీతో భేటీ అయిన వారిలో రావరే ఎంపీ హరిబావ్ జావలేతోపాటు జల్‌గావ్ ఎంపీ ఏటీ పాటిల్, ధులే ఎంపీ ప్రతాప్ సోనవణే, జాల్నా ఎంపీ రావ్‌సాహెబ్ దానవే తదితరులున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement