Jalgav
-
‘గృహ’ కుంభకోణంలో 48 మందికి శిక్షలు
సాక్షి, ముంబై: జల్గావ్ గృహనిర్మాణ పథకం కుంభకోణంలో ధులే జిల్లా కోర్టు చరిత్రాత్మక తీర్పును వెలువరించింది. ఈ కేసులో ప్రము ఖులైన మాజీ మంత్రి, శివసేన నేత సురేష్ జైన్, ఎన్సీపీ నేత గులాబ్రావ్ దేవకర్లతోపా టు మొత్తం 48 మందిని జల్గావ్ జిల్లా కోర్టు దోషులుగా ప్రకటించింది. వీరిలో సురేష్ జైన్కు ఏడేళ్ల జైలు శిక్షతోపాటు రూ.100 కోట్ల జరిమానా విధించింది. గులాబ్రావు దేవకర్కు అయిదేళ్ల జైలు శిక్ష, రూ.5 లక్షల జరిమానా, బిల్డర్ జగన్నాథ్ వాణీ, రాజేంద్ర మయూర్లకు ఏడేళ్ల జైలు, రూ.40 కోట్ల జరిమానా, ప్రదీప్ రాయసోనికి అయిదేళ్ల జైలు, రూ.10 లక్షల జరిమానా విధిస్తూ కోర్టు తీర్పు ఇచ్చింది. 1999లో జల్గావ్ మున్సిపాలిటీ ప్రారంభించిన గృహనిర్మాణ పథకంలో భారీగా అక్రమాలు జరిగాయి. -
జల్గావ్ సందర్శించాలని మోడీకి ఆహ్వానం
సాక్షి, ముంబై: గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీకి మహారాష్ట్రలోని జల్గావ్ రావాలని ఆహ్వానం అందింది. స్థానిక బీజేపీ ఎంపీ హరిబావ్ జావలే ఆయనను జల్గావ్ను సందర్శించాలని కోరారు. ఈ విషయంపై బీజేపీకి చెందిన ఎంపీల బృందం గుజరాత్ ముఖ్యమంత్రితో మంగళవారం భేటీ అయింది. స్థానికంగా జరగనున్న వ్యవసాయ సదస్సులో పాల్గొనాలని వారు మోడీని కోరారు. ముఖ్యంగా పత్తి అధికంగా పండే ఈ ప్రాంతంలో పత్తి అనుబంధ పరిశ్రమలను ఏర్పాటు చేసినట్లయి తే రైతులకు లాభం చేకూరనుందని వీరు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ విషయంపై నరేంద్ర మోడీకి అన్ని వివరాలు తెలిపి జల్గావ్కు రావాలని ఆహ్వానం పంపారు. ఆయన జల్గావ్ వచ్చినట్టయితే ఖందేశ్ ప్రాంతంలో కూడా బీజేపీ కార్యకర్తల్లో కొత్త ఉత్సాహం నింపినట్లవుతుందని పార్టీ భావిస్తోంది. మోడీతో భేటీ అయిన వారిలో రావరే ఎంపీ హరిబావ్ జావలేతోపాటు జల్గావ్ ఎంపీ ఏటీ పాటిల్, ధులే ఎంపీ ప్రతాప్ సోనవణే, జాల్నా ఎంపీ రావ్సాహెబ్ దానవే తదితరులున్నారు.