సాక్షి, ముంబై: జల్‌గావ్ గృహనిర్మాణ పథకం కుంభకోణంలో ధులే జిల్లా కోర్టు చరిత్రాత్మక తీర్పును వెలువరించింది. ఈ కేసులో ప్రము ఖులైన మాజీ మంత్రి, శివసేన నేత సురేష్ జైన్, ఎన్సీపీ నేత గులాబ్‌రావ్ దేవకర్‌లతోపా టు మొత్తం 48 మందిని జల్‌గావ్ జిల్లా కోర్టు దోషులుగా ప్రకటించింది. వీరిలో సురేష్ జైన్‌కు ఏడేళ్ల జైలు శిక్షతోపాటు రూ.100 కోట్ల జరిమానా విధించింది. గులాబ్‌రావు దేవకర్‌కు అయిదేళ్ల జైలు శిక్ష, రూ.5 లక్షల జరిమానా, బిల్డర్ జగన్నాథ్ వాణీ, రాజేంద్ర మయూర్‌లకు ఏడేళ్ల జైలు, రూ.40 కోట్ల జరిమానా, ప్రదీప్ రాయసోనికి అయిదేళ్ల జైలు, రూ.10 లక్షల జరిమానా విధిస్తూ కోర్టు తీర్పు ఇచ్చింది. 1999లో జల్‌గావ్ మున్సిపాలిటీ ప్రారంభించిన గృహనిర్మాణ పథకంలో భారీగా అక్రమాలు జరిగాయి.
Comments
Please login to add a commentAdd a comment