housing scam
-
‘గృహ’ కుంభకోణంలో 48 మందికి శిక్షలు
సాక్షి, ముంబై: జల్గావ్ గృహనిర్మాణ పథకం కుంభకోణంలో ధులే జిల్లా కోర్టు చరిత్రాత్మక తీర్పును వెలువరించింది. ఈ కేసులో ప్రము ఖులైన మాజీ మంత్రి, శివసేన నేత సురేష్ జైన్, ఎన్సీపీ నేత గులాబ్రావ్ దేవకర్‌లతోపా టు మొత్తం 48 మందిని జల్గావ్ జిల్లా కోర్టు దోషులుగా ప్రకటించింది. వీరిలో సురేష్ జైన్‌కు ఏడేళ్ల జైలు శిక్షతోపాటు రూ.100 కోట్ల జరిమానా విధించింది. గులాబ్‌రావు దేవకర్‌కు అయిదేళ్ల జైలు శిక్ష, రూ.5 లక్షల జరిమానా, బిల్డర్ జగన్నాథ్ వాణీ, రాజేంద్ర మయూర్‌లకు ఏడేళ్ల జైలు, రూ.40 కోట్ల జరిమానా, ప్రదీప్ రాయసోనికి అయిదేళ్ల జైలు, రూ.10 లక్షల జరిమానా విధిస్తూ కోర్టు తీర్పు ఇచ్చింది. 1999లో జల్గావ్ మున్సిపాలిటీ ప్రారంభించిన గృహనిర్మాణ పథకంలో భారీగా అక్రమాలు జరిగాయి. -
పాక్ మాజీ ప్రధాని షాబాజ్ అరెస్టు
లాహోర్: పాక్ మాజీ ప్రధాని, విపక్షనేత షాబాజ్ షరీఫ్ (67) అవినీతి కేసులో అరెస్టయ్యారు. రూ.1,400 కోట్ల (పాక్ కరెన్సీ) హౌజింగ్ కుంభకోణానికి పాల్పడ్డారన్న ఆరోపణలపై పాక్ అవినీతి నిరోధక విభాగం శుక్రవారం షరీఫ్‌ను అరెస్టు చేసింది. ప్రస్తుతం ఆయన పాకిస్తాన్ ముస్లిం లీగ్ – నవాజ్ (పీఎంఎల్–ఎన్) అధ్యక్షుడిగా ఉన్నారు. ‘లాహోర్‌లోని నేషనల్ అకౌంటబులిటీ బ్యూరో ముందు విచారణకు షాబాజ్ హాజరయ్యారు. ఆషియానా హౌజింగ్ స్కీమ్, పంజాబ్ సాఫ్ పానీ కంపెనీలకు నిబంధనలకు విరుద్ధంగా కాంట్రాక్టులు ఇచ్చారంటూ ఈయనపై ఆరోపణలు వచ్చాయి. -
హౌసింగ్‌లో రూ.50 కోట్ల కుంభకోణం
కరీంనగర్ సిటీ : గత ప్రభుత్వ హయాంలో కాటారం, మహాదేవపూర్, మహాముత్తారం మండలాల్లో గృహనిర్మాణ పథకంలో రూ.50 కోట్ల కుంభకోణం జరిగిందని, దీనిపై సీబీసీఐడీ విచారణ జరిపించాలని కాంగ్రెస్ పార్టీకి చెందిన కాటారం జెడ్పీటీసీ చల్ల నారాయణరెడ్డి జెడ్పీ సమావేశంలో ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బొప్పాపూర్‌లో 600 రేషన్‌కార్డులుంటే, 750 ఇండ్లు మంజూరయ్యాయంటూ అవినీతికి ఆధారాలను బయటపెట్టారు. దీనిపై మంత్రి ఈటెల రాజేందర్ స్పందిస్తూ.. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో మంథని నియోజకవర్గంతో పాటు జిల్లావ్యాప్తంగా హౌసింగ్, పింఛన్లలో జరిగిన అక్రమాలపై సీబీసీఐడీతో విచారణ జరిపిస్తామన్నారు. బ్రోకర్లు, పైరవీదారుల కోసం తమ ప్రభుత్వం లేదన్నారు. సమైక్య రాష్ట్రంలో ప్రజలకు వ్యవస్థపై విశ్వాసం పోయిందని, ఆ నమ్మకాన్ని తిరిగి నెలకొల్పేందుకే ‘మన ఊరు-మన ప్రణాళిక’ కార్యక్రమాన్ని చేపట్టిందని చెప్పారు. జిల్లాలోని ప్రాధాన్యతా అంశాలను ప్రణాళికలో పొందుపరచాలని అధికారులను ఆదేశించారు. ఆంధ్రా అధికారి వెళ్లిపోవాలి : బొడిగె శోభ ఆంధ్రా ప్రాంతానికి చెందిన ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ తన సొంత ప్రాంతానికి వెళ్లిపోవాలని చొప్పదండి ఎమ్మెల్యే బొడిగె శోభ అల్టిమేటం జారీ చేశారు. ఆర్డబ్ల్యూఎస్ కింద పనులు మంజూరైనా, అధికారులు పనులు చేపట్టడం లేదన్నారు. పనులు చేయకపోవడానికి ఈఈ లేడని ఎస్ఈ సాకు చూపిస్తున్నాడన్నారు. ఆంధ్రాకు చెందిన ఆ అధికారికి తెలంగాణలో పనిచేయడం ఇష్టం లేకపోతే సొంత ప్రాంతానికి వెళ్లొచ్చన్నారు. -
మాజీ మంత్రి బెయిల్ రద్దు
సాక్షి, ముంబై: జల్గావ్ హౌసింగ్ సొసైటీ కుంభకోణం కేసులో చిక్కుకున్న రాష్ట్ర మాజీమంత్రి గులాబ్రావ్ దేవ్కర్కు అత్యున్నత న్యాయస్థానంలో మంగళవారం చుక్కెదురైంది. ఈ కేసులో జిల్లా కోర్టు గులాబ్‌రావ్‌కు మంజూరు చేసిన బెయిల్‌ను అత్యున్నత న్యాయస్థానం రద్దు చేసింది. దీంతో ఆయనను ఏక్షణంలోనైనా అరెస్టు అవకాశాలు కనిపిస్తున్నాయి. అనేక సంవత్సరాలుగా నత్తనడకన సాగుతున్న ఈ కేసు రాష్ట్ర రాజకీయాల్లో పెనుసంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ కేసులో అప్పట్లో సురేష్ జైన్‌తోపాటు అప్పటి సహాయ మంత్రి గులాబ్రావ్ దేవ్కర్ను కూడా పోలీసులు అరెస్టు చేశారు. అయితే జిల్లా కోర్టు గులాబ్‌రావ్‌కు బెయిల్ మంజూరు చేసింది. ఈ నిర్ణయాన్ని సవాలుచేస్తూ ప్రేమానంద్జాదవ్ అనే వ్యక్తి బాంబే హైకోర్టుకు చెందిన ఔరంగాబాద్ ధర్మాసనాన్ని ఆశ్రయించారు. దీంతో ఔరంగాబాద్ ధర్మాసనం దేవ్కర్ బెయిల్‌ను రద్దు చేసింది. దేవ్కర్ ఈ నిర్ణయాన్ని సవాలుచేస్తూ అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. దీనిపై పలుసార్లు విచారణ జరిపిన సుప్రీంకోర్టు మంగళవారం తీర్పు వెలువరించింది. గులాబ్రావ్ దేవ్కర్ బెయిల్ రద్దు చేయడమే కాకు ండా రెండు రోజులలోగా పోలీసులకు లొంగిపోవాలంటూ ఆదేశించింది. -
మళ్లీ జైలుకు ఎమ్మెల్యే జైన్
సాక్షి, ముంబై: జల్గావ్ గృహనిర్మాణ పథకం కుంభకోణం కీలక నిందితుడు, అక్కడి ఎమ్మెల్యే సురేష్ జైన్‌ను ఆస్పత్రి నుంచి మంగళవారం మళ్లీ జైలుకు తరలించారు. జైన్ ఏకంగా ఐదుసార్లు బెయిల్ పిటిషన్ పెట్టుకున్నా కోర్టులో ప్రతిసారి చుక్కెదురైన విషయం విదితమే. అయితే ఈ ఎమ్మెల్యే సుమారు ఏడాదిగా అరెస్టులో ఉన్నప్పటికీ ఆరోగ్యం బాగా లేకపోవడంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. బెయిల్ రాకపోవడంతో కోర్టు ఆదేశాల మేరకు మంగళవారం తెల్లవారుజామున ఇతణ్ని జల్గావ్ జైలుకు తరలించారు. హౌసింగ్ కుంభకోణం కేసుకు సంబంధించి సురేష్ జైన్‌ను 2012 మార్చి 10న అరెస్టు చేశారు. ఆయన మంత్రి పదవిలో కొనసాగుతున్న సమయంలో ఖాందేశ్ బిల్డర్‌తో చేతులు కలిపి సుమారు రూ.29 కోట్ల మేర గృహనిర్మాణ పథకం నిధులను దుర్వినియోగం చేశారంటూ ఆరోపణలు వచ్చాయి. దీంతో కేసు నమోదు చేసిన జల్గావ్ పోలీసులు ఈ ఎమ్మెల్యేను అరెస్టు చేశారు. ఇక స్థానిక కోర్టు తొమ్మిది రోజులపాటు పోలీసు కస్టడీ, అనంతరం మార్చి 30వ తేదీ వరకు జ్యుడీషియల్ కస్టడీ విధించింది. అయితే అనారోగ్యానికి చికిత్స నిమిత్తం ఆయనకు తాత్కాలిక బెయిల్ కూడా మంజూరు చేసింది. జైన్ ఆరోగ్యం మరింత క్షీణించడంతో గత మార్చి 23న ముంబై బ్రీచ్‌కాండీ ఆస్పత్రికి తరలించారు. అయితే ఆస్పత్రి నుంచి కూడా ఆయన బెయిల్ పిటిషన్ దాఖలు చేసుకున్నా ఫలితం లేకపోయింది. కోర్టు ఐదుసార్లు ఆయన బెయిల్ అభ్యర్థనలను తిరస్కరించింది. దీంతో పోలీసులు సురేశ్ జైన్‌ను వరోరా జైలుకు తరలించారు.