మాజీ మంత్రి బెయిల్ రద్దు | Gulabrao Deokar's Bail Cancellation | Sakshi
Sakshi News home page

మాజీ మంత్రి బెయిల్ రద్దు

Published Wed, Dec 18 2013 12:07 AM | Last Updated on Sat, Sep 2 2017 1:42 AM

Gulabrao Deokar's Bail Cancellation

 సాక్షి, ముంబై: జల్గావ్ హౌసింగ్ సొసైటీ కుంభకోణం కేసులో చిక్కుకున్న రాష్ట్ర మాజీమంత్రి గులాబ్‌రావ్ దేవ్కర్‌కు అత్యున్నత న్యాయస్థానంలో మంగళవారం చుక్కెదురైంది. ఈ కేసులో జిల్లా కోర్టు గులాబ్‌రావ్‌కు మంజూరు చేసిన బెయిల్‌ను అత్యున్నత న్యాయస్థానం రద్దు చేసింది. దీంతో ఆయనను ఏక్షణంలోనైనా అరెస్టు అవకాశాలు కనిపిస్తున్నాయి. అనేక సంవత్సరాలుగా నత్తనడకన సాగుతున్న ఈ కేసు రాష్ట్ర రాజకీయాల్లో  పెనుసంచలనం సృష్టించిన విషయం తెలిసిందే.
 
 ఈ కేసులో అప్పట్లో సురేష్ జైన్‌తోపాటు అప్పటి సహాయ మంత్రి గులాబ్‌రావ్ దేవ్కర్‌ను కూడా పోలీసులు అరెస్టు చేశారు. అయితే జిల్లా కోర్టు గులాబ్‌రావ్‌కు బెయిల్ మంజూరు చేసింది. ఈ నిర్ణయాన్ని సవాలుచేస్తూ ప్రేమానంద్‌జాదవ్ అనే వ్యక్తి బాంబే హైకోర్టుకు చెందిన ఔరంగాబాద్ ధర్మాసనాన్ని ఆశ్రయించారు. దీంతో ఔరంగాబాద్ ధర్మాసనం దేవ్కర్ బెయిల్‌ను రద్దు చేసింది. దేవ్కర్ ఈ నిర్ణయాన్ని సవాలుచేస్తూ అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. దీనిపై పలుసార్లు విచారణ జరిపిన సుప్రీంకోర్టు మంగళవారం తీర్పు వెలువరించింది. గులాబ్‌రావ్ దేవ్కర్ బెయిల్ రద్దు చేయడమే కాకు ండా రెండు రోజులలోగా పోలీసులకు లొంగిపోవాలంటూ  ఆదేశించింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement