మాజీ మంత్రి బెయిల్ రద్దు
సాక్షి, ముంబై: జల్గావ్ హౌసింగ్ సొసైటీ కుంభకోణం కేసులో చిక్కుకున్న రాష్ట్ర మాజీమంత్రి గులాబ్రావ్ దేవ్కర్కు అత్యున్నత న్యాయస్థానంలో మంగళవారం చుక్కెదురైంది. ఈ కేసులో జిల్లా కోర్టు గులాబ్‌రావ్‌కు మంజూరు చేసిన బెయిల్‌ను అత్యున్నత న్యాయస్థానం రద్దు చేసింది. దీంతో ఆయనను ఏక్షణంలోనైనా అరెస్టు అవకాశాలు కనిపిస్తున్నాయి. అనేక సంవత్సరాలుగా నత్తనడకన సాగుతున్న ఈ కేసు రాష్ట్ర రాజకీయాల్లో పెనుసంచలనం సృష్టించిన విషయం తెలిసిందే.
ఈ కేసులో అప్పట్లో సురేష్ జైన్‌తోపాటు అప్పటి సహాయ మంత్రి గులాబ్రావ్ దేవ్కర్ను కూడా పోలీసులు అరెస్టు చేశారు. అయితే జిల్లా కోర్టు గులాబ్‌రావ్‌కు బెయిల్ మంజూరు చేసింది. ఈ నిర్ణయాన్ని సవాలుచేస్తూ ప్రేమానంద్జాదవ్ అనే వ్యక్తి బాంబే హైకోర్టుకు చెందిన ఔరంగాబాద్ ధర్మాసనాన్ని ఆశ్రయించారు. దీంతో ఔరంగాబాద్ ధర్మాసనం దేవ్కర్ బెయిల్‌ను రద్దు చేసింది. దేవ్కర్ ఈ నిర్ణయాన్ని సవాలుచేస్తూ అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. దీనిపై పలుసార్లు విచారణ జరిపిన సుప్రీంకోర్టు మంగళవారం తీర్పు వెలువరించింది. గులాబ్రావ్ దేవ్కర్ బెయిల్ రద్దు చేయడమే కాకు ండా రెండు రోజులలోగా పోలీసులకు లొంగిపోవాలంటూ ఆదేశించింది.