ఇరాక్‌లో హింసకు వ్యతిరేకంగా జంతర్‌మంతర్‌లో ఆందోళన | Protest at Jantar Mantar over violence in Iraq | Sakshi
Sakshi News home page

ఇరాక్‌లో హింసకు వ్యతిరేకంగా జంతర్‌మంతర్‌లో ఆందోళన

Published Sat, Jun 21 2014 10:30 PM | Last Updated on Sat, Sep 2 2017 9:10 AM

Protest at Jantar Mantar over violence in Iraq

న్యూఢిల్లీ: ఇరాక్‌లో హింసకు వ్యతిరేకంగా జంతర్‌మంతర్‌లో శనివారం భారీ ఆందోళన జరిగింది. ఈ కార్యక్రమంలో నగరానికి చెందిన అనేకమంది పాల్గొన్నారు. ఎండ తీవ్రంగా ఉన్నప్పటికీ ఆందోళనకారులు ఎంతమాత్రం లెక్కచేయలేదు. ఇరాక్‌లో చిక్కుకుపోయిన భారతీయులకు భద్రత కల్పించాలని నరేంద్రమోడీ ప్రభుత్వానికి ఆందోళనకారులు విన్నవించారు. ఏజీస్ అనే స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఓ ఆందోళనకారుడు మాట్లాడుతూ ‘ఇరాక్‌లో ఉగ్రవాద చర్యల్ని ఖండించాలనే ఏకైక  ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం జరిగింది. ఈ విషయంలో ప్రభుత్వం జోక్యం చేసుకోవాలి. అక్కడ చిక్కుకుపోయిన మా సోదరులను సురక్షితంగా ఇక్కడికి తిరిగి తీసుకురావాలి. షియా, సున్నీల ఐకమత్యం అవసరం. ఈ రెండు వర్గాల మధ్య విభేదాలను సృష్టించేందుకు ఉగ్రవాదులు చేస్తున్న ప్రయత్నాలను ఖండిస్తున్నాం’ అని అన్నారు.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement