బీసీలకు రాజకీయ రిజర్వేషన్లు కల్పించాలి: ఆర్‌ కృష్ణయ్య  | R Krishnaiah Demands Political Reservations For BCs | Sakshi
Sakshi News home page

Published Sun, Feb 3 2019 3:21 AM | Last Updated on Sun, Feb 3 2019 3:22 AM

R Krishnaiah Demands Political Reservations For BCs - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: బీసీలకు చట్టసభల్లో రాజకీయ రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్‌ చేస్తూ జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో శనివారం ఢిల్లీలోని జంతర్‌మంతర్‌ వద్ద ధర్నా చేపట్టారు. ఈ సందర్భం గా సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్‌ కృష్ణయ్య మాట్లాడుతూ.. అన్ని రంగాల్లో బీసీలకు జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్‌ చేశారు. ప్రస్తుతం బీసీలకు చట్టసభల్లో 14%, ఉద్యోగాల్లో 9%, వాణిజ్య రంగాల్లో ఒక్క శాతం మాత్రమే ప్రాతినిధ్యం ఉందని వివరించారు. అగ్రకులాల్లో 10% ఉన్న పేదలకు 10 % రిజర్వేషన్లు కల్పించినట్టే బీసీలకు అన్ని రంగాల్లో జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు కల్పించేందుకు ఈ సమావేశాల్లోనే బిల్లు ప్రవేశపెట్టాలన్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement