ప్రధాని కరువు సాయం సంపన్నులకే: రాహుల్
న్యూఢిల్లీ: కరువు సాయం కోసం జంతర్ మంతర్ వద్ద ఆందోళన చేస్తున్న తమిళనాడు రైతులను శుక్రవారం కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ కలిశారు. రాహుల్ ఇవాళ మధ్యాహ్నం ఆందోళన చేస్తున్న రైతులను కలుసుకుని తన మద్దతు తెలిపారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా రాహుల్ మాట్లాడుతూ... దేశంలోని సంపన్నులకు మాత్రమే ప్రధానమంత్రి కరువు సాయం అందిస్తున్నారని విమర్శించారు. దేశానికి వెన్నెముకగా ఉన్న రైతులను విస్మరించడం బాధాకరమన్నారు. రైతులను అన్నివిధాలా ఆదుకోవాల్సిన అవసరం ఉందని రాహుల్ అన్నారు. కాగా కరువు ఉపశమన ప్యాకేజీ, రుణ మాఫీ డిమాండ్ చేస్తూ ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద గత 18 రోజులుగా తమిళనాడు రైతులు ఆందోళన కొనసాగిస్తున్న విషయం తెలిసిందే.