Tamil Nadu Farmers
-
తమిళనాడు రైతుల దీక్ష.. దారుణం
-
తమిళనాడు రైతుల దీక్ష.. దారుణం
సాక్షి, న్యూఢిల్లీ: 40 రోజుల పైగా నిరసనలు చేశారు.. అయినా ప్రభుత్వాలకు చీమ కుట్టినట్లైనా అనిపించలేదు. అలసిపోయి కాస్త విరామం తీసుకుని మళ్లీ పోరాటానికి దిగారు. ప్చ్.. లాభం లేకుండా పోయింది. అంతే రోజుకో రూపం దాల్చుతున్న ఆందోళన ఒక్కసారిగా దారుణంగా మారింది. అన్నం పండించే అన్నదాత చివరకు తన మలం తానే తిని ప్రభుత్వాలపై నిరసన వ్యక్తం చేశాడు. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద తమిళనాడు రైతులు ఇలా నిరసన తెలియజేశారు. దక్షిణ భారత నదుల అనుసంధాన రైతుల జాతీయ సంఘం అధ్యక్షుడు అయ్యాకన్ను నేతృత్వంలో పది మంది రైతులు 58 రోజులుగా జంతర్ మంతర్ వద్ద దీక్ష చేస్తున్నారు. ఆదివారం ఉదయం తమ మలాన్ని ప్లాస్టిక్ బ్యాగుల్లో సేకరించిన రైతులు.. నినాదాలు చేస్తూ తినేశారు. సోమవారం మనిషి మాంసం తింటామంటూ హెచ్చరికలు కూడా జారీ చేశారు. ‘గతంలో 41 రోజులపాటు ఇక్కడ దీక్షలు చేశాం. ఎవరూ పట్టించుకున్న పాపాన పోలేదు. ఇప్పుడు మళ్లీ వచ్చాం. మేం అసలు వారి(ప్రభుత్వాలు) కంటికి కనిపించటం లేదా?.’ అని అయ్యాకన్ను ప్రశ్నిస్తున్నారు. నిరసనలు చేపట్టి మంగళవారానికి సరిగ్గా 59 రోజులు పూర్తవుతుంది. అంటే మా నిరసనలకు వంద రోజులు అయినట్లే లెక్క. ఆ రోజు పూర్తి నగ్నంగా ప్రధాని కార్యాలయంకు మార్చి నిర్వహిస్తాం అని ఆయన తెలిపారు. రుణమాఫీ, రూ.4,000 కోట్ల కరువు సాయం, కావేరీ నదీ యాజమాన్య బోర్డు ఏర్పాటు తదితర డిమాండ్లతో మార్చి 14 నుంచి 41 రోజులపాటు జంతర్ మంతర్ వద్ద తమిళనాడు రైతులు ఆందోళన చేశారు. ఆ తర్వాత తిరిగి నెలన్నర క్రితం మళ్లీ నిరసన ప్రదర్శనలు చేపట్టారు. కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచే ప్రయత్నం చేస్తున్నా ప్రయోజనం లేకుండా పోతుంది. మరోవైపు తమిళనాడు ప్రభుత్వం కూడా నిర్లక్ష్యం వహిస్తుండటంతో అర్ద నగ్న, నగ్న ప్రదర్శన, విధవలుగా అవతారం, చనిపోయిన రైతుల పుర్రెలను మెడలో వేసుకొని, అర్థనగ్న ప్రదర్శనలు, ఎలుకలు-పాములు నోట్లో పెట్టుకోవటం.. ఇలా రోజుకో కొత్త రూపంలో నిరసన తెలియజేస్తున్నారు. 140 ఏళ్లలో ఎప్పుడూ లేని విధంగా గతేడాది అత్యల్ఫ వర్షాపాతం నమోదుకావటంతో భారత వాతావరణ శాఖ తమిళనాడును కరువు రాష్ట్రంగా ప్రకటించింది. దీంతో మద్రాస్ హైకోర్టు రైతులందరికీ రుణ మాఫీ చేయాలంటూ ప్రభుత్వాన్ని ఆదేశించింది. అయితే చిన్న, మధ్య తరహా రైతులకు మాత్రమే రుణ మాఫీకి అర్హులను చేయాలంటూ ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేయగా సుప్రీంకోర్టు స్టే విధించటంతో కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు రైతులు ఇలా చేస్తున్నారు. -
'పుర్రెలు, ఎముకలతో జంతర్‌మంతర్‌కు..'
న్యూఢిల్లీ: తమిళనాడులు రైతులు పుర్రెలు, ఎముకలతో ఢిల్లీ బాటపట్టారు.. రుణమాఫీ కోసం, కరువు భృతికోసం ఈ ఏడాది ప్రారంభంలో దాదాపు 41 రోజులపాటు ఢిల్లీ నడిబొడ్డున సుదీర్ఘ ఆందోళనలు నిర్వహించి వెళ్లిన వారు తిరిగి రాష్ట్ర ప్రభుత్వం మొండి వైఖరినే ప్రదర్శించడంతో చేసేదేం లేక మరోసారి జంతర్‌మంతర్‌కు చేరారు. అయితే, గతంలో మాదిరిగా కాకుండా ఈసారి మాత్రం ఎండా వాన పగలు రాత్రి అనే తేడా లేకుండా తమ సమస్య తీవ్రతను సమాజానికి తెలియజేస్తామని స్పష్టం చేస్తూ పుర్రెలు, ఎముకలతో దీక్షా స్థలికి చేరుకున్నారు. 'వానలు రానీ, ఎండలు కొట్టని మా ఉద్యమం మాత్రం ఈసారి ఆగదు' అని అని నేషనల్ సౌత్ ఇండియన్ రివర్స్ లింకింగ్ ఫార్మర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు పీ అక్కక్కాను చెప్పారు. కనీసం ఈసారి వందమంది రైతులు ఈ ఉద్యమంలో భాగస్వామ్యం అయ్యి వంద రోజులపాటు ఆందోళన నిర్వహించనున్నారు. తొలుత ఈ వారం ప్రారంభంలో వచ్చిన రైతులు ప్రధాని నివాసం ముందు ఆందోళనకు దిగే ప్రయత్నం చేయగా వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం వారు ఇక జంతర్‌మంతర్ వద్ద ఉద్యమం కొనసాగించేందుకు సిద్ధమయ్యారు. -
యూరిన్ బాటిల్స్‌తో రైతుల ఆందోళన
న్యూఢిల్లీ: దేశ రాజధాని జంతర్ మంతర్ వద్ద తమిళనాడు రైతుల ఆందోళన కొనసాగుతోంది. రుణమాఫీ, కరువు సాయం చేయాలంటూ రోజుకో రూపంలో కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచే ప్రయత్నం చేస్తున్న రైతులు శనివారం మరోసారి వినూత్నంగా నిరసన తెలిపారు. సమస్యను ఎంత తీవ్రంగా తెలుపుతూ, ఇప్పటికైనా తమను ఆదుకోవాలని.. ‘తమ మూత్రం తామే తాగుతామంటూ’ యూరిన్ బాటిల్ ముందు పెట్టుకుని తమ ఆందోళన ఉధృతం చేశారు. కరువు నిధులను విడుదల చేయాలని, కావేరీ మేనేజ్మెంట్ బోర్డు ఏర్పాటు చేయాలనే డిమాండ్లతో తమిళనాడుకు చెందిన రైతుల బృందం మార్చి 14 నుంచి ఢిల్లీలో నిరసన ప్రదర్శనలను చేస్తోన్న విషయం తెలిసిందే. తమిళనాడులోని రైతులు కరవు కోరల్లో చిక్కుకున్నారని, సాగునీరు లేక అల్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తూ తమని ఆదుకోండి మహాప్రభో అని దీనంగా వేడుకుంటున్నారు. గతంలో రైతులు నగ్నంగా ఆందోళనలు, కపాలాల మాలలు మెడలో ధరించినా, ఎలుకలు, చనిపోయిన పాములను నోట కరిచినా, చీరలు కట్టుకుని నిరసన తెలిపినప్పటికీ కేంద్రం పట్టించుకోలేదు. కాగా రైతుల ఆందోళన నేపథ్యంలోనే కరువు, తుపాను సాయం కింద తమిళనాడుకు కేంద్రం రూ.2వేల కోట్ల సాయాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఆ సాయం తమకు సరిపోదంటూ రైతులు ఆందోళన కొనసాగిస్తున్నారు. -
చీరలు కట్టుకుని తమిళ రైతుల నిరసన
-
చీరలు కట్టుకుని తమిళ రైతుల నిరసన
న్యూఢిల్లీ: కరవు సాయం కోరుతూ నెల రోజులుగా దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద వివిధ రూపాల్లో ఆందోళన చేస్తున్న తమిళ రైతులు శుక్రవారం వినూత్నంగా ఆందోళనకు దిగారు. చీలు కట్టుకుని రహదారులపై నడుస్తూ కరవు సాయం మంజూరు చేయండి అంటూ తమ ఆవేదనను వ్యక్తం చేశారు. తీవ్ర కరవు పరిస్థితుల వల్ల ఆత్మహత్యలు చేసుకున్న రైతుల పుర్రెలు ఇవేనంటూ వాటిని పట్టుకుని ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే. తామంతా కావేరి నదీమాత బిడ్డలమని, అందుకే చీరలు కట్టుకున్నామని తెలిపారు. -
చీరలు కట్టుకుని నిరసన తెలిపారు..
ఢిల్లీ: కరువు సాయం కోరుతూ నెల రోజులుగా దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద వివిధ రూపాల్లో ఆందోళన చేస్తున్న తమిళ రైతులు శుక్రవారం మళ్లీ వినూత్నంగా ఆందోళనకు దిగారు. చీరలు కట్టుకుని రహదారులపై నడుస్తూ ‘కరువు సాయం మంజూరు చేయండి’ అంటూ తమ ఆవేదనను వ్యక్తం చేశారు. తీవ్ర కరవు పరిస్థితుల వల్ల ఆత్మహత్యలు చేసుకున్న రైతుల పుర్రెలు ఇవేనంటూ వాటిని పట్టుకుని ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే. తామంతా కావేరి నదీమాత బిడ్డలమని, అందుకే చీరలు కట్టుకున్నామని వారు తెలిపారు. కరువు ఉపశమన ప్యాకేజీ మంజూరు చేయాలని, తమ రుణాలను మాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద తమిళనాడు రైతులు ఆందోళన చేస్తున్న నిరసన 32వ రోజుకు చేరింది. కేంద్ర ప్రభుత్వానికి తమ ఆక్రందనను వినిపించేందుకు వినూత్నరీతిలో అన్నదాతలు ఇక్కడ నిరసనలు చేపడుతున్నారు. గతంలో పుర్రెలు, ఎముకలతో ఆందోళన నిర్వహించి మీడియా దృష్టి ఆకర్షించిన రైతులు.. తమ డిమాండ్లు నెరవేర్చకుంటే గొంతు కోసుకొని ఆత్మహత్య చేసుకుంటామని ఇప్పటికే హెచ్చరికలు చేశారు. రైతుల ఆందోళన నేపథ్యంలోనే కరువు, తుపాను సాయం కింద తమిళనాడుకు కేంద్రం రూ.2,014.45 కోట్ల సాయాన్ని ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే. -
తమిళనాడు ప్రభుత్వంపై సుప్రీంకోర్టు ఆగ్రహం
-
తమిళనాడు ప్రభుత్వంపై సుప్రీంకోర్టు ఆగ్రహం
న్యూఢిల్లీ: రైతుల ఆందోళనకు సంబంధించి తమిళనాడు ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలపై పూర్తి స్థాయిలో నివేదిక సమర్పించాలని ప్రభుత్వాన్ని న్యాయస్థానం ఆదేశించింది. రైతుల దుస్థితిపై సుప్రీంకోర్టు ఆవేదన వ్యక్తం చేస్తూ ఇటువంటి సమయాల్లో రాష్ట్ర ప్రభుత్వం మౌనం వహించడం సరికాదని వ్యాఖ్యానించింది. మానవతా దృక్పథంతో స్పందించాలని సుప్రీంకోర్టు సూచించింది. రైతుల ఆందోళనలను ఎందుకు పట్టించుకోవడం లేదని సూటిగా ప్రశ్నించింది. కాగా దాదాపు నెల రోజులుగా కరువు ఉపశమన ప్యాకేజీ మంజూరు చేయాలని, తమ రుణాలను మాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ తమిళనాడు రైతులు చేస్తున్న ఆందోళన ఉధృతమైంది. తమ డిమాండ్ల కోసం ఆందోళన జరుపుతున్న అన్నదాతలు కేంద్ర ప్రభుత్వానికి తమ ఆక్రందనను వినిపించేందుకు ప్రతిరోజూ వినూత్నరీతిలో ఇక్కడ నిరసనలు చేపడుతున్నారు. రుణమాఫీపై కేంద్రం జోక్యం చేసుకోవాలంటూ రైతులు గురువారం అరగుండ్లుతో నిరసన తెలిపారు. గతంలో పుర్రెలు, ఎముకలతో ఆందోళన నిర్వహించి మీడియా దృష్టి ఆకర్షించిన రైతులు.. తమ డిమాండ్లు నెరవేర్చకుంటే గొంతు కోసుకొని ఆత్మహత్య చేసుకుంటామని ఇప్పటికే హెచ్చరించిన సంగతి తెలిసిందే. రైతుల ఆందోళన నేపథ్యంలోనే కరువు, తుపాను సాయం కింద తమిళనాడుకు కేంద్రం రూ.2,014.45 కోట్ల సాయాన్ని ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రధానమంత్రి కార్యాలయం (పీఎంవో) ఎదుట రైతులంతా నగ్నంగా గుమిగూడి నిరసన ప్రదర్శన నిర్వహించిన రైతులు నిన్న ఒంటిపై రాతలతో తమ నిరసన తెలిపారు. తమ డిమాండ్లు పరిష్కరించే వరకూ ఆందోళన కొనసాగిస్తామని రైతులు స్పష్టం చేస్తున్నారు. -
కొనసాగుతున్న తమిళ రైతుల ఆందోళన
-
ప్రధాని కరువు సాయం సంపన్నులకే
-
ప్రధాని కరువు సాయం సంపన్నులకే: రాహుల్
న్యూఢిల్లీ: కరువు సాయం కోసం జంతర్ మంతర్ వద్ద ఆందోళన చేస్తున్న తమిళనాడు రైతులను శుక్రవారం కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ కలిశారు. రాహుల్ ఇవాళ మధ్యాహ్నం ఆందోళన చేస్తున్న రైతులను కలుసుకుని తన మద్దతు తెలిపారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రాహుల్ మాట్లాడుతూ... దేశంలోని సంపన్నులకు మాత్రమే ప్రధానమంత్రి కరువు సాయం అందిస్తున్నారని విమర్శించారు. దేశానికి వెన్నెముకగా ఉన్న రైతులను విస్మరించడం బాధాకరమన్నారు. రైతులను అన్నివిధాలా ఆదుకోవాల్సిన అవసరం ఉందని రాహుల్ అన్నారు. కాగా కరువు ఉపశమన ప్యాకేజీ, రుణ మాఫీ డిమాండ్ చేస్తూ ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద గత 18 రోజులుగా తమిళనాడు రైతులు ఆందోళన కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. -
చచ్చిన పాములను నోట్లో పెట్టుకుని..
న్యూఢిల్లీ: కరువు ఉపశమన ప్యాకేజీ, రుణ మాఫీ డిమాండ్ చేస్తూ ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద గత 16 రోజులుగా తమిళనాడు రైతులు ఆందోళన కొనసాగిస్తున్నారు. బుధవారం అన్నదాతలు వినూత్నంగా ఆందోళకు దిగారు. కొంత మంది రైతులు చచ్చిపోయిన పాములను నోట్లో పెట్టుకుని ఆందోళనలో పాల్గొన్నారు. ఇంతకుముందు ఎలుకలను నోట్లో పెట్టుకుని నిరసన తెలిపారు. కపాలాలు మెడలో వేసుకుని కూడా ఆందోళన చేశారు. తాము ఎన్నిరకాలుగా ఆందోళనలు చేస్తున్నా ప్రభుత్వం ఎటువంటి స్పందన రాకపోవడం పట్ల రైతులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కాగా, ఆందోళన చేస్తున్న రైతులకు తమిళనాడు చెందిన నాయకులు పార్టీలకు అతీతంగా మద్దతు తెల్పుతున్నారు. లోక్‌సభ డీప్యూటీ స్పీకర్ తంబిదురై(ఏఐఏడీఎంకే) మంగళవారం ఆందోళన చేస్తున్న రైతులను కలుసుకుని సమస్యను వీలైనంత తొందరగా ప్రధాని దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇచ్చారు. సంబంధిత మంత్రులను కలుసుకున్నామని, ఈ విషయాన్ని పార్లమెంట్లో కూడా లేవనెత్తామని ఆయన చెప్పారు. ఇది కేవలం ఒక రాష్ట్ర సమస్య కాదని మొత్తం దేశానిదని అన్నారు. నిరసనలను ఉపసంహరించుకోవాలని కూడా ఆయన రైతులను కోరారు. తంబిదురై వెంట వచ్చిన తమిళనాడు వ్యవసాయ మంత్రి ఆర్.దొరైక్కన్ను... రైతుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం తీసుకున్న చర్యలను వారికి వివరించారు. డీఎంకే రాజ్యసభ సభ్యులు టీకేఎస్ ఎలంగోవన్, ఆర్ఎస్ భారతి, పుదుచ్చేరి సీఎం వి.నారాయణ స్వామి కూడా రైతులకు కలుసుకుని మద్దతు ప్రకటించారు. రైతులకు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీతో త్వరలోనే సమావేశం ఏర్పాటుచేస్తామని తమిళ మనీలా కాంగ్రెస్ చీఫ్ జీకే వాసన్ అన్నారు. -
మేకదాటు ఉద్రిక్తత
ముట్టడిని అడ్డుకున్న పోలీసులు 1500 మంది రైతుల అరెస్ట్ హొసూరు/కెలమంగలం : కావేరి నదిపై మేకదాటు వద్ద కర్ణాటక ప్రభుత్వం నిర్మించ తలపెట్టిన ప్రాజెక్ట్ వల్ల తమ ప్రాంత రైతులు తీవ్రంగా నష్టపోతారంటూ తమిళనాడుకు చెందిన రైతులు ఉద్యమించారు. రాష్ర్ట సరిహద్దులోని మేకదాటు ప్రాంతాన్ని ముట్టడించేందుకు రాజకీయాలకు అతీతంగా నాయకులు, కార్యకర్తలు, సంఘ సంస్థలు, రైతులు సుమారు రెండు వేలకు పైగా తరలి వచ్చారు. దీంతో శనివారం డెంకణీకోటలో ఉద్రిక్తత నెలకొంది. డెంకణీకోటకు 80 కిలోమీటర్ల దూరంలో ఉన్న మేకదాటు వరకు రైతులు ర్యాలీగా వెళ్లి, కర్ణాటక ప్రభుత్వం చేపట్టిన పనులను అడ్డుకోవాలని కావేరి హక్కుల విడుదల సమాఖ్య నిర్ణయించింది. ఈ మేరకు కావేరి నదీ పరివాహక ప్రాంతాలైన తిరుచ్చి, తిరువారూరు, తంజావూరు, నాగై, సేలం, క్రిష్ణగిరి, ధర్మపురి, నామక్కల్ తదితర జిల్లాల రైతులు శుక్రవారం రాత్రికి డెంకణీకోట, హొసూరుకు చేరుకున్నారు. శనివారం ఉదయం డెంకణీకోట పాతబస్టాండు నుంచి ర్యాలీ మొదలైంది. కర్ణాటక ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ రైతులు పాడికట్టి దానిపై ఓ రైతును పడుకోబెట్టి ర్యాలీలో పాల్గొన్నారు. ర్యాలీ 50 మీటర్ల దూరం వెళ్లగానే భారీగా మొహరించిన పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులను, బ్యారికేడ్లను తోసుకుని ముందుకు వెళ్లేందుకు రైతులు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. పరిస్థితి విషమిస్తుండడంతో చేతికి చిక్కిన 1500 మంది రైతులను బలవంతంగా వాహనాల్లో ఎక్కించి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అక్కడ వారిని ఉంచేందుకు సరైన వసతి లేకపోవడంతో వెంటనే కల్యాణమంటపాలకు తీసుకెళ్లారు.