యూరిన్‌ బాటిల్స్‌తో రైతుల ఆందోళన | Tamil Nadu farmers protesting at Jantar Mantar over drought relief funds | Sakshi
Sakshi News home page

యూరిన్‌ బాటిల్స్‌తో రైతుల ఆందోళన

Published Sat, Apr 22 2017 12:16 PM | Last Updated on Fri, Aug 24 2018 7:14 PM

Tamil Nadu farmers protesting at Jantar Mantar over drought relief funds



న్యూఢిల్లీ: దేశ రాజధాని  జంతర్ మంతర్ వద్ద తమిళనాడు రైతుల ఆందోళన కొనసాగుతోంది. రుణమాఫీ, కరువు సాయం చేయాలంటూ రోజుకో రూపంలో కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచే ప్రయత్నం చేస్తున్న రైతులు శనివారం  మరోసారి వినూత్నంగా నిరసన తెలిపారు.  సమస్యను ఎంత తీవ్రంగా తెలుపుతూ, ఇప్పటికైనా తమను ఆదుకోవాలని.. ‘తమ మూత్రం తామే తాగుతామంటూ’  యూరిన్‌ బాటిల్‌ ముందు పెట్టుకుని తమ ఆందోళన ఉధృతం చేశారు. కరువు నిధులను విడుదల చేయాలని, కావేరీ మేనేజ్‌మెంట్‌ బోర్డు ఏర్పాటు చేయాలనే డిమాండ్లతో తమిళనాడుకు చెందిన రైతుల బృందం మార్చి 14 నుంచి ఢిల్లీలో నిరసన ప్రదర్శనలను చేస్తోన్న విషయం తెలిసిందే.

తమిళనాడులోని రైతులు కరవు కోరల్లో చిక్కుకున్నారని, సాగునీరు లేక అల్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తూ తమని ఆదుకోండి మహాప్రభో అని దీనంగా వేడుకుంటున్నారు.  గతంలో రైతులు నగ్నంగా ఆందోళనలు, కపాలాల మాలలు మెడలో ధరించినా, ఎలుకలు, చనిపోయిన పాములను నోట కరిచినా, చీరలు కట్టుకుని నిరసన  తెలిపినప్పటికీ కేంద్రం పట్టించుకోలేదు. కాగా రైతుల ఆందోళన నేపథ్యంలోనే కరువు, తుపాను సాయం కింద తమిళనాడుకు కేంద్రం రూ.2వేల కోట్ల సాయాన్ని  ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఆ సాయం తమకు సరిపోదంటూ రైతులు ఆందోళన కొనసాగిస్తున్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement