drought relief fund
-
92% మందికి ఇన్పుట్ సబ్సిడీ
సాక్షి, అమరావతి: ఎన్నికల దృష్టితో కాకుండా అన్నదాతల సంక్షేమమే లక్ష్యంగా సంతృప్త స్థాయిలో లబ్ధి చేకూరుస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం గతేడాది ఖరీఫ్, రబీ సీజన్లలో కరువు, ప్రకృతి విపత్తులతో నష్టపోయిన 92 శాతం మంది రైతుల ఖాతాల్లోకి పెట్టుబడి రాయితీని జమ చేసి ఆదుకుంది. 8.89 లక్షల మంది రైతన్నల ఖాతాల్లోకి రూ.1,126.31 కోట్లు జమ చేయగా మరో 1.54 లక్షల మందికి రూ.163.12 కోట్లు మాత్రమే ఇవ్వాల్సి ఉంది.అది కూడా ఖాతాల వివరాలు, ఐఎఫ్ఎస్సీ కోడ్, ఆధార్ నంబర్లు సరిపోలకపోవడం లాంటి సాంకేతిక కారణాలతో జాప్యం జరుగుతోంది. బ్యాంకర్లు, అధికార యంత్రాంగం ఈ సమస్యను పరిష్కరించిన వెంటనే మిగిలిన అర్హులకూ ప్రయోజనం చేకూరేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. వీటిని వక్రీకరిస్తూ పెట్టుబడి సాయం ఏమైపోయిందంటూ రామోజీ శోకాలు పెడుతున్నారు. ఒకపక్క ఈసీ ద్వారా అన్నదాతలకు సాయం అందకుండా అడ్డుపడ్డ చంద్రబాబు మరోవైపు ఎల్లో మీడియాలో నిస్సిగ్గుగా అబద్ధాలను ప్రచారం చేస్తున్నారు.ప్రకృతి వైపరీత్యాలతో పంట నష్టపోయిన రైతులకు ఆ సీజన్ ముగిసే లోగానే పరిహారం అందిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఐదేళ్లుగా అండగా నిలుస్తోంది. దేశవ్యాప్తంగా నెలకొన్న వర్షాభావ పరిస్థితులతో ఖరీఫ్–23లో ఏడుజిల్లాల పరిధిలోని 103 కరువు మండలాల్లో 14.24 లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నట్లు గుర్తించారు. 6.60 లక్షల మందికి రూ.847.22 కోట్ల కరువు సాయం చెల్లించాలని లెక్క తేల్చారు. గతేడాది రబీ ఆరంభంలో మిచాంగ్ తుపాను ప్రభావంతో కురిసిన వర్షాలకు 6.64 లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బ తిన్నట్లు తేలింది. దీనికి సంబంధించి 4.61 లక్షల మందికి రూ.442.36 కోట్ల నష్టపరిహారం చెల్లించాలని అంచనా వేశారు.ఈ రెండు విపత్తుల్లోనూ 77 వేల మంది ఉండటంతో నష్టపోయిన వారి సంఖ్య మొత్తం 10.44 లక్షలుగా తేల్చారు. ఈమేరకు రూ.1,289.57 కోట్లు జమ చేసేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేయగా కోడ్ సాకుతో ఈసీని అడ్డంపెట్టుకుని చంద్రబాబు బృందం అడ్డుకుంది. ఈసీ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ రైతులు హైకోర్టును ఆశ్రయిస్తే మే 10న జమ చేసేందుకు కోర్టు అనుమతినిచ్చింది. అయినప్పటికీ ఈసీ తాత్సారం చేయడం వెనుక ఎవరున్నారో అందరికీ తెలిసిందే. తుది జాబితాలు రాగానే మిగతా వారికీ..నష్టపోయిన 10.44 లక్షల మంది రైతులకు రూ.1,289.57 కోట్లు ఇన్పుట్ సబ్సిడీ జమ చేయాల్సి ఉండగా ఆ ఖాతాల వివరాలను వ్యవసాయ శాఖ సీఎంఎఫ్ఎస్కు పంపించింది. అయితే 46,226 మంది రికార్డులు సరిగా లేవని వెనక్కి పంపారు. వీరికి రూ.57.15 కోట్లు జమ కావాల్సి ఉంది. మిగిలిన 9,97,925 మంది రైతులకు సంబంధించి రూ.1,232.43 కోట్లు జమ చేసేందుకు వ్యవసాయ శాఖ తిరిగి సీఎఫ్ఎంఎస్కు ప్రతిపాదనలు పంపింది.ఇందులో 8,89,784 మంది రైతులకు రూ.1,126.31 కోట్లు జమ అయింది. మరో 1,08,141 మందికి సంబంధించి రూ.106.12 కోట్లు సాంకేతిక కారణాలతో జమ కాలేదు. ఇలా 1.54 లక్షల మందికి రూ.163.27 కోట్లు జమ కావాల్సి ఉంది. బ్యాంక్ ఖాతా, ఆధార్ నెంబర్లు, రైతుల వివరాలు మిస్ మ్యాచ్ అయినట్టు గుర్తించడంతో ఆ వివరాలను జిల్లాలకు పంపి క్షేత్ర స్థాయి పరిశీలన జరుపుతున్నారు. జిల్లాల నుంచి తుది జాబితాలు రాగానే వారికి కూడా సొమ్ములు జమ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.త్వరలో రబీ 2023–24 కరువు జాబితాలుదేశవ్యాప్తంగా నెలకొన్న వర్షాభావ పరిస్థితులు రబీ 2023–24 సీజన్లో కూడా కొనసాగాయి. ఆరు జిల్లాల్లో 87 మండలాల్లో కరువు ప్రభావం ఉన్నట్లు గుర్తించారు. 2.37 లక్షలమంది రైతులకు చెందిన 2.52 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో పంటలు దెబ్బతిన్నట్లు ప్రాథమికంగా తేలింది.తుది జాబితాల రూపకల్పన జరగకుండా కోడ్ సాకుతో చంద్రబాబు బృందం అడ్డుకోగా ఇటీవలే పోలింగ్ ముగియడంతో ఈసీ అనుమతితో తుది నివేదిక రూపకల్పనకు శ్రీకారం చుట్టారు. ఇప్పటికే సోషల్ ఆడిట్, అర్జీల స్వీకరణ, పరిష్కార ప్రక్రియ పూర్తిచేశారు. జిల్లాల నుంచి తుదిజాబితాలు రాగానే పెట్టుబడి రాయితీ విడుదలకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. నాడు ప్రకటనలోనూ అంతులేని ఆలస్యం..చంద్రబాబు పాలనలో ఏటా కరువు కాటకాలే తాండవించడంతో సగటున 324 మండలాలు కరువు ప్రభావానికి గురయ్యాయి. ఖరీఫ్–2014లో 238, ఖరీఫ్–2015లో 359, ఖరీఫ్–2016లో 301, రబీ 2017–18లో 121, ఖరీఫ్–2018లో 347, రబీ 2018–19లో 257 మండలాల్లో కరువు విలయ తాండవం చేసింది. అయితే నాడు కరువు మండలాలను ఏ సీజన్‌కు ఆ సీజన్లో ప్రకటించిన దాఖలాలే లేవు. 2014 ఖరీఫ్‌లో కరువు వస్తే 2015 మార్చి 10 వరకు మూడుసార్లుగా కరువు మండలాలను నోటిఫై చేశారు.2015లో కరువు వస్తే నవంబరు నెలాఖరు వరకు ప్రకటించనే లేదు. 2016 ఖరీఫ్‌లో కరువు వస్తే 2017 ఫిబ్రవరి వరకు మూడు దఫాలుగా ప్రకటించారు. 2017 రబీలో కరువు వస్తే 2018 మార్చి నెలాఖరు వరకు మూడుసార్లు ప్రకటించారు. 2018 ఖరీఫ్‌లో కరువు వస్తే 2018 అక్టోబరు వరకు ఏకంగా ఐదు దఫాలుగా కరువు మండలాలను వెల్లడించారు. రబీ 2018–19లో కరువు వస్తే.. ఎన్నికలకు ముందు ఫిబ్రవరి 2019లో కరువు మండలాలను ప్రకటించారు.రూ.2,558 కోట్లు ఎగ్గొట్టిన బాబునాడు 2014 ఖరీఫ్ కరువు సాయాన్ని చంద్రబాబు సర్కారు 2015 నవంబరు వరకు అందజేయలేదు. 2015 కరువు సాయం 2016 నవంబరులో విదిల్చింది. 2016లో కరువు వస్తే 2017 జూన్‌లో, 2017లో కరువు వస్తే 2018 ఆగస్టులో సరిపుచ్చారు. 2018లో కరువు వల్ల ఖరీఫ్‌లో రూ.1,832.28 కోట్లు, రబీలో రూ.356.45 కోట్ల పంటనష్టం జరిగితే చంద్రబాబు ప్రభుత్వం అందించిన సహాయం సున్నా. 24.80 లక్షల మంది రైతులకు రూ.2,558 కోట్లు ఎగ్గొట్టిన నిర్వాకం చంద్రబాబుదే. తిత్లీ తుపాను బాధితులకు బాబు ఎగ్గొట్టిన రూ.182.60 కోట్ల పరిహారంతో సహా ఈ ఐదేళ్లలో 34.41 లక్షల రైతులకు రూ.3,261.60 కోట్ల పెట్టుబడి రాయితీని అందించి ఆదుకున్నది సీఎం జగన్ ప్రభుత్వమే.ఆ కథనాల్లో నిజం లేదు..ఖరీఫ్ 2023 కరువు, రబీ 2023–24లో మిచాంగ్ తుపానుకు సంబంధించి అర్హత పొందిన వారిలో ఇప్పటికే 8.89 లక్షల మందికి రూ.1,126.31 కోట్ల పెట్టుబడి రాయితీ జమచేశాం. మరో 1.54 లక్షల మందికి రూ.163.12 కోట్లు జమ చేయాల్సి ఉంది. సాంకేతిక సమస్యల్ని పరిష్కరించి త్వరలోనే వీరికి పరిహారం జమ చేస్తాం. 50 శాతం మందికి ఇంకా పరిహారం జమ కాలేదన్న కథనాల్లో వాస్తవం లేదు. ఇప్పటికే 92 శాతం మందికి జమ చేశాం. రబీ 2023–24 సీజన్లో కరువు నష్టానికి సంబంధించి తుది జాబితాల రూపకల్పన జరుగుతోంది. కలెక్టర్ల ఆమోదంతో తుది జాబితాలు రాగానే సకాలంలో పరిహారం జమ చేసేందుకు ఏర్పాట్లు చేస్తాం. – చేవూరు హరికిరణ్, స్పెషల్ కమిషనర్, వ్యవసాయశాఖ -
కేంద్ర ఉద్యోగులకు 28% డీఏ
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కరువు భత్యం(డీఏ), పెన్షనర్లకు కరువు ఉపశమనం(డీఆర్) 28 శాతానికి పెంచేందుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన బుధవారం సమావేశమైన మంత్రివర్గం ప్రస్తుతం మూలవేతనంపై 17 శాతంగా ఉన్న డీఏను మరో 11 శాతం పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ పెంపు ఈ ఏడాది జూలై 1వ తేదీ నుంచి అమల్లోకి వస్తుందని కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అనురాగ్‌సింగ్ ఠాకూర్ వెల్లడించారు. దీనివల్ల కేంద్రంపై అదనంగా రూ.34,401 కోట్ల ఆర్థిక భారం పడనున్నట్టు చెప్పారు. ప్రభుత్వ తాజా నిర్ణయంతో 48.34 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, 65.26 లక్షల మంది పెన్షనర్లు లబ్ధి పొందుతారని చెప్పారు. కాగా, 2020 జనవరి 1, 2020 జులై 1, 2021 జనవరి 1 తేదీల్లో చెల్లించాల్సిన మూడు అదనపు డీఏ, డీఆర్ వాయిదాలను.. కోవిడ్–91 మహమ్మారి కారణంగా తలెత్తిన పరిస్థితుల దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం నిలిపివేసింది. 2020 జనవరి 1 నుంచి 2021 జూన్ 30 మధ్య గల కాలానికి డీఏ, డీఆర్ 17 శాతంగానే ఉంటుందని కేంద్రం ఒక ప్రకటనలో స్పష్టం చేసింది. ‘ఆయుష్ మిషన్’ ఐదేళ్లపాటు పొడిగింపు నేషనల్ ఆయుష్ మిషన్(నామ్)ను కేంద్ర ప్రాయోజిత పథకంగా 2021 ఏప్రిల్ 1 నుంచి 2026 మార్చి 31 వరకూ కొనసాగింపునకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇందుకు రూ.4,607.30 కోట్ల వ్యయం కానుంది. ఇందులో కేంద్రం వాటా రూ.3,000 కోట్లు, రాష్ట్రాల వాటా రూ.1,607 కోట్లుగా ఉంటుంది. నేషనల్ ఆయుష్ మిషన్‌ను కేంద్ర ప్రభుత్వం 2014 సెప్టెంబరు 15న ప్రారంభించింది. అర్హులందరికీ వైద్య సేవలు అందేలా చూడడం, ఔషధాలు, మానవ వనరుల లభ్యత పెరిగేలా చూడడం, ఆయుష్ విద్యా సంస్థల సంఖ్యను పెంచడం వంటివి ఆయుష్ మిషన్ లక్ష్యాలు. కేబినెట్ మరికొన్ని నిర్ణయాలు ∙న్యాయ వ్యవస్థలో మౌలిక సదుపాయాల కల్పన కోసం రూ.9,000 కోట్లతో కేంద్ర ప్రాయోజిత పథకం కొనసాగింపు ప్రతిపాదనలకు ఆమోదం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సహా ఐదేళ్లపాటు ఇది అమలవుతుంది. ఓబీసీ ఉప కులాల వర్గీకరణ కమిషన్ కాలపరిమితి మరో ఆరు నెలల పాటు.. అంటే జనవరి 31 వరకు పొడిగింపు. నార్త్ ఈస్ట్రన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫోక్ మెడిసిన్ సంస్థ పేరు ఇకపై నార్త్ ఈస్ట్రన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద, ఫోక్ మెడిసిన్ రీసెర్చ్‌గా మార్పు. ప్రత్యేక పశు సంవర్థక ప్యాకేజీ అమలుకు ఆమోదం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం నుంచి ఐదేళ్లపాటు అమలయ్యేలా కేంద్ర ప్రభుత్వంలోని వివిధ విభాగాల్లో మార్పులు చేస్తూ కేంద్ర కేబినెట్ నిర్ణయించింది. ప్రత్యేక పశు సంవర్థక ప్యాకేజీ అమలు చేయాలని తీర్మానించింది. పశు సంవర్థక రంగం వృద్ధితోపాటు ఈ రంగంలో ఉన్న 10 కోట్ల మంది రైతులకు మెరుగైన ప్రతిఫలం దక్కేలా ఈ చర్య దోహదపడుతుందని ప్రభుత్వం తెలిపింది. ఈ ప్యాకేజీ కింద కేంద్రం రూ.9,800 కోట్ల మేర ఆర్థిక సాయం అందించనుంది. మొత్తంగా రూ.54,618 కోట్ల పెట్టుబడులు వస్తాయని ఆశిస్తోంది. వివిధ విభాగాలను రాష్ట్రీయ గోకుల్ మిషన్, జాతీయ పాడి అభివృద్ధి కార్యక్రమం(ఎన్పీడీడీ), జాతీయ పశు సంపద మిషన్‌గా విభజించారు. రాష్ట్రీయ గోకుల్ మిషన్ దేశీయ జాతుల అభివృద్ధి, పరిరక్షణకు సహాయపడుతుంది. ఎన్పీడీడీ పథకం సుమారు 8,990 బల్క్ మిల్క్ కూలర్స్ ఏర్పాటు లక్ష్యంగా పనిచేస్తోంది. -
రుణమాఫీ కోసం కదంతొక్కిన రైతన్న
ముంబై: రైతు రుణమాఫీ, అటవీభూములపై గిరిజనులకు హక్కులు, కరువు సాయం కోరుతూ వేలాదిమంది మహారాష్ట్ర రైతులు, గిరిజనులు నిరసనబాట పట్టారు. మెగసెసె అవార్డు గ్రహీత, వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా పేరొందిన డాక్టర్ రాజేంద్రసింగ్ సైతం వీరి వెంట నడిచారు. ప్రధానంగా మరాఠ్వాడా, థానె, భుసావాల్ ప్రాంతాల నుంచి వచ్చిన రైతులు, గిరిజనులతో మంగళవారం మధ్యాహ్నం థానెలో ర్యాలీ ప్రారంభమైంది. అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో ముంబైలోని విధాన్ భవన్‌కు గురువారం చేరుకుని అక్కడ భారీస్థాయిలో నిరసన ప్రదర్శన చేపట్టనున్నారు. రైతులందరికీ అందుబాటులో తగినంత భూమి, నీరు, సహజవనరులన్నీ దక్కాలని సూచించిన స్వామినాథన్ కమిటీ నివేదికను అమలుచేయాలని రైతులు డిమాండ్చేస్తున్నారు. ప్రభుత్వం స్పందించకపోవడంతో ఉద్యమంబాట పట్టామని ర్యాలీకి నేతృత్వం వహిస్తున్న లోక్ సంఘర్‡్ష మోర్చా నేత ప్రతిభాషిండే చెప్పారు. -
ప్రధాని కరువు సాయం సంపన్నులకే
-
ప్రధాని కరువు సాయం సంపన్నులకే: రాహుల్
న్యూఢిల్లీ: కరువు సాయం కోసం జంతర్ మంతర్ వద్ద ఆందోళన చేస్తున్న తమిళనాడు రైతులను శుక్రవారం కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ కలిశారు. రాహుల్ ఇవాళ మధ్యాహ్నం ఆందోళన చేస్తున్న రైతులను కలుసుకుని తన మద్దతు తెలిపారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రాహుల్ మాట్లాడుతూ... దేశంలోని సంపన్నులకు మాత్రమే ప్రధానమంత్రి కరువు సాయం అందిస్తున్నారని విమర్శించారు. దేశానికి వెన్నెముకగా ఉన్న రైతులను విస్మరించడం బాధాకరమన్నారు. రైతులను అన్నివిధాలా ఆదుకోవాల్సిన అవసరం ఉందని రాహుల్ అన్నారు. కాగా కరువు ఉపశమన ప్యాకేజీ, రుణ మాఫీ డిమాండ్ చేస్తూ ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద గత 18 రోజులుగా తమిళనాడు రైతులు ఆందోళన కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. -
చచ్చిన పాములను నోట్లో పెట్టుకుని..
న్యూఢిల్లీ: కరువు ఉపశమన ప్యాకేజీ, రుణ మాఫీ డిమాండ్ చేస్తూ ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద గత 16 రోజులుగా తమిళనాడు రైతులు ఆందోళన కొనసాగిస్తున్నారు. బుధవారం అన్నదాతలు వినూత్నంగా ఆందోళకు దిగారు. కొంత మంది రైతులు చచ్చిపోయిన పాములను నోట్లో పెట్టుకుని ఆందోళనలో పాల్గొన్నారు. ఇంతకుముందు ఎలుకలను నోట్లో పెట్టుకుని నిరసన తెలిపారు. కపాలాలు మెడలో వేసుకుని కూడా ఆందోళన చేశారు. తాము ఎన్నిరకాలుగా ఆందోళనలు చేస్తున్నా ప్రభుత్వం ఎటువంటి స్పందన రాకపోవడం పట్ల రైతులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కాగా, ఆందోళన చేస్తున్న రైతులకు తమిళనాడు చెందిన నాయకులు పార్టీలకు అతీతంగా మద్దతు తెల్పుతున్నారు. లోక్‌సభ డీప్యూటీ స్పీకర్ తంబిదురై(ఏఐఏడీఎంకే) మంగళవారం ఆందోళన చేస్తున్న రైతులను కలుసుకుని సమస్యను వీలైనంత తొందరగా ప్రధాని దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇచ్చారు. సంబంధిత మంత్రులను కలుసుకున్నామని, ఈ విషయాన్ని పార్లమెంట్లో కూడా లేవనెత్తామని ఆయన చెప్పారు. ఇది కేవలం ఒక రాష్ట్ర సమస్య కాదని మొత్తం దేశానిదని అన్నారు. నిరసనలను ఉపసంహరించుకోవాలని కూడా ఆయన రైతులను కోరారు. తంబిదురై వెంట వచ్చిన తమిళనాడు వ్యవసాయ మంత్రి ఆర్.దొరైక్కన్ను... రైతుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం తీసుకున్న చర్యలను వారికి వివరించారు. డీఎంకే రాజ్యసభ సభ్యులు టీకేఎస్ ఎలంగోవన్, ఆర్ఎస్ భారతి, పుదుచ్చేరి సీఎం వి.నారాయణ స్వామి కూడా రైతులకు కలుసుకుని మద్దతు ప్రకటించారు. రైతులకు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీతో త్వరలోనే సమావేశం ఏర్పాటుచేస్తామని తమిళ మనీలా కాంగ్రెస్ చీఫ్ జీకే వాసన్ అన్నారు.