వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ ఢిల్లీ బయల్దేరి వెళ్లారు. నేడు ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద సచివాలయ సీమాంధ్ర ఉద్యోగులు తలపెట్టిన మహాధర్నాలో ఆమె పాల్గొననున్నారు. ఈరోజు ఉదయం శంషాబాద్ విమానాశ్రయం నుండి విజయమ్మ, పార్టీ ముఖ్య నేతలు ఢిల్లీ వెళ్లారు. ఆంధ్రప్రదేశ్‌ను ముక్కలు చేయరాదంటూ వైఎస్‌ఆర్‌సీపీతో పాటు, సచివాలయ ఉద్యోగులు ఢిల్లీలో నినదించనున్నారు. ఉదయం 10 గంటలకు ఉద్యోగులు ఏపీ భవన్ నుంచి ర్యాలీగా జంతర్‌మంతర్ వద్దకు చేరుకుంటారు. ఆ తర్వాత సాయంత్రం నాలుగంటల వరకు మాహాధర్నా కొనసాగుతుంది. ఉద్యోగుల మహాధర్నాలో వైఎస్ విజయమ్మ పాల్గొంటారు.