సాక్షి, ఢిల్లీ: సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరిని బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత ఢిల్లీలో గురువారం కలిశారు. ఆయనను జంతర్ మంతర్ వద్ద దీక్షకు ఆహ్వానించారు. అనంతరం కవిత మీడియాతో మాట్లాడుతూ, దేశంలో పరిస్థితులు, మహిళా రిజర్వేషన్ బిల్లు రావాల్సిన ఆవశ్యకతపై చర్చించామన్నారు. ఎస్పీ, ఆర్జేడీ పార్టీలకు ప్రాథమికంగా మహిళ రిజర్వేషన్లపై ఎలాంటి అభ్యంతరం లేదని కవిత అన్నారు.
‘‘మజ్లిస్ పార్టీని కూడా ధర్నాకు ఆహ్వానించాం. బిల్లు పెడితే అన్ని అంశాలు పరిష్కరించుకునే అవకాశం ఉంది. వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో బిల్లు ప్రవేశపెట్టాలని డిమాండ్ చేస్తున్నాం. 18 పార్టీలకు చెందిన నేతల ప్రతినిధులు రేపు హాజరుకానున్నారు. కాలేజీలు, యూనివర్సిటీలో బిల్లు ప్రాముఖ్యత వివరిస్తాము. మహిళా బిల్లు వల్ల ఎవరికీ నష్టం లేదు. బిల్లు పెట్టే బీజేపీ చిత్తశుద్ధి నెరవేర్చుకోవాలి. బీజేపీ హైదరాబాద్ దీక్ష చేపడుతుందంటే.. ఢిల్లీలో నా దీక్ష సక్సెస్ అయ్యనట్టే కదా.. మహిళా రిజర్వేషన్ బిల్లు పాస్ అయ్యేలా బండి సంజయ్, కిషన్ రెడ్డి చూడాలి’’ అని కవిత అన్నారు.
‘‘మార్చి 2న నేను దీక్ష చేస్తామని ప్రకటించాను. నాకు ధైర్యం ఉంది. 9 వతేదీన రావాలని ఈడీ నోటీసులు ఇచ్చింది.. నేను 11ను వస్తాను అని తెలియజేశాను. బీఎల్ సంతోష్ ఎందుకు సిట్ ఎదుటకు రారు. కోర్టు స్టేలు తెచ్చుకున్న వ్యక్తులు మాట్లాడితే ఎలా?. ఈడీ ప్రశ్నలకు నేను సమాధానం ఇస్తా. వెళ్లాల్సిన సమయంలో కోర్టుకు వెళ్తాం’’ అని కవిత పేర్కొన్నారు.
చదవండి: ఈడీ విచారణకు కవిత.. అరెస్ట్ తప్పదా?.. ఒకవేళ అదే జరిగితే పరిస్థితి ఏంటి?
Comments
Please login to add a commentAdd a comment