సాక్షి, ఢిల్లీ: ప్రముఖ రాజకీయ వేత్త, సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరికి వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి నివాళులర్పించారు. ఆయన భౌతిక కాయానికి పుష్పాంజలి ఘటించారు. సీపీఎం నేతలు రాఘవులు, మధులను పరామర్శించిన విజయసాయిరెడ్డి అనంతరం మీడియాతో మాట్లాడారు.
‘‘పీడిత పక్షాన రాజీలేని పోరాటం చేసిన యోధుడు ఏచూరి. నమ్మిన సిద్ధాంతాలను జీవితాంతం ఆచరించారు. ఏచూరి విషయ పరిజ్ఞానం, భావ ప్రకటన స్ఫూర్తిదాయకం. ఏచూరితో పార్లమెంట్‌లో కలిసి పనిచేసే అవకాశం లభించడం మర్చిపోలేను’’ అని విజయసాయి పేర్కొన్నారు.
ఇదీ చదవండి: అలా వెళ్లిపోయావేం... ఏచూరీ!
శనివారం ఉదయం వసంత్‌కుంజ్‌లోని ఇంటి నుంచి సీపీఎం కేంద్ర కార్యాలయానికి ఏచూరి భౌతిక కాయాన్ని తరలించారు. అక్కడ పార్టీ కార్యకర్తలు, అభిమానుల సందర్శనార్థం ఉంచారు. విదేశాల నుంచి వచ్చిన కమ్యూనిస్టు నేతలు, దేశంలోని ప్రముఖలు నివాళులర్పించేందుకు వీలుగా అక్కడ ఉంచారు. అనంతరం మధ్యాహ్న సమయంలో ఏచూరి భౌతిక కాయాన్ని ఢిల్లీ ఎయిమ్స్‌కు తరలించనున్నారు. ముందే ప్రకటించిన విధంగా విద్యార్థుల వైద్య పరిశోధనల నిమిత్తం అప్పగించనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment