నారాయణ, చైతన్య సహా కోచింగ్‌ సెంటర్లను నిషేదించాలి : ఎంపీ విజయసాయిరెడ్డి | Vijay Sai Reddy Demands Banned To Narayana And Sri Chaitanya Coaching Centres, More Details Inside | Sakshi
Sakshi News home page

నారాయణ, చైతన్య సహా కోచింగ్‌ సెంటర్లను నిషేదించాలి : ఎంపీ విజయసాయిరెడ్డి

Published Mon, Jul 29 2024 5:02 PM | Last Updated on Mon, Jul 29 2024 5:40 PM

Vijay Sai Reddy Demands Banned to Narayana and Sri Chaitanya coaching Centre

సాక్షి, ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలోని ఓల్డ్‌ రాజేంద్రనగర్‌లో రావుస్‌ ఐఏఎస్‌ స్టడీ సెంటర్‌ బేస్‌మెంట్‌లోకి వరద నీరు పోటెత్తి ముగ్గురు విద్యార్థులు మృతిచెందారు. ఈ విషాదంపై వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి విచారం వ్యక్తం చేశారు. మరణించిన విద్యార్ధులకు ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలని డిమాండ్‌ చేశారు. రాజ్యసభలో సివిల్ కోచింగ్ సెంటర్లో విద్యార్థుల మరణంపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా ఎంపీ విజయసాయిరెడ్డి మాట్లాడారు.   
 
👉పాఠశాలలు, కాలేజీలు, యూనివర్సిటీల్లో విద్యాప్రమాణాలు పెంచాలి.

👉విద్య ప్రమాణాలు ఉంటే కోచింగ్ సెంటర్లు అవసరం ఉండదు.

👉విద్య సంస్థలను బలోపేతం చేసి  కోచింగ్ సెంటర్లు నిషేధించాలి.

👉ఢిల్లీలో  రావుస్,ఏపీలో నారాయణ, చైతన్య కోచింగ్ సెంటర్లు  కనీసం మౌలిక సదుపాయాలు, ప్రమాణాలు కల్పించడం లేదు.

👉దేశంలో ప్రతిచోటా అనేక ఘటనలు జరుగుతున్నాయి..కొన్ని బయటకు రావడం లేదు.

👉కోచింగ్ సెంటర్లను నిషేధించాలి లేదంటే నియంత్రించాలి.

👉ఢిల్లీలో జరిగిన ఘటనను ఆప్,బీజేపీ రెండు ప్రభుత్వాలు బాధ్యత వహించాలి.

👉ప్రపంచంలో ఇరుకైన సిటీలో ఢిల్లీ 44 వ స్థానంలో ఉంది.

👉వేల సంఖ్యలో యూపీఎస్సీ కోచింగ్ కోసం యువత ఢిల్లీ వస్తారు.

👉ఈ ఘటనలో నిర్లక్ష్యం వహించిన అధికారులపై చర్యలు తీసుకోవాలి

👉ఢిల్లీ లెఫ్టెనెంట్‌ గవర్నర్ ఎంసీడీ అధికారులపై చర్యలు తీసుకోవాలి.

👉మృతి చెందిన విద్యార్థుల కుటుంబ సభ్యులకు మూడు కోట్ల రూపాయల నష్టపరిహారం అందించాలి. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement