
సాక్షి, హైదరాబాద్: నిజామాబాద్ లోక్‌సభ స్థానం నుంచి టీఆర్‌ఎస్ తరఫున బరిలోకి దిగిన సిట్టింగ్ ఎంపీ కల్వకుంట్ల కవిత తన పేరు మీద రూ.7.63 కోట్లు, భర్త రామయగారి దేవనపల్లి అనిల్‌కుమార్ పేరు మీద రూ.9.7 కోట్ల ఆస్తులు కలిగి ఉన్నట్లు ఎన్నికల అఫిడవిట్‌లో ప్రకటించారు. కవిత దాఖలు చేసిన ఎన్నికల అఫిడవిట్ ప్రకారం ఆమె రూ.5,55,30,620 విలువ గల స్థిరాస్తులు, రూ. 2,08,37,049 విలువైన చరాస్తులను కలిగి ఉండగా, భర్త అనిల్‌కుమార్ రూ.6,76,64,099 విలువైన చరాస్తులు, రూ.2,97,77,746 విలువైన స్తిరాస్తులను కలిగిఉన్నారు. కవిత రెండు టయోటా ఫార్చునర్ కార్లను కలిగి ఉన్నారు. కవిత తనయులు ఆదిత్య రూ.24.81 లక్షలు, ఆర్య రూ.30.90 లక్షల చరాస్తులను కలిగి ఉన్నారు. కవిత రూ.2.27 కోట్ల అప్పులు, అనిల్ కుమార్ రూ.6.79 కోట్ల అప్పు లు కలిగి ఉన్నారు. ఆమెపై ప్రత్యేక తెలంగాణ ఉద్యమానికి సంబంధించిన రెండు కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. ఆమె వీఎన్‌ఆర్ వీజేఐఈటీ నుంచి 1999లో ఇంజనీరింగ్ పూర్తి చేసినట్లుగా పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment