
సాక్షి, హైదరాబాద్: సీఎం కూతురు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను నిరాధార కేసులతో వేధిస్తే సహించేది లేదని మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి హెచ్చరించారు. ఆమెపై నిరాధారమైన వార్తలు ప్రచురించేలా చేయడం నీతిమాలిన చర్య అని, కవిత ఇంటిపై బీజేపీ దాడి హేయమైన చర్య అని వేముల సోమవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో మండిపడ్డారు.
‘కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలు, వైఫల్యాలను కేసీఆర్ ఎత్తి చూపుతున్నందునే కవితపై నిరాధారమైన వార్తలు సృష్టిస్తున్నారు. టీఆర్‌ఎస్ కవితకు అండగా ఉండి బీజేపీ కార్యకర్తలను తరిమి కొడతాం’అని వేముల హెచ్చరించారు. ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్, ఎమ్మెల్యేలు గాదరి కిశోర్, భాస్కర్‌రావు, నోముల భగత్‌లు టీఆర్‌ఎస్ ఎల్పీ కార్యాలయంలో మాట్లాడు తూ.. కవితపై ఆరోపణలు ఖండించారు.
Comments
Please login to add a commentAdd a comment