సాక్షి, హైదరాబాద్:బీఆర్‌ఎస్ పార్టీ అందిస్తున్న ఉచిత కరెంట్‌పై తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యల కారణంగా అటు రైతులతో పాటు బీఆర్‌ఎస్ నాయకులు భగ్గుమంటున్నారు. హైదరాబాద్ విద్యుత్ సౌధ వద్ద బుధవారం నిర్వహించిన ధర్నాలో బీఆర్‌ఎస్ శ్రేణులతో కలిసి ఎమ్మెల్సీ కవిత, ఎమ్మెల్యే దానం నాగేందర్ తదితరులు పాల్గొని నిరసన తెలియజేశారు. రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డి వ్యాఖ్యాలపై మండిపడ్డారు.
రైతుకు వ్యవసాయం పండగ కావాలంటే నీళ్ళు, రైతు బంధు ఇస్తున్నామని.. వ్యాపార వేత్తలకు కరెంట్ ఇవ్వొదని రేవంత్ రెడ్డి చెప్పడం సమజసం కాదని ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ నేతలు ఉచిత కరెంట్పై ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. కేసిఆర్ పాన లో వ్యవసాయం పండగ అయ్యిందని.. 24 గంటల కరెంటు కచ్చితంగా ఇచ్చి తీరుతామని స్పష్టం చేశారు.
గ్రామంలో కాంగ్రెస్ నాయకులను తరిమి కొట్టాలని పిలుపునిచ్చారు. బేశరుతుగా కాంగ్రెస్ నాయకులు క్షమాపణ చెప్పాలని, లేకుంటే తెలంగాణలో తిరగనివ్వమని వార్నింగ్ ఇచ్చారు. కాగా తెలంగాణ రైతాంగానికి మొత్తానికి ఎనిమిది గంటల ఉచిత విద్యుత్ ఇస్తే సరిపోతుందని, 24 గంటల ఉచిత విద్యుత్ మాత్రం విద్యుత్ సంస్థల నుంచి కమీషన్ల కోసమేనంటూ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాష్ట్రంలో రాజకీయంగా వేడిని రాజేశాయి.
చదవండి: రేవంత్ ‘ఉచిత’ ఉపన్యాసం.. ఆత్మరక్షణలో కాంగ్రెస్.. చేజేతులా!
Comments
Please login to add a commentAdd a comment