free current
-
TG: ప్రభుత్వ విద్యాసంస్థలకు ఉచిత విద్యుత్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రభుత్వ విద్యాసంస్థలకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ విద్యాసంస్థలకు ఉచిత విద్యుత్ అందించనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క గురువారం ఒక ప్రకటనలో తెలియజేశారు. ఇక.. ఇవాల్టీ నుంచే విద్యాసంస్థలో ఉచిక విద్యుత్ అమలులోకి వస్తుందని, జీవో కూడా విడుదల చేశామని వెల్లడించారు. దీంతో రాష్ట్రంలోని 27,862 విద్యాసంస్థలకు ఉచిత విద్యుత్ అందనుంది.గురువారం రవీంద్ర భారతిలో జరిగిన గురుపూజోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడారు. ‘విద్యా సంస్థలకు ఉచితంగా ఇచ్చే విద్యుత్తు బిల్లులను రాష్ట్ర ప్రభుత్వమే చెల్లిస్తుంది. విద్యతో పాటు గురువులకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం. గత పది సంవత్సరాల్లో ఇబ్బందులు పడ్డ ఉపాధ్యాయులకు పదోన్నతులు, బదిలీలు నిర్వహించింది మా ప్రభుత్వమే. 11,062 పోస్టులకు డీఎస్సీ నోటిఫికేషన్ వేసి పరీక్షలు నిర్వహించాం, మరో 6వేల పోస్టులకు నోటిఫికేషన్ వేస్తాం. స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేశామని చెప్పడానికి సంతోషిస్తున్నాను. యూనివర్సిటీల మౌలిక వసతులకై రూ.300 కోట్లు కేటాయించాం. ప్రభుత్వ బడుల మౌలిక వసతుల కల్పనకు రూ.667 కోట్లు వెచ్చించాం. శానిటేషన్ వర్క్స్ ఏర్పాటుకు రూ. 136 కోట్లు విడుదల చేశాం. ప్రగతిశీల తెలంగాణ రాష్ట్రం నిర్మాణం కావడానికి ఉపాధ్యాయులు కీలక పాత్ర పోషించాలి’ అని అన్నారు. ఈ కార్యక్రమంలో భట్టితో పాటు మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. -
ఉచిత కరెంట్ కోసం అప్లయ్ చేశారా?, లేదంటే ఇలా చేయండి..
దేశ ప్రజలకు ప్రధాని నరేంద్ర మోదీ శుభవార్త చెప్పారు. సోలార్ పవర్ వినియోగాన్ని మరింత పెంచేందుకు ప్రధాని మోదీ 'పీఎం సూర్య ఘర్: ముఫ్త్ బిజిలీ యోజన' పథకాన్ని ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు. ఈ పథకంలో ప్రతి నెలా కోటి ఇళ్లకు 300 యూనిట్ల వరకు ఉచిత కరెంట్‌ను అందించనున్నట్లు తెలిపారు. ఈ పథకాన్ని అట్టడుగు స్థాయిలో ప్రాచుర్యంలోకి తీసుకురావడానికి, పట్టణ స్థానిక సంస్థలు, పంచాయతీలు తమ అధికార పరిధిలో రూఫ్‌టాప్ సోలార్ సిస్టమ్‌లను ప్రోత్సహించాలని మోదీ అన్నారు. అదే సమయంలో, ఈ పథకం మరింత ఆదాయానికి, తక్కువ విద్యుత్ బిల్లులకు, ప్రజలకు ఉపాధి కల్పనకు దారి తీస్తుంది అని చెప్పారు. ప్రధాన మంత్రి సూర్య ఘర్ ముఫ్త్ బిజిలీ యోజన కోసం ఎలా దరఖాస్తు చేయాలి? ఇందుకోసం ఎలాంటి పత్రాలు కావాలో తెలుసుకుందాం ♦ ముందుగా https://pmsuryaghar.gov.in వెబ్‌సైట్‌ను ఓపెన్ చేయండి. ♦ అప్లయ్ ఫర్ రూఫ్‌టాప్ సోలార్ ఆప్షన్‌పై క్లిక్ చేయండి ♦ మీరు ఈ వివరాలతో ముందుగా నమోదు చేసుకోవాలి - రాష్ట్రం, విద్యుత్ పంపిణీ సంస్థ, విద్యుత్ వినియోగదారు సంఖ్య, మొబైల్ నంబర్, ఇమెయిల్ వివరాల్ని నమోదు చేయాలి. ♦ పూర్తి చేసిన తర్వాత, మీ మొబైల్ నంబర్‌తో లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. ♦ మీరు ఇప్పుడు సోలార్ ప్యానల్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ అప్లికేషన్ ప్రాసెస్‌లో బ్యాంక్ వివరాలను సమర్పించాలి. ♦ మీరు ఆమోదం పొందిన తర్వాత, మీ డిస్కమ్‌లోని రిజిస్టర్డ్ విక్రేతలలో ఎవరైనా ప్లాంట్‌ను ఇన్స్టాల్ చేసుకోవాలి. ♦ ఇనెట్ మీటర్‌ను ఇన్స్టాల్ చేశాక, డిస్కమ్ అధికారులు తనిఖీలు చేస్తారు. అనంతరం పోర్టల్ నుంచి కమిషనింగ్ సర్టిఫికేట్ ఇస్తారు. ♦ ఈ రిపోర్ట్ పొందిన తర్వాత మీ బ్యాంకు ఖాతా వివరాలతో పాటు క్యాన్సిల్డ్ చెక్‌ను పోర్టల్‌లో సబ్మిట్ చేయాలి. 30 రోజుల్లోగా మీ ఖాతాలో సబ్సిడీ జమ అవుతుంది. -
వైఎస్ జగన్ హయంలో రైతులకు నాణ్యమైన ఉచిత విద్యుత్తు
-
కాంగ్రెసోళ్లది ఉత్త కరెంటు
సిద్దిపేట జోన్: ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కరెంట్ గురించి అడిగే నైతిక హక్కు కాంగ్రెస్ నాయకులకు లేదని ఆర్ధిక, వైద్యారోగ్యాశాఖ మంత్రి టి.హరీశ్‌రావు తేల్చిచెప్పారు. కాంగ్రెస్ పాలనలో ఉచిత కరెంట్‌ను ఉత్త కరెంట్‌గా మార్చిన కాంగ్రెసోళ్లు ఇప్పుడు సిగ్గు లేకుండా కరెంట్ గురించి మాట్లాడుతున్నారని విమర్శించారు. శనివారం సిద్దిపేట జిల్లా నర్మెటలో రూ.300 కోట్లతో ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ నిర్మాణానికి భూమి పూజ చేశారు. జిల్లా కేంద్రంలో సఖి, భరోసా కేంద్రాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా హరీశ్ మాట్లాడుతూ ‘సీఎం కేసీఆర్ సంకల్పానికి దైవబలం ఉంది.. ఆయన పనిమంతుడే కాదు దేవున్ని బాగా కొలుస్తారు, నమ్ముతారు. అందుకే తొమ్మిదేళ్ల పాలనలో రాష్ట్రంలో కరువే లేదు’ అని వ్యాఖ్యానించారు. అదే చంద్రబాబు, కిరణ్ కుమార్‌రెడ్డి హయాంలో కరువుతో రాష్ట్ర ప్రజలు అల్లాడిపోయారని గుర్తుచేశారు. చాలా రాష్ట్రాల్లో కరువు వచ్చినా తెలంగాణలో కాళేశ్వరం వల్ల ఆ ఛాయలు లేవన్నారు. ఒక్కప్పుడు ఐటీ అని కలవరించిన చంద్రబాబు ఇప్పుడు తెలంగాణ భూముల విలువ గురించి మాట్లాడుతున్నారని చెప్పారు. కాగా, ఈ వయసులో ఆయనను అరెస్టు చేయడం దురదృష్టకరమన్నారు. కార్యక్రమంలో డీజీపీ అంజన్‌కుమార్, అదనపు డీజీ (ఉమెన్ సేఫ్టీ) షికాగోయల్, హుస్నాబాద్ ఎమ్మెల్యే సతీష్, ఉద్యానవన శాఖ కమిషనర్ హన్మంత రావు, జెడ్పీ చైర్పర్సన్ రోజాశర్మ, కలెక్టర్ పాటిల్ పాల్గొన్నారు. శతమానం భవతి.. శ్రీజ సిద్దిపేటలో రూ 30 లక్షలతో ఏర్పాటు చేసిన శిశుగృహ కేంద్రాన్ని మంత్రి ప్రారంభించారు. ఆ సమయంలో అక్కడి సిబ్బంది చేతిలో ఓ మూడు నెలల పసికందు చిరునవ్వులు చిందించడంతో ఆయన అబ్బురపడ్డారు. వెంటనే పసికందును ఎత్తుకొని సిబ్బంది ద్వారా వివరాలు సేకరించారు. మూడు నెలల క్రితం పసికందును విక్రయించే క్రమంలో అడ్డుకొని సంరక్షణ బాధ్యతలు స్వీకరించినట్టు వారు మంత్రి దృష్టికి తెచ్చారు. కాగా ఇప్పటివరకు పేరులే కుండా ఉన్న ఆ పసికందుకు శ్రీజ అని నామకరణం చేశారు. నిండు నూరేళ్లు శ్రీజ ముఖంలో చిరునవ్వులు వెల్లివిరియాలని దీవించారు. -
బీజేపీ శాపం.. కాంగ్రెస్ పాపం..కేసీఆర్ దీపం: హరీశ్
గజ్వేల్: ’’తెలంగాణకు రూపాయి ఇయ్య.. ఏం చేసుకుంటావో చేసుకో అన్న కిరణ్‌కుమార్‌రెడ్డి ఇయ్యాల బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డికి గురువు, ఉచిత కరెంట్ వద్దన్న చంద్రబాబు రేవంత్‌రెడ్డికి గురువు. దీపం లాంటి కేసీఆర్ ఉండగా.. తెలంగాణ ద్రోహుల చుట్టూ తిరుగుతున్న శాపం లాంటి బీజేపీ, పాపం లాంటి కాంగ్రెస్ మనకెందుకు..?’’ అని మంత్రి టి.హరీశ్‌రావు వ్యాఖ్యానించారు. శనివారం సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గంలో హోంమంత్రి మహ మూద్ అలీతో కలిసి పలు అభివృద్ధి పనుల శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభల్లో హరీశ్‌రావు మాట్లాడుతూ.. మూడు నల్ల చట్టాలను తీసుకొచ్చి రైతాంగం ఉసురుపోసుకున్న బీజేపీ, మూడు గంటలే కరెంటు చాలంటున్న కాంగ్రెస్‌ను ప్రజలు తరిమికొట్టే రోజులు దగ్గరపడ్డాయన్నారు. అసెంబ్లీలో తెలంగాణకు నిధులివ్వరా? అని అప్పట్లో తాను ప్రశ్నిస్తే ఒక్క రూపాయి ఇయ్య...ఏం చేస్తారో చేసుకోండి అన్న కిరణ్‌కుమార్‌రెడ్డిని కిషన్‌రెడ్డి తన ప్రమాణ స్వీకార కార్యక్రమానికి సోయి మరిచి ముఖ్య అతిథిగా ఆహ్వానించారని మండిపడ్డారు. కిరణ్, బాబు కాళ్ల వద్ద ఆత్మగౌరవాన్ని తాకట్టుపెడతారా? తెలంగాణను రాచి రంపాన పెట్టి, ఈ ప్రాంతానికి కరెంట్, నీళ్లు ఇయ్యకపోగా.. వ్యవసాయం దండగ అన్న చంద్రబాబు నేడు రేవంత్‌రెడ్డికి గురువు అంటూ ఎద్దేవా చేశారు. తెలంగాణ ద్రోహులుగా ముద్రపడిన కిరణ్, చంద్రబాబు కాళ్ల దగ్గర ఈ ప్రాంత ఆత్మగౌరవాన్ని తాకట్టు పెడతారా..? ఇది సిగ్గుచేటు అంటూ వ్యా ఖ్యానించారు. చంద్రబాటు ఇటీవల తెలంగాణపై ప్రేమ చూపినట్లు మాట్లాడు తున్నారని, అదీ ఏపీ సీఎం జగన్‌పై కోపంతో మాత్రమేనని, నిజంగా ఆయనకు తెలంగాణపై ప్రేమ లేదని, ముమ్మాటికీ ఆయన ఈ ప్రాంతానికి ద్రోహి అని పునరుద్ఘాటించారు. కార్యక్రమాల్లో కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, ఎమ్మెల్సీ డాక్టర్ యాదవరెడ్డి, రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ (టీఎస్ఎఫ్డీసీ) చైర్మన్ వంటేరు ప్రతాప్‌రెడ్డి, జెడ్పీ చైర్పర్సన్ రోజాశర్మ తదితరులు పాల్గొన్నారు. -
రేవంత్‌లో టీడీపీ వాసనలు పోలేదా?.. టీ కాంగ్రెస్ కొంపముంచేశాడా?
రాజకీయాలలో ఒక్క పదం చాలు మొత్తం వాతావరణాన్ని మార్చడానికి. తెలంగాణలో కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చేసిన ఒక వ్యాఖ్య ఆసరాగా చేసుకుని అధికారంలో ఉన్న భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) కార్యకర్తలు, నేతలు తీవ్ర అలజడి సృష్టించడానికి యత్నించారు. వారికి నిరసనగా కాంగ్రెస్ శ్రేణులు కూడా కొన్ని ఆందోళనలకు దిగినా, మొత్తం మీద బీఆర్ఎస్దే పై చేయి అయినట్లు అనిపిస్తుంది. గత కొంతకాలంగా బీఆర్ఎస్కు పోటాపోటీగా ఉన్నది కాంగ్రెస్ పార్టీయేనన్న భావన ఏర్పడిన తరుణంలో రేవంత్ ఉచిత విద్యుత్‌కు సంబంధించి చేసిన వ్యాఖ్య ఆ పార్టీని ఆత్మరక్షణలో పడేసింది. అదే టైమ్‌లో కాంగ్రెస్‌లోని ఇతర వర్గాలు ఆ పాయింట్ ఆధారంగా ఆయనను ఇరుకున పెట్టడానికి సహజంగానే యత్నిస్తాయి. తెలంగాణ మంత్రి కేటిఆర్ అయితే పవర్ పుల్ పంచ్ డైలాగు వాడారు. రేవంత్ వీటన్నిటికి సమాధానం ఇస్తూ ట్వీట్ చేసినా జరగవలసిన నష్టం కొంతమేర జరిగిపోయింది. అమెరికాలో జరిగిన తానా సభలో ఆయన ఒక ప్రశ్నకు సమాధానంగా తెలంగాణలో ఇరవై నాలుగు గంటలపాటు వ్యవసాయానికి విద్యుత్ ఇవ్వనవసరం లేదని, ఇందులో ముఖ్యమంత్రి కేసీఆర్ కమిషన్ల వ్యవహారం ఉందని ఆరోపించారు. తెలంగాణలో 95 శాతం మంది మూడు ఎకరాలలోపు వారేనని, ఎకరానికి నీరు ఇవ్వడానికి గంట సమయం పడుతుందని, ఆ లెక్కన మూడు గంటల సమయం కరెంటు ఇస్తే చాలని, మొత్తం మీద ఎనిమిది గంటల ఉచిత విద్యుత్ సరిపోతుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఎన్నికలకు నాలుగునెలల ముందు ఇలాంటి వ్యాఖ్య చేయడంతో బీఆర్ఎస్ వెంటనే రంగంలో దూకి కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రైతులకు ఉచిత విద్యుత్ ఉండదని, మూడు గంటలే విద్యుత్ సరఫరా అన్న రేవంత్‌ను ఉరికించాలని అంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత వ్యాఖ్యానించారు. కేటిఆర్ స్పందిస్తూ మూడు పంటలు పండించే బీఆర్ఎస్ కావాలా? మూడు గంటలే కరెంటు ఇచ్చే కాంగ్రెస్ కావాలా ? అని సవాల్ విసిరారు. దీనిపై కాంగ్రెస్‌లో కూడా అలజడి ఏర్పడింది. పార్టీ వ్యవహారాల ఇన్చార్జీ మాణిక్యం ఠాకూర్ మొదలు సీఎల్పి నేత భట్టి విక్రమార్క, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి తదితరులు రకరకాలుగా స్పందించారు. కోమటిరెడ్డి వ్యాఖ్య ఒకరకంగా రేవంత్‌ను ఇబ్బంది పెట్టేదే. రేవంత్‌కు అండగా ఉన్నట్లు కనిపిస్తూనే, వ్యంగ్యంగా మాట్లాడారు. ఇండియాలో ఉన్నంతవరకు బాగానే ఉన్నారని, అమెరికాలో తానా సభలో నటుడు బాలకృష్ణ, మంత్రి ఎర్రబెల్లి దయాకరరావులను కలిసిన తర్వాత రేవంత్ ఇలా మాట్లాడారేమోనని అన్నారు. చదవండి: పవన్ ఇంతకీ ఏం సాధించినట్లు?.. పిచ్చి పీక్స్‌కు వెళ్లడం అంటే ఇదేనేమో! ప్రత్యేకించి బాలకృష్ణ తిక్క ఈయనకు అంటిందేమో అన్నట్లు వెంకటరెడ్డి చమత్కరించారు. రేవంత్‌లో తెలుగుదేశం వాసనలు పోలేదని పరోక్షంగా ఆయన చెప్పారన్నమాట. అదే టైమ్‌లో అసలు తెలంగాణలో రైతులకు ఎక్కడ 24 గంటల విద్యుత్ ఇస్తున్నారని ప్రశ్నించారు. అలా ఇస్తున్నట్లు రుజువు చేస్తే తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని అన్నారు. ఉచిత విద్యుత్ అన్నది కాంగ్రెస్ పేటెంట్ అని, 24 గంటల కరెంటు ఇస్తామని భట్టి పేర్కొన్నారు. వరంగల్ వచ్చి ప్రత్యేకంగా సభ పెట్టి రైతుల డిక్లరేషన్‌ను ప్రకటించిన కాంగ్రెస్‌కు ఇది ఊహించని పరిణామమే. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామని రాహుల్ గాంధీతో ప్రకటింప చేశారు. కాని అప్పుడు అది ఎలా సాధ్యమో కాంగ్రెస్ నేతలెవరూ వివరించలేదు. రేవంత్ ఆర్ధికవేత్త మాదిరి మాట్లాడి బోర్ల పడ్డారనిపిస్తుంది. కాంగ్రెస్ పార్టీ ఎనిమిది గంటల ఉచిత విద్యుత్ ఇస్తుందని రేవంత్ చెప్పడం వల్ల పార్టీ ఇరుకున పడినట్లయింది. ఆయన చెప్పినదానిలో హేతుబద్దత ఉందా? లేదా? అన్నది వేరే చర్చ. కాని ఆయన డిఫెన్స్‌లో పడడం వల్లే, తన ప్రకటనను వక్రీకరించారని, బీఆర్ఎస్ మూడు చెరువుల నీళ్లు తాగడం ఖాయమని, మూడోసారి అధికారంలో రాలేదని ఆయన సమాధానం ఇచ్చారు. వరంగల్ రైతు డిక్లరేషన్‌ను అమలు చేస్తామని, రైతు బంధు కింద ఎకరాకు పదిహేనువేలు ఇస్తామని, తదితర అంశాలన్నిటిని ప్రస్తావించినా కీలకమైన ఉచిత విద్యుత్ విషయంలో అనవసర వివాదం సృష్టించుకున్నారు. దీనిపై బీఆర్ఎస్ పెద్ద ఎత్తున ఆందోళనకు దిగడం, రేవంత్ దిష్టి బొమ్మలు దహనం చేయడం వంటి వాటిలో రాజకీయం వేడెక్కింది. దీనికి పోటీగా కాంగ్రెస్ కూడా నిరసనలు చేపట్టినా, వాటికి అంత ప్రాధాన్యత లేకుండా పోయినట్లయింది. రాహుల్ గాంధీపై బీజేపీ కక్ష కట్టిందని నిరసిస్తూ తాము గాందీ భవన్లో నిరశన చేయబోతుండగా, దానిని చెడగొట్టడానికి బీఆర్ఎస్ కుట్ర పన్నిందని కాంగ్రెస్ నేతలు వ్యాఖ్యలు చేసినా, అందులో పస కనిపించలేదు. ఇటీవలే రేవంత్ మరో సందర్భంలో ములుగు కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క సీఎం కావచ్చని అనడం కూడా విమర్శలకు దారి తీసింది. కాంగ్రెస్‌లో టీడీపీ నేతల ఆధిపత్యం పెరిగిపోయిందన్న భావనను కాంగ్రెస్ నేతలు వ్యక్తం చేశారు. బీఆర్ఎస్పై రాజకీయంగా దాడి పెంచవలసిన తరుణంలో రేవంత్ స్వయంకృతాపరాధంతో ఆత్మరక్షణలో పడ్డారు. వెంటనే కొందరు నేతలు అధిష్టానానికి దీనిపై ఫిర్యాదులు కూడా చేశారు. ఈ సందర్భంగా రేవంత్ ఇప్పటికీ చంద్రబాబు నాయుడు శిష్యుడుగానే ఉన్నారన్న అభిప్రాయాన్ని ప్రచారం చేయడానికి బీఆర్ఎస్ యత్నించింది. చంద్రబాబు వ్యవసాయం దండగ అని అంటే, రేవంత్ ఉచిత విద్యుత్ దండగ అని అంటున్నారని ఆరోపించింది. 2004 ఎన్నికల ముందు ఆనాటి ప్రతిపక్ష నేత వైఎస్ రాజశేఖరరెడ్డి రైతులకు ఉచిత విద్యుత్ ఇస్తామని కాంగ్రెస్ నేతగా ప్రకటించారు. దానిపై అప్పట్లో కూడా పార్టీలో బిన్నాబిప్రాయాలు వచ్చాయి. సాధ్యాసాధ్యాలపై కూడా చర్చలు జరిగాయి.అయినా వైఎస్ వెనక్కి తగ్గలేదు. అప్పట్లో ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు రైతులకు ఉచిత విద్యుత్ ఇస్తే కరెంటు తీగలపై బట్టలు ఆరేసుకోవల్సిందేనని టీడీపీ నేతలతో అన్నారు. ఆయనకు మద్దతు ఇచ్చే ఎల్లో మీడియా కూడా తదనుగుణంగా కార్టూన్లు కూడా వేశాయి. చదవండి: పవన్ చెబుతున్నవన్నీ తప్పుడు లెక్కలే.. ఇదిగో సాక్ష్యం టీడీపీ 2004లో ఓడిపోవడానికి ఇది కూడా కారణం అయింది. చంద్రబాబు చేసిన ఒకటి, రెండు వ్యాఖ్యలు టీడీపీ కొంప ముంచాయి. ఇప్పుడు రేవంత్ వ్యాఖ్యల వల్ల అంత నష్టం జరుగుతుందా? లేదా? అన్నది అప్పుడే చెప్పలేం. అయితే అసలే ప్రతిపక్షంలో ఉండి నానా తంటాలు పడుతున్న తరుణంలో రేవంత్ ఇలా మాట్లాడడం రాజకీయంగా తెలివైన పనికాదు. గతంలో పివి నరసింహారావు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ముల్కి నిబంధనలపై సుప్రీంకోర్టు తీర్పు ముల్కికి అనుకూలంగా తీర్పు వచ్చింది. ఆ సందర్భంలో ఆయన ఇదే ఫైనల్ అన్న వ్యాఖ్య చేశారు. దానిపై ఆయనను వ్యతిరేకించే ఆంధ్ర కాంగ్రెస్ నేతలు కొందరు ప్రత్యేక ఆంధ్ర ఉద్యమానికి ఆజ్యం పోశారు. చివరికి పివి ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పుకోవలసి వచ్చింది. ఆ తర్వాత రాష్ట్రపతి పాలన పెట్టవలసి వచ్చింది. ఇటీవల జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏపీలో వలంటీర్లను ఉద్దేశించి చేసిన అనుచిత వ్యాఖ్యలు ఆయనను తీవ్ర ఇరకాటంలోకి నెట్టాయి. వాటిని వెనక్కి తీసుకోలేక, సమర్దించుకోలేక సతమతమవుతున్నారు. ఇలా ఆయా నేతలు చేసిన పలుప్రకటనలను ఉదాహరణగా తీసుకోవచ్చు. మాజీ మంత్రి డీకే సమరసింహారెడ్డి బీసీలా? వంకాయలా అని యాథాలాపంగా అన్నారు. అది ఆరోజుల్లో పెద్ద వివాదం అయింది. చంద్రబాబు నాయుడు ఎస్సీలలో పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా అని వ్యాఖ్యానించిన వైనం ఆయనను వెంటాడుతూనే ఉంటుంది. అలాగే మగపిల్లాడిని కంటానని కోడలు అంటే అత్త వద్దంటుందా అని మరో అభిప్రాయం చెప్పి మహిళల ఆగ్రహానికి ఆయన గురి అయ్యారు. అసెంబ్లీలో ఒకసారి చంద్రబాబును ఉద్దేశించి వైఎస్ రాజశేఖరరెడ్డి చేసిన ఒక కామెంట్‌పై టీడీపీ నానా రచ్చ చేసింది. తదుపరి వైఎస్ దానిని వెనక్కి తీసుకున్నారు. ఇవన్ని ఎందుకంటే రాజకీయాలలో అందులోను ఎన్నికల సమయంలో నేతలు చాలా వ్యూహాత్మకంగా ఉండాలి. ఒక్కోసారి ఒక్క నినాదమే పార్టీకి ఎంతో ఉపయోగపడవచ్చు. 1971లో ఇందిరాగాంధీ ఇచ్చిన గరీబీ హటావో నినాదం మొత్తం దేశాన్ని కదల్చివేసింది. 1999లో ఈసారి వాజ్ పేయికే అన్న నినాదం బీజేపీకి కలిసి వచ్చింది. కేసీఆర్ తెలంగాణ ఆత్మగౌరవ నినాదం పెద్ద ఉద్యమానికి అండగా నిలిచింది. 2019లో వైఎస్ జగన్మోహన్రెడ్డి ఒక్క చాన్స్ అన్న ప్రచారం బాగా కలిసి వచ్చింది. ఇలా ఆయా వ్యాఖ్యలు కొన్నిసార్లు నెగిటివ్‌గా, మరికొన్నిసార్లు పాజిటివ్‌గా మారతాయి. ఎన్నికల సమయంలో నెగిటివ్ వ్యాఖ్యలు చేశారో,ప్రత్యర్ది పార్టీ దానిని అందిపుచ్చుకుని ప్రజలలో ఆ పార్టీ నేత పరపతిని దెబ్బతీస్తుంది. సరిగ్గా ఇప్పుడు రేవంత్‌ను బీఆర్ఎస్ అలాగే ఇరుకునపెట్టింది. దానికి కాంగ్రెస్‌లో అంతర్గతంగా ఉండే వర్గాలు కూడా ఆయనను చికాకుపెట్టాయి. అందుకే కాలు జారితే వెనక్కి తీసుకోవచ్చు.. నోరు జారితే వెనక్కి తీసుకోలేం అని అంటారు. దానిని నేతలు గుర్తుంచుకోకపోతే వారికే నష్టం. -కొమ్మినేని శ్రీనివాస రావు, ఏపీ మీడియా అకాడెమీ చైర్మన్ -
క్షమాపణ చెప్పాల్సిందే, లేకుంటే రాష్ట్రంలో తిరగనివ్వం: ఎమ్మెల్సీ కవిత
సాక్షి, హైదరాబాద్:బీఆర్ఎస్ పార్టీ అందిస్తున్న ఉచిత కరెంట్‌పై తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యల కారణంగా అటు రైతులతో పాటు బీఆర్ఎస్ నాయకులు భగ్గుమంటున్నారు. హైదరాబాద్ విద్యుత్ సౌధ వద్ద బుధవారం నిర్వహించిన ధర్నాలో బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి ఎమ్మెల్సీ కవిత, ఎమ్మెల్యే దానం నాగేందర్ తదితరులు పాల్గొని నిరసన తెలియజేశారు. రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డి వ్యాఖ్యాలపై మండిపడ్డారు. రైతుకు వ్యవసాయం పండగ కావాలంటే నీళ్ళు, రైతు బంధు ఇస్తున్నామని.. వ్యాపార వేత్తలకు కరెంట్ ఇవ్వొదని రేవంత్ రెడ్డి చెప్పడం సమజసం కాదని ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ నేతలు ఉచిత కరెంట్‌పై ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. కేసిఆర్ పాన లో వ్యవసాయం పండగ అయ్యిందని.. 24 గంటల కరెంటు కచ్చితంగా ఇచ్చి తీరుతామని స్పష్టం చేశారు. గ్రామంలో కాంగ్రెస్ నాయకులను తరిమి కొట్టాలని పిలుపునిచ్చారు. బేశరుతుగా కాంగ్రెస్ నాయకులు క్షమాపణ చెప్పాలని, లేకుంటే తెలంగాణలో తిరగనివ్వమని వార్నింగ్ ఇచ్చారు. కాగా తెలంగాణ రైతాంగానికి మొత్తానికి ఎనిమిది గంటల ఉచిత విద్యుత్ ఇస్తే సరిపోతుందని, 24 గంటల ఉచిత విద్యుత్ మాత్రం విద్యుత్ సంస్థల నుంచి కమీషన్ల కోసమేనంటూ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాష్ట్రంలో రాజకీయంగా వేడిని రాజేశాయి. చదవండి: రేవంత్ ‘ఉచిత’ ఉపన్యాసం.. ఆత్మరక్షణలో కాంగ్రెస్.. చేజేతులా! -
కర్ణాటక ఫలితాలు: కరెంటు బిల్లులు కాంగ్రెస్ నుంచి వసూలు చేసుకోండి!
సాక్షి, బెంగళూరు: ‘‘మే కరెంటు బిల్లులు కట్టం. కాంగ్రెస్ పార్టీ నుంచి వసూలు చేసుకోండి’’ అని కర్ణాటకలో ఓ గ్రామస్థులు తెగేసి చెప్పారు. చిత్రదుర్గ జిల్లాలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. బకాయిలతో సహా కరెంటు బిల్లులన్నీ కట్టాలన్న బిల్లు కలెక్టర్ గోపిని గ్రామస్థులు ఎదురు తిరిగారు. ప్రతి ఇంటికీ 200 యూనిట్ల ఉచిత కరెంటిస్తామని కాంగ్రెస్ ఎన్నికల హామీ ఇచ్చింది గనక గ్రామస్తులు తమ కరెంటు బిల్లు చెల్లించేందుకు నిరాకరించారు. ఎన్నికల బిల్లులను ఆ పార్టీ నుంచే వసూలు చేసుకోవాలని స్పష్టం చేశారు. దాంతో చేసేది లేక ఆయన వెనుదిరిగాడు. కాగా అధికారం చేపట్టిన తొలిరోజు తొలి కేబినెట్ సమావేశంలో ప్రతీ ఇంటికి నెలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్‌ను అందించే హామీకి ఆమోద ముద్ర వేస్తామని కాంగ్రెస్ పేర్కొంది. చదవండి: నేను వెన్నుపోటు పొడవను.. డీకే శివకుమర్ కీలక వ్యాఖ్యలు.. Villagers in Chitradurga refuse to pay electricity bill. Exhort others also not to pay! They tell the bill collector that Congress had promised them free electricity, as soon as they came to power… Go take it from them (Congress), they say… If Congress doesn’t give a CM soon,… pic.twitter.com/FNgGtwdPHM — Amit Malviya (@amitmalviya) May 15, 2023 -
మోదీ అడ్డాలో పాగాకు కేజ్రీవాల్ పక్కా ప్లాన్! ఉచిత కరెంటు హామీ
సూరత్: ఈసారి గుజరాత్లో ఎలాగైనా పాగావేయాలని భావిస్తోంది ఆమ్ ఆద్మీ పార్టీ. ఈ ఏడాది చివర్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల కోసం ఇప్పటి నుంచే ప్రజలపై హామీల వర్షం కురిపిస్తోంది. గురువారం సూరత్‌లో జరిగిన ఓ సమావేశానికి హాజరైన ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్.. తమను గెలిపిస్తే నెలకు 300 యూనిట్ల వరకు ఉచిత కరెంటు అందిస్తామని ప్రకటించారు. నిరంతరాయంగా విద్యుత్ సరఫరా ఉంటుందని చెప్పారు. తాము అధికారంలోకి వస్తే చేపట్టే కార్యక్రమాలపై గుజరాత్‌లోని ప్రతి ఇల్లు తిరిగి ప్రచారం నిర్వహిస్తామని కేజ్రీవాల్ పేర్కొన్నారు. తాము ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటి నెరవేర్చకపోయినా మళ్లీ ఆప్‌కు ఓటు వేయొద్దని స్పష్టం చేశారు. గుజరాత్లో అవినీతిని అంతం చేస్తే తాను సీఎంగా ఉన్న ఢిల్లీ మోడల్ తరహాలోనే ఉచిత విద్యుత్ సాధ్యమవుతుందని వివరించారు. అంతేకాదు ఆప్‌ను గెలిపిస్తే 2021 డిసెంబర్ ముందు వరకు ఉన్న విద్యుత్ బకాయిలను రద్దు చేస్తామన్నారు. మార్పు కోరుకుంటున్నారు గుజరాత్ ప్రజలు 27ఏళ్ల బీజేపీ పాలనతో విసిగిపోయారని కేజ్రీవాల్ అన్నారు. ఇక్కడి ప్రజలు మార్పు కోరుకుంటున్నారని చెప్పారు. డిసెంబర్లో జరగనున్న గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాగైనా సత్తా చాటాలని ఆప్ వ్యూహాలు రచిస్తోంది. ఇందులో భాగంగానే కేజ్రీవాల్ ఆ రాష్ట్రంపై ప్రత్యేక దృష్టి సారించారు. జులైలో ఆయన రాష్ట్రానికి రావడం ఇది రెండోసారి. చదవండి: బీజేపీ నేతలకు మమత వార్నింగ్.. ‘ఇక్కడకు రావొద్దు రాయల్ బెంగాల్ టైగర్ ఉంది’ -
ఉచిత విద్యుత్‌పై టీడీపీ అసత్య ప్రచారం: మంత్రి బుగ్గన
సాక్షి,డోన్: వ్యవసాయానికి ఇచ్చే ఉచిత విద్యుత్‌పై టీడీపీ నేతలు అసత్య ప్రచారం చేస్తున్నారని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ధ్వజమెత్తారు. నంద్యాల జిల్లా డోన్‌లో శనివారం నిర్వహించిన నియోజకవర్గ స్థాయి వైఎస్సార్సీపీ ప్లీనరీలో మంత్రి మాట్లాడారు. రాష్ట్రంలో విద్యుదుత్పత్తికి ఏటా రూ.10 వేల కోట్లు వ్యయం చేస్తుంటే.. రూ.2 వేల కోట్లకు లెక్కలు తేలడం లేదన్నారు. ఈ నేపథ్యంలో మోటార్లకు మీటర్లు బిగించబోతున్నట్లు చెప్పారు. రైతులకు యథాతథంగా ఉచిత విద్యుత్ అందుతోందని తెలిపారు. -
గెలిస్తే ఉచితంగా 300 యూనిట్ల కరెంట్
సాక్షి, న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిస్తే విద్యుత్ గృహ వినియోగదారులకు 300 యూనిట్ల ఉచిత కరెంట్ అందిస్తామని ఆమ్ ఆద్మీ పార్టీ ప్రకటించింది. గురువారం లక్నోలో ఆప్ యూపీ ఇన్‌ఛార్జి సంజయ్ సింగ్‌తో కలిసి ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా మీడియాతో మాట్లాడారు. బీజేపీ హయాంలో గృహ అవసరాల నిమిత్తం 300 యూనిట్ల విద్యుత్తుకు రూ.1,900 చెల్లిస్తున్నారని అదే ఆప్ ప్రభుత్వం వస్తే ఏమీ చెల్లించనవసరం లేదని స్పష్టం చేశారు. యూపీలో గెలిస్తే అధిక కరెంట్ బిల్లులతో సతమతమవుతోన్న 48 లక్షల కుటుంబాల విద్యుత్ బిల్లులను రద్దుచేస్తామన్నారు. రైతులకు ఉచితంగా కరెంట్ ఇస్తామని, పాత బకాయిలు మాఫీ చేస్తామని సిసోడియా పేర్కొన్నారు. ఇదే తరహా హామీని ఇప్పటికే ఆప్ పంజాబ్, ఉత్తరాఖండ్, గోవాల్లోనూ ఇచ్చింది. యూపీలోని మొత్తం 403 స్థానాల్లో పోటీకి దిగుతామని ఆప్ గతంలోనే స్పష్టంచేసింది. ఢిల్లీలో విజయవంతం అయిన విద్యుత్తు ఫార్మూలాను 2017లో పంజాబ్ ఎన్నికల్లో ప్రయోగించి అత్యధిక స్థానాలు పొందిన రెండో పార్టీగా ఆప్ నిలిచింది. ఈ సారి ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్‌ల్లోనూ తమదైన ముద్ర వేయాలని ఏడాది నుంచే పార్టీ జాతీయ కన్వీనర్ కేజ్రీవాల్ ఎన్నికల ప్రణాళికలు సిద్ధం చేశారు. ఈ నెల మొదటి వారంలో వివిధ సర్వేలు పంజాబ్‌లో ఆప్ గణనీయమైన పురోగతి సాధిస్తుందని పేర్కొనడంతో పార్టీని పక్క రాష్ట్రాలకు విస్తరించడానికి సరైన తరుణమని కేజ్రీవాల్ భావించారు. ఉత్తరప్రదేశ్‌లాంటి పెద్ద రాష్ట్రంలో పార్టీని ప్రజల్లోకి తీసుకురావాలంటే ఛరిష్మా ఉన్న అగ్రనేత తప్పనిసరి. ఇటు అధికార బీజేపీ, కాంగ్రెస్, ఎస్పీ, బీఎస్పీ పునాదులు బలంగా ఉండడంతో ఢిల్లీ విద్యుత్ ఫార్మూలానే యూపీలోనే ప్రయోగించాలని ఆప్ విశ్వసిస్తోంది. కరోనా నేపథ్యంలో ఉత్తరప్రదేశ్ గ్రామీణ ప్రాంతాల్లో 95 శాతం మంది ఆదాయం పడిపోయిందని ఓ సర్వేలో వెల్లడైంది. దేశవ్యాప్తంగా తరలివెళ్లిన వలస కార్మికులు కరోనా వల్ల తిరిగి రావడమూ ఓ కారణమని సర్వే పేర్కొంది. ఈ నేపథ్యంలో విద్యుత్తు ఫార్మూలా యూపీలో ప్రభావం చూపుతుందని ఆప్ భావిస్తోంది. -
ఎస్సీ, ఎస్టీలకు ఉచిత ‘వెలుగు’
సాక్షి, విజయనగరం : ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలన్నీ పేద, మధ్య తరగతి ప్రజలకు మేలు చేసేవే. సార్వత్రిక ఎన్నికలకు ముందు నిర్వహించిన సుదీర్ఘ పాదయాత్రలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇచ్చిన హామీల మేరకు అమ్మ ఒడి, వైఎస్సార్ రైతు భరోసా, వైఎస్సార్ చేయూత, జగనన్న విద్యాదీవెన, వసతి దీవెన, వైఎస్సార్ ఆరోగ్య ఆసరా లాంటి అనేక ప్రజారంజక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారు. ఈ క్రమంలో ఎస్సీ, ఎస్టీ కుటుబాలకు ఉచిత విద్యుత్ పథకాన్ని ప్రభుత్వం అమలు చేస్తూ వారి ఇళ్లలో విద్యుత్ వెలుగులు నింపింది. లబ్దిదారుల కళ్లలో ఆనందం జిల్లాలో 90 శాతం మంది ఎస్సీ, ఎస్టీలు నిరుపేదలే. నెలకు రూ.200 లోపు విద్యుత్ వినియోగించే ఆ కుటుంబాలకు ప్రభుత్వం ఉచితంగా విద్యుత్ అందిస్తోంది. ఉచితంగా విద్యుత్ అందిస్తుండడంతో ఆయా కుటుంబాలు ఎంతగానో ఆనందిస్తున్నాయి. గతంలో ఆయా కుటుంబాల్లో చాలామందికి విద్యుత్ సౌకర్యం ఉండేదికాదు. విద్యుత్ బిల్లులు కూడా చెల్లించే పరిస్థితి లేకపోవడంతో విద్యుత్ కనెక్షన్ పెట్టుకునేవారు కాదు. ప్రస్తుతం ప్రభుత్వం ఉచితంగా విద్యుత్ అందిస్తుండడంతో ఆ సౌకర్యాన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకుంటున్నారు. ఎస్సీ, ఎస్టీల విద్యుత్ కనెక్షన్లు 85,090 జిల్లాలో ఎస్సీ, ఎస్టీల విద్యుత్ కనెక్షన్లు 85,090 ఉన్నాయి. వాటిలో ఎస్సీ విద్యుత్ కనెక్షన్లు 48,635, ఎస్టీల విద్యుత్ కనెక్షన్లు 36,455 ఉన్నాయి. ఏప్రిల్ నెల నుంచి జూలై నెల వరకు ఎస్సీ, ఎస్టీల ఉచిత విద్యుత్‌కు సంబంధించి విద్యుత్‌శాఖకు ప్రభుత్వం రూ.6.11 కోట్లు సబ్సిడీ కింద చెల్లించింది. చదవండి :మహిళల జీవితాల్లో ‘వైఎస్సార్ చేయూత’ వెలుగులు -
TS: ‘ఉచిత విద్యుత్’ లబ్ధిదారుల నమోదుకు చర్యలు
సాక్షి, హైదరాబాద్: సెలూన్లు, ధోబీఘాట్లకు సంబంధించి ఉచిత విద్యుత్ పథకం కింద అర్హులైన లబ్ధిదారులు తమ పేర్లు నమోదు చేసుకోవడానికి వీలుగా జిల్లా కలెక్టర్లు, బీసీ సంక్షేమ అధికారులు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ ఆదేశించారు. లబ్ధిదారులు తమ దరఖాస్తులను ఉచితంగా మీ సేవా కేంద్రాలలో నమోదు చేసుకునేలా సౌకర్యాన్ని కల్పించాలని ఐటీ శాఖ అధికారులను కోరా రు. పథకం అమలుపై గురువారం ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ పథకం కింద ఇప్పటి వరకు 28,550 మంది దరఖాస్తు చేసుకున్నారని అధికారులు నివేదించారు. -
Arvind Kejriwal: అధికారంలోకి వస్తే 300 యూనిట్ల ఉచిత విద్యుత్
పణజి: గోవాలో ఆప్ అధికారంలోకి వస్తే ప్రతి కుటుంబానికి 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తామని ఢిల్లీ సీఎం, ఆప్ కన్వీనర్ కేజ్రీవాల్ ప్రకటించారు. రెండో రోజుల పర్యటనలో భాగంగా ఆయన గోవా చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయన నాలుగు హామీలను ప్రజలకు ఇచ్చారు. తాము అధికారంలోకి రాగానే పాత విద్యుత్ బిల్లులన్నీ రద్దు చేస్తామని ప్రకటించారు. రాష్ట్రాన్ని పరిశుభ్రంగా మారుస్తామని చెప్పారు. తమ పార్టీ అధికారంలోకి రాగానే రాష్ట్రంలోని 87 శాతం మంది ప్రజలు ఉచిత విద్యుత్ పొందుతారని స్పష్టం చేశారు. ఢిల్లీలోని ప్రజలు ప్రస్తుతం ఉచిత విద్యుత్ పొందుతున్నారని గుర్తు చేశారు. ఢిల్లీ ప్రజలు ఉచిత విద్యుత్ పొందితే గోవా ప్రజలు ఎందుకు పొందలేరని ప్రశ్నించారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా ఆయన పలువురు ముఖ్యనేతలను కలిశారు. స్వచ్ఛమైన రాజకీయాలు చేసేవారికోసం తమ పార్టీ వెదుకుతోందని చెప్పారు. కాంగ్రెస్ పార్టీని వీడి బీజేపీలో చేరిన ఎమ్మెల్యేలను ఆయన టార్గెట్ చేశారు. ఎన్నికల ఫలితాల్లో 17 సీట్లను కాంగ్రెస్ గెలుచుకోగా, 13 సీట్లను బీజేపీ గెలుచుకుందని గుర్తు చేశారు. అయితే తర్వాత జరిగిన పరిణామాల్లో కాంగ్రెస్ తరఫున 5 మంది మిగలగా, మిగిలిన వారు వెళ్లి బీజేపీలో చేరారు. తాము ఓటేసిన నేతలు ఇతర పార్టీలకు మారపోవడంపై ప్రజలు మోసానికి గురైనట్లు భావిస్తున్నారని అన్నారు. వారంతా డబ్బుల కోసమే పార్టీ మారినట్లు ప్రజలు భావిస్తున్నారని పేర్కొన్నారు. -
సాగు భళా.. 30 ఏళ్లు వర్ధిల్లేలా!
సాక్షి, తిరుపతి : ఉచిత విద్యుత్ పథకానికి మెరుగులద్ది రైతులు సాధికారత సాధించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. రానున్న 30 ఏళ్ల పాటు రైతన్నలకు నాణ్యమైన వ్యవసాయ విద్యుత్‌ను హక్కుగా అందించేందుకు వైఎస్సార్ ఉచిత విద్యుత్ పథకానికి శ్రీకారం చుట్టింది. వ్యవసాయ సర్వీసులకు మీటర్లు బిగించడం ద్వారా పగటిపూట నిరంతరాయంగా 9 గంటల పాటు ఉచిత విద్యుత్‌ను ఇచ్చేలా చర్యలు చేపడుతోంది. ఇందుకోసం పాత లైన్ల స్థానంలో కొత్త లైన్లను ఏర్పాటు చేస్తోంది. ఇందుకోసం దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (ఎస్పీడీసీఎల్) చిత్తూరు, నెల్లూరు, కడప, కర్నూలు, అనంతపురం జిల్లాల్లో రూ.782 కోట్లతో అభివృద్ధి పనులు చేస్తోంది. కొత్త లైన్లు.. నయా సబ్ స్టేషన్లు డిస్కం పరిధిలోని ఐదు జిల్లాల్లో 2.80 లక్షల కిలోమీటర్ల మేర విద్యుత్ లైన్లు ఉన్నాయి. కొత్తగా 3,043 కిలోమీటర్ల మేర లైన్లు నిర్మిస్తున్నారు. 1,532 ట్రాన్స్ఫార్మర్లకు సంబంధించి లోడ్ సామర్థ్యాన్ని పెంచారు. ఈ ఏడాది నూతనంగా మరో 675 ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేస్తున్నారు. రూ.174.4 కోట్లతో కొత్తగా 72 చోట్ల 33/11 కేవీ విద్యుత్ ఉప కేంద్రాలు నిర్మించనున్నారు. ఇందుకోసం డిస్కం పరిధిలో మొత్తంగా రూ.782 కోట్లు ఖర్చు చేస్తున్నారు. డిస్కం పరిధిలో 10,90,743 విద్యుత్ సర్వీసులు ఉండగా.. అనధికారికంగా మరో 12 వేలకు పైగా ఉన్నట్టు గుర్తించారు. గత ప్రభుత్వ హయాంలో ఉచిత విద్యుత్‌తో రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. లో-ఓల్టేజీతో మీటర్లు కాలిపోయి నష్టపోయారు. ప్రభుత్వం ఇలాంటి సమస్యల్ని దృష్టిలో పెట్టుకుని ప్రత్యేక కార్యాచరణ రూపొందించింది. ఉచిత విద్యుత్ పథకంపై రైతుల్లో నెలకొన్న అనుమానాలు నివృత్తి చేసేందుకు ఎస్పీడీసీఎల్ ఈ నెల 1 నుంచి గ్రామ స్థాయిలో రైతు సదస్సులు నిర్వహిస్తోంది. నవంబర్ 22 నుంచి డిసెంబర్ 5 వరకు రైతులకు ప్రత్యేక బ్యాంకు ఖాతాలు తెరుస్తారు. నవంబర్ 1నుంచి వచ్చే ఏడాది మార్చి 31 వరకు వ్యవసాయ విద్యుత్ సర్వీసులకు స్మార్ట్ మీటర్లు, ఇన్ఫ్రారెడ్ సమాచారం గల ప్రామాణిక మీటర్లను బిగిస్తారు. ప్రయోజనాలివీ.. కొత్త మీటర్ల ఏర్పాటకు ముందు అనధికార విద్యుత్ కనెక్షన్ల క్రమబద్ధీకరణకు అవకాశం కల్పిస్తారు. రెవెన్యూ రికార్డుల్లో మార్పులు, చేర్పుల ఆధారంగా విద్యుత్ శాఖ బిల్లుల్లో పేర్లు మార్చుకోవడం, సాగు విస్తీర్ణంలో మార్పులు, చేర్పులు చేసుకోవచ్చు. ప్రభుత్వమే రైతులకు నగదు బదిలీ చేయనుంది. ఆ మొత్తాల్ని రైతులు విద్యుత్ శాఖకు బిల్లు రూపంలో చెల్లించడం వల్ల నాణ్యమైన విద్యుత్ కోసం డిమాండ్ చేసే హక్కు వారికి ఉంటుంది. ఒక్క పైసా కూడా కట్టక్కర్లేదు వైఎస్సార్ ఉచిత వ్యవసాయ విద్యుత్ పథకంపై రైతులకు అవగాహన కల్పిస్తున్నాం. వ్యవసాయ కనెక్షన్లకు మీటర్లు బిగించడం వల్ల కలిగే ప్రయోజనాలను వివరిస్తాం. మీటర్ పొందడం నుంచి కనెక్షన్ తీసుకునే వరకు రైతులు ఒక్క పైసా కూడా కట్టాల్సిన అవసరం లేదు. - హెచ్.హరనాథరావు, సీఎండీ, ఎస్పీడీసీఎల్ -
చంద్రబాబుకు బాలినేని సవాల్!
సాక్షి, విజయవాడ: ఉచిత విద్యుత్‌పై ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడుకు విద్యుత్ శాఖా మంత్రి బాలినేని శ్రీనివాస్‌రెడ్డి సవాల్ విసిరారు. బుధవారం ఆయన విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ, రైతులకు అన్యాయం జరిగిందని నిరూపిస్తే రాజీనామా చేస్తానని, లేదంటే చంద్రబాబు రాజకీయాల నుంచి తప్పుకుంటారా? అని ప్రశ్నించారు. రైతులకు ఉచిత విద్యుత్ తీసుకొచ్చిందే వైఎస్సార్ అని అన్నారు. పగటిపూట 9 గంటల పాటు సీఎం జగన్ ఉచిత విద్యుత్‌ను అందిస్తున్నారని తెలిపారు. రైతుల ఉచిత విద్యుత్ కోసం రూ. 1700 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు చెప్పారు. ప్రతి రైతుకి ఉచితంగా విద్యుత్ అందిస్తున్నట్లు తెలిపారు. చంద్రబాబు ఉచిత విద్యుత్ వ్యతిరేకి అని మండిపడ్డారు. తీగలపై బట్టలు ఆరబెట్టుకోవాలన్న విషయాన్ని రైతులు మర్చిపోలేదని చెప్పారు. విద్యుత్ బకాయిలు పెంచి రైతులపై కాల్పులు జరిపిన చరిత్ర చంద్రబాబుది అని విమర్శించారు. కేంద్రం సూచించిన నిబంధనలను రైతులకు మేలు చేసేలా మార్చామని తెలిపారు. సీఎంగా జగన్ ఉన్నంతవరకు ఉచిత విద్యుత్ అందిస్తామని బాలినేని చెప్పారు. చదవండి: అంబులెన్స్‌కు దారి ఇచ్చిన సీఎం కాన్వాయ్ -
పేదింటి వెలుగులకు సమయం ఆసన్నం
సాక్షి ,కడప : అధికారంలోకి వచ్చిన మరుక్షణమే 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందిస్తామని..లేదా సంవత్సరానికి రూ.6 వేలు అందజేస్తామని ఎన్నికల సమయంలో వైఎస్ జగన్ హామీ ఇచ్చారు. విద్యుత్ ఉచితంగా అందించడంతోపాటు ఎస్సీ.ఎస్టీల అభివృద్ధి,సంక్షేమానికి అన్ని రకాలుగా కృషి చేస్తామని చెప్పారు. ఇప్పుడు ఆ హామీ అమలుకు వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం సిద్ధమైంది. దీని వల్ల మన జిల్లాలోనే 81,845 ఎస్సీ,11,769 ఎస్టీలకు అంటే మొత్తం 93,614 కుటుంబాలకు ప్రయోజనం చేకూరనుంది. కడప డివిజన్లో ఎస్సీలకు 8454 గృహ సర్వీసులు ఉండగా మైదుకూరు డివిజన్లో 21681 సర్వీసులున్నాయి. ప్రొద్దుటూరు డివిజన్లో 15,912, పులివెందుల డివిజన్ లో 8484 ,రాజంపేటలో 18,778, రాయచోటి డివిజన్లో 8536 సర్వీసులున్నాయి. ఎస్టీలకు సంబంధించి కడప డివిజన్లో 1277 సర్వీసులుండగా.. మైదుకూరు డివిజన్లో 1178, ప్రొద్దుటూరు 1026, పులివెందులలో 1610, రాజంపేటలో 4032, రాయచోటిలో 2646 గృహ సర్వీసులు ఉన్నాయి. 200 యూనిట్లు ఉచిత విద్యుత్ ఇవ్వడంవల్ల ఎస్సీ,ఎస్టీలలో పేదలకు మేలు జరుగుతుందన్నది. ఎస్సీ,ఎస్టీల అభివృద్దికి మరింత కృషి.. ప్రధానంగా మాల, మాదిగ సామాజిక వర్గాలకు వేరు వేరుగా కారొరేషన్లు ఏర్పాటు చేసి అన్ని రకాల పథకాల ద్వారా ఆర్దిక లబ్ధి చేకూర్చడంతో పాటు ఎస్సీ,ఎస్టీ సబ్‌ప్లాన్ పారదర్శకంగా అమలు చేస్తామని జగన్ హామీ ఇచ్చారు. భూపంపిణీతోపాటు ఉచిత బోరు బావుల పథకాన్ని వర్తింప చేస్తామన్నారు. వైఎస్సార్ పెళ్లి కానుక కింద ఎస్సీ,ఎస్టీ చెల్లెమ్మల వివాహాలకోసం లక్ష రూపాయలు ఇవ్వడంతోపాటు గిరిజనులకు ప్రత్యేక జిల్లా ఏర్పాటు చేసి ప్రత్యేక యూనివర్సిటీ, మెడికల్,ఇంజనీరింగ్ కళాశాలలను సైతం ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. 500 మంది జనాభా ఉన్న ప్రతి తాండా, గూడెంలను పంచాయతీలుగా మారుస్తామన్నారు. ఐటీడీఏ పరిధిలో సూపర్ స్పషాలటీ ఆసుపత్రినినిర్మిస్తామన్నారు. పోడు భూములను సాగుచేసుకునే గిరిజన రైతులకు యాజమాన్య హక్కు కల్పిస్తూ (ఫారెస్ట్ రైట్స్ యాక్టు 2006 ప్రకారం) గిరిజనులకు వైఎస్సార్ ఇచ్చిన హామీలను నెరవేరుస్తామన్నారు. జగన్ సీఎం కాగానే ఈ హామీల అమలుకు శ్రీకారం చుట్టడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. -
వైఎస్ అలా.. బాబు ఇలా..
సాక్షి, అమరావతి: చేనేత కుటుంబాలకు 100 యూనిట్లు వరకు ఉచిత విద్యుత్ అని ఎన్నికలు సమీపిస్తున్న వేళ మూడు నెలల క్రితం చంద్రబాబు ప్రకటించారు. కానీ అమలుకు నోచుకోలేదు. - వర్షాకాలంలో ఆరుబయట నేతకు వీలుగా షెడ్లు వేస్తామని 2014లో చంద్రబాబు ఇచ్చిన హామీ నెరవేర్చలేదు. - వైఎస్ఆర్ సీఎంగా ఉన్నప్పుడు చేనేతలకు హెల్త్ కార్డులిచ్చారు. రూ.500 నుంచి రూ.1,500 వరకు వైద్యానికయ్యే ఖర్చును చెల్లించేవారు. చంద్రబాబు దానికి మంగళం పాడేశారు. - చేనేత కుటుంబాలకు పూర్తిగా పని కల్పించేందుకు వీలుగా ప్రభుత్వ ఉద్యోగులు విధిగా వారానికి రెండు రోజులు ఖద్దరు వస్త్రాలు ధరించేలా వైఎస్ఆర్ నిర్ణయం తీసుకున్నారు. దాన్ని అమలు చేసే లోగా మరణించారు. - వైఎస్ హయాంలో చేనేత వికలాంగులకు నెలకు 25 కిలోల బియ్యం ఉచితంగా ఇచ్చేవారు. చంద్రబాబు వచ్చాక దానిని ఎగ్గొట్టారు. - వైఎస్ పాలనలో తక్కువ వడ్డీకి రూ.5 వేల నుంచి రూ.25 వేల వరకు రుణాలిచ్చారు. బాబు వచ్చాక ఇవ్వడం లేదు. రూ.15 వేల విలువచేసే కుంచె, పైపులకు 90 శాతం సబ్సిడీ ఇస్తామన్నారు. కానీ ఇవ్వలేదు. చేనేత కార్మికులకు జిల్లాల్లో క్లస్టర్లు ఏర్పాటు చేస్తామన్న హామీ నిలబెట్టుకోలేదు. -
ఉచిత విద్యుత్... ఉత్తిదే...
సాక్షి, గిద్దలూరు: హామీలు ఇవ్వడంలో చంద్రబాబుబును మించిన వారు లేరని ప్రజల్లో ప్రచారం ఉంది. నోటికి అంది వచ్చిన హామీలన్నీ గుప్పించి చివరకు వాటిని అమలు చేయలేక చేతులెత్తేస్తున్నారు. రైతులు, డ్వాక్రా రుణాల మాఫీ, ఇంటోకో ఉద్యోగం, నిరుద్యోగ భృతి ఇలా హామీల మీద హామీలు గుప్పించి ప్రజలను ఆశకు గరిచేసి తీరా గద్దెనెక్కాక చేయిచ్చిన చంద్రబాబు తాజాగా మరో హామీని తుంగలో తొక్కారు. నాయీ బ్రాహ్మణులు, రజకుల దుకాణాలకు సంబంధించి 150 యూనిట్ల వరకు విద్యుత్ ఉచితంగా ఇస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారు. హామీ ఇచ్చిన ఐదు నెలలు కావస్తున్నా ఇంతవరకు హామీ అమలు కాలేదు. ఎన్నికల కోడ్ అమలులోకి రావడంతో ఇక అమలయ్యే సూచనలు కనిపించడం లేదు. నెలనెలా విద్యుత్ బిల్లులు వస్తుండటంతో రజకులు, నాయీ బ్రాహ్మణులు చంద్రబాబుపై మండిపడుతున్నారు. అమలు కాని హామీలు ఎందుకివ్వాలంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఏర్పాటై ఐదేళ్లయినా వెనుకబడిన కులాల కోసం ఏమీ చేయలేదని బీసీలు టీడీపీ ప్రభుత్వంపై మండిపడుతున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో ఉచిత విద్యుత్ అందిస్తారంటే ఆశపడ్డారు. పొదుపు మహిళల నుంచి, రైతులు, వ్యాపారులు, విద్యార్థులు ఇలా అన్ని వర్గాల వారిని చంద్రబాబు మోసం చేశారని, ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నట్లు వారు చెబుతున్నారు. ఎన్నికల్లో గెలిచేందుకే దొంగ హామీలు.. బార్బర్ సెలూన్ ఎన్నికల్లో గెలిచి తిరిగి అధికారం చేపట్టేందుకే చంద్రబాబు ఇలాంటి దొంగ హామీలు ఇస్తున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. రైతుల రుణాలు మాఫీ చేస్తానని ఐదేళ్లయినా మాఫీ చేయలేదు. డ్వాక్రా రుణాలు పూర్తిగా మాఫీ చేస్తానని చెప్పి పసుపు కుంకుమ పేరుతో చెక్కులిచ్చారు. ఇదే కాకుండా ప్రతి పొదుపు మహిళకు సెల్‌ఫోన్ స్తిమని చంద్రబాబు హామీ ఇచ్చారు. మహిళలు కోటి ఆశలతో ఎదురుచూస్తున్నారు. చంద్రబాబు హామీలు నీటిమీద బుడగలు తప్ప అమలు చేయరని మరోసారి తేలిపోయింది. నియోజకవర్గంలోని ఆరు మండలాల్లో దాదాపు 550మంది నాయీబ్రాహ్మణులు, 150మంది రజకులు ఉచిత విద్యుత్ కోసం ఎదురుచూస్తున్నారు. ప్రతి నెలా బిల్లు కడుతున్నా.. మంగళి షాపుకు విద్యుత్ బిల్లులో 150 యూనిట్ల వరకు ఉచితంగా అందిస్తానని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు హామీ ఇచ్చారు. నెలకు రూ.400 బిల్లు చెల్లించే అవసరం లేదని ఆనందం వేసింది. హామీ ఇచ్చి ఐదు నెలలు కావస్తున్నా ఇంత వరకు అమలు కాలేదు. బిల్లు రావడం ఆగుతుందని ఆశపడుతున్నా కానీ, ప్రతి నెలా బిల్లు చెల్లించాల్సిందేనని కరెంటోళ్లు వెంటబడి కట్టించుకెళుతున్నారు. లేదంటే కరెంట్ సరఫరా నిలిపేస్తామంటున్నారు. – పి.శివప్రసాద్, నాయీ బ్రాహ్మణుడు, గిద్దలూరు జాబితా ఇచ్చాం.. ఉత్తర్వులు అందలేదు ఉచిత విద్యుత్ కోసం జాబితా సిద్ధం చేసి పంపించాం. నాయీ బ్రాహ్మణులు, రజకులకు 150 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందించాలని ప్రభుత్వం నుంచి మాకు ఎటువంటి ఆదేశాలు అందలేదు. బిల్లులు యాథావిధిగా ప్రతినెలా వసూలు చేస్తున్నాం. –చంద్రశేఖరరెడ్డి, ఏఈ, విద్యుత్ శాఖ, గిద్దలూరు -
జోరుగా ఇంటింటి ప్రచారం
సాక్షి, చిన్నచింతకుంట: మండలంలోని అల్లీపురం గ్రామంలో కాంగ్రెస్ పార్టీ మండలాధ్యక్షుడు వెంకటేశ్వర్‌రెడ్డి ఆధ్వర్యంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోను ఇంటింటికి తీసుకెళ్లి ప్రతిఒక్కరికి తెలియపర్చి టీఆర్ఎస్ పార్టీని ఓడగొట్టడమే తమ లక్ష్యమన్నారు. నాలుగున్నరేళ్ల పాలనలో టీఆర్ఎస్ పార్టీ ఎలాంటి అభివృద్ధి చేయకపోగ ప్రజల కొరకు ఎన్నో సంక్షేమ పథకాలను అమలుచేశామని ప్రగల్భాలు పలకడం పరిపాటిగా మారిందన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం మోసపూరితమైన మాటలు నమ్మవద్దని కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ మాజీ సభ్యుడు వేణుగోపాల్, పార్టీ మండల ఉపాధ్యక్షుడు ధనంజయ్, యూత్ కాంగ్రెస్ మండలాధ్యక్షుడు వెంకటేష్, రాష్ట్ర ఎన్ఎస్యూఐ రాష్ట్ర కార్యదర్శి అక్బర్, నాయకులు రహ్మత్, సురేష్, యూత్ కాంగ్రెస్ అసెంబ్లీ కార్యదర్శులు మహిపాల్‌రెడ్డి, సురేష్, ఖాజామైనొద్దీన్, గ్రామ అధ్యక్షుడు కృష్ణయ్య, మహేందర్‌రెడ్డి, నర్సింహ, దామోదర్ తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ హయాంలోనే అభివృద్ధి భూత్పూర్: కాంగ్రె‹స్ పార్టీ హయాంలోనే రాష్ట్రం అభివృద్ధి జరిగిందని కాంగ్రెస్ పార్టీ మండలాధ్యక్షుడు నర్సింహరెడ్డి అన్నారు. మండలంలోని హస్నాపూర్‌లో గడప గడపకు కాంగ్రెస్ పార్టీ ప్రచారంలో భాగంగా ఇంటింటా తిరిగి మేనిఫెస్టోపై వివరించారు. చేయ్యి గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఏకకాలంలో రైతులకు రుణమాఫీ, పేదలకు ఉచిత కరెంట్, ఏడు కిలోల సన్నబియ్యం సరఫరా చేస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో దేవరకద్ర యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఫసియొద్దీన్, హర్యానాయక్, యూత్ కాంగ్రెస్ పార్టీ మండలాధ్యక్షుడు శ్ర్రీకాంత్రెడ్డి, దేవరకద్ర మైనార్టీ సెల్ అధ్యక్షుడు సాధిక్, నాయకులు సంజీవ్‌రెడ్డి, తిరుపతిరెడ్డి, నర్సింహులు తదితరులు పాల్గొన్నారు. అడ్డాకుల: మండల కేంద్రంలో శుక్రవారం కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోను ఓటర్లకు వివరించి హస్తం గుర్తుకు ఓట్లేసి గెలిపించాలని కోరారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రైతులకు ఏకకాలంలో రూ.2 లక్షల రుణమాఫీ, వృద్ధాప్య పింఛన్లను రూ.2 వేలకు, వికలాంగుల పింఛన్లను రూ.3 వేలకు పెంచనున్నట్లు ఓటర్లకు వివరించి మద్దతు కూడగడుతున్నారు. కాంగ్రెస్‌తోనే అభివృద్ధి సాధ్యమన్నారు. కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు జగదీశ్వర్, మండలాధ్యక్షుడు నాగిరెడ్డి, మండల కోఆప్షన్ సయ్యద్‌షఫి, రిటైర్డ్ ఏఈ లక్ష్మీనారాయణ, యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు బాలరాజు, నాయకులు దశరత్‌రెడ్డి, సురేందర్‌రెడ్డి, శేఖర్‌రెడ్డి, సాయిరెడ్డి, వెంకట్‌రెడ్డి, బుచ్చన్న, రవిసాగర్ తదితరులు పాల్గొన్నారు. -
మరుపురాని మహానేత
-
కరెంట్ సరే.. నీరెక్కడ..?
వ్యవసాయానికి 24గంటల విద్యుత్ సరఫరాతో రైతుల ఇక్కట్లు తీరుతాయనుకుంటే మరింత పెరిగాయి. నిరంతర విద్యుత్‌తో రైతులందరూ విచ్చలవిడిగా విద్యుత్ మోటార్లను ఉపయోగిస్తుండడంతో బావుల్లోని నీరు అడుగంటింది. నీటి కోసం రైతులు గంటల తరబడి బావుల వద్ద పడిగాపులు పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. విద్యుత్ ఉన్నా.. బావుల్లో నీరు లేక పొలాలు ఎండిపోతున్నాయి. కరీంనగర్ (రూరల్) : కరీంనగర్ మండలంలో ఈ రబీ సీజన్లో 6500 ఎకరాల్లో వరి పంటను సాగు చేశారు. ఎస్సారెస్పీ కాలువ నీటి విడుదలతో పలువురు రైతులు ఆరుతడి పంటలకు బదులుగా వరి పంటను సాగు చేసేందుకు మొగ్గు చూపారు. ఒకవైపు కాలువ నీరు, మరోవైపు నిరంతర విద్యుత్ సరఫరాతో ఈ రబీ సీజన్లో పంటలు పండుతాయని ఆశించిన రైతాంగానికి ఆదిలోనే అడ్డంకి ఏర్పడింది. గత నెల 25నుంచి మొదటి విడత కాలువ నీరు విడుదల చేసినప్పటి నుంచి ఇప్పటివరకు 4విడతలుగా ఆయకట్టు చివరి రైతులకు నీరందని దుస్థితి. గతేడాది వర్షభావ పరిస్థితులతో బావుల్లో భూగర్భజలాలు అడుగంటాయి. ఉపయోగపడని నిరంతర విద్యుత్ గత నెల 1నుంచి రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయానికి 24గంటల విద్యుత్‌ను సరఫరా చేస్తోంది. నిరంతర విద్యుత్ సరఫరాను చేసేందుకు వీలుగా 10సబ్స్టేషన్లలో ప్రత్యేకంగా పీటీఆర్లను ఏర్పాటు చేశారు. ఉమ్మడి కరీంనగర్ మండలంలో మొత్తం 8వేల వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లున్నాయి. గతేడాది వర్షాలు సమృద్ధిగా కురవకపోవడంతో ప్రస్తుతం భూగర్భజలాలు అడుగంటాయి. విద్యుత్ ఉన్నా.. పలువురు రైతుల వ్యవసాయ బావుల్లోని నీరు రెండు,మూడు గంటలకే సరిపోతున్నాయి. మళ్లీ నీటి కోసం ఐదారు గంటలపాటు వేచి చూడాల్సిన పరిస్థితి. బావుల్లో సరిపడే నీరు లేక పొలాలన్నీ ఎండిపోతున్నాయి. కొందరు రైతులు పొలమంతా పారే పరిస్థితి లేక ఉన్న నీటితో సగం పొలానికి మాత్రమే ఉపయోగిస్తూ పంటను కాపాడుకుంటున్నారు. కొందరు రైతులు చివరి ప్రయత్నంగా పంటలను కాపాడుకునేందుకు బావుల్లో పూడిక తీయిస్తుండగా.. మరికొందరు సైడ్బోర్లు వేయిస్తున్నారు. గొర్రెలు మేపుతున్నా ఎకరం పొలంలో వరి నాటు వేశా. బావిలో నీరు లేక పొలాలన్నీ ఎండుతున్నాయి. వంతులవారీగా సరిపడే నీరందకపోవడంతో 30గుంటలు విడిచిపెట్టి మిగిలిన 10గుంటలకు నీరు పెడుతున్నా. గొర్రెలకు మేత లేక ఎండిన పొలంలో వారం రోజుల నుంచి గొర్రెలను మేపుతున్నా. – కూకట్ల ఎల్లయ్యయాదవ్, రైతు, మొగ్ధుంపూర్ బావిలో నీరు లేక.. ఎకరం 20గుంటల్లో వరి నాటేశా. నీరు సరిపోవడం లేదు. కరెంట్ ఉన్నా బావిలో నీరు లేదు. మోటార్ పెట్టిన రెండు గంటలకే అయిపోతున్నాయి. పొలమంతా పారక 20గుంటలు విడిచిపెట్టా. చివరి వరకు మిగిలిన ఎకరం పొలం కూడా పారుతదో లేదో తెలుస్తలేదు. – మైలారం నాగరాజు, రైతు, మొగ్ధుంపూర్ -
యథేచ్ఛగా ఇటుక బట్టీలు
మేడ్చల్ : రైతుల బలహీనతలు, ఆర్థిక సంపాదనలు అంతంత మాత్రంగా ఉండటంతో వాటిని ఆసరా చేసుకున్న ఇటుక బట్టీల వ్యాపారులు మేడ్చల్ డివిజన్లోని మేడ్చల్, కీసర, శామీర్‌పేట్, మేడ్చల్ శివారు మండలం కుత్బుల్లాపూర్ మండలాల్లో వివిధ గ్రామాల్లో పేదలకు కేటాయించిన అసైన్డ్ భూముల్లోనే ఇటుక బట్టీలను ఏర్పాటు చేస్తున్నారు. ప్రభుత్వం రైతుల పంట సాగుకు ఉచిత కరెంట్ సరఫరా చేస్తుండగా వ్యాపారులు ఇటుకల తయారీకి ఉచిత విద్యుత్‌ను అక్రమంగా వాడుతున్నారు. డివిజన్ మండలాల్లో ఇటుక బట్టీల వ్యాపారం యథేచ్చగా కొనసాగుతున్నా రెవెన్యూ, ట్రాన్స్‌కో శాఖ అధికారులు మామూళ్ల మాయలో కళ్లకు గంతలు కట్టుకున్నారు. ప్రభుత్వం పేదల బతుకుదెరువు కోసం ఇచ్చిన అసైన్డ్ భూముల్లో నిబంధనలకు విరుద్ధంగా కొందరు వ్యాపారులు వీటిని ఏర్పాటు చేసి లక్షల రూపాయలు ఆర్జిస్తున్నారు. వంద ఎకరాల అసైన్డ్ భూముల్లో.... మేడ్చల్ మండలంలోని గౌడవెళ్లి, శ్రీరంగవరం, బండమాదారం, రాయిలాపూర్, గుండ్లపోచంపల్లి, నియోజకవర్గంలోని కీసరతో పాటు యాద్గార్పల్లి, తిమ్మాయిపల్లి, కరీంగూడ,భోగారం, శామీర్‌పేట మండలం ఉద్దెమర్రి, అలియాబాద్, జవహర్‌నగర్, కుత్బుల్లాపూర్ మండలం నాగులూర్, దుండిగల్ గ్రామాల పరిధిలో దాదాపు 300 ఎకరాల భూములను ఇటుక బట్టీల కోసం వినియోగిస్తున్నారు. ఇందులో 100 ఎకరాల వరకు అసైన్డ్ భూముల్లో ఇటుక బట్టీలు ఉన్నాయి. ప్రస్తుత నిర్మాణ రంగం పెరగడంతో పాటు హైదరాబాద్ నగర శివారు ప్రాంతాలైన మేడ్చల్, కీసర, శామీర్‌పేట్ మండలాల్లో ఇటుకల వ్యాపారానికి డిమాండ్ పెరిగింది. ఇదే అదునుగా భావించిన వ్యాపారులు ప్రైవేట్, ప్రభుత్వ అసైన్డ్ పొలాల్లో బట్టీలను ఏర్పాటు చేస్తున్నారు. దుర్వినియోగం అవుతున్న ఉచిత విద్యుత్ ఇటుక బట్టీల నిర్వాహకులు వ్యవసాయ బోర్ల నీటినే వాడుతున్నారు. దీంతో ప్రభుత్వం వ్యవసాయ రంగానికి అందిస్తున్న ఉచిత విద్యుత్ దుర్వినియోగమవుతుంది. డివిజన్లో సుమారు 300 వరకు ఇలా ఇటుక బట్టీలను నిర్వహిస్తున్నారు. ఇందులో 90 శాతం వరకు అక్రమంగా విద్యుత్‌ను వాడుతున్నారు. ఇటుకల తయారీకి పొలాల్లో ఉండే బోర్ల నుంచి బట్టీల వరకు పైప్లైన్ల వేసుకుంటున్నారు. కొందరైతే బట్టీల వద్ద ఎకంగా కాలువలు తవ్వేస్తున్నారు. ప్రభుత్వ ఆధాయానికి గండీ కొడుతున్నా అధికారులు మాత్రం ఏమీ ఎరగనట్లు వ్యవహరించడం గమనార్హం. అక్రమార్కులకు అధికారుల అండదండలు ఇటుక బట్టీల వ్యాపారంలో అక్రమార్కులకు గ్రామస్థాయి నుంచి మండల స్థాయి వరకు ఉన్న కొంతమంది అధికారులు అక్రమ వ్యాపారాన్ని పెంచి ప్రోత్సహిస్తున్నారు. గ్రామాల్లో ఉండే రెవెన్యూ అధికారులకు ఏవి అసైన్డ్ భూములో ఏవి పట్టా భూములో ఖచ్చితంగా తెలుసు. కానీ అసైన్డ్ భూముల్లో ఇటుక బట్టీలు నడుస్తున్నా పట్టించుకోరు. గ్రామాల రెవెన్యూ అధికారులు బట్టీల వ్యాపారులతో నెలకు కొంత అమౌంట్ ఇవ్వాలని వ్యాపారం ప్రారంభంకాక ముందే మాట్లాడుకుంటున్నారని పలువురు బహీరంగంగానే అంటున్నారు. ట్రాన్స్‌కో వారికి కాసుల పంట ఇటుక బట్టీల వ్యాపారం ట్రాన్స్‌కో అధికారులకు కాసుల పంటగా మారింది. గ్రామాల్లో ఉచిత కరెంట్ బోరు నుంచి నీరు అందెలా చూసేది కరెంటోళ్లే. పేరుకు ఒక చోట కమర్షియల్ మీటర్ పెట్టి మిగతాదంతా ఉచిత కరెంటును వాడుకుంటున్నారు. విద్యుత్ సిబ్బందికి అన్ని తెలిసినా వారికి ముట్టాల్సింది ముట్టడంతో అక్రమ వ్యాపారులకు అండగా నిలబడుతున్నారని స్థానికులు అనుకుంటున్నారు. తాము ఉన్నామని చెప్పుకునేందుకు అప్పుడప్పుడు విజిలెన్స్ అధికారులతో కలిసి దాడులు చేసి నామమాత్రపు అపరాధ రుసుములు విధిస్తున్నారు. -
ఉచిత విద్యుత్.. ఒకింత ఊరట
డేట్లైన్ హైదరాబాద్ నక్సలైట్ ఉద్యమం కారణంగా వందలు వేల ఎకరాల భూస్వాములు ఇప్పుడు లేరు. చిన్న కమతాలు ఎక్కువ సంఖ్యలో ఉన్న మాట నిజమే. అట్లా ఎకరం, రెండెకరాలు ఉన్న రైతులు వ్యవసాయం సొంతంగా చేసుకుంటారు కాబట్టి, ఈ తరహా భూములకు ఎనిమిది వేల రూపాయల సాయం అందించడం వల్ల లబ్ధి జరుగుతుంది. కానీ పదులూ, వందల ఎకరాల భూములు ఉండి కౌలుకు ఇచ్చుకుని వేరే వ్యాపారాలు, వృత్తులు చేసుకునే వాళ్లు కూడా చాలామంది ఉంటారు. ఈ సాయం వాళ్లకు కాకుండా కౌలు చేసే వాళ్లకు కదా వెళ్లాల్సింది! కరెంట్ బిల్లులు కట్టనందుకు బావి దగ్గర నుంచి ఫ్యూజులు పీక్కొచ్చి ఎంఆర్ఓ కార్యాలయంలోనో, ఇతరత్రా ప్రభుత్వ కార్యాలయాల్లోనో పెట్టేసుకోవడం చూశాం. నీరందక కళ్ల ముందే ఎండిపోతున్న చేనును చూసి దిక్కుతోచకుండా మిగిలిన రైతు పరిస్థితి చూశాం. అలాంటి రైతు ‘ఊరన్నా ఇడిచిపెట్టి పోవాలె, ఉసురన్నా తీసుకోవాలె.’ బోరు బావుల మీద ఆధారపడి వ్యవసాయం చేసిన తెలంగాణ రైతుల దైన్యం ఎలా ఉండేదో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, చంద్రబాబునాయుడి ప్రభుత్వ హయాంలో చూశాం. అప్పుడే, ‘నేను అధికారంలోకి వచ్చాక ఉచిత కరెంట్ ఇస్తాను, కరెంట్ బిల్లుల బకాయిలు రద్దు చేస్తాను’ అని అప్పటి ప్రతిపక్షనేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి రైతులకు భరోసా ఇచ్చారు. దీనికి చంద్రబాబు స్పందన ఏమిటో కూడా మన విన్నాం.‘ఆ కరెంట్ తీగల మీద బట్టలు ఆరేసుకోవాల్సిందే!’ అని ఎద్దేవా చేసిన చంద్రబాబునాయుడు తరువాత డాక్టర్ వైఎస్ తను ఇచ్చిన హామీని నెరవేర్చడం స్వయంగా చూశారు. రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి అయిన వెంటనే సర్కార్ కార్యాలయాల్లో బందీలుగా ఉన్న ఫ్యూజులను పైసా అపరాధ రుసుం కట్టించుకోకుండానే రైతులకు ఎట్లా తిరిగి ఇచ్చిందీ కూడా చంద్రబాబు వీక్షించారు. హామీ మేరకు ఉచిత కరెంట్ ఎట్లా ఇచ్చిందీ, కరెంట్ బిల్లుల బకాయిలు ఎట్లా మాఫీ చేసిందీ కూడా ఆయన గమనించారు. అప్పటికి దేశంలో ఇంకా విద్యుత్ సంస్కరణలు ఊపందుకోలేదు. ఈ చర్య వల్ల రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున ఆర్ధికభారం మోయవలసి వచ్చింది. అయినా రాజశేఖరరెడ్డి వెనక్కు తగ్గలేదు. ఫతేమైదాన్‌లో ప్రమాణ స్వీకారం చేశాక ఆయన మొదటి సంతకం ఉచిత విద్యుత్ సరఫరా ఫైల్ మీదనే చేశారు. ఆయన జీవించినంత కాలం అదే విధానం అమలు పరిచారు. రాజశేఖరరెడ్డి నిర్ణయం తెలుగు ప్రాంత రైతులకు గొప్ప ఊరట. ఉమ్మడి రాష్ట్రంలో నాటి తెలంగాణ రైతులకు మరీ పెద్ద ఊరట. తెలంగాణలో అత్యధికంగా, ఇరవై అయిదు లక్షల బోరు బావులు వ్యవసాయం కోసం ఉపయోగిస్తున్నారు. కరెంట్ అవసరం ఆనాడు తెలంగాణ రైతులకే ఎక్కువ. ఇప్పటికీ తెలంగాణలో బోరు బావుల మీద ఆధారపడి చేస్తున్న వ్యవసాయం శాతం అధికమే. తెలంగాణ ప్రభుత్వం మిషన్ కాకతీయ పేరిట తలపెట్టిన ప్రాజెక్టులు అన్నీ పూర్తయితే పరిస్థితి మారుతుంది. బోరు బావుల అవసరం పూర్తిగా తగ్గిపోతుంది. కాలువలు పారుతున్నప్పుడు బోర్ల అవసరం ఉండదు. పైగా భూగర్భ జలాల పరిస్థితి కూడా చాలా మెరుగు పడుతుంది. నిజానికి తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావంతో ఏర్పడిన నూతన ప్రభుత్వం నిరంతరాయంగా వ్యవసాయానికి తొమ్మిది గంటల విద్యుత్ సరఫరా చేస్తూనే ఉంది. రైతులకు మంచిరోజలు 2017 డిసెంబర్ 31 రాత్రి 12 గంటల ఒక్క నిమిషం, అంటే నూతన సంవత్సరం లోకిఅడుగుపెట్టిన క్షణం తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించిన 24 గంటల విద్యుత్ సరఫరా మీద అనుకూలంగా, ప్రతికూలంగా జరుగుతున్న చర్చలూ, విమర్శలూ, విశ్లేషణల గురించి తరువాత మాట్లాడుదాం. ఇందులో 40 శాతం విద్యుత్ సరఫరా, వ్యవసాయం కోసం ప్రభుత్వం ఉచితంగా చేస్తుంది. దానికి ప్రభుత్వం భరించాల్సిన మొత్తం సంవత్సరానికి రూ. 600 కోట్లు. ప్రాజెక్టులు పూర్తయి కాలవల్లోకి నీళ్లొస్తే ఈ వ్యయం బాగా తగ్గే అవకాశం ఉంటుంది. అప్పుడు ప్రాజెక్టులకు ఎత్తిపోతల కోసం వాడే విద్యుత్ భారం ప్రభుత్వానికి తప్పదు. ఏది ఏమైనా తెలంగాణ రైతు వ్యవసాయం మీద ఆశలు పెంచుకునే మంచిరోజులు వచ్చాయని చెప్పాలి. ఇందుకు రాష్ట్ర ప్రభుత్వాన్ని అభినందించి తీరాలి. ఉచితంగా విద్యుత్ వస్తున్నది, అందునా 24 గంటల సరఫరా జరుగుతున్నది కాబట్టి వృథా అయ్యే అవకాశాలను కూడా ప్రభుత్వం గమనించాల్సి ఉంటుంది. ఇప్పటికే ఆటోమేటిక్ స్టార్టర్ల విషయంలో ప్రభుత్వం ప్రచార కార్యక్రమం ప్రారంభించింది. వాటిని తొలగింప చెయ్యడానికి పై స్థాయి నుంచి కింది దాకా ప్రజా ప్రతినిధులు, ప్రభుత్వ యంత్రాంగం యుద్ధ ప్రాతిపదికన పని చేయవలసి ఉంటుంది. ఇక తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న ఈ చర్య మీద వస్తున్న విమర్శల గురించి ఆలోచిస్తే– 2003 ప్రాంతాల్లో ప్రారంభమైన విద్యుత్ సంస్కరణలు తరువాత కాంగ్రెస్ నాయకత్వం లోని యూపీఏ ఒకటి, రెండు ప్రభుత్వాల హయాంలలో (పదేళ్లలో) ఊపందుకుని విద్యుత్ ఉత్పాదక ప్రాజెక్టులు పూర్తయి అనేక రాష్ట్రాల్లో మిగులు విద్యుత్ లభ్యమయ్యే పరిస్థితులు నెలకొన్నాయని ప్రొఫెసర్ కోదండరాం నాయకత్వంలోని జేఏసీ అంచనా. ఇందుకు ఆధారంగా జేఏసీ నాయకులు 2017 –2018 కేంద్ర ప్రభుత్వ సంస్థ సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ (సీఈఏ) వార్షిక నివేదికలో రూపొందించిన వివరాలను చూపుతున్నారు. అయితే దేశమంతటా ఇబ్బడి ముబ్బడిగా కరెంట్ ఉత్పత్తి అయి మిగులు పరిస్థితిలోకి వెళితే ఆ వెసులుబాటును తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయాన్ని పండుగ చెయ్యడానికి వాడుకుంటే తప్పు పట్టాల్సిన అవసరం లేదు. జేఏసీ చెబుతున్నది కాబట్టి పట్టించుకోవాల్సిన అవసరం లేదని ప్రభుత్వం భావించడం కూడా సరికాదు. 24 గంటల విద్యుత్ సరఫరా వ్యవసాయ రంగానికి 24 గంటల ఉచిత విద్యుత్ సరఫరా వల్ల పడనున్న భారం ఏటా రూ.600 కోట్లని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నా అందుకోసం విద్యుత్ సంస్థల మీద పది వేల కోట్ల రూపాయల మేర భారం పడనుందనీ, అందులో రూ. 5,500 కోట్ల భారాన్ని మాత్రమే ప్రభుత్వం భరిస్తానని అంటున్నదని జేఏసీ చెబుతున్నది. ప్రభుత్వ వర్గాలు చెబుతున్న దానికీ, జేఏసీ చూపుతున్న లెక్కలకూ చాలా వ్యత్యాసం ఉంది. ఎంతైనా ప్రజల డబ్బే కాబట్టి ప్రభుత్వం దీనికి సరైన వివరణ ఇస్తే బాగుంటుంది. అంతిమంగా విద్యుత్ సంస్థలు నష్టాల్లో కూరుకుపోకుండా చూడాల్సిన బాధ్యతా ప్రభుత్వానిదే. ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ 24 గంటల విద్యుత్ సరఫరా ఫలితాలు రెండు రోజుల్లోనే తెలియవు. కొంతకాలం పరిశీలించాల్సిందే. ఎకరాకు ఎనిమిదివేలు రైతులకు లాభం చేకూర్చే మరో కార్యక్రమం– ఎకరాకు ఏటా ఎనిమిది వేల రూపాయలు.రెండు విడతలుగా రైతులకు చెల్లించే ఈ మొత్తం ముఖ్యమంత్రి చెబుతున్నట్టుగా మొత్తం అవసరాలు తీర్చలేకపోయినా కూడా రైతుకు ఊరటే. కానీ శాసనసభ వేదికగా ముఖ్యమంత్రి ఒక ప్రకటన చేశారు– కౌలు రైతులకు ఈ పథకం వర్తింపచేసే ప్రసక్తే లేదని. తెలంగాణలో ఎంతమంది రైతులు సొంతంగా వ్యవసాయం చేస్తున్నారు, ఎంత భూమి కౌలుదారుల చేతుల్లో ఉంది అనే లెక్కలు ప్రభుత్వం దగ్గర ఉన్నాయా? ఆ లెక్కలు తేల్చి ఈ పథకం అమలు చేస్తే ప్రజాధనం వృధా కాకుండా ఉంటుంది. పైగా పేద, ధనిక భేదం లేకుండా అందరికీ ఎకరానికి ఎనిమిది వేలు ఇస్తామనడం సరయినది కాదు. తెలంగాణలో నక్సలైట్ ఉద్యమం కారణంగా వందలు వేల ఎకరాల భూస్వాములు ఇప్పుడు లేరు. చిన్న కమతాలు ఎక్కువ సంఖ్యలో ఉన్న మాట నిజమే. అట్లా ఎకరం, రెండెకరాలు ఉన్న రైతులు వ్యవసాయం సొంతంగా చేసుకుంటారు కాబట్టి, ఈ తరహా భూములకు ఎనిమిది వేల రూపాయల సాయం అందించడం వల్ల తప్పక కొంత లబ్ధి జరుగుతుంది. కానీ ఇంకా తక్కువ సంఖ్యలోనే అయినా పదులూ, వందల ఎకరాల భూములు ఉండి కౌలుకు ఇచ్చుకుని వేరే వ్యాపారాలు, వృత్తులు చేసుకునే వాళ్లు కూడా చాలామంది ఉంటారు. ఈ సాయం వాళ్లకు కాకుండా కౌలు చేసే వాళ్లకు కదా వెళ్లాల్సింది! తెలంగాణలో వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్, ఎకరానికి ఏటా 8 వేల రూపాయల ఆర్థికసాయం మంచి ఆలోచనే అయినా రైతులను వేధిస్తున్న ఇతర సమస్యల మీద మరింత దృష్టి పెట్టాల్సిన అవసరం చాలా ఉంది. ఎంతో ఆర్భాటంగా ముఖ్యమంత్రి ప్రకటించిన రైతు సమాఖ్యల మీద పెద్ద పెట్టున విమర్శలు రావడంతో మళ్లీ వాటి ఊసే ఎత్తడంలేదు. ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబునాయుడు ఆధ్వర్యంలో నడుస్తున్న జన్మభూమి కమిటీల లాగా కాకుండా రైతు సంక్షేమానికి పాటు పడే, న్యాయం జరిగేటట్టు చూసే ఒక ప్రత్యేక యంత్రాంగం ఏర్పాటు చేయవలసిన అవసరం అయితే ఉంది. పంటకు గిట్టుబాటు ధర రాక, నాణ్యమైన విత్తనాలు లభిం చక, పంటల బీమా లేక ఊపిరి సలపక రైతుల ఉసురు తీస్తున్న ఉదంతాలు అనేకం. పోరాడి ప్రత్యేక రాష్ట్రం సాధించుకున్నా తెలంగాణలో రైతు ఆత్మహత్యలు ఆగలేదన్న సంగతి వాస్తవం. ముప్పిరిగొంటున్న ఈ సమస్యలన్నిటికీ తగిన పరిష్కారం చూపకుండా కేవలం 24 గంటలు విద్యుత్ సరఫరా చేసి, ఏడాదికి ఎనిమిది వేలు ఇచ్చినంత మాత్రాన రైతు పరిస్థితి బాగుపడదు. మిగిలిన రైతు సమస్యల పరిష్కారమూ ముఖ్యమేనని చెప్పడం అందుకే. గడువు కంటే ముందుగానే వస్తాయంటున్న సార్వత్రిక ఎన్నికల్లో తిరిగి అధికారంలోకి రావాలంటే తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత చంద్ర శేఖరరావు ఈ సమస్యలతో పాటు తమ పార్టీ ఎన్నికల ప్రణాళికలో చేసిన ముఖ్యమైన వాగ్దానాలు నెరవేర్చే ప్రయత్నం చేస్తేనే సాధ్యం. అంతేతప్ప చంద్రబాబునాయుడి మార్గంలో రాజకీయ పేకాటలో జోకర్ వంటి పవన్‌కల్యాణ్ లాంటి వాళ్లు సాయపడతారనుకుంటే పొరపాటు. తెలంగాణ రాష్ట్రంలో పేకాట క్లబ్‌లను మూయించి ఎన్నో కుటుంబాలను కాపాడిన ముఖ్యమంత్రికి బహుశా ఆ ఆట రాదేమో. పేకాటలో జోకర్లు ఎన్ని ఉన్నా ఒరిజినల్ సీక్వెన్స్ ఒకటి తప్పనిసరి. లేకపోతే ఆటలో ఓటమే. దేవులపల్లి అమర్ datelinehyderabad@gmail.com -
దళితుల లోగిళ్లలో వెలుగులు
బాబు జమానాలో ఇలా... దళితుల గృహాలకు నెలకు 100 యూనిట్లలోపు విద్యుత్తు వినియోగం జరిగితే అందులో 75 యూనిట్లకు రాయితీ ఇస్తున్నారు. మిగతా 25 యూనిట్లకు బిల్లు వేస్తున్నారు. 75 యూనిట్ల తర్వాత 100 యూనిట్ల వరకు ప్రతి యూనిట్‌కు రూ.2.60 చార్జి వసూలు చేస్తున్నారు. 75 యూనిట్ల తర్వాత 10 యూనిట్లు వాడుకుంటే రూ. 26, ఒక్క యూనిట్ వాడుకుంటే రూ.2.60 లెక్కన చెల్లించాలి. నెలలో 100 యూనిట్ల కన్నా ఒక్క యూనిట్ ఎక్కువ ఉపయోగించుకున్నా రాయితీ హుష్‌కాకే... వైఎస్సార్ సీపీ అధికారంలోకి వస్తే... ఎలాంటి షరతులూ లేకుండా ప్రతి దళితునికి ఇంటి అవసరాలకు ఉచిత విద్యుత్తు ఇస్తామని హామీ... అధికారంలోకి వచ్చిన వెంటనే అమలు చేస్తామని వైఎస్ జగన్ స్పష్టీకరణ జిల్లాలో ఎస్సీ, ఎస్టీ వినియోగదారులు మొత్తం 1,65,450 మంది ఇందులో అధిక శాతం మంది పరిమితులకు లోబడే రాయితీ పొందుతున్నారు వైఎస్ జగన్ ఇచ్చిన హామీ అమలులోకి వస్తే ఎస్సీ, ఎస్టీలందరికీ ఉచితంగా విద్యుత్తు అందనుంది. సాక్షి, రాజమహేంద్రవరం: దళితుల లోగిళ్లలో త్వరలో వెలుగులు విరజిమ్మనున్నాయి. ప్రతి దళితుడి ఇంటికీ ఉచితంగా విద్యుత్తు సరఫరా కానుంది. రాష్ట్రంలోని దళితవాడలకు ఉచిత విద్యుత్తు ఇస్తామని ‘ప్రజా సంకల్ప పాదయాత్ర’లో ప్రతిపక్ష నేత, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ప్రకటించిన నేపథ్యంలో దళితుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటి వరకు దళితుల గృహాలకు వినియోగించే విద్యుత్తుపై పరిమితులతో కూడిన రాయితీలున్నాయి. దళితుల గృహాలకు నెలకు 100 యూనిట్లులోపు విద్యుత్తు వినియోగం జరిగితే అందులో 75 యూనిట్లు రాయితీ ఇస్తున్నారు. మిగతా 25 యూనిట్లకు బిల్లు వేస్తున్నారు. 75 యూనిట్ల తర్వాత 100 యూనిట్ల వరకు ప్రతి యూనిట్‌కు రూ.2.60 చార్జి వసూలు చేస్తున్నారు. 75 యూనిట్ల తర్వాత 10 యూనిట్లు వాడుకుంటే రూ. 26, ఒక్క యూనిట్ వాడుకుంటే రూ.2.60 లెక్కన చెల్లించాలి. నెలలో 100 యూనిట్ల కన్నా ఒక్క యూనిట్ ఎక్కువ ఉపయోగించుకున్నా వారికి ఎలాంటి రాయితీ ఉండదు. ఈ నేపథ్యంలో ఎలాంటి షరతులూ లేకుండా ప్రతి దళితునికి ఇంటి అవసరాలకు ఉచిత విద్యుత్తు ఇస్తామని జగన్ ప్రకటించారు. 1.65 లక్షల లబ్ధిదారులకు ప్రయోజనం... జిల్లాలో ఎస్సీ, ఎస్టీ వినియోగదారులు మొత్తం 1,65,450 మంది ఉన్నారు. వీరిలో 1,03,599 మంది ఎస్సీ వినియోగదారులు, 61,851 ఎస్టీ వినియోగదారులున్నారు. 100 యూనిట్లులోపు విద్యుత్తు ఉపయోగిస్తున్న ఎస్సీలు 84,797 మంది ఉన్నారు. వీరికి 75 యూనిట్లు రాయితీ లభిస్తోంది. ఫలితంగా నెలకు రూ.99.14 లక్షలు లబ్ధి కలుగుతోంది. ఎస్టీ వినియోగదారుల్లో 100 యూనిట్లులోపు విద్యుత్‌ను ఉపయోగిస్తున్న వారు 50,900 మంది ఉన్నారు. వీరికి నెలకు రూ.39.73 లక్షలు లబ్ధి జరుగనుంది. ప్రస్తుతం 1,65,450 మంది ఎస్సీ, ఎస్టీ వినియోగదారుల్లో 1,35,697 మందికే రాయితీ లభిస్తోంది. వైఎస్ జగన్ ఇచ్చిన హామీ అమలులోకి వస్తే ఎస్సీ, ఎస్టీలందరికీ తమ గృహాలకు ఉచితంగా విద్యుత్తు అందనుంది. ఉచిత విద్యుత్తుతో మాకు కలుగుతుంది.. జగన్మోహన్రెడ్డి అధికారంలోకి వస్తే ఎస్సీ, ఎస్టీలకు ఉచిత విద్యుత్తు ఇస్తానని ప్రకటించడం చాలా సంతోషించదగిన విషయం. కూలీనాలీ చేసుకుని, తిండి గింజల కోసం కష్టపడే మాలాంటి ఎందరో గిరిజన ప్రజలకు ఇది చాలా ఊరటనిచ్చే విషయం. నెలనెలా వచ్చే విద్యుత్తు బిల్లులు చెల్లించే స్థోమత లేక విద్యుత్తు కనెక్షన్ తొలగించుకునే పరిస్థితుల్లో ఉన్న ఎంతో మంది ఎస్టీలకు దీనివల్ల ఎంతో మేలు కలుగుతుంది. – కొట్టి కన్నంరాజులు, నాయకపోడు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఉచిత విద్యుత్తుతో దళిత వాడలకు ఊతం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ప్రకటన రాష్ట్రంలో వేలాది దళితవాడలకు ఊతంగా నిలుస్తుంది. దళితుల సామాజిక, ఆర్థిక సమస్యలు తెలిసిన నేతగా జగన్ మెహన్‌రెడ్డి ఈ హామీ ఇవ్వడం ఉపయుక్తమైన ఆలోచన. నేటికీ అనేక దళిత వాడల్లో అనేక మంది దళితులు విద్యుత్ బిల్లుల చెల్లింపు భారంగా ఉంది. నాడు మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి రైతులకు ఉచిత విద్యుత్ ఇస్తే ఆయన తనయుడిగా జగన్ మోహన్‌రెడ్డి దళిత వాడలకు ఉచిత విద్యుత్ ఇస్తానడడం అభినందనీయం. – కందికట్ల రమణ, దళిత యువకుడు, అమలాపురం