మాట్లాడుతున్న మంత్రి హరీశ్ రావు
సిద్దిపేట జోన్: ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కరెంట్ గురించి అడిగే నైతిక హక్కు కాంగ్రెస్ నాయకులకు లేదని ఆర్ధిక, వైద్యారోగ్యాశాఖ మంత్రి టి.హరీశ్‌రావు తేల్చిచెప్పారు. కాంగ్రెస్ పాలనలో ఉచిత కరెంట్‌ను ఉత్త కరెంట్‌గా మార్చిన కాంగ్రెసోళ్లు ఇప్పుడు సిగ్గు లేకుండా కరెంట్ గురించి మాట్లాడుతున్నారని విమర్శించారు. శనివారం సిద్దిపేట జిల్లా నర్మెటలో రూ.300 కోట్లతో ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ నిర్మాణానికి భూమి పూజ చేశారు.
జిల్లా కేంద్రంలో సఖి, భరోసా కేంద్రాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా హరీశ్ మాట్లాడుతూ ‘సీఎం కేసీఆర్ సంకల్పానికి దైవబలం ఉంది.. ఆయన పనిమంతుడే కాదు దేవున్ని బాగా కొలుస్తారు, నమ్ముతారు. అందుకే తొమ్మిదేళ్ల పాలనలో రాష్ట్రంలో కరువే లేదు’ అని వ్యాఖ్యానించారు. అదే చంద్రబాబు, కిరణ్ కుమార్‌రెడ్డి హయాంలో కరువుతో రాష్ట్ర ప్రజలు అల్లాడిపోయారని గుర్తుచేశారు.
చాలా రాష్ట్రాల్లో కరువు వచ్చినా తెలంగాణలో కాళేశ్వరం వల్ల ఆ ఛాయలు లేవన్నారు. ఒక్కప్పుడు ఐటీ అని కలవరించిన చంద్రబాబు ఇప్పుడు తెలంగాణ భూముల విలువ గురించి మాట్లాడుతున్నారని చెప్పారు. కాగా, ఈ వయసులో ఆయనను అరెస్టు చేయడం దురదృష్టకరమన్నారు. కార్యక్రమంలో డీజీపీ అంజన్‌కుమార్, అదనపు డీజీ (ఉమెన్ సేఫ్టీ) షికాగోయల్, హుస్నాబాద్ ఎమ్మెల్యే సతీష్, ఉద్యానవన శాఖ కమిషనర్ హన్మంత రావు, జెడ్పీ చైర్‌పర్సన్ రోజాశర్మ, కలెక్టర్ పాటిల్ పాల్గొన్నారు.
శతమానం భవతి.. శ్రీజ
సిద్దిపేటలో రూ 30 లక్షలతో ఏర్పాటు చేసిన శిశుగృహ కేంద్రాన్ని మంత్రి ప్రారంభించారు. ఆ సమయంలో అక్కడి సిబ్బంది చేతిలో ఓ మూడు నెలల పసికందు చిరునవ్వులు చిందించడంతో ఆయన అబ్బురపడ్డారు. వెంటనే పసికందును ఎత్తుకొని సిబ్బంది ద్వారా వివరాలు సేకరించారు.
మూడు నెలల క్రితం పసికందును విక్రయించే క్రమంలో అడ్డుకొని సంరక్షణ బాధ్యతలు స్వీకరించినట్టు వారు మంత్రి దృష్టికి తెచ్చారు. కాగా ఇప్పటివరకు పేరులే కుండా ఉన్న ఆ పసికందుకు శ్రీజ అని నామకరణం చేశారు. నిండు నూరేళ్లు శ్రీజ ముఖంలో చిరునవ్వులు వెల్లివిరియాలని దీవించారు.
Comments
Please login to add a commentAdd a comment