=ఫ్రీ కరెంట్ పేరిట సర్కారు కపటనాటకం
=ఎస్సీ, ఎస్టీలకు ఉత్తి‘చేయి’
=భారం తప్పించుకునేందుకు కొర్రీలు
=నెలనెలా తగ్గుతున్న లబ్ధిదారులు
వరంగల్, న్యూస్‌లైన్ : ఉచిత విద్యుత్ పేరిట నిరుపేద దళితులు, గిరిజనులను ప్రభుత్వం నిలువునా మోసం చేస్తోంది... కపట నాటకాలతో వంచనకు గురిచేస్తోంది. గిమ్మిక్కులతో సర్కారుపై పడుతున్న భారాన్ని తగ్గించుకుంటూ... 50 యూనిట్ల పరిధిలోపు విద్యుత్‌ను వినియోగించుకునే వారే అర్హులంటూ మెలికపెట్టి ఉత్తి‘చేరుు’ చూపిస్తోంది. జిల్లాలో ఎస్సీ వర్గాలకు చెందిన విద్యుత్ కనెక్షన్లు 92 వేలు, ఎస్టీలకు సంబంధించి 76 వేల కనెక్షన్లున్నాయి. ఇందులో ఒక్కో కుటుంబం వినియోగిస్తున్న విద్యుత్ నెలకు 60 నుంచి 90 యూనిట్ల మధ్యలో ఉంటోంది. 90 శాతం మేర కుటుంబాలు ఇదే స్థాయిలో విద్యుత్‌ను వాడుకుంటున్నట్లు అధికారిక రికార్డులే చెబుతున్నారుు. ఈ లెక్కన సర్కారు నిబంధనల ప్రకారం వారు ఉచిత విద్యుత్‌కు అనర్హులు కాగా... మిగిలిన పది శాతం కుటుంబాలు మాత్రమే ఉచిత విద్యుత్‌కు అర్హులన్న మాట.
ఇక్కడే తెలుస్తుంది..
కూలీ చేసుకునే దళిత కుటుంబం రెండు బుగ్గలు, ఒక ఫ్యాన్ వినియోగించడం తప్పనిసరి. ఈ లెక్కన ఇంటిలో ఒక బల్బు, ఇంటి బయట మరొక బల్బు, ఒక ఫ్యాన్ ఉన్న ఓ కుటుంబం నెలకు వినియోగించే విద్యుత్‌ను లెక్కిస్తే... సర్కారు అసలు నైజం ఏంటో ఇట్టే తెలుసుకోవచ్చు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం వీరెవరూ ఉచితం పరిధిలోకి రారు. 100 వాట్స్ బుగ్గ గంట వెలిగితే వినియోగమయ్యే విద్యుత్ 0.1 యూనిట్. రోజుకు సగటున ఆరు గంటలకు లెక్కగడితే 0.6 యూనిట్లు. ఇలా రెండు బుగ్గలకు రోజుకు 1.2 యూనిట్లు.. నెలకు 37.2 యూనిట్ల విద్యుత్ వినియోగమవుతుంది.
అదేవిధంగా 60 వాట్స్ ఉండే ఒక ఫ్యాన్ గంటపాటు తిరిగితే వినియోగమయ్యే విద్యుత్ 0.06 యూనిట్లు. రోజుకు సగటున 12 గంటలకు లెక్కగడితే 0.72 యూనిట్లు. ఇలా నెలకు 22.32 యూనిట్ల విద్యుత్ వినియోగమవుతుంది. అంటే 31 రోజులకు సదరు దళిత కుటుంబానికి 59.52 యూనిట్ల విద్యుత్ వాడకమవుతోంది. ఇది.. స్వయంగా కరెంట్ అధికారులు చెబుతున్న వాస్తవ లెక్కలు. దీన్నిబట్టి సర్కారు ఎస్సీ, ఎస్టీలకు ప్రకటించిన ఉచిత విద్యుత్ నయవంచనే అని గ్రహించవచ్చు. అంతేకాకుండా 50 యూనిట్లలోపు వినియోగించుకునే వారికే ఉచితం అంటూ మెలికపెట్టడం భారాన్ని తప్పించుకునేందుకేననే నగ్న సత్యాన్ని బహిర్గతం చేస్తోంది.
ఇంటింటికీ స్కానింగ్...
ఇప్పటివరకు మీటర్ పనిచేయట్లేదనో.. పాడైపోరుుందనో... సగటున రీడింగ్ తీసే విధానానికి స్వస్తి పలుకుతూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు విద్యుత్ సిబ్బంది ఉచిత విద్యుత్ అర్హులైన వారి ఇంటింటికీ తిరుగుతూ మీటర్లను నిశితంగా పరిశీలన చేయనున్నారు. జనవరి నుంచి ఎంత విద్యుత్ వాడకమైందో స్కానింగ్ తీయనున్నారు. ఆ తర్వాత 50 యూనిట్లలోపు వినియోగించుకున్న వారికే బిల్లులు మాఫీ చేయనున్నారు. ఈ లెక్కన జిల్లాలో ఒక్కరు కూడా ఉచిత విద్యుత్ పరిధిలోకి వచ్చే అవకాశాలు లేవని తేటతెల్లమవుతోంది.
నెలానెలా తగ్గిపోతున్నారు...
50 యూనిట్ల వినియోగం పరిధిలోకి వచ్చే వినియోగదారుల సంఖ్య నెలనెలకూ గణనీయంగా పడిపోతోంది. ఇందుకు ఈ కింది పట్టికే నిదర్శనం.
‘ఉచిత’ వంచన
Published Sat, Jan 4 2014 3:39 AM | Last Updated on Sat, Sep 2 2017 2:15 AM
Advertisement
Advertisement